నయనిక రెడ్డి అల్లు శిరీష్‌ పెళ్లిలో హైలెట్‌ 'శంకు చక్రం' మెహందీ డిజైన్‌ | Allu Sirishs Shanku-Chakram Mehendi At His Wedding | Sakshi
Sakshi News home page

నయనిక రెడ్డి అల్లు శిరీష్‌ పెళ్లిలో హైలెట్‌ 'శంకు చక్రం' మెహందీ డిజైన్‌

Mar 8 2026 11:55 AM | Updated on Mar 8 2026 11:55 AM

Allu Sirishs Shanku-Chakram Mehendi At His Wedding

ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్‌ని సెట్‌ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్‌ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్‌ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్‌ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. 

నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్‌ చేతిపై ఉన్న మెహందీ డిజైన్‌ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్‌..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. 

ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్‌ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్‌ వైట్‌ సిల్క్‌ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్‌తో అంకరించబడిన లావెండర్‌ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్‌లు, స్టేట్‌మెంట్‌ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది.

 

(చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్‌..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement