మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ | Allu Sirish Wedding And Emotional Note Wife Nayanika Late Father | Sakshi
Sakshi News home page

Allu Sirish: నయనికతో పెళ్లి తర్వాత అల్లు శిరీష్ ఎమోషనల్ పోస్ట్

Mar 7 2026 4:37 PM | Updated on Mar 7 2026 4:50 PM

Allu Sirish Wedding And Emotional Note Wife Nayanika Late Father

అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)

'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.

శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

Advertisement
 
Advertisement
Advertisement