ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి | Andhra Student Attacked With Iron Rod In Karnataka Ballari School, One Dead And Eight Injured | Sakshi
Sakshi News home page

ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి

Mar 8 2026 11:04 AM | Updated on Mar 8 2026 12:42 PM

Andhra Student Dies In Karanataka Ballari

సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్‌ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్‌ వార్డెన్‌ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్‌ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్‌లో చోటు చేసుకుంది. 

శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్‌ వార్డెన్‌పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్‌ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(బీఎంఐఎస్‌)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న బ్రూస్‌పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్‌తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై  ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.

ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్‌ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్‌ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్‌ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement