వెంకటేష్-అనిల్‌ రావిపూడి సినిమా.. హీరోయిన్‌ ఎవరంటే..? | Venkatesh and Anil Ravipudi movie actress will finalize | Sakshi
Sakshi News home page

వెంకటేష్-అనిల్‌ రావిపూడి సినిమా.. హీరోయిన్‌ ఎవరంటే..?

Mar 7 2026 7:29 AM | Updated on Mar 7 2026 8:43 AM

Venkatesh and Anil Ravipudi movie actress will finalize

విక్టరీ వెంకటేష్ ఐదవసారి హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో చేతులు కలిపాడు. 2027 సంక్రాంతికి మరో సినిమాతో రానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో F2 , F3 , సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌ గారు సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే, 2027 పొంగల్‌ రేసులో బరిలోకి దిగబోతున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి వెంకటేష్ (Venkatesh), కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రల్లో  సినిమా ఉండనుంది. అయితే, హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చర్చగా మారింది.

తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్‌ సరసన నటించేందుకు మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ఆమె సంతకం చేసిందని టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అనిల్‌ రావిపూడి వెతుకుతున్నాడని చెబుతున్నారు. కీర్తి గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన విజయం లేకపోడంతో కాస్త వెండితెరకు దూరమైంది. మరి అనిల్ రావిపూడి అయినా మహానటికి విజయాన్ని అందిస్తారేమో చూడాలి. భారీ బడ్జెట్‌తో సిద్ధం అవుతున్న ఈ మూవీకి నిర్మాత ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement