వెల్‌సెటిల్ అయ్యాక మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి మంచి పొజిషన్‌లో సెటిల్ అయ్యి..చక్కగా ఆర్జింగ్, సత్కారాలు, రివార్డులు పొంది కూడా మళ్లీ నచ్చిన కెరీర్ కోసం మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెడుతున్నానని చెబుతున్నాడు. వామ్మో అందుకు ఎంత ఓపిక కావలిరా బాబు అనిపిస్తోంద కదూ..!. మరి ఇంతకీ ఈ వ్యక్తి దేని కోసం ఇలా అంటే..
హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ ధావన్ సక్సెస్‌కి సరికొత్త అర్థమిచ్చేలా తన కథను నెట్టింట పంచుకున్నాడు. “ఇదిగో నా కథ“ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. తనది సాధారణ విజయగాధ కాదంటూ తన ప్రస్థానం మొదలైన విధానం గురించి వివరించాడు. తాను చిన్నప్పుడూ బేకరీలకు సాస్‌లను అమ్మడం ప్రారంభించానని, పెద్దయ్యాక రిటైల్ స్టోర్‌లో పనిచేశానని చెప్పుకొచ్చాడు. అక్కడ తాను రాక్‌లలో చొక్కాలను మడతపెట్టి శుభ్రం చేసేవాడనని చెప్పుకొచ్చాడు.
తర్వాత జీఈలో తన తొలి కార్పొరేట్ జీతం చూడగానే..ప్రపంచంపైన ఉన్నట్లు ఫీలయ్యానంటూ తాను సాధించిన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదని, సరిగ్గా ఆ సమయంలోనే తల్లిని కోల్పోయానని తెలిపాడు.
అలా 18 ఏళ్లు వచ్చేటప్పటికీ ఎంఎన్‌సీలో పనిచేశానిట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రూ. 40 వేల రుణంతో హైదరాబాద్‌లో వాట్స్ ఇన్ ఏ నేమ్‌ను ప్రారంభించి..ఏకంగా 15 కోట్ల కంపెనీగా మార్చాడు. దాదాపు వంద ప్లస్ బ్రాండ్లు, అవార్డులు మంచి గుర్తింపు అందుకున్నానంటూ తన కథను చెప్పుకొచ్చాడు. అంతేగాదు 30 ఏళ్లకే మెర్సిడేజ్ కారు కొని తన కలను సాకారం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం దాన్ని అమ్మేసి మారుతి కారుతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు.
ప్రస్తుతం తాను ప్రారంభించిన అన్ని కంపెనీలను అమ్మేశానని కూడా వెల్లడించాడు. అయితే తాను ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఇలా చేయలేదని, కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలనిపించి ఇలా చేశానని చెబుతున్నాడు. 39 ఏళ్ల వయసులో ఉన్న తాను కంటెంట్ క్రియేటర్‌గా కొత్తగా తన కెరీర్‌ని మొదలు పెట్టాలనుకుంటున్నా అందుకే ఇలా చేశానంటూ తన సక్సెస్ స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు గ్రేట్ ఎచివ్‌మెంట్స్ అని ప్రశంసించారు. అంతేగాదు మీ మళ్లీ కెరీర్‌ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న మీ ధైర్యం అసామాన్యమైనదని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.
ఎవరీ రాజీవ్ ధావన్?
ధావన్ తన పోస్ట్‌లో ఎనిమిదవ తరగతి ఫెయిల్యూర్, పది తర్వాత చదువు మానేసినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం తర్వాత తన చదువుని తిరిగి పూర్తిచేసినట్లు తెలిపాడు. అతని లింక్డ్ఇన్ ప్రకారం.. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.
(చదవండి: అద్భుతమైన కెరీర్ ట్రాక్ రికార్డు..! ఒకరు యుద్ధ భూమిలో, మరొకరు ఇన్విస్టిగేషన్‌లో..)


