ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా | RK Roja Praises YS Jagan For Women’s Empowerment And Criticizes Minister Vangalapudi Anitha, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా

Mar 8 2026 2:52 PM | Updated on Mar 8 2026 4:55 PM

Rk Roja Fires On Minister Vangalapudi Anitha

సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్‌గా పని చేసి మళ్లీ  జగన్‌ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు  సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది.

..కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్‌ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.

మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement