గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 ప్రకటన వచ్చేసింది. ఈమేరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్ ఇస్తామని దరఖాస్తులను ఆహ్వానించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పరిశ్రమంలోని 17 విభాగాల్లో గద్దర్ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చిన పేర్కొన్నారు. వ్యక్తిగత విభాగంలోనూ గద్దర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. జనవరి 21 నుంచి 31 వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందని ప్రకటించారు.


