పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభం

Mar 8 2026 7:54 AM | Updated on Mar 8 2026 7:54 AM

రాయచూరు రూరల్‌: మంత్రాలయంలో గురు రాఘవేంద్రుల పూర్వ పీఠాధిపతి సుయితీంద్ర తీర్థుల పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్‌ ప్రత్యేక పూజలు చేశారు. సుయితీంద్ర తీర్థుల 13వ వర్ధంతి, స్మరణోత్సవ వేడుకల్లో భాగంగా వందలాది భక్తుల సముక్షంలో వెండి రథోత్సవాలు జరిపారు.

శ్రీశైలం వెళ్లే

భక్తులకు ఉచిత భోజనం

రాయచూరు రూరల్‌: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చే కళ్యాణ, ఉత్తర కర్ణాటక భక్తులకు ఉచితంగా భోజనం అందజేసేందుకు శ్రీకారం చుడుతున్నట్లు బ్రమరాంభ శ్రీశైల మల్లికార్జున సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ప్రకాష్‌ మాడగిరి తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని క్రిష్ణ మండలం గుడే బల్లూరు ఆధ్వర్యంలో నేరుడగం సిద్ధలింగ స్వామి సంయుక్త సహకారంతో భక్తులకు భోజన వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భక్తులకు భోజనం అందజేస్తామన్నారు. శ్రీశైలం అడవుల్లో పాదయాత్ర చేసే భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

జనగణన

సమర్థవంతంగా చేపట్టాలి

బళ్లారి రూరల్‌: జనగణన గంభీరంగా పరిగణించి కచ్చితమైన వివరాలను సేకరించాలని దావణగెరె డీసీ జి.ఎం.గంగాధర స్వామి అధికారులను ఆదేశించారు. కేంద్ర జనగణన శాఖ ఆధ్వర్యంలో శనివారం జెడ్పీ సభాంగణంలో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుపు నిర్వహించిన సామాజికి, ఆర్థిక జనగణనలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని జనగణన సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. అన్ని తాలూకాల్లో జనగణన నిర్వహించే వ్యక్తులకు శిక్షణ ఇచ్చి చిన్న బృందాలుగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు వస్తే సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలన్నారు. అనంతరం జెడ్పీ సీఈఓ గిత్త మాధవరావు విట్టల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏడీసీ శీలవంత శివకుమార్‌, ఉప విభాగాధికారి సంతోష్‌ పాటిల్‌, హొన్నళ్లి ఉప విభాగాధికారి చెన్నప్ప, జనగణన శాఖ జిల్లా నోడల్‌ అధికారి వివేక్‌సిన్హ తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో చదువుకోండి

రాయచూరు రూరల్‌: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని రాయచూరు డీఎస్పీ శాంతవీర్‌ పిలుపునిచ్చారు. శనివారం పోలీస్‌ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యతో పాటు కళలు, సాహిత్యం, క్రీడల్లో రాణించడానికి ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. పిల్లలను భావి భారత నిర్మాతలుగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కవిత, చంద్రశేఖర్‌, గోవిందప్ప, యంకప్ప, క్రిష్ణ, ఇస్మాయిల్‌, కోమల, ఉషాబాయి, సుజాత, మల్లికార్జున, రుబీనా తదితరులు పాల్గొన్నారు.

ర్యాంకులు సాధించడం అభినందనీయం

రాయచూరు రూరల్‌: వైద్య విద్యార్థులు పేద ప్రజల సేవకు పునీతులు కావాలని ధార్వాడ ఐఐటీ డైరక్టర్‌ వెంకప్పయ్య దేశాయి పేర్కొన్నారు. శనివారం నవోదయ వైద్య కళాశాల ఆడిటోరియంలో గ్రాడ్యయేషన్‌ డే నిర్వహించారు. నర్సింగ్‌, పిజియోథెరపీ, ఫార్మసీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కోవిడ్‌లో ఎవ్వరు చేయని పనులు నర్సులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాయచూరు నవోదయ వైద్య కళాశాల ఉన్నత విద్యకు పేరుగాంచిందన్నారు. విద్యార్థులు సమాజానికి, కళాశాలకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. సమావేశంలో నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్‌.రాజేంద్ర రెడ్డి, రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌, న్‌దేవానంద, గిరీష్‌, దొడ్డయ్య, అర్జున్‌, విజయ్‌ కూమార్‌, ఉమాకాంత్‌, కాజల్‌ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement