పులిమేడు రూట్‌లో భక్తుల రద్దీ | The Sathram Pullumedu route to Sabarimala sees heavy pilgrim traffic | Sakshi
Sakshi News home page

పులిమేడు రూట్‌లో భక్తుల రద్దీ

Dec 3 2025 1:53 PM | Updated on Dec 3 2025 2:59 PM

The Sathram Pullumedu route to Sabarimala sees heavy pilgrim traffic

సాక్షి శబరిమల: శబరిమలకు వెళ్ళే భక్తులకు ప్రత్యామ్నాయ మార్గం అయిన అటవీ మార్గం పులిమేడులో యాత్రికుల రద్దీ బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 1,500 మంది నుంచి రెండు వేల మంది దాక యాత్రికులు తరలివస్తున్నట్లు  అటవీశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పెరియార్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లేఈ అటవీమార్గంలో భక్తుల సంరక్షణార్థం ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సత్రం నుంచి సన్నిధానం వరకు సుమారు 12 కి.మీ దూరం ఉంటుంది. అయితే అక్కడి వాతావరణాన్ని అనుసరించి యాత్రికులకు ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించేందుకు అనమతి ఉంటుంది. 

ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాత్రికులకు సత్రం నుంచి సన్నిధానం చేరుకోవడానికి అనుమతి ఉంది. అలాగే ఉదయం 8 నుంచి 11 గంటలలోపు యాత్రికులు తిరిగి సత్రానికి ప్రయాణించటానికి అనుమతి ఉంది. అలాగే దేవస్వం బోర్డు సత్రంలో కూడా స్పాట్‌ బుకింగ్‌ కోసం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి ఉన్న అనుమతిని ఆధారం ప్రయాణానికి అనుమతి ఉంటుంది. సత్రాన్ని వదిలి సన్నిధానం వరకు వెళ్లే యాత్రికుల బృందాలతో తమ శాఖ అధికారులు వెళ్తారని అటవీ శాఖ వెల్లడించింది. 

దీంతో పాటు యాత్రికులు భద్రతా, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సుమారు 35 మంది అటవీ శాఖ అధికారులు 35 మంది ఎకో గార్డులు ఉన్నారని పేర్నొంది. అలాగే అదనంగా ఈ మార్గంలో ఎలిఫెంట్‌ స్క్వాడ్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏనుగులు, గేదెలు, అడవి జంతువులు లేవని నిర్థారించడానికి అటవీగార్డు బృందం సదా అప్రమత్తమై ఉండటమే గాక, జంతువులు లేవని నిర్ధారణ అయితేనే యాత్రికులను ప్రయాణించడానికి అనుమతిస్తామని అఝుతా రేంజ్ ఆఫీసర్ డి. బన్నీ తెలిపారు. 

వర్షం పడితే ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే కఝుతాకుళి నుంచి కొన్ని మైళ్ల తర్వాత అంతా బురదమయంగా ఉంటుంది. అందువల్ల ఈ మార్గం గుండా వెళ్లడం చాలా కష్టం. సత్రాన్ని సందర్శించే యాత్రికుల పత్రాలను ఉప్పుపారలోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో తనిఖీ చేస్తారు. అలాగే ఈ అటవీ గార్డుల తోపాటు పోలీసు, ఆరోగ్య శాఖల సేవలను కూడా ఈ మార్గంలో ఏ‍ర్పాటు చేశారు. 

ఇవేగాక ఈ అటవీ మార్గంలో ఇరికప్పర, సీతకులం, జీరో పాయింట్ వద్ద పరిశుభ్రమైన నీరు , ఉప్పుపార బేస్ వద్ద టీ , స్నాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ అటవీ మార్గం గుండా వచ్చే యాత్రికుల వివరాలను సన్నిధానం పక్కన ఉన్న అటవీ శాఖ, పోలీసు చెక్‌పోస్టులలో కూడా నమోదు చేస్తారు.

(చదవండి: 16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement