విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్ .. అధికారులు ఏం చేశారంటే? | Passenger Smokes Beedi On Akasa Air Flight | Sakshi
Sakshi News home page

విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్ .. అధికారులు ఏం చేశారంటే?

Mar 9 2026 9:00 AM | Updated on Mar 9 2026 10:59 AM

 Passenger Smokes Beedi On Akasa Air Flight

భారత్‌లో ఇటీవల విమాన ప్రమాద ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. ఈ దుర్ఘటనలకు కారణం  సాంకేతిక సమస్యలతో  పాటు నిర్వహణ సంస్థల లోపాలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అయితే తాజాగా విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్‌ తాగిన ఘటన అధికారులను కలవరపరిచింది. విమాన భద్రత చట్టాలను ఉల్లంఘించడంతో సదరు వ్యక్తిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఢిల్లీకి చెందిన ఆశిశ్ అనే వ్యక్తి రాజధాని నుంచి గోవాకు వెళుతున్నాడు.  దీని కోసం  అక్షర ఎయిర్‌వేస్‌ QP1625లో టికెట్  బుక్‌ చేసుకొని ప్రయాణమయ్యాడు. అయితే ఆశిశ్ ప్రయాణ సమయంలో విమానంలోని టాయిలెట్‌లో బీడీ తాగాడు. ఇది గమనించిన ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అతనని తనీఖీ చేయగా అతని వద్ద బీడీతో పాటు లైటర్ సైతం లభించింది. దీంతో  పోలీసులకు సమాచారమచ్చారు.

దీంతో ఆశిశ్‌ను అదుపులోకి తీసుకొని గోవా, మోపా పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం సివిల్ ఏవియేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే విమానంలో బీడీ తాగడం చాలా ప్రమాదకరమని అది విమాన భద్రతకు ముప్పని ఎయిర్‌ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement