రాహులా.. మనం సాధించాం: రష్మిక ట్వీట్‌ వైరల్‌ | Rashmika Mandanna React on Telangana Gaddar Awards 2025 | Sakshi
Sakshi News home page

రాహులా.. మనం సాధించాం: రష్మిక ట్వీట్‌ వైరల్‌

Mar 7 2026 1:58 PM | Updated on Mar 7 2026 2:06 PM

Rashmika Mandanna React on Telangana Gaddar Awards 2025

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 జాబితాను శనివారం ప్రకటించారు. అందులో ఉత్తమ నటి అవార్డు స్టార్‌ హీరోయిన్‌ రష్మికను వరించింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి గానూ రష్మికకు ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎక్స్‌ వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. రాహుల్‌ ట్వీట్‌పై రష్మిక కూడా స్పదించింది. 

ఆయన పోస్ట్‌ని రీట్వీట్‌ చేస్తూ.. ‘రాహులా.. మనం సాధించాం’ అని రాసుకొచ్చింది. దానికి రాహుల్‌ రిప్లై ఇస్తూ..‘ఈ అవార్డుకి మీరు అర్హులు. థ్యాంక్యూ రష్మిక’ అని కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం రష్మిక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

కాగా, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న తన ప్రియుడు, స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement