‘కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే’ | Sailajanath Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే’

Mar 9 2026 4:51 PM | Updated on Mar 9 2026 5:09 PM

Sailajanath Slams Chandrababu Govt

తాడేపల్లి : కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ విమర్శించారు.  ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు.  ‘నిరుద్యోగుల జీవితాలను  అన్యాయం చేశారు. 

వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీలకు వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చిన రుణాలను భేషరతుగా మాఫీ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement