‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్‌దా..?, ఓవైసీదా?’ | BJP Telangana President Ramchander Rao Slams Revanth Sarkar | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్‌దా..?, ఓవైసీదా?’

Mar 9 2026 2:41 PM | Updated on Mar 9 2026 3:56 PM

BJP Telangana President Ramchander Rao Slams Revanth Sarkar

హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్‌ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారని  ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్‌దా.. లేక ఓవైసీదా? అని   ట్వీట్‌ చేశారు.

 

ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement