టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్‌సీపీ అంటే ఓట్లు తొలగింపే’ | Sajjala ramakrishna reddy comments on deletion of votes in andhra pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్‌సీపీ అంటే ఓట్లు తొలగింపే’

Mar 9 2026 3:51 PM | Updated on Mar 9 2026 6:54 PM

Sajjala ramakrishna reddy comments on deletion of votes in andhra pradesh

సాక్షి,తాడేపల్లి: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా, జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. 

‘ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌లా ఏర్పడి పని చేయాలి. ఈ విషయంలో బూత్‌ కమిటీలదే  కీలకపాత్ర. 2019 ఎన్నికలకు మందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని తెలియగానే ఓట్లు తీసేశారు.

దీనిపై అప్పట్లో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఓటర్లను కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి.అందుకు అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేసుకుందాం. బూత్‌ లెవెల్‌ పరిధిలో నాయకులను ఈ ప్రక్రియలో ప్రమేయం చేయాలి’ అని సూచించారు. 

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement