breaking news
Anil Ravipudi
-
'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి జనాలు ఎంతలా చూశారో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ పరంగా రొటీన్ అనే విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇది క్లిక్ అయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని, స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.నటుడిగా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవి సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఆ లోటుని 'మన శంకరవరప్రసాద్' తీర్చేసినట్లే కనిపిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు అటుఇటు అయినా సరే వచ్చే నెల రెండో వారం ఓటీటీ రిలీజ్ పక్కా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))'మన శంకరవరప్రసాద్' విషయానికొస్తే.. నేషనల్ సెక్యూరిటీ అధికారి శంకరవరప్రసాద్ (చిరంజీవి).. కేంద్రమంత్రి శర్మ రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటాడు. మంత్రి కూడా శంకర్‌ని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ ఉంటాడు. శంకర్ గతంలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ జీవీఆర్ కుమార్తె శశిరేఖని పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటారు. దీంతో పిల్లల్ని చూసే ఛాన్స్ కూడా శంకర్‌కి ఉండదు. ఇది తెలుసుకున్న కేంద్రమంత్రి.. పిల్లలతో సమయం గడిపేలా వాళ్లు చదువుతున్న స్కూల్లో పీఈటీగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కొన్నాళ్లకు శంకర్.. పిల్లలకు దగ్గరగానే ఉన్నాడని శశిరేఖకు తెలుస్తోంది. ఇదే టైంలో జీవీఆర్‌పై దాడి జరగుతుంది. దీంతో మాజీ భార్య ఇంటికే శంకర్.. సెక్యూరిటీ కోసం వస్తాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్-శశిరేఖ ఎందుకు విడిపోయారు? అనేదే మిగతా స్టోరీ.సంక్రాంతి సినిమాల ఓటీటీ డీటైల్స్ విషయానికొస్తే.. ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రాన్ని ఫిబ్రవరి 6 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' మూవీని ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేయనున్నారు. ఇది కూడా అనౌన్స్ చేశారు. (ఇదీ చదవండి: కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ) -
'పొగరెక్కిన పోటుగాడు కంచె దాటినాడే'.. క్రేజీ సాంగ్ వీడియో
చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’నుంచి తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మూవీలో చాలా ఫన్నీగా సాగిన ఈ గీతాన్ని చిరంజీవినే పాడటం విశేషం. 'ఆ పెద్దిరెడ్డి వీధి మొదలు పెద్ద వదిన గారు' అంటూ సాగే ఈ పాటకు బాగానే విజిల్స్ పడ్డాయి. పొగరెక్కిన పోటుగాడు కంచెదాటినాడే అనే చరణం నుంచి చిరు తన గొంతు కలుపుతారు. అందుకే ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో వెంకటేశ్ వెంకీ గౌడగా అతిథి పాత్రలో కనిపించి నవ్వులతో మెప్పించగా నయనతార తనదైన రీతిలో మంచి నటనతో ఆకట్టుకుంది. -
'మన శంకరవరప్రసాద్ గారు' రూ. 350 కోట్ల జర్నీ
చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ నమ్మలేదు. విశ్వంభర వంటి సినిమా ఉండగా అనిల్‌తో ప్రాజెక్ట్ ఏంటి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సెడెన్‌గా అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమా షూటింగ్‌తో పాటు విడుదల వరకు పనులు అన్నీ వేగంగా పూర్తి అయ్యాయి. దీంతో జనవరి 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లోకి వచ్చేశాడు. మొదటి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్స్ సాధించాడు.‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సినిమా ప్రకటన నుంచి థియేటర్స్‌లో సక్సెస్ సెలబ్రేసన్స్ వరకు ఉన్న ప్రధాన అంశాలను ఒక వీడియోలో చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మెమోరీస్ మీరూ చూసేయండి. -
3 సబ్జెక్ట్స్ ఫెయిల్.. చిరంజీవి పరువు తీయకురా అంటే..
పుత్రోత్సాహం.. కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలుగుతుంది. ప్రయోజకుడైన అనిల్ రావిపూడిని చూసి ఆయన తండ్రి బ్రహ్మయ్య కూడా అంతే సంతోషపడుతున్నాడు. కాకపోతే కొడుకు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ దిశగా సాగిన ప్రయాణాన్ని మన శంకరవరప్రసాద్‌గారు ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్‌లో బ్రహ్మయ్య గుర్తు చేసుకున్నాడు.కుళ్లుగా ఉందిముందుగా ఇండస్ట్రీకి ఇంతమంచి దర్శకుడినిచ్చినందుకు చిరంజీవి బ్రహ్మయ్యను ప్రశంసించాడు. బ్రహ్మయ్య ప్రతిరోజు సెట్‌కు వచ్చి కొడుకు ఎదుగుదలను చూసి సంతోషించేవాడు. ఈయన్ను చూస్తే నాకే కుళ్లు వచ్చేస్తుంది. నాకంటే ఎక్కువ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్‌గా కష్టపడి కొడుకును చదివించాడు. అయితే సినిమాల్లో అనిల్ రావిపూడిని చెడగొట్టిందే ఈయన. ఇంకేం కావాలిఅనిల్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్నా.. చిరంజీవి సినిమా రిలీజైందనగానే అమ్మకు చెప్పకు పదా అని సినిమాకు తీసుకెళ్లేవాడు. నేను సినిమాల్లో వేసుకున్న డ్రెస్‌లను కొడుక్కి కుట్టించి అతడు డ్యాన్స్ చేసుంటే సంతోషపడ్డాడు ఇప్పుడు కొడుకు ఇంత గొప్ప దర్శకుడు అయి సూపర్ స్టార్స్‌ను డైరెక్ట్ చేస్తుంటే తండ్రిగా అతడికి ఇంకేం కావాలి అని మెచ్చుకున్నాడు.మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్బ్రహ్మయ్య మాట్లాడుతూ.. నా కొడుకు బీటెక్ చదివేటప్పుడు మూడో సంవత్సరంలో మూడు సబ్జెక్టులు పోయాయి. చిరంజీవి సినిమాలు తెగ చూసేవాడు. అప్పుడు నేను.. చిరంజీవికి చెడ్డ పేరు తీసుకురాకురా.. ఆయన సినిమాలు చూసి చెడిపోయావంటారు అని భయపెట్టాను. దాంతో చదువు పూర్తి చేసి చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు.చిరంజీవి స్పీడ్అనిల్ వంద మైళ్ల స్పీడులో సినిమా తీస్తే చిరంజీవి దాన్ని 200 మైళ్ల స్పీడులో ముందుకు తీసుకెళ్లాడు. ఉదయం తొమ్మిదిన్నరకు షూటింగ్ అంటే ఏడున్నరకే ఆయన సెట్లో ఉండేవాడు. మేము ఆదరాబాదరాగా పరిగెత్తేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే!చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో రమణ గోగుల్ సాంగ్ డిలీట్.. ఎందుకంటే? -
రమణ గోగుల సాంగ్ అందుకే పెట్టలేదు: అనిల్ రావిపూడి
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా రాణించిన రమణ గోగుల తర్వాత సడన్‌గా సినిమాలకు దూరమయ్యాడు. గతేడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆయన పాడిన గోదారి గట్టు మీద రామసిలకవే.. పాట బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో మార్మోగిపోయింది.రమణతో సాంగ్దీంతో అనిల్ రావిపూడి కాంబినేషన్లో రమణ గోగుల మరో పాట పాడబోతున్నాడని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అది ఏ సినిమాకో కాదు.. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీకి! భీమ్స్ ఇచ్చిన ట్యూన్‌కు అతడితో పాట కూడా పాడించారట.. ఇంకేముంది, ఈ సాంగ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. తీరా సినిమాలో ఆయన పాడిన పాటే లేదు. ఈ విషయంపై తాజాగా అనిల్ రావిపూడి స్పందించాడు. అంత ఊపు లేదని..ఆయన మాట్లాడుతూ.. రమణ గోగులతో ఓ పాట పాడించాను. కాకపోతే అది మెలోడియస్గా ఉందని పక్కన పెట్టాల్సి వచ్చింది. సినిమాలో మొదటి పాట అంటే ఎనర్జీ, ఊపు, వైబ్ ఉండాలి. కానీ రమణ పాడిన పాట మెలోడియస్గా డ్యుయెట్‌లా ఉంది. ఓపెనింగ్ సాంగే ఊపు రావాలి.. కానీ ఇదంత జోష్‌గా లేదని నాకెక్కడో కొడుతూనే ఉంది. దీంతో ఆయనకు చెప్పి ఆ పాటను పక్కనపెట్టాం. దాని స్థానంలో హుక్ స్టెప్ సాంగ్ పెట్టాం. రమణ పాడిన సాంగ్ రిలీజ్ చేయాలనుకోవడం లేదు. అది ఇంకో సినిమాలో వాడుకుంటాను అని చెప్పుకొచ్చాడు.సింగర్ మాత్రమే కాదుసింగర్ రమణ గోగుల ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు మాత్రమే కాదు. వీటన్నింటికన్నా ముందు ఆయన ఓ వ్యాపారవేత్త. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సోలార్ ఎనర్జీ, అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదివాడు. తర్వాత పలు స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాడు. ఎన్నో వందలాది గ్రామాలకు సోలార్ ఎల్డీ కాంతులు అందించాడు.చదవండి: పనిమనిషిపై 10 ఏళ్లుగా అత్యాచారం, ధురంధర్ నటుడి అరెస్ట్ -
అనిల్ రావిపూడికి చిరు కార్ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..!
-
‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్ (ఫొటోలు)
-
అనిల్ రావిపూడికి ఒక రేంజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)
-
అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!)A MEGA GIFT to the HIT MACHINE 🔥🔥🔥Moments of Megastar @KChiruTweets garu honouring @AnilRavipudi with a surprising gift, a brand-new Range Rover ❤️🔥#ManaShankaraVaraPrasadGaru THE ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER 💥💥💥 pic.twitter.com/o3C2DvAoL1— Shine Screens (@Shine_Screens) January 25, 2026 -
ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!
-
అనిల్ రావిపూడి 10వ సినిమా టైటిల్ చూస్తే Wow అనాల్సిందే..
-
సర్ప్రైజ్.. 'మన శంకర వరప్రసాద్‌గారి' కోసం వస్తున్న నయనతార
'మన శంకర వరప్రసాద్‌గారు' రెండో వారంలోనూ జోరు చూపిస్తున్నారు. శనివారం నాడు ఏకంగా లక్ష టికెట్లు బుక్‌మైషోలో అమ్ముడుపోయాయి. ఆపై గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఉంది కాబట్టి ఈ రెండురోజులు థియేటర్స్ ఫుల్ కానున్నాయి. అయితే, నేడు (జనవరి 25)న సాయింత్రం 5గంటలకు మూవీ యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనుంది. ఈ వేడుకలో నయనతార కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయన్ చాలా ఏళ్ల తర్వాత వేదికపై మాట్లాడనుంది. అయితే, ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఎక్కడ జరుగుతుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పార్క్ హయత్‌లో జరగవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీంతో చిత్ర నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొంటుంది. కానీ, అందరి చూపు నయనతారపైనే ఉంది. సినిమా విడుదలకు ముందు కొన్ని ప్రమోషనల్ వీడియోలతో చాలా మందిని ఆశ్చర్యపరిచిన నయన్.. ఇప్పుడు ఏకంగా సక్సెస్మీట్కు వస్తున్నట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ అనేక రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటింఆచరు. ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది. మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 450 కోట్ల వరకు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
'మన శంకర వరప్రసాద్‌గారు' స్టోరీ.. ఈ మూవీ నుంచే తీసుకున్నా: అనిల్
చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ దూసుకుపోతుంది. అయితే, మూవీ చూసిన తర్వాత చాలామంది అనేక విమర్శలు చేశారు. ఈ మూవీ డాడీ, విశ్వాసం, తులసి సినిమాలకు దగ్గరగా ఉందంటూ కామెంట్లు చేశారు. ఆ మూడు కథలను బేస్ చేసుకుని ‘మన శంకర వరప్రసాద్ గారు’ స్క్రిప్ట్‌ను రెడీ చేశారంటూ నెట్టింట పోస్టులు షేర్ చేశారు. అయితే, ఈ అంశంపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి అసలు విషయం చెప్పారు.మన శంకర వరప్రసాద్ గారు స్టోరీపై వస్తున్న విమర్శలకు దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా స్పందించాడు. 'అజిత్ నటించిన 'విశ్వాసం' మూవీ ఛాయలు మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే..? ఈ రెండు సినిమాల్లో హీరోయిన్గా నయనతార నటించారు. విశ్వాసం మూవీ కథను పాప పాత్ర టర్న్ చేస్తుంది. వాస్తవానికి అలాంటి కాన్సెప్ట్ కథతో తెలుగులో 'డాడీ' మూవీ ఎప్పుడో వచ్చింది. నేను 'డాడీ' మూవీని రిఫరెన్స్‌గా తీసుకునే 'మన శంకర వరప్రాద్'ను తెరకెక్కించాను. డాడీ మూవీలో చిరు ఎమోషన్స్ బాగా పండించారు. కానీ, సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. డాడీ స్టోరీ చుట్టూ ఒక బలమైన కోటరి లేకపోవడంతోనే ప్రేక్షకులను మెప్పించలేదని నా అభిప్రాయం. అయితే, డాడీ మూవీ నాకు బాగా నచ్చింది. అందులోని ప్రధానమైన కాన్సెప్ట్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఇందులో దాచేది ఏం లేదు. ఓపెన్‌గానే చెబుతున్నాను. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి మూలం 'డాడీ' స్టోరీనే..' అంటూ అనిల్ హూందాగా చెప్పారు. ఈ విషయంలో అనిల్‌ను మెచ్చుకోవాల్సింది. తను నిజాయితీగానే క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఫ్యామిలీ పల్స్ బాగా పట్టేసుకున్న అనిల్ తనదైన స్టైల్లో మన శంకర వరప్రసాద్ గారు కథన సిద్ధం చేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా కేవలం డాడీ మూవీ కాన్సెప్ట్‌ను మాత్రమే తీసుకున్నారు. కానీ, కథలో చిరు అభిమానులకు కావాల్సినంత స్టఫ్‌ను అనిల్ ఇచ్చారు. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. -
సంక్రాంతికి వస్తున్నాం..సీక్వెల్ లేనట్టేనా..!
-
'మన శంకర వరప్రసాద్ గారు' ఫేక్ కలెక్షన్స్.. అనిల్ సమాధానం
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్స్‌పై వస్తున్న రూమర్స్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, కొందరు అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దీంతో దర్శకుడు స్పందించారు.'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టాలీవుడ్లో అనేక రికార్డ్లను అధిగమించి సత్తా చాటుతుంది. ఇప్పటికీ బుక్‌మైషోలో టికెట్ల అమ్మకాల్లో ట్రెండింగ్‌లో ఉంది. కానీ, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్ నంబర్స్ ఫేక్ వేశారని సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు షేర్ చేశారు. ఇదే అంశంపై అనిల్ ఇలా స్పందించారు. 'ఈ సంక్రాంతికి చాలా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. అయితే, తాము చాలా ఓపెన్‌గానే కలెక్షన్స్ వివరాలు ఎప్పటికప్పడు ప్రకటిస్తూనే ఉన్నాం. వాటిని కొందరు మీడియా మిత్రులు కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. అందులో ఎలాంటి దాపరికం లేదు. ఫేక్ కలెక్షన్స్ వివరాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రేక్షకులు చిరంజీవిని ఎలా చూడాలని అనుకున్నారో అంతే రేంజ్లో మేము తెరపై ఆయన కనిపించేలా జాగ్రత్త పడ్డాం. ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కడెక్కడో ఉన్నవారంతా థియేటర్‌కు వచ్చేశారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ సినిమా చూశారు. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరిగాయి. కేవలం వారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యజమానులకు కూడా లాభాలు వచ్చేశాయి. అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.బుక్‌మై షోలోనూ ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటివరకు 25 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారి సంఖ్య ఊహించలేమని మేకర్స్ అన్నారు. -
ఆయన నమ్మకమే ఇక్కడి వరకు నడిపించింది: అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్
ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవితో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించాడు. ఈ జనవరి 12న రిలీజైన మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెప్పించారు.ఇప్పటివరకు తాను 9 సినిమాలతో హిట్ కొట్టిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్‌తో మొదలైన అనిల్ ప్రయాణం టాలీవుడ్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2,ఎఫ్3 చిత్రాలతో తన మార్క్ చూపించారు. సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన పదో సినిమాకు కూడా రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి.అయితే తన మొదటి సినిమా పటాస్ రిలీజై సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తి కావడంతో అనిల్ రావిపూడి ఎమోషనల్ ట్వీట్ చేశారు. పటాస్‌ను గుర్తు చేసుకుంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. తాను ప్రేక్షకుల హృదయాల్లోకి అడుగుపెట్టి నేటికి 11 ఏళ్లు పూర్తయిందన్నారు. ఇంత కీలకమైన బాధ్యతను నాపై నమ్మకంతో, అపారమైన విశ్వాసంతో నాకు అండగా నిలిచిన నా మొదటి హీరో శ్రీ నందమూరి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు. ఆ నమ్మకమే నాకు నిర్భయంగా ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సినిమా నా జీవితంలోకి తీసుకువచ్చిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, భావోద్వేగాలు, ఆనందం వెలకట్టలేనివని.. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఈ ప్రయాణం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. It all started here 🙏🏻🙏🏻🙏🏻1️⃣1️⃣ years since I first made my way into the audiences hearts ❤️I will always remain indebted to my first hero, @NANDAMURIKALYAN garu, for trusting me with such a crucial responsibility and for standing by me with immense confidence. That belief… pic.twitter.com/BzUrzsvfXV— Anil Ravipudi (@AnilRavipudi) January 23, 2026 -
అలా రజనీకాంత్ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!
సక్సెస్ అందుకోవడం కన్నా దాన్ని కొనసాగించడం చాలా కష్టం. కానీ, కెరీర్ మొదలైనప్పటినుంచి అపజయమనేదే ఎరుగకుండా విజయాల పరంపరతో దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అతడు డైరెక్ట్ చేసిన 9వ సినిమా మన శంకరవరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇందులో చిరు స్టైల్, డ్యాన్స్, కామెడీ చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది.రజనీకాంత్‌ను అలా ఊహించుకోగలమా?అయితే కొందరు మాత్రం చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని, తాతగా నటిస్తే బెటర్ అని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు గట్టి కౌంటరిచ్చాడు అనిల్ రావిపూడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రతి హీరోకు కొన్ని బలాలుంటాయి. వాటిని వదిలేసి మనమెప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. రజనీకాంత్‌గారిని తన వాకింగ్ స్టైల్ లేకుండా ఒక సినిమా చేయమనండి, మనం చూడగలమా? అలాగే చిరంజీవి కూడా..ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా రజనీకాంత్‌గారి సినిమా ఊహించుకోగలమా? అది రజనీకాంత్‌గారి స్టైల్. అలాంటి రజనీకాంత్‌తో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమా చేస్తే జనాలు ఒప్పుకోరు. ఆయనకు తగ్గ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాలి. అలాగే చిరంజీవికి తగ్గ అంశాలు ఆయన మూవీలో ఉండాలి. చిరంజీవిగారు అనగానే మనకు గుర్తొచ్చేవి డ్యాన్సు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు మంచి పర్ఫామెన్స్ లేదా కథాబలం.నేను చేసి చూపించా..ఆయన ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయాలా? అంటే దానికి తగ్గట్లుగా కథ రాస్తే చేయొచ్చు. నేను తీసి చూపించానుగా! చిరంజీవి- నయనతార మధ్య లవ్‌స్టోరీ పెట్టాను. ఎక్కడా ఓవర్‌గా చూపించలేదు. ఆయన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. ఇలాంటి ప్రయోగాలు మనం చేయొచ్చు. ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు. హీరో బలాలను వాడుకుంటేనే సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరో విషయం.. చిరంజీవిగారు తన లుక్స్ మెయింటైన్ చేస్తారు. తాత పాత్రలెందుకు చేయాలి?అలుపు, ఆయాసం లేకుండా హుషారుగా హుక్ స్టెప్ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. ఆయన అలాగే ఉండాలని కోరుకుంటాను. ఒక మనిషి అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడు మనమెందుకు ఆయన తండ్రి, తాత పాత్రలు మాత్రమే చేయాలని రుద్దాలి? కావాలని ఒక వ్యక్తిని తగ్గించడానికే కొందరు ఇలా మాట్లాడుతున్నారు. చిరంజీవి.. గాడ్‌ఫాదర్, సైరా నరసింహారెడ్డి అని మధ్యమధ్యలో ప్రయోగాలు చేశారు.. కానీ ఈ సినిమాకే ఎందుకింత పెద్ద ఫలితం వచ్చిందంటే జనాలు ఆయన్ను పాత చిరంజీవిగా చూడాలనుకున్నారు అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.చదవండి: శశిరేఖ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది -
ఆ సీన్ రీల్స్ పిల్లలకు చూపించొద్దు : అనిల్ రావిపూడి
‘‘నా టార్గెట్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి, నా సినిమాలు చూస్తూ నవ్వుతుంటే అదే నాకు ఎనర్జీ. ఆ నవ్వే నా సక్సెస్ సీక్రెట్ ’’ అని అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ‘‘మా సినిమా విజయపథంలో దూసుకెళుతోంది’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇంకా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు... → ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్స్‌లో మా సినిమా ఇంకా దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవిగారు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయనలో ఉన్న ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఒకప్పటి ఆయన స్టైల్‌ను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. అన్నీ కుదిరాయి. సక్సెస్ టూర్లో భాగంగా థియేటర్స్ విజిట్ చేసినప్పుడు... చిరంజీవిగారిని స్క్రీన్‌పై చక్కగా ప్రజెంట్ చేశానని చెప్పారు.→ చిరంజీవి, వెంకటేశ్‌గార్ల వంటి స్టార్ హీరోలు ఉన్న ఈ సినిమా స్క్రిప్ట్‌ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేశాను. కానీ సవాల్‌గా అనిపించింది. కొత్తవారిని ప్రోత్సహించడంలో చిరంజీవిగారు ముందుంటారు. ‘హుక్ స్టెప్’ సాంగ్ కోసం ఆట సందీప్‌ను ప్రోత్సహించారు. అలాగే ఈ చిత్రంలోని ‘ఫ్లైయింగ్ హై’ పాటను చిరంజీవిగారి చిన్న చెల్లెలు మాధవిగారి కుమార్తె నైరా పాడారు. నైరా ఫిల్మ్ కోర్స్ చేశారని, సింగర్‌గా ట్రై చేయించమని చిరంజీవిగారు చెప్పారు కానీ, పాట పాడించమని రికమండ్ చేయలేదు. అయితే నైరా ఈ పాటను సింగిల్ టేక్‌లో పాడారు. → చిరంజీవి–వెంకటేశ్‌గార్ల కాంబినేషన్ సీన్స్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎప్పటికైనా ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తాను. ఇక ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ‘మద్యపానం.. మహదానందం’ సీన్స్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విభిన్న రకాలుగా రీల్స్ చేస్తున్నారు. అయితే ఈ ‘మధుపానం..’ సీన్స్‌కి సంబంధించిన రీల్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని కోరుతున్నాను. → ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది (అక్షయ్ కుమార్ హీరో). అలాగే ‘భగవంత్ కేసరి’ సినిమా కోర్ పాయింట్‌తో ‘జన నాయగన్’ తీశారు. ఇలా నా డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం హ్యాపీగా ఉంది. నా సినిమాలను నేరుగా ఇతర భాషల్లోకి రిలీజ్ చేయవచ్చు. అయితే ఎమోషన్స్, యాక్షన్ యూనివర్సల్‌గా వర్కౌట్ అవుతాయి కానీ కామెడీకి మాత్రం ప్రతి భాషకి ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉంటుంది కాబట్టి నేరుగా రిలీజ్ చేయలేం. → నా తర్వాతి సినిమా కోసం టైటిల్ లాక్ చేశాను. ఓ విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేస్తాను. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావడం ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లా అనిపిస్తోంది. ఇందులో నేను ఓ ముఖ్య పాత్రధారిగా ఉండటం హ్యాపీ. అలాగే వరుస విజయాలతో దర్శకుడిగా వంద శాతం సక్సెస్ స్ట్రైక్ అనే ఫీలింగ్ బాగుంది. -
పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్
దర్శకుడిగా వరుస బ్లాక్బస్టర్లు కొడుతున్న అనిల్ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. సరైన నిర్ణయం తీసుకోకపోతేఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్ ఇచ్చాను.టైటిలే విచిత్రంగా ఉండబోతోందితాజాగా వైజాగ్ టూర్లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్ అయితే జరగబోతోంది. టైటిల్ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్ ప్రకటిస్తాను.పవన్ కల్యాణ్‌తో కాదు!ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్ మాత్రమే ఫిక్స్ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్ దరకడం కదా! జూన్, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. పవన్ కల్యాణ్‌ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లి ప్రపోజల్.. ముందు కెరీర్‌పై ఫోకస్ చేయ్: హీరోయిన్ -
ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన 8 రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన సంగతి తెలిసిందే. Watching my little niece #Naira sing the #FlyingHigh song from my film #ManaShankaraVaraPrasadGaru filled my heart with indescribable joy ❤️https://t.co/Ghbnf7gQtXThis is just the beginning, my dear. May your path always be bright, joyful, and filled with endless… pic.twitter.com/hxcaTwLiWw— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2026 -
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్.. అనిల్ రావిపూడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్
-
Anil Ravipudi: చిరంజీవి పేరు... పెట్టడానికి కారణం ఇదే ...?
-
Anil Ravipudi: నాగార్జున, మహేష్ తో సినిమా కన్ఫర్..?
-
ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?
ప్రభాస్ 'రాజాసాబ్' తప్పితే సంక్రాంతి రిలీజైన మిగతా సినిమాలన్నీ పాజిటివ్ టాక్ అందుకున్నాయి. కానీ చిరంజీవి చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి థియేటర్లు ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలివారం పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా నంబర్స్ ప్రకటించారు. అలానే ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్లు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి తొలివారం పూర్తయ్యేసరికి రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోటా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు తెలుస్తోంది. రిలీజైన తర్వాత ఏడురోజు అంటే నిన్న కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీంతో ఏడో రోజు వసూళ్లలో 'అల వైకుంఠపురములో'ని చిరు చిత్రం అధిగమించినట్లు సమాచారం.మరోవైపు తొలివారంలోనే ఈ రేంజు వసూళ్లు అందుకున్న ప్రాంతీయ చిత్రం ఇదేనని నిర్మాతలు ఘనంగా ప్రకటించుకున్నారు. అంటే చిరంజీవి సరసన కొత్త రికార్డ్ చేరినట్లే. ఇకపోతే ఇవాళ్టి నుంచి అందరూ నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తారు కాబట్టి వసూళ్లు కాస్త తగ్గొచ్చు. కాకపోతే లాంగ్ రన్లో ఎంత వసూళ్లు వస్తాయనేది చూడాలి? ఫిబ్రవరి తొలివారం వరకు పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం 'మన శంకరవరప్రసాద్'కి కలిసొచ్చేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)Every theatre, every centre..Every region and every heart…THE SWAG KA BAAP has conquered everything 😎₹292+ crores Gross in the FIRST WEEK for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥#MegaSankranthiBlockbusterMSG enters into BLOCKBUSTER… pic.twitter.com/AaBGtzHDQh— Shine Screens (@Shine_Screens) January 19, 2026 -
సీనియర్ హీరోలకు బ్లాక్‌బస్టర్.. అనిల్ 10వ సినిమా ఎవరితో?
కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్ హిట్లు కొట్టేసి శెభాష్ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..ఫస్ట్ సినిమా నుంచే..అనిల్ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్ 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్ హిట్లే అందుకున్నాడు. బ్లాక్‌బస్టర్ సినిమాలుగతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్ పండగను క్యాష్ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్‌ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది. సీనియర్ హీరోలతో సినిమాలుఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్‌కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. చిరంజీవి బంపరాఫర్మరోవైపు మెగాస్టార్.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్ ఇచ్చాడు. అనిల్ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే అనిల్ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.రామ్‌చరణ్‌తో సినిమా!మన శంకరవరప్రసాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'రామ్‌చరణ్‌తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ చేయండి.. వెంటనే రామ్‌చరణ్ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్.. చరణ్‌తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!పదో సినిమాపై బజ్అసలే అనిల్ రావిపూడి కెరీర్లో 10వ సినిమా.. హిట్ స్ట్రీక్ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్‌తోనా? చిరు-వెంకీతోనా? నాగ్తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి! -
సిగ్గు లేకుండా తిందాం.. దోశలు వేస్తూ.. పిచ్చ కామెడీ
-
చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన 'అనిల్ రావిపూడి'
'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా హిట్ కావడంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండురోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే, సినిమాకు పెద్ద బడ్జెట్ కాకపోయినప్పటికీ చిరంజీవి, నయనతార, వెంకటేశ్ వంటి స్టార్స్ ఉండటంతో వారి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని టాక్.. ఈ మూవీకి నిర్మాతలుగా సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. దీంతో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే ప్రశ్న ఎక్కువమందిలో కలుగుతుంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాకు గాను తను రెమ్యేనరేషన్ మాత్రమే తీసుకున్నానని అనిల్ రావిపూడి అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను షేర్ ఏమీ తీసుకోవడం లేదన్నారు. చిరంజీవి కూడా సినిమా బడ్జెట్‌ను బట్టి తన పారితోషికం తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో నయనతార, వెంకటేశ్ వంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు.. ఆపై ఆయన కూతురు నిర్మాత కాబట్టి ఆమెకు కూడా కాస్త నాలుగు రూపాయలు మిగలాలి కదా అనే దృష్టిలో చిరు ఉన్నారని తెలిపారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అనిల్ రావిపూడి చెప్పారు.ఎవరికి ఎంత రెమ్యునరేషన్..?చిరంజీవి ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ వుంది. అయితే, తన కూతురు నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఇందులో తన పారితోషికాన్ని కాస్త తగ్గించారని సమాచారం. ఇందులో శశిరేఖగా నయనతార ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర కోసం ఆమె ముందుగా రూ. 15 కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఫైనల్‌గా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌తో ఢీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రూ. 9 కోట్లు, అనిల్ రావిపూడి రూ. 25 కోట్లు తమ రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
నన్ను లాక్కెళ్లి ముద్దు పెట్టాలని చూశారు: అనిల్ రావిపూడి
వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు కొల్లగొట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అవన్నీ నాకు కొట్టిన పిండి అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఒకటీరెండు కాదు వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని హిట్ మెషిన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.మెగా బ్లాక్‌బస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించాడు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మెగా బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్లో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.కనబడితే లాక్కెళ్లి..ఆయన మాట్లాడుతూ.. ఈ కథలోని అన్ని సన్నివేశాలకు చిరంజీవి గారే స్ఫూర్తి. నాకు ఈ సినిమా చేసే అవకాశాన్నిచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మెగా ఫ్యాన్స్ అయితే నేను కనబడితే లాక్కెళ్లి ముద్దులు పెడదామని చూస్తున్నారు. వాళ్లు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేను.ఫామ్‌హౌస్ కొనివ్వాలిఅమెరికాలో ప్రీమియర్స్ 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తే నిర్మాత సాహు గారపాటికి కారు ఇస్తానన్నాను. నేను అనుకున్న నెంబర్ దాటిపోయింది కాబట్టి ఆయనకు కారు కొనిస్తాను. కాకపోతే.. కలెక్షన్స్ మూడు దాటి నాలుగు మిలియన్ డాలర్లు వస్తే నాకు ఫామ్ హౌస్ కొనివ్వాలి. ఇప్పుడు ఆయన కారు అడుగుతారా? లేదా? అనేది ఆయన ఇష్టం అని అనిల్ రావిపూడి సరదాగా ఓ కండీషన్ పెట్టాడు.చదవండి: మన శంకరవరప్రసాద్ గారు రెండు రోజుల కలెక్షన్స్ -
'మన శంకరవరప్రసాద్ గారు' రెండురోజుల కలెక్షన్స్
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మార్క్ ఏంటో చూపుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డే రూ. 84 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రెండు రోజుల కలెక్షన్స్‌ను అధికారికంగా తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.'మన శంకరవరప్రసాద్ గారు' రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. సినిమా బాగుందని టాక్ రావడం ఆపై సంక్రాంతి సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో సినిమాకు టికెట్ ధరలు కూడా కాస్త అధికంగా ఉండటంతో కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. చిరంజీవి కెరీర్లో సైరా నరసింహారెడ్డి (రూ. 244 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 235 కోట్లు) చిత్రాలు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే, 'మన శంకరవరప్రసాద్ గారు' సులువుగా రూ. 350 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.#HappyBhogi2026 to everyone ❤️SWAG KA BAAP is setting Box-office on fire across the globe 🔥🔥🔥₹120Crore Gross worldwide in 2 DAYS for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥❤️🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/bIsz1HS9eu— Shine Screens (@Shine_Screens) January 14, 2026 -
ఈ సంక్రాంతి కూడా నాకో మంచి జ్ఞాపకం: దర్శకుడు అనిల్ రావిపూడి
‘‘2026 సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్‌గా చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలతో మీకు ఆనందాన్ని ఇచ్చి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. నా కెరీర్లో చాలా వేగంగా 25 రోజుల్లో పూర్తి చేసిన స్క్రిప్ట్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నేను రాసిన ప్రతి సీన్‌కి స్ఫూర్తి చిరంజీవిగారే... అందుకే ఆ ఘనత మొత్తం చిరంజీవిగారికి ఇస్తాను’’ అని అనిల్ రావిపూడి చెప్పారు.చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర చేశారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్ యూ మీట్లో చిత్రదర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారితో పని చేసిన 85 రోజుల్లో ప్రతి రోజూ ఒక బ్యూటిఫుల్ మెమొరీ.సంక్రాంతి వసూళ్లపరంగా మా నిర్మాతలు సాహు, సుష్మిత సంతోషపడాలి. ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో అలా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ ఆనందపడాలి. వెంకీ గౌడ పాత్రని ఒప్పుకున్నందుకు వెంకటేశ్‌గారికి హ్యాట్సాఫ్’’ అని తెలిపారు. ‘‘ప్రేక్షకులు మా సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు’’ అని సాహు గారపాటి అన్నారు. సుష్మిత కొణిదెల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లాంచింగ్ సమయంలో నాన్నగారు నా పేరు అడిగితే... సుష్మిత కొణిదెల అని చెప్పాను. ‘ఆ పేరు నిలబెట్టుకో’ అన్నారు. ఇప్పుడు ఆ పేరు నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు భీమ్స్, నటులు హర్షవర్ధన్, అభినవ్, శ్రీనివాస రెడ్డి, సాయి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ సాయికృష్ణ, కెమెరామేన్ సమీర్ రెడ్డి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
'అసలు నీవల్ల ఏంటి ఉపయోగం అనేవారు'.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్‌గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబో అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెంకీ మామ కూడా ఈ మూవీలో కనిపించడంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. మూవీకి హిట్ టాక్ రావడంతో మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిన్నప్పుడు మా నాన్న నన్ను తిట్టేవాడని భీమ్స్ సిసిరోలియో అన్నారు. నువ్వు దేనికి రావు రా.. నీవల్ల ఏంటి ఉపయోగం అని అనేవారని గుర్తు చేసుకున్నారు. నాన్న ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను.. నా ముందు అనిల్ రావిపూడి ఉన్నారు.. నా వెనుక చిరంజీవి గారు ఉన్నారని ఎమోషనలయ్యారు. ఇది ఒక మాటతోనో.. చేసిన పాటలతోనో చెప్పుకునేది కాదు.. మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు.. నన్ను తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నారంటూ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. ఈ వేదిక నుంచి చెబుతున్నా.. నీ తల్లిదండ్రులకు, నీకు నా పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.భీమ్స్ మాట్లాడుతూ..' చిన్నప్పుడు నీ వల్ల ఏంటిరా ఉపయోగం అని నాన్న తిట్టేవారు. నాన్నా.. ఇప్పుడు ఇక్కడున్న.. నా ముందు అనిల్‌గారు.. నా వెనుక చిరంజీవిగారు ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా భీమ్స్ ఉంటే బాగుంటుందని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నా కష్టానికి మీరు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా. సినిమా మొదలైనప్పటి నుంచి నాకు ఒక్కటే అనిపిస్తోంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొడుకు గొప్ప దర్శకుడు అయ్యాడు. ఒక సాధారణ రైతు కొడుకునైన నేను వాళ్లతో కలిసి పనిచేశాను. కర్షకుడు, కార్మికుడు, రక్షకుడు.. ఇలా ముగ్గురు కలిసిన త్రివేణి సంగమంలా అనిపిస్తోంది' అని అన్నారు. -
మన శంకరవరప్రసాద్ తర్వాత, ఏ హీరోతో అనిల్ రావిపూడి చిత్రం చేస్తాడు?
-
'మన శంకర వర ప్రసాద్‌గారు' ఓల్డ్ సాంగ్స్ ఖర్చు ఎంతో తెలుసా?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో 1980 కాలం నాటి పాటలను ఉపయోగిస్తున్నారు. అందులో ఎక్కువగా ఇళయరాజా పాటలు తీసుకోవడం విశేషం. ఈ జనరేషన్ సినీ ఫ్యాన్స్‌కు ఆ సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి కూడా.. అందుకే దర్శకులు కూడా వాటిపై మక్కువ చూపుతున్నారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం మూవీ 'కే ర్యాంప్' కోసం హీరో రాజశేఖర్ నటించిన పాత సినిమా పాటను 'ఇదేమిటమ్మ మాయా..' తీసుకున్నారు. సినిమాకు కూడా బాగా కలిసొచ్చింది కూడా.. ఆ సమయంలో నెట్టింట భారీగా వైరల్ అయింది. అయతే, సంక్రాంతి రేసులో ఉన్న 'మన శంకర వర ప్రసాద్‌గారు' సినిమాలో కూడా పాత పాటలను ఉపయోగించి క్రేజ్ తెచ్చారు.చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా 'మన శంకర వర ప్రసాద్‌గారు'లో సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కోసం ఈ సాంగ్‌ను మూడు భాషల నుంచి తీసుకున్నారు. 'దళపతి' సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా విడుదలైంది. అయితే, చిరు సినిమా కోసం అన్ని భాషలకు సంబంధించిన ట్యూన్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై సినిమాలో అక్కడక్కడ మరికొన్ని పాత పాటలను దర్శకుడు వాడారు. దీంతో ఈ పాటల రైట్స్ కోసం అడియో కంపెనీలకు భారీగానే డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. మన శంకర వర ప్రసాద్గారులో ఉపయోగించిన పాత పాటల అన్నింటికి కలిపి సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అది కూడా కేవలం ట్యూన్స్ వరకు మాత్రమే అనుమతి తీసుకున్నట్లు టాక్.. అయితే, 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాకు ఆ పాత పాటలకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ ట్యూన్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. చిరంజీవి పాట 'రామ్మా చిలకమ్మ'కు వెంకీ డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు చేసిన గోల మామూలుగా ఉండదు. ఆపై 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పాటకు చిరు స్టెప్పులు వేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. ఇలా అన్ని పాటలకు కోటి రూపాయలు ఖర్చు చేసినప్పటికీ మూవీ లవర్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. -
కాంబో సూపర్ హిట్.. డైరెక్టర్‌కు మెగాస్టార్ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ వస్తోంది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది.మనశంకర వరప్రసాద్ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో అనిల్ రావిపూడిని మెగాస్టార్ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెరిశారు. Cherishing moments with Megastar @KChiruTweets garu for team #ManaShankaraVaraPrasadGaru ❤️🔥✨Experience the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 💥#MegaBlockbusterMSG IN CINEMAS NOW ❤️ pic.twitter.com/dhcbC4L7pL— Shine Screens (@Shine_Screens) January 12, 2026 Sometimes, words aren’t needed at all ❤️🤗#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026 -
మన శంకర వరప్రసాద్ గారు హిట్టా.. ఫట్టా
-
'మన శంకర వర ప్రసాద్ గారు'.. మూవీలో ఇదొక్కటే మైనస్
సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' వచ్చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. నిర్మాతలను కమర్షియల్‌గా కూడా గట్టెక్కించే సినిమా అని చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే, ఒక విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.'మన శంకర వర ప్రసాద్ గారి' గురించి ఎక్కడ చూసిన సానుకూల స్పందన కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ, సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో ఈ పాటను చాలాసార్లు ఉపయోగించారు. ప్రధానంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్స్‌లలో ఈ సాంగ్ ఉంటుంది. ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను క్లియర్ చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా దృఢమైన వైఖరిని తీసుకుంటారని తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ వియషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ పాట కారణం వల్ల థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుకుంటున్నారు. నిర్మాతల నుండి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది. -
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ‘మన శంకరవరప్రసాద్ గారు’నటీనటులు: చిరంజీవి, వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్, రఘుబాబు, అభినవ్ గోమఠం తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెలరచన-దర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 12, 2026ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరు ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Mana Shankara Vara Prasad Garu Movie Review)కథశంకరవరప్రసాద్(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీమ్(కేథరీన్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం) కేంద్ర హోంమంత్రి నితీష్ శర్మ(శరత్ సక్సేనా) రక్షణ బాధ్యలతను చూస్తుంటుంది. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉండే శంకరవరప్రసాద్.. పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ(నయనతార) అతనికి విడాకులు ఇచ్చి.. బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్(సచిన్ ఖేడ్కెర్) దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించపోవడంతో ఆరేళ్లుగా వరప్రసాద్ అదే బాధలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నితీష్.. తనకున్న పలుకుబడితో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్ ఎలా దగ్గరయ్యాడు? అసలు శశిరేఖ, వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? మైనింగ్ వ్యాపారవేత్త వెంకీ గౌడ(వెంకటేశ్), శశిరేఖకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు శశిరేఖ, వరప్రసాద్ మళ్లీ కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..ఎలా ఉందంటే..అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాలో కొత్తదనం, ట్విస్టులు, లాజిక్కుల గురించి వెతకడం అంటే.. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడం ఆయన స్టైల్. కథ-కథనం కంటే.. హీరోకి ఉన్న ప్లస్ పాయింట్స్‌ని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే.. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు? అనేది అనిల్‌కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి కూడా అనిల్ ఆ పనే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌ని గట్టిగా వాడుకొని.. ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాగే చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్‌ని పక్కన పెట్టలేదు. మధ్య మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్‌ని కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే.. ఈ సింపుల్ లైన్‌కి చిరంజీవి మేనరిజాన్ని హైలెట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే! ఈ మధ్య కాలంలో... ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలిష్‌గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి సరిపోలేదనే చెప్పాలి. ఒకానొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్లా చూపించారనే ఫీలింగ్ కలుగుతుంది.ఓ రౌడీ ముఠా.. హోం మంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్‌తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్- శశిరేఖల ప్రేమ.. పెళ్లి.. విడాకులకు దారీతీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి. స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథనం కాస్త బోరింగ్‌గా సాగుతుంది. బుల్లిరాజా(రేవంత్) ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ సీన్‌ని పెట్టి ఫస్టాఫ్ ముగించాడు. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా.. విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించినా.. సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేశ్ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్ అవుతాయి. వెంకీ గౌడగా వెంకటేశ్ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. సాధారణ సమయంలో రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ.. సంక్రాంతి పండక్కి వచ్చి ‘మన శంకరవరప్రసాద్’ మంచి పనే చేశాడు. ముందుగా చెప్పినట్లుగా కొత్తదనం ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా హాయిగా నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా చూడొచ్చు. (Positives And Negatives Of Mana Shankara Vara Prasad Garu Movie)ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగులు.. ఇవన్నీ చూస్తే ఒకప్పటి మెగాస్టార్ మన కళ్లముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే.. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్ స్టెప్ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో విజిల్స్ వేయడం గ్యారెంటీ. శశిరేఖగా నయనతార తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. హీరో మామగారిగా సచిన్ ఖేడ్కర్ చక్కగా నటించాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. చిరు-వెంకీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా జరీనా వాహబ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్ టీమ్ సభ్యులుగా నటించిన కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. భీమ్స్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తొలిసారి నయన్ ఇలా.. చిరంజీవి ఏమో.. 'మన శంకర వరప్రసాద్ గారు' విశేషాలు
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఆదివారం సాయంత్రం ప్రీమియర్లతో షోలు పడనున్నాయి. వరస హిట్స్ కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు చేసిన మూవీ కావడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి?2017లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి పలు కమర్షియల్, పీరియాడిక్ మూవీస్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో చేసిన సినిమా ఇదే. దానికి తోడు సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.పదేళ్ల క్రితం 'పటాస్'తో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి.. దాదాపు ప్రతి మూవీతోనూ హిట్ అందుకుంటున్నాడు. 'ఎఫ్3' చిత్రం మాత్రమే ఓకే ఓకే అనిపించుకుంది గానీ మిగిలనవన్నీ కూడా హిట్స్‌గా నిలిచాయి. గతేడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' అయితే కేవలం తెలుగులోనూ విడుదలైనప్పటికీ రూ.250 కోట్లకు పైనే వసూళ్లు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా ఈ డైరెక్టర్ ట్రాక్ రికార్డు.. 'మన శంకర వరప్రసాద్' కలిసొచ్చేలానే కనిపిస్తోంది.నయనతార.. హీరోయిన్గా సినిమాలు చేయడం తప్పితే ప్రమోషన్లకు హాజరైంది లేదు. అలాంటిది ఈ చిత్రం కోసం ప్రారంభంలో ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. రీసెంట్గా మరో వీడియో కూడా చేసింది. విదేశాల్లో ఉండటం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేపోయింది. ఒకవేళ వచ్చుంటే మాత్రం రికార్డ్ అయిపోయేది.రీసెంట్ టైంలో చిరంజీవి ప్రతి సినిమాలో ఎవరో ఒక హీరో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ అలాంటి రోల్లో కనిపించనున్నారు. వెంకీ పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుంది. 'ఏంటి బాసూ సంగతి..' అనే పాటలో చిరు-వెంకీ కలిసి డ్యాన్స్ కూడా చేయనున్నారు. ఇప్పటికే ఆ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సినిమా రెమ్యునరేషన్స్ విషయానికొస్తే.. చిరంజీవి రూ.70-75 కోట్ల వరకు తీసుకున్నారట. ఈయన కెరీర్లో ఇదే అత్యధికమని టాక్. వెంకటేశ్‌కి రూ.10-15 కోట్లు, నయనతారకు రూ.9 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడికి రూ.20-25 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం.టికెట్ బుకింగ్ సైట్ బుక్ మై షోలో ఇన్నాళ్లు ఏ సినిమా రిలీజైనా సరే రివ్యూలు, రేటింగ్స్ లాంటివి ఉండేది. ఈ మూవీ కోసం అలాంటివే లేకుండా చిత్రబృందం ఏకంగా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. తెలుగు వరకు అయితే ఇలా చేసిన తొలి చిత్రమిదే!రీఎంట్రీలో చిరంజీవి పలు సినిమాలు చేసినప్పటికీ.. ఇందులో తన వింటేజ్ చిత్రాలని గుర్తుచేసేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. అలానే మూవీలో ఓ సన్నివేశంలో చిరు పాటలకు వెంకీ, వెంకటేశ్ పాటలకు చిరు డ్యాన్స్ చేస్తారని రూమర్ అయితే ఉంది. ఇందులో నిజమెంత అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఇలా పలు విశేషాలతో థియేటర్లలోకి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ హిట్ అవ్వడం చిరంజీవికి చాలా కీలకం. ఎందుకంటే తర్వాత రాబోయే 'విశ్వంభర'కు కాస్తోకూస్తో బజ్ రావాలంటే ఇది సక్సెస్ కావాల్సిందే. మరి ఈసారి చిరు-అనిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. -
'మన శంకర వరప్రసాద్' యూనివర్స్‌పై అనిల్ రావిపూడి క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే. అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్‌తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్‌లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో వెంకటేశ్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్‌ను సృష్టిస్తానని ఆయన చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్‌గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. -
'చిరంజీవి' సినిమా.. టికెట్ ధరల పెంపునకు అనుమతి
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని తెలిపింది.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. -
'మన శంకర వరప్రసాద్‌గారు' ప్రీరిలీజ్‌లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)
-
సుమతో అనిల్ రావిపూడి కామెడీ.. పడి పడి నవ్విన చిరంజీవి
-
'హుక్ స్టెప్' సాంగ్.. హుషారుగా చిరంజీవి డ్యాన్స్
చిరంజీవి కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్'.. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మూవీలోని మరో పాటని రిలీజ్ చేశారు. 'హుక్ స్టెప్' అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటలో చిరు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాబా సెహగల్ ఈ గీతాన్ని పాడారు. ఇందులో బంగారు కోడిపెట్టి, ముఠామేస్త్రి, ఖైదీ నం.150 సినిమాల్లోని స్టెప్పులని చూపించారు.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో తీశారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్. వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్స్ సంగీతమందించారు. సాహు గారపాటి, చిరు కూతురు సుస్మిత నిర్మాతలుగా వ్యవహరించారు. 'భోళా శంకర్' లాంటి ఫ్లాప్ తర్వాత దాదాపు రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకుని చిరు.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాలూ ఆగిపోయాయి.. ఇది ఎంతమందికి తెలుసు) -
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్
-
ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..
-
చరణ్‌తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్‌ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్‌కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్‌తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్టే. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)
-
మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది.The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12thMegastar @KChiruTweets Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut— Shine Screens (@Shine_Screens) January 2, 2026 -
చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్నిరోజుల ముందే ఈ మూవీలోని రెండు పాటల్ని రిలీజ్ చేయగా.. వాటిలో మీసాల పిల్ల బాగా వైరల్ అయింది. మరో సాంగ్ మాత్రం అంతంత మాత్రంగానే బాగుందనిపించింది. ఇప్పుడు మరో గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరు, వెంకీ కలిసి స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. అలానే చిరు-వెంకీ కలిసి ఓ పాటలో డ్యాన్స్ కూడా చేస్తారని అన్నాడు. ఇప్పుడు దాన్ని 'మెగా విక్టరీ సాంగ్' పేరిట విడుదల చేశారు. పాట విషయానికొస్తే బీట్ బాగుంది కానీ ట్యూన్ మాత్రం ఎక్కడో విన్నామో అనిపించేలా ఉందనిపించింది.ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న.. 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలోకి వస్తోంది. దీని కంటే ముందు 9వ తేదీన 'రాజాసాబ్'.. తర్వాత 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. మరి వీటిలో ఈసారి ఏయే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య) -
చిరు 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల తేదీ ప్రకటన
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ) -
చిరంజీవితో వెంకటేశ్.. రన్ టైమ్ ఇదే: అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’.. సంక్రాంతికి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. అయితే, ఈ మూవీలో వెంకటేశ్‌కు ఎంత సమయం పాటు స్క్రీన్ స్పేష్ ఇచ్చారనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ క్యామియో రోల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర ఉందని చిరంజీవితో నేను చెప్పాను. దీంతో వెంకటేశ్‌ను ఎంపిక చేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయన ఇమేజ్‌కు తగ్గకుండా ఆ పాత్ర కోసం మరింత లోతుగా పనిచేశాను. వెంకీ దాదాపు 20 నిమిషాల పాటు తెరపై కనిపిస్తారు. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను తప్పకుండా అలరిస్తాయి. వారిద్దరూ కలిసి చేసే డ్యాన్స్, పంచే కామెడీకి ఫిదా అవుతారు' అని పంచుకున్నారు.చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని వెంకటేశ్ గతంలో పంచుకున్నారు. తన ఫేవరెట్ నటుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కూడా వెంకీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కలిసి నటించినందుకు థాంక్స్ అంటూనే.. వెంకీ రాకతో ఈ చిత్రానికి ప్రత్యేకత తీసుకొచ్చారని చిరు పేర్కొన్నారు. వెంకీతో కలిసి వర్క్ చేసిన పది రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. డిసెంబర్ 15 నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్లలో దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. -
'శశిరేఖ' పూర్తి సాంగ్.. చిరు, నయన్ మ్యాజిక్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగే పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతానికి చిరు, నయనతార వేసిన క్లాసిక్ స్టెప్పులకు ఫిదా కావాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చాలా కలర్‌ఫుల్ లోకేషన్స్‌లో ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో ఈ పాటకు కూడా అంతే క్రేజ్ రావచ్చు. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో వెంకటేశ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. -
'శశిరేఖ' కోసం చిరంజీవి స్టెప్పులు
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా 'శశిరేఖ..' అంటూ కొనసాగే రెండో పాటకు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. డిసెంబర్ 8న పూర్తి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌ను మధుప్రియ ఆలపించిన విషయం తెలిసిందే. -
'మనశంకర వరప్రసాద్‌గారు.. నా రోల్ ముగిసింది..' వెంకటేశ్ ట్వీట్
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది. అయితే సంక్రాంతి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ మామ ఇటీవలే మరో మూవీని ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు.మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లోనూ వెంకీ మామ సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో వెంకీమామ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు హీరో వెంకటేశ్. మనశంకర వరప్రసాద్ చిత్రంలో నా పాత్ర షూటింగ్ ముగిసిందని ట్వీట్ చేశారు.వెంకటేశ్ తన ట్వీట్లో రాస్తూ..'మనశంకరవరప్రసాద్ మూవీ కోసం ఈరోజు నా పాత్రను ముగించా. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఇష్టమైన మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నో రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలనే కోరిక ఉండేది. చివరికీ ఈ ప్రత్యేక చిత్రం కోసం అనిల్ రావిపూడి మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.Wrapped up my part today for #ManaShankaraVaraPrasadGaru, and what an incredible experience it has been! Working with my favourite @KChiruTweets was an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with ‘Megastar… pic.twitter.com/KAzWcXGBeK— Venkatesh Daggubati (@VenkyMama) December 3, 2025 -
అన్నగారు పోలీసాఫీసర్
కార్తీ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో రానుంది. డిసెంబరులో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు టీజర్‌ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.‘‘టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. కార్తీ, జ్ఞానవేల్ రాజాతో పాటు చిత్రయూనిట్‌కి అభినందనలు’’ అని అనిల్ రావిపూడి తెలిపారు. ‘‘యాక్షన్ కామెడీ కథతో రూపొందిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ మూవీలో కార్తీపోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బర్త్ డే గిప్ట్
దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు చిరంజీవి. సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఓ స్పెషల్ వాచ్‌ని అనిల్ రావిపూడికి పుట్టిన రోజు కానుకగా చిరంజీవి అందించారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.కాగా, ఆదివారం (నవంబరు 23) అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేయించి, సెలబ్రేట్ చేశారు చిరంజీవి. ఈ వేడుకలో సుస్మిత కొణిదెల, సాహు గార పాటి తదితరులు పాల్గొన్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సుస్మిత కొణిదెల, సాహు గార పాటి నిర్మిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
మాస్ డ్యాన్స్‌కి రెడీ
మాస్ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట చిరంజీవి, వెంకటేశ్. ఈ స్టార్స్ ఇద్దరితో ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, ముఖ్య పాత్రల్లో వెంకటేశ్, క్యాథరీన్, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు.ఆల్రెడీ చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో గత నెలాఖర్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఓ సెలబ్రేషన్ సాంగ్ ఉందని, ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్‌తో పాటు నయనతార, క్యాథరీన్ కూడా డ్యాన్స్ చేస్తారని టాక్. ఈ పాటను ఈ నెలాఖరున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. -
సంక్రాంతికి వస్తున్నాం మూవీ అరుదైన ఘనత!
అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలకు ఎంపికైంది. ఈ నెల 20న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) అవార్డుల వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇండియన్ పనోరమ(ఫీచర్ ఫిల్మ్స్) విభాగంలో అఫీషియల్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిందని మేకర్స్ ట్వీట్ చేశారు.అంతేకాకుండా ఇవాళ పలు అవార్డులకు నామినేట్ వారి జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో టాలీవుడ్ డైరెక్టర్ యదు వంశీ నామినేట్ అయ్యారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికిగానూ ఆయనకు నామినేషన్ దక్కింది. ఇదే విభాగంలో.. మలయాళం నుంచి జితిన్‌లాల్ (ఎ.ఆర్.ఎం), హిందీ నుంచి కరణ్ సింగ్త్యాగి (కేసరి చాప్టర్ 2) బెంగాలీ నుంచి రామ్ కమల్ ముఖర్జీ (బినోదిని)పోటీపడుతున్నారు.#SankranthikiVasthunam has been officially selected for the Indian Panorama (Feature Films) at the International Film Festival of India (IFFI) 2025 ❤️🔥❤️🔥❤️🔥Another remarkable milestone for a film that set a new benchmark for regional films in TFI 💥An @AnilRavipudi film 🔥… pic.twitter.com/eMP57q7Zw9— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2025 -
అదిరే అభి నా సినిమాకు సాయం చేశాడు: అనిల్ రావిపూడి
‘‘గౌతమ్ ఎస్ఎస్సీ’ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ చిత్రంలో అభి మంచి పాత్ర చేశాడు. మేము చాలా ఏళ్లు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసేందుకు అభి సాయం చేశాడు. అదిరే అభిగా ‘జబర్దస్త్’తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగానూ ‘చిరంజీవ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్‌కు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ కావాలి. ‘చిరంజీవ’ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. ఆహాలో చిరంజీవ మూవీరాజ్ తరుణ్, కుషిత కల్లపు జోడీగా నటించిన చిత్రం ‘చిరంజీవ’ (Chiranjeeva Movie). అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీమియర్ షోకి, ప్రెస్ మీట్‌కి అనిల్ రావిపూడి అతిథిగా హాజరయ్యారు. పన్నెండేళ్లుగా ట్రై చేస్తున్నా..రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం అభి మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు’’ అని తెలిపారు. ‘‘చిరంజీవ’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు రాహుల్ అవుదొడ్డి. అభినయ కృష్ణ మాట్లాడుతూ– ‘‘పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆహా నుంచి శ్రావణిగారికి ‘చిరంజీవ’ కథ నచ్చడంతో ఈ సినిమా తీశారు’’ అన్నారు.చదవండి: స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం! -
వెల్కమ్ వెంకీ
‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్!’ అంటూ వెంకటేశ్‌ని ఆప్యాయంగా సెట్స్‌కి ఆహ్వానించారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్లో జాయిన్ అయ్యారు వెంకటేశ్. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేసింది. ‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్...’ అంటూ చిరంజీవి ఆప్యాయంగా వెంకటేశ్‌ని పిలవగా, ‘చిరు సార్... మై బాస్...’ అంటూ చిరంజీవిని హత్తుకున్నారు వెంకటేశ్. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్. చిరంజీవి– వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కాగా.. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. -
మీసాల పిల్ల సాంగ్ క్రేజ్.. యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. There’s no stopping the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 🔥🔥🔥#MeesaalaPilla is trending #1 on YouTube with 30M+ Views, 30K+ Reels on insta, 300M+ Reel Views and 50M+ Plays across all music platforms 💥💥💥AN UNANIMOUS MUSICAL SENSATION IN INDIA ❤️🔥❤️🔥❤️🔥--… pic.twitter.com/6rqiuAUop5— Shine Screens (@Shine_Screens) October 21, 2025 -
ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు చిరంజీవి సత్కారం (ఫొటోలు)
-
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'ఇక్కడ నన్ను దొబ్బెస్తున్నారండి'.. చిరంజీవి సాంగ్‌పై బుల్లిరాజు అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ మరో హిట్‌కు రెడీ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరా కానుకగా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.అయితే ప్రోమో రిలీజ్ తర్వాత మీసాల పిల్ల ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అలరించిన బుల్లిరాజు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి అలరించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడితో బుల్లిరాజు చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అందరూ నన్ను దొబ్బేస్తున్నారండి అంటూ బుల్లి రాజు భీమ్స్ సిసిరోలియోను అడిగాడు. వెళ్లి డైరెక్ట్‌గా డైరెక్టర్‌ను అడుగు అంటూ బుల్లిరాజు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి- బుల్లిరాజు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.ఈ చిత్రంలోని మీసాల పిల్ల లిరికల్ వీడియో ఫుల్ సాంగ్ అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియే సంగీతమందించారు. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.From fans, audiences to Bulli Raju, everyone is all excited to the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 💥#MeesaalaPilla Lyrical Video on Monday, 13th October ❤️🔥— https://t.co/EHn4RGd1j5A #Bheemsceciroleo Musical 🎵#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE😎… pic.twitter.com/S2sY6uDEjy— Shine Screens (@Shine_Screens) October 10, 2025 -
చిరంజీవి-అనిల్ రావిపూడి విలన్‌గా సరైన నటుడు!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీఎంట్రీ ఇచ్చాక ఆరు సినిమాలు చేశారు. కానీ, ఆయన రేంజ్‌కు తగిన విలన్ ఏ సినిమాలో కనిపించలేదని చెప్పవచ్చు. కానీ, వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆయన కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్‌గారు'(Mana ShankaraVaraPrasadGaru)లో విలన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నట్లు టాలీవుడ్ టాక్.ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్స్‌గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) పేరును సెలక్ట్ చేశారని తెలుస్తోంది. దసరా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది పవర్ఫుల్ విలన్‌గా మాత్రమే కాదు మంచి కామెడీ టైమింగ్‌తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాక్..సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన కేవలం కామెడీ జోనర్ చిత్రాలే కాదు పవర్ఫుల్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. అయితే, 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీ మాత్రం కామెడీ, ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో రానుంది. నయనతారతో పాటు వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిష్కింధపురి సక్సెస్ఫుల్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మాట్లాడారు. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టబోతోందని అన్నారు. ఈ మూవీలోని కొన్ని సీన్స్ నేను చూసి ఈ మాట చెబుతున్నానని బాబీ పేర్కొన్నారు. మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ ఖాయమని చెప్పారు.అంతకుముందు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. అనుదీప్, అనిల్ రావిపూడితో కలిసి కిష్కింధపురి సినిమా చూశామని తెలిపారు. అయితే ఈ సినిమాలో చూసినప్పుడు అనుపమ కనిపించగానే అనుదీప్ అరుస్తూనే ఉన్నాడని అన్నారు. ఇదీ చూసి ఏంటి ఇలా అరుస్తున్నాడు.. అదేంటో మాకు అర్థం కాలేదు..మనం హీరో వస్తే కదా అరవాలి.. ఇతనేంటి అనుపమ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హా ఏంటి అనుకున్నా అంటూ నవ్వులు పూయించాడు. కాగా.. ఇటీవల విడుదలైన కిష్కింధపురి చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. #ManaShankaraVaraPrasadGaru సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది - Director #Bobby#Chiranjeevi #AnilRavipudi #Kishkindhapuri pic.twitter.com/ElqNM3Frwj— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2025 -
పక్కా లోకల్.. పాన్ ఇండియా వద్దు..!
-
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
సందడే సందడి
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇదే స్టూడియోలో మరో కాంప్లెక్స్‌లో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూట్లో భాగంగా విజయ్ సేతుపతి, టబుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు పూరి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో షాట్ గ్యాప్‌లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్‌ని కలిసి, సందడి చేసింది పూరి అండ్ టీమ్. ఇక ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి– పూరి జగన్నాథ్ చిత్రం కూడా 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మెగాస్టార్-బాలయ్య కాంబోలో సినిమా.. అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా 157 టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఈ ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు. వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారని అనిల్ తెలిపారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్ అయితే తప్పకుండా చేస్తానన్నారు. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు. -
'అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. మీ ఊహకు మించి ఉంటుంది'
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు.చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్‌ను చూపించాలకున్నట్లు తెలిపారు. చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
రావిపూడి దర్శకత్వంలో చిరు మూవీ... గ్లింప్స్ రిలీజ్
-
చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి
గతంలో సినిమాని సినిమాగా చూసి ఎంటర్టైన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రాఫిక్స్, లాజిక్కులు, హీరో లుక్.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం తేడా అనిపించినా సరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. గతేడాది 'విశ్వంభర' కూడా టీజర్‌తో చాలానే విమర్శలు ఎదుర్కొంది.అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమా విషయంలో ముందే జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డైరెక్టర్.. చిరంజీవితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్భంగా తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి స్టైలిష్‌గా కనిపించారు.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)అయితే చిరు లుక్‌పై ట్రోల్స్ వస్తాయని భయపడ్డాడో ఏమో గానీ అనిల్ రావిపూడి.. 'చిరంజీవి సూట్లో ఎలా ఉంటారో చూడటం నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరంజీవి లుక్‌కి VFX ఏమి లేదు.. 95 శాతం ఒరిజినల్' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం జిమ్‌కి వెళ్లి సన్నబడ్డారని చెప్పుకొచ్చాడు. అనిల్ స్పీచ్ చూస్తుంటే ట్రోల్స్ వచ్చి తర్వాత క్లారిటీ ఇవ్వడం కంటే ముందే జాగ్రత్తపడుతున్నాడేమో అనిపిస్తుంది.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం చిరంజీవి 'విశ్వంభర' ఈ మూవీ కంటే ముందు రిలీజ్ కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ) -
'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి.. టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎప్పుడెప్పుడొస్తుందా అనుకుంటున్నారు. ఈనెలలోనే మెగాస్టార్ బర్త్ డే రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ మూవీ టైటిల్ ఈనెల 21 రివీల్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడి మెగా మూవీ టైటిల్ అప్డేట్ గురించి ప్రశ్నించగా.. నిజమేనని స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ టైటిల్లో సంక్రాంతి అనే పదం లేదని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే 157వ చిత్రంగా నిలవనుంది. -
సైమా అవార్డ్స్ ప్రెస్మీట్లో మెరిసిన సెలబ్రిటీస్ (ఫొటోలు)
-
నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్
-
జెట్ స్పీడ్‌తో..!
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగాఅనిల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి–నయనతారపాల్గొనగా ఓపాటను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితోపాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే వెంకటేశ్పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్
చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ క్రమంలోనే చిరు-నయన్ కలిసున్న కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో నిర్మాణ సంస్థ అప్రమత్తమైంది. ఈ మేరకు లీకు వీరులకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఓ నోట్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'వైరల్ వయ్యారి' కొరియోగ్రాఫర్ మన మణుగూరు బిడ్డనే..)'అనధికారికంగా షూటింగ్ రికార్డ్ చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం' అని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఓ నోట్ రిలీజ్ చేశారు. మరి ఇప్పటికైనా లీకు వీరులు ఆగుతారా? లేదా అనేది చూడాలి? ఈ సినిమాతో చిరు నటించిన మరో మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అదే 'విశ్వంభర'. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. ఈ అక్టోబరులో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.చిరు-అనిల్ రావిపూడి సినిమా మాత్రం కచ్చితంగా వచ్చే సంక్రాంతికి రానున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. ఈ మూవీలో చిరు.. పీఈటీ టీచర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. శివశంకర ప్రసాద్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇదే సినిమాలో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. వీటిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
మంచి పాత్ర ఇస్తే కూర్చోనైనా నటిస్తానన్నారు: అనిల్ రావిపూడి
ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మృతితో చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లెజెండరీ నటుడు ఇక లేరన్న వార్తను సినీతారలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13) ఉదయం ఫిలింనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి సైతం నటుడిని చివరిసారి సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాడు.కూర్చోనైనా నటిస్తా..ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావుగారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. దర్శకుడిగా ఆయనతో కలిసి పనిచేయలేదు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా చిత్రాలకు పని చేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్.. నవరసాల్లో ఏ పాత్రయినా గొప్పగా పోషించే నటుడు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. నేను దర్శకుడయ్యాక చాలా ఫంక్షన్స్‌లో ఆయన్ను కలిశాను. నాకు మంచి పాత్ర ఇస్తే.. ఓపిక లేకపోయినా సరే, కూర్చోనైనా నటిస్తా అన్నారు. కానీ, ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. ఎంతోమంది ఆయన్ను అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్రలతో, నటనతో మన మధ్య ఎల్లప్పుడూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు.లేని లోటు పూడ్చలేనిదిఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనతో యావత్ తెలుగు జాతిని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన మహా నటుడు కోట శ్రీనివాసరావు. కామెడీ, విలన్, సెంటిమెంట్.. నవరసాలను పండించి మెప్పించి ఒప్పించిన మహానటుడు. ఆయన శకం ముగిసింది. పాన్ ఇండియా అని చెప్పి చాలామంది వేరే భాషా నటులను టాలీవుడ్లో ప్రవేశపెడుతున్నారు. దానివల్ల తెలుగులో గొప్ప నటుల టాలెంట్ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇక్కడివారి ప్రతిభను ఉపయోగించుకోవాలి అని గొంతెత్తి ప్రశ్నించిన తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: కోట జీవితాన్ని మలుపు తిప్పిన నటుడు.. ఆ హీరో కాళ్లపై పడి నమస్కరించి.. -
‘రఫ్ఫాడించేద్దాం’ అంటున్న చిరంజీవి.. ఆగస్ట్ 22 నుంచే బీ రెడీ..
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సినిమా కోసం మినిమం గ్యారెంటీ కామెడీ-ఎమోషన్ మిక్స్‌కి ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు. ప్రస్తుతం “మెగా 157”(Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రo షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయింది. కానీ ఇంకా టైటిల్ పై క్లారిటీ రాలేదు.తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, అనిల్ రావిపూడి సినిమా ప్రచారానికి భారీ ప్లాన్ వేశారని, అంచెలంచెలుగా ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22నుంచి ఈ సినిమా ప్రచారాన్ని భారీగా ప్రారంభించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారని తెలిసింది. అదే రోజు టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుంది. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుంది. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల అంచనాలు మరీ పెరిగిపోయాయి వాళ్ళు ‘‘గ్యాంగ్ లీడర్’’, ‘‘ఘరానా మొగుడు’’, ‘‘రౌడీ అల్లుడు’’ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ని వీరిద్దరి కాంబో నుంచీ ఆశిస్తూన్నారు.ఇంతకీ ఈ సినిమాకి ‘‘రఫ్ఫాడించేద్దాం’’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తారా? ఈ పదాన్ని సినిమా టీం తరచూ ప్రచారంలో ఉపయోగిస్తున్న నేపథ్యంలో అదే టైటిల్ అయ్యే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్లో కనిపించనున్నారట. ఇటీవల వెంకీ చేసిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమాలోని పాత్రనే ఈ సినిమాలో కొనసాగించబోతున్నట్టు టాక్. రెండు సినిమాలను కలుపుతూ కొన్ని కీలక సీన్లు ఉండబోతున్నాయని సమాచారం.ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రచారాన్ని మూడున్నర నెలల ముందే మొదలుపెట్టి, అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాలని అనిల్ రావిపూడి బృందం భావిస్తోంది. మెగాస్టార్ మాస్ మ్యాజిక్‌తో, అనిల్ కామెడీ కట్‌తో ఈ చిత్రం ఇంకెన్ని సర్ప్రైజులు ఇవ్వబోతోందో వేచి చూడాల్సిందే! -
'సంక్రాంతికి వస్తున్నాం-2 వస్తే ఆరుగురు ఉంటారు'
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగన ముద్ర వేసిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. ఈ చిత్రంలో వెంకటేశ్ సతీమణిగా నటించి అభిమానులను అలరించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైంది.ఈ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో తన రోల్ గురించి మాట్లాడింది. పిల్లలకు తల్లి పాత్రలో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. మంచి నటిగా రాణించాలంటే ఎలాంటి పాత్రనైనా చేయాల్సిందేనని.. ఇలాంటి పాత్రలు చేయడానికి వయస్సు అడ్డంకి కాదని వెల్లడించింది. నేను చాలా సినిమాల్లో తల్లిగానే నటించానని పేర్కొంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నలుగురు పిల్లలకు అమ్మగా నటించానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం-2 మూవీ చేస్తే కనుక నాకు ఆరుగురు పిల్లలు ఉంటారని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారని తానా సభలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సుడిగాలి సుధీర్‌పై కోపం? అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి కమెడియన్‌గా, యాంకర్‌గా, హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింత పాపులర్ అయ్యాడు. మొదట్లో సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసిన సుధీర్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, వాంటెడ్ పండుగాడ్ వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం G.O.A.T. మూవీ చేస్తున్నాడు.సుధీర్‌పై మితిమీరిన రోస్టింగ్మరోవైపు టీవీ షోలలో యాంకర్‌గానూ పని చేస్తున్నాడు. అయితే బుల్లితెరపై ఆయన్ను విపరీతంగా రోస్ట్ చేస్తుంటారు. షో ఏదైనా సుధీర్‌ను ఆడుకోవడం మాత్రం గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొన్నిసార్లు నటుడిపై మితిమీరిన పంచ్‌లు వేస్తుండటం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అంతేకాదు, సుధీర్ కూడా తనపై వేసే పంచ్‌లకు హర్టవడా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందరూ ఆడుకునేవారేడ్రామా జూనియర్స్‌లో పిల్లల నుంచి జడ్జి అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరకు అందరూ సుధీర్‌ను ఆడుకునేవారే! అనిల్ రావిపూడి.. గతంలో కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోలోనూ సుధీర్‌ను రోస్ట్ చేసేవాడు. దీంతో ఈ డైరెక్టర్‌కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. సుధీర్‌పై ఎందుకంత కోపం? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. సుధీర్‌ను పంచులతో ఫ్రై చేస్తుంటే నాకు జాలేస్తుంటుంది. పాపం, అతడు హీరోగా కూడా సినిమాలు చేశాడు.. ఆయన్ని అంతలా ఫ్రై చేయాలా? అని అడిగితే సుధీర్‌ను రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అనేవారు.అందుకే తప్పడం లేదుషో నిర్వాహకులే అలా అన్నాక మేమేం చేస్తాం. మాకు ఇష్టం లేకపోయినా సుధీర్‌ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్‌ను ఫ్రై చేస్తేనే జనం నవ్వుతారు, చప్పట్లు కొడతారని చెప్పారు. ప్రేక్షకులు అదంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిశాక మేమూ ఇంకాస్త ఎక్కువ రోస్ట్ చేస్తున్నాం. సుధీర్ చాలా స్పోర్టివ్. ఎలాంటి జోకులు వేసినా ఫీలవ్వడు. కొన్ని పంచులు వేయడానికి నేను మొహమాటపడితే కూడా.. ఏం పర్లేదు సర్, జనాలు నవ్వడమే కావాలి.. మీరు ఫ్లోలో వెళ్లిపోండి అని చెప్తాడు.నేనే కట్ చేస్తుంటా..అయినా సరే, కొన్నిసార్లు నేనే తటపటాయిస్తుంటాను. కొన్ని పంచులు ఓవర్ అయిపోతుందన్నప్పుడు వాటిని కట్ చేస్తుంటాను. సరదా కోసమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరినీ ఏదీ అనుకోము అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మనల్ని నవ్వించడం కోసం సుధీర్ అడిగి మరీ తిట్టించుకుంటాడా? అని అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ -
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
ఈ ఏడాది సంక్రాంతి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఓ రేంజ్లో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.అయితే ఈ సినిమాలోని ఓ పాట ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఊపేసింది. గోదారిగట్టు మీద రామ చిలకవే అంటూ అభిమానులతో స్టెప్పలేయించింది. ఈ పాటలో వెంకీమామ, ఐశ్వర్య రాజేశ్ తమ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించారు. అంతేకాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అయితే ఈ పాటకు కేవలం మన ఆడియన్స్ మాత్రమే ఊగిపోయారనుకుంటే పొరపాటే అవుతుంది. తాజాగా ఫారినర్స్ కూడా ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు. స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ అనే నటుడు తన సతీమణితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. వెంకటేశ్ ఐశ్వర్య రాజేశ్ పాత్రల్లో వీరిద్దరు అదరగొట్టేశారు. కేవలం ఈ సాంగ్ మాత్రమే కాదు.. పలు ఇండియన్ చిత్రాలకు సంబంధించిన పాటలతో పాటు డైలాగ్స్, సీన్స్ కూడా రీ క్రియేట్ చేస్తుంటారు. ఏదేమైనా ఇండియన్ సినిమాలపై వీరికున్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ చూసేయండి. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
హైదరాబాద్ టు ముస్సోరీ
ముస్సోరీలో ల్యాండ్ అయ్యారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. వీటీవీ గణేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెంకటేశ్, కేథరిన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటరై్టన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. మలి షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందని, పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందని బుధవారం మేకర్స్ అధికారికంగా తెలిపి, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్ పాల్గొనగా కొన్ని కీలక, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించడానికి ΄్లాన్ చేశారు. ‘‘1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో మళ్లీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చిరు, వెంకీ మల్టీస్టారర్ ఫిక్స్ ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
భైరవంకి అది ప్లస్ అవుతుంది: అనిల్ రావిపూడి
‘‘ముగ్గురు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తున్నప్పుడు ముందుగా పక్కన పెట్టాల్సింది అహం. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్‌లను చూస్తే అహంని పక్కనపెట్టి ‘భైరవం’ చిత్రం చేసినట్లు అనిపిస్తోంది. బ్రదర్స్‌లాగా చాలా కలిసిపోయి ప్రమోషన్స్ చేస్తున్నారు. అది ఈ సినిమాకి కచ్చితంగా ప్లస్ అవుతుంది’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, సంపత్ నంది, నిర్మాత బెల్లంకొండ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ ముగ్గురు హీరోలు కష్టాలు చూసి నిలబడ్డారు. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడండి’’ అని చెప్పారు. ‘‘భైరవం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు బెల్లంకొండ సురేష్. కేకే రాధామోహన్ మాట్లాడుతూ–‘‘మా సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు.‘‘ఒక మంచి సినిమా చూశామనే సంతృప్తిని ‘భైరవం’ ఇస్తుంది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. ‘‘ఈ సినిమా విజయం సాధించాలని మా యూనిట్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది’’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఈ సినిమా ఆడియన్స్ కి నెక్ట్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది’’ అని విజయ్ కనక మేడల తెలి΄ారు. ఈ వేడుకలో ఆనంది, దివ్య పిళ్లై, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌పాకాల, నటుడు అజయ్ మాట్లాడారు. -
అనిల్ రావిపూడి స్పీడ్‌కు చిరంజీవి బ్రేకులు..
-
అనిల్ రావిపూడి స్పీడ్‌కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్‌లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్‌లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్ రావిపూడి స్పీడ్‌కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్ కనిపించడం లేదు. అందుకే అనిల్‌ను కాస్త బ్రేక్ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచితేనే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్‌లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్ అయితే వస్తుంది. -
'మెగా 157' ప్రారంభం.. ఫస్ట్ సీన్ ఎక్కడంటే
మెగాస్టార్ చిరంజీవి,అనిల్ రావిపూడి తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రం రానుంది.తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు (మే 23) హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అనిల్‌తో పాటు చిరంజీవి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది.ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. -
చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)
-
మెగాస్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్
-
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేసినట్లు ప్రకటించి, స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయనతార... తన టీమ్‌తో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్పాటలు వినడం, ‘హలో మాస్టర్... కెమేరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చెప్పడం ఆకట్టుకున్నాయి.ఫైనల్‌గా అనిల్ రావిపూడి, నయనతార కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. ‘‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత చిరంజీవి–నయనతార కలిసి మూడోసారి నటించనున్న చిత్రమిది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమేరా: సమీర్ రెడ్డి. -
చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. చిరు ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. దీనిపై కంటే డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే మూవీపై అందరి కళ్లున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాదికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. చిరంజీవి కోసం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని చాలా పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఇప్పుడు ఓ పేరు ఫిక్సయ్యారు. ఆమెనే కేథరిన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 2013 నుంచి తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న కేథరిన్.. అల్లు అర్జున్ సరసన రెండు మూవీస్ చేసింది. వీటిలో 'సరైనోడు' ఒకటి. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో నటించింది. రీసెంట్ టైంలో బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటించింది.ఇప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేథరిన్ ని అదృష్టం వరించినట్లే. ప్రస్తుతానికి ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో మిగతా హీరోయిన్లతో పాటు ఈమె గురించి టీమ్ ప్రకటిస్తారేమో? వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ మూవీ థియేటర్లలో రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా) -
సంక్రాంతికి భారీ ప్లాన్ వేసిన చిరంజీవి, అనిల్ రావిపూడి
-
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi,), అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ కెరీర్లో గుర్తిండిపోయేలా సినిమా ఉంటుందని అనిల్ చెబుతున్నాడు. ఇందులో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వింటేజ్ చిరంజీవి ఇందులో చూపించబోతున్నాడట. కామెడీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ కూడా ఇందులో ఉంటుందట. ఇందుకోసం అనిల్ బలమైన సీన్లు రాసుకున్నాడట. అంతేకాదు చిరంజీవిని ఢీకొట్టే విలన్‌గా ఓ యంగ్ హీరోని చూపించబోతున్నారట. అతనెవరో కాదు మెగాస్టార్ వీరాభిమాని కార్తికేయ(Kartikeya Gummakonda).ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో విలన్‌గానూ నటించాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో పాటు అజిత్ ‘తెగింపు’లో కార్తికేయ విలన్‌గా నటించి అందరిని మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాలో నెగెటివ్ రోల్ చేయనున్నాడు. అయితే ఇందులో విలన్ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ కూడా చేస్తాడట. ఈ పాత్రకు కార్తికేయ అయితేనే న్యాయం చేస్తాడని అనిల్ అతన్ని సంప్రదించారట. చిరంజీవి సినిమా అనగానే కార్తికేయ కథ వినకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా టాలీవుడ్లో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కార్తికేయ కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చిరంజీవితో కలిసి నటించాలనుకున్న కార్తికేయ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయినట్లే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందట. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్రలో ఆయన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్‌లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. పుష్పరాజ్‌గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్‌లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్‌గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్‌తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్‌తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌మీట్‌కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా! -
చిరంజీవి సినిమాలో అతిథి?
చిరంజీవి, వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే... అవుననే సమాధానమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాలోని అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
జూనియర్ జక్కన్న: Anil Ravipudi
-
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'Mega157' నుంచి 'రఫ్ఫాడిద్దాం' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల సమయంలో వెంకటేష్‌తో అనిల్ చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సినిమాను ప్రతి ఇంటికి తీసుకెళ్లాయి. దీంతో ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ ఫార్మూలానే చిరంజీవి సినిమాకు ఇంకాస్త డిఫరెంట్‌గా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.సంక్రాంతి-2026లో రఫ్ఫాడిద్దాం పేరుతో ఒక వీడియోను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. Mega157 ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న తన గ్యాంగ్ మొత్తాన్ని మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌తో చిరంజీవికి పరిచయం చేశాడు. డైరెక్షన్ టీమ్ నుంచి నిర్మాతల వరకు అందరినీ పరిచయం చేశారు. సుమారు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇదే వీడియోను చిరంజీవి కూడా తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు అంటూ ఆయన్ను చిరంజీవి ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనిల్‌ను మెచ్చుకుంటూ కాంమెంట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో అప్పుడే మొదలెట్టేశాడు రా బాబూ.. అంటూ ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి తన సొంత పేరైన శివ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳— https://t.co/KpR65ACX9L SANKRANTHI 2026 - రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025 -
#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పిల్.. కొట్టివేసిన కోర్టు
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vasthunam) సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు చేయించాలని విజయవాడకు చెందిన ఎం.లక్ష్మణకుమార్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రవితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై తీర్పు ఇచ్చింది. ఏదైనా ఒక సినిమా నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు విషయంలో దర్యాప్తు చేయమని తాము ఈడీని ఆదేశించలేమని న్యాయస్థానం తెలిపింది. అలా చేస్తే కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. అదంతా అధికార యంత్రాంగం పరిధిలో ఉన్న విషయం అని కోర్టు పేర్కొంది.సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తాము విచారించాల్సింది ఏమీ లేదని కోర్టు పేర్కొంది. ఆ సినిమాకు సంబంధించిన అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేసింది. కోర్టులో దాఖలు చేసిన పిల్ కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉందని పేర్కొంది. భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వాలని గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్ విషయంలో ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. -
అనిల్- చిరంజీవి సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. -
శంకర్ వరప్రసాద్‌గా చిరంజీవి.. మెగా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి (Anil Ravipudi) అంటేనే హాస్యానికి, విజయానికి చిరునామా. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మామూలు సక్సెస్ అందుకోలేదు. ఎవరూ ఊహించనంతగా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సంతోషంలో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నామని మాటిచ్చేశాడు. కాకపోతే ఈసారి వెంకీమామతో కాదు.. చిరంజీవి (Chiranjeevi Konidela)తో! ఇందుకోసం వైజాగ్ వెళ్లి సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. కథకు పచ్చజెండా ఊపిన చిరుగ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్లో చిరంజీవిని చూస్తారని అభిమానులకు మాటిచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు. 'కథ పూర్తయింది. చిరంజీవిగారికి ఫైనల్ స్క్రిప్ట్ చదివి వినిపించాను. నా కథలోని శంకర్ వరప్రసాద్ పాత్రను పరిచయం చేశాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకు శ్రీకారం చుట్టేద్దాం' అని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశాడు.చిరంజీవి ఒరిజినల్ పేరుతో..షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా నిర్మితం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇది చూసిన అభిమానులు ఉగాదికి ముందు ఎంత మంచి శుభవార్త చెప్పారు.. ఇంకో బ్లాక్‌బస్టర్ తథ్యం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇందులో శివ అనే పదాన్ని తీసేసి మిగతాది యథాతథంగా వాడేశారు. మెగాస్టార్ అసలు పేరును వాడేస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతిదాకా ఆగాల్సిందే! Final script narration done & locked 📝☑️🔒 చిరంజీవి గారికి నా కధ లో పాత్ర“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil MegaStar @KChiruTweets garu…— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025 చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. శోభిత హర్ట్ -
చిరు సినిమా: నో లవ్ ట్రాక్.. మెగాస్టార్‌తో అనిల్ మాస్టర్ ప్లాన్!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇంకా సెట్‌పైకి వెల్లలేదు కానీ.. అనిల్ మాత్రం అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లోనే చిరు సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ కథ కూడా కామెడీ పంథాలోనే సాగుతుందని హింట్ ఇచ్చేశాడు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంద్ర తర్వాత చిరంజీవి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇంద్రలో కూడా సీమ యాసను పూర్తిగా వాడలేదు. కానీ ఈచిత్రంలో చిరంజీవి పూర్తిగా రాయలసీమ యాసలోనే మాట్లాడతారట. డైలాగుల విషయంలోనూ అనిల్ జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలకు భూమిక, మృణాల్ ఠాకుర్లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
‘‘మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. చిరంజీవి హీరోగా తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇక చిరంజీవిగారితో చేయనున్న సినిమాకి సంబంధించిన కథని సిద్ధం చేసేందుకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్‌ని సెంటిమెంట్‌గా భావిస్తాను. ఇక్కడే నా సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటుంటాను. ఆ స్క్రిప్ట్‌లను శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించడం సెంటిమెంట్‌గా భావిస్తాను. చిరంజీవిగారితో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. ‘గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్’లో చిరంజీవిగారిని ఈ చిత్రంలో చూస్తారు. ఒక నెలలో మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. మే ఆఖరిలో లేదా జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా పాల్గొన్నారు. – ‘సాక్షి’, సింహాచలం -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్ రికార్డ్
హీరో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.అయితే, సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఇప్పటి వరకు ఈ లిరికల్ వీడియో సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో తక్కువ సమయంలోనే ఈ మార్క్ అందుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో కేవలం మూడు వారాల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా.. జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను ఉంచారు. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించారు. -
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్!
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే ఓటీటీ వర్షన్లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్టైమ్తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.అయితే థియేటర్ వర్షన్ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.దారుణమైన కథలు ప్రచారం..ఆ కామెంట్‌కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను.ఎలాంటి కెమిస్ట్రీ లేదుమర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్ -
చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
-
చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ (ఫొటోలు)
-
లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ చిత్రం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం శివంగి. ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చేతుల మీదుగా శివంగి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది స్టన్నింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025 -
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్..
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
హీరో వెంకటేశ్ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషనల్ విషయంలో చేసిన మ్యాజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆడియో లిరిక్స్ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్‌ను దాటింది. థియేటర్స్‌లో ఈ పాటకు ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి. -
వచ్చే సంక్రాంతి కోసం చిరు మెగా ప్లాన్
-
ఈ సక్సెస్ చాలా పాఠాలు నేర్పింది: ‘దిల్’ రాజు
‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్‌తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్. అయితే వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.90 శాతం ఫెయిల్యూర్స్, కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ ఉండే ఇండస్ట్రీ ఇది. 20 ఏళ్లుగా మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు షేర్ రాబట్టింది. ఓ రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న రూ. 300 కోట్ల గ్రాస్ నంబర్ మా మూవీతో చూడబోతున్నందుకు హ్యాపీ’’ అని తెలిపారు. ‘‘20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఇలాంటి సమయంలో వాళ్లు తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’’ అని శిరీష్ పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సాయికృష్ణ, రాజేశ్, హరి, శోభన్, ఎల్వీఆర్ మాట్లాడారు. -
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
ఆ విషయంలో నేను శ్రీమంతుడిని: అనిల్ రావిపూడి
‘‘దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ మూవీ తీయాలనే నా కలని తొలి సినిమా ‘పటాస్’తోనే నెరవేర్చుకోగలిగాను. నా బలం ఏంటో విశ్లేషించుకుంటూ, నా గత చిత్రాల ప్రభావం ప్రస్తుత మూవీస్‌పై పడకుండా జాగ్రత్త పడుతూ, ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా కథ రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ). ‘పటాస్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి నేటి (జనవరి 23)తో పదేళ్లు. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ∙నా పదేళ్ల కెరీర్లో నేను చేసిన ప్రతి సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమాకు ఒకొక్క మెట్టు ఎక్కించి, ఫైనల్‌గా ఈ ‘పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఆడియన్స్ నాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఆడియన్స్ నుంచి నాకు లభించిన ప్రేమే నా ఆస్తి. ఆ విషయంలో నేను శ్రీమంతుడిని. ఇక నా కెరీర్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్, వన్ వీక్‌లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మూవీస్‌కి ఈ బలం ఉందని ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie)తో ఆడియన్స్ స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారనిపిస్తోంది. ‘పటాస్’కు ముందు దర్శకుడ్ని కావడానికి నేను ఎక్కని కాంపౌండ్ లేదు. చాలామంది హీరోలను కలిశాను. నన్ను నమ్మి, కల్యాణ్‌రామ్‌గారు చాన్స్ ఇచ్చారు. అందుకే నా సక్సెస్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.దర్శకులు ఈవీవీగారితో కొందరు నన్ను పోల్చడాన్ని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. గొప్ప బాధ్యత కూడా. జంధ్యాలగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి. థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. చిరంజీవిగారితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాను. నాగార్జునగారితో ‘హలో బ్రదర్’లాంటి మూవీ చేయాలని ఉంది. -
'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now. Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025 -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్‌కు రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.రూ.200 కోట్లకు చేరువలో..అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్ తాజాగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.మీనాక్షి స్థానంలో..సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్ వేసింది.ప్రభాస్‌తో నటించాలనుందన్న మీనాక్షిదీంతో అనిల్.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందని కవర్ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు. A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025 చదవండి: 'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..? -
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కాగా.. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూడు రోజులకే వందకోట్ల మార్క్‌ను అధిగమించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.చదవండి: కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండిన నాగ చైతన్యఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
విజయ్ చివరి సినిమా రీమేక్? ఉన్నదంతా కక్కేసిన నటుడు.. అనిల్ అసహనం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్‌అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్‌కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్‌ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.అప్పుడు నేనూ చూశాగణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్‌తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్‌ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
ఆ సాంగ్ విని అర్థరాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా: వెంకటేశ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేశ్(venkatesh) ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. యూట్యూబ్‌లో మిలియన్లకొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ పాట మొదట వెంకటేశ్‌తో పాడించాలని అనుకోలేదట మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఆ ఆలోచన లేదట. కానీ వెంకటేశ్ పాడతానని అనడంతో ట్రై చేశారట. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట గురించి వెంకటేశ్ కూడా మాట్లాడారు. తనకు బాగా నచ్చడంతోనే ఆ పాట పాడినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పాట వినగానే తెలియకుండా డ్యాన్స్ చేశాడట.‘అనిల్ రావిపూడి(Anil Ravipudi) నాకు ఈ పాటను షేర్ చేసి వినమని చెప్పారు. అర్థరాత్రి 2 గంటలకు ఆ సాంగ్ వింటూ తెలియకుండా డాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది’ అని వెంకటేశ్ అన్నారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.ముచ్చటగా మూడోదిఅనిల్ రావిపూడి, వెంకేటశ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా దిల్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రాలే. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈచిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.ప్రమోషన్స్‌లో సూపర్ హిట్ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో మొదటి చిత్రం గేమ్ ఛేంజర్ అల్రెడీ రిలీజైంది. రేపు(జనవరి 12) బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్లలో విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందంజలో ఉంది. అన్నింటికంటే చివరిగా రిలీజ్ అవుతున్నప్పటికీ.. మిగతా రెండు సినిమాల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాయి. డిఫరెంట్ ప్రమోషన్స్‌తో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక పక్క అనిల్ రావిపూడి హీరోయిన్లు, మరోపక్క విక్టరీ వెంకటేశ్, అందరూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని చేశారు. కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా టీవీ షోలు, కామెడీ షోలు అన్నింటిల్లోనూ పాల్గొన్నారు. వెంకటేశ్ అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ప్రమోషన్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో రానిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. -
సంక్రాంతికే రావాలనుకున్నాం: అనిల్ రావిపూడి
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్...’ అనే పాట వెంకటేశ్‌గారికి చాలా నచ్చింది. దీంతో ఆయనే స్వయంగా ఆ పాట పాడతానని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. కానీ ఆయన 20 నిమిషాల్లో ఆ పాట పాడటంతో సంగీత దర్శకుడు భీమ్స్ కూడా షాక్ అయ్యాడు’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ వెంకటేశ్‌గారితో నేను తీసిన ‘ఎఫ్ 2’ (2019) సంక్రాంతికి వచ్చి, విజయం సాధించింది. ‘ఎఫ్ 3’ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. మా కాంబోలో మూడో సారి చేసే సినిమాని ఎలాగైనా పండగకి తీసుకొస్తే బావుంటుందని సినిమా ఆరంభం అప్పుడే సంక్రాంతికి రావాలనుకున్నాం. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి సంబధించినది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజుల ప్రయాణం సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర వెంకటేశ్గారిది. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ట్రైలర్ అందరికీ బాగా నచ్చింది. థియేటర్స్‌కి వచ్చాక సినిమా అద్భుతంగా నచ్చితే మూవీ బ్లాక్ బస్టరే.⇒ కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి, గొప్పగా తీస్తే సరిపోదు. థియేటర్స్‌కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి ప్రమోషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాం. వెంకటేశ్‌గారి లాంటి పెద్ద స్టార్ హీరో సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయ్యింది. నేను హీరోలకి ఫ్యాన్‌గానే ఉంటాను. రిలేషన్‌ని పాజిటివ్‌గా ఉంచుతాను కాబట్టి వాళ్ల నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.⇒ ‘దిల్’ రాజుగారితో ‘పటాస్’ సినిమాతో నా ప్రయాణం ఆరంభమైంది. రాజుగారు, శిరీష్ గారు అంటే నా కుటుంబం లెక్క. మాది పదేళ్ల ప్రయాణం. ఇక ఉమెన్ సెంట్రిక్‌గా ఒక స్పోర్ట్స్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ నేపథ్యంలో మూవీ చేస్తాను. ‘ఎఫ్ 4’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి కూడా ఫ్రాంచైజీలు చేసుకునే అవకాశం ఉంది. -
72 రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి.. నాలుగు నిమిషాలే వృథా!
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా రెండున్నర గంటల సినిమాను దాదాపు 3 గంటలకు పైగా నిడివితో షూట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా అయినా సరే ఎడిటింగ్‌లో అరగంట సీన్స్ అయినా ఎగిరిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే కావాల్సిన నిడివి మేరకు మాత్రం చిత్రీకరణ చేస్తారు. వారిలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడా లిస్ట్‌లోకి అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని కూడా ఎక్కించొచ్చు. ఎడిటింగ్‌కి అవకాశం లేకుండా ముందే లెక్కలు వేసుకొని సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాసాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. అది కూడా స్టార్ హీరో సినిమా. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie). ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి బరిలో..అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్(venkatesh) సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సంక్రాంతికి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో రెండు బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకటేశ్‌తో ఫోటోలు దిగిన 3 వేల మంది ఫ్యాన్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్ తన అభిమానులతో పోటోలు దిగారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విజయం కోసం చిత్ర యూనిట్ సరికొత్తగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. తాజాగా వెంకటేశ్ 3000 మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వినూత్నమైన ముక్కోణపు క్రైమ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి చిత్రాలతో పోటీ పడి వాటికి మించిన ప్రమోషన్స్‌తో ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. -
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్‌గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్‌లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్‌లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్‌లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకీ మామ
-
పెదవుల పైన మెరుపులు మెరిశాయే...
‘‘నా లైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు. -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే ఈ పాట కూడా మ్యూజికల్ హిట్‌గా నిలవనుంది.అనంత శ్రీరామ్ రచించిన ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఆలపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
-
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి.. టాలీవుడ్లో ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. పటాస్,రాజా ది గ్రేట్, ఎఫ్2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో ఈ చిత్రం విడుదలపై ప్రకటన రానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ప్రకటన రానుంది.అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ గుర్తు చేసుకున్నారు. వాళ్లతో సినిమా చేయడం తన లక్ అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్‌లో అనిల్- చిరుల సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇక చిరు ఇటీవలే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనిల్ సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. -
వెంకటేష్ బర్త్‌డే కానుక.. రెండో సాంగ్ ప్రోమో అదిరిపోయింది
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. -
స్టయిలిష్‌గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024


