ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్కెక్కారు. మంగళవారం రాత్రి వడ్డించిన భోజనం చాలా నాసికరంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తమకు పాడైపోయిన భోజనం పెడుతున్నారని ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్ధులు బైఠాయించారు. ఆహారం విషయంలో ఎలాంటి నాణ్యత లేదని ఆపై హాస్టల్ కూడా కనీస మౌలిక వసతులు లేవని తెలిపారు. యూనివర్సిటీలోని సమస్యల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్ కూడా పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్ తెలిపారు.
హాస్టల్‌లో పాడైపోయిన ఆహారాన్నే తరుచుగా వడ్డించడం వల్లే తాము అనారోగ్యానికి గురవవుతున్నామని విద్యార్థులు వాపోయారు. రాత్రి సమయంలో బోజనం కోసం విద్యార్థులు రోడెక్కడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


