రూ. వేల కోట్ల భూములు దోచుకున్నారు.. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు | YSRCP files complaint against Gitam University land grab | Sakshi
Sakshi News home page

రూ. వేల కోట్ల భూములు దోచుకున్నారు.. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Mar 9 2026 1:26 PM | Updated on Mar 9 2026 1:55 PM

YSRCP files complaint against Gitam University land grab

సాక్షి, విశాఖపట్నం: గీతం వర్సిటీ భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వందలాది ప్రజలు ఈరోజు (సోమవారం) కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్రమంగా కబ్జా చేసిన భూములలో నిర్మాణాలు ఆపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు, మాజీ ఎమ్మెల్యే  వాసుపల్లి గణేశ్ కుమార్ కలెక్టర్‌కు విన్నవించారు. అయితే ప్రజల ఫిర్యాదులను స్వీకరించకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టరేట్‌లో బైఠాయించారు.

విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ రూ, 5 వేల కోట్లు దోచుకున్నారని వైఎస్ఆర్సీపి కార్పొరేటర్ల పై దాడి చేసి జీఎంసి కౌన్సిల్ సమావేశంలో అక్రమంగా భూమిని క్రమబద్ధీకరించుకున్నారని కేకే రాజు ఆరోపించారు. వందలాది మంది ప్రజ ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చినా ఎంపీ భరత్ ఆదేశాల మేరకు  ఫిర్యాదులు  తీసుకోలేదన్నారు. కోర్టులో కేసులు ఉండగానే అక్రమ నిర్మాణాలు గీతంలో చేపడతారని ప్రశ్నించారు. పోలీసుల జూలంతో తమ పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్నారు.

టీడీపీ నాయకుల అవినీతి బీజేపి నాయకులకు కనిపించట్లేదా అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. భూకబ్జాలు చేసిన ఎంపీ భరత్ ను జైల్లో పెట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే  గీతం భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూలదొస్తమని హెచ్చరించారు.  గీతం భూబ్జాలపై ఫిర్యాదులు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఆ‍ధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement