మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా 'శశిరేఖ..' అంటూ కొనసాగే రెండో పాటకు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. డిసెంబర్ 8న పూర్తి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌ను మధుప్రియ ఆలపించిన విషయం తెలిసిందే.


