గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్ ప్రకటించారు. ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను (Telangana Gaddar Film Awards) ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
గద్దర్ -2025 ఫిల్మ్ అవార్డ్స్‌లో రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్ సినిమాలు అత్యధికంగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. తండేల్ సినిమాకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) మూవీకి గాను ఉత్తమ నటిగా ఎంపికైంది. ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో గౌరవించనున్నారు. నటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు దక్కడం విశేషం. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు వరించింది.
- ఉత్తమ చిత్రం (మొదటి బహుమతి): రాజు వెడ్స్ రాంబాయి
- రెండవ ఉత్తమ చిత్రం: దండోరా
- మూడవ ఉత్తమ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
- ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా
- ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ - లిటిల్ హార్డ్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం - కోర్టు
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్
- ఉత్తమ బాలల చిత్రం - అనగనగా
- ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్)
- ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ )
- ఉత్తమ దర్శకుడు- సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ సహాయ నటుడు- శివాజీ (దండోరా)
- ఉత్తమ సహాయ నటి- భూమిక (యుఫోరియా )
- ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె. రాబిన్ (దండోరా)
- ఉత్తమ మేల్ సింగర్- అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ ఫిమేల్ సింగర్- సాహితి చాగంటి (కన్నప్ప)
- ఉత్తమ హాస్య నటుడు- శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్)
- ఉత్తమ బాలనటుడు- రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో )
- ఉత్తమ స్టోరీ రైటర్ - గుణశేఖర్ (యుఫోరియా )
- ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ - గిర గిర గిర (ఛాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ - తోట తరణి (ఛాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవింద్ (అఖండ)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్)
- ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ - (23)
- ఉత్తమ మేల్ యాక్టర్ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)
- స్పెషల్ జ్యూరీ హీరో - రోషన్ (ఛాంపియన్)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ - అనిల్ రావిపూడి
గౌరవ పురస్కారాలు (లెజెండరీ అవార్డ్స్): - ఎన్టీఆర్ (NTR) అవార్డు- మెగాస్టార్ చిరంజీవి
- ఏఎన్ఆర్ (ANR) అవార్డు- జయసుధ
- కాంతారావు అవార్డు- ఆర్. నారాయణమూర్తి
- బి.ఎన్. రెడ్డి అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
- పైడి జయరాజ్ అవార్డు -కమల్ హాసన్
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్విని దత్


