హనీట్రాప్‌ రాకెట్‌ గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌ రాకెట్‌ గుట్టురట్టు

Mar 8 2026 7:54 AM | Updated on Mar 8 2026 7:54 AM

ప్రైవేట్‌ వీడియోలు,

ఫొటోలతో రూ.25 లక్షలు డిమాండ్‌

ప్రైవేట్‌ నర్స్‌తో సహా నలుగురు అరెస్ట్‌

సాక్షి, బళ్లారి: దావణగెరె నగరంలో ఓ వ్యాపారిని ప్రైవేట్‌ వీడియోలు, ఫొటోలతో బెదిరించిన హనీట్రాప్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యాపారిని వలలో వేసుకున్న ప్రైవేట్‌ నర్సు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్‌ నర్స్‌తో సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు. వివరాలు.. దావణగెరె నగరంలో నివసిస్తున్న సుష్మిత అనే నర్స్‌.. ఓ వ్యాపారికి మాయమాటలు చెప్పి వలలో వేసుకుంది. వ్యాపారితో సన్నిహితంగా ఉంటూ తన బుట్టలో వేసుకుంది. వ్యాపారితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు చూపించి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. భయపడిన వ్యాపారి అప్పుడప్పుడు కొంత నగదును నర్స్‌ సుష్మితకు ఇచ్చాడు. మళ్లీ మళ్లీ డబ్బు ఇవ్వాలంటూ వ్యాపారిని ఇబ్బందులు పెట్టారు. విసిగిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వల పన్ని నర్స్‌తో సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు. కాగా.. సదరు నర్స్‌ చాలామంది హనీట్రాప్‌ చేసి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు సమాచారం. దావణగెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement