ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విలువ పెట్టుబడిదారుడుగా ప్రసిద్ధి చెందిన వారెన్ బఫెట్ కేవలం స్టాక్ మార్కెట్లను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు. ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, భావోద్వేగాలను ఎల్ నియంత్రించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని మారుస్తాయంటారు బఫెట్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
➤సమయం, శక్తి, నైపుణ్యం అనేవి జీవితంలో నిజమైన ఆస్తులు. సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు?, దేని గురించి రోజూ ఆలోచిస్తుంటారు?, అనే విషయాలను గమనించండి. మీ డబ్బును లేదా మూలధనాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారనే విషయం మీద చాలా జాగ్రత్త వహించాలి. సమయం మీకు వ్యతిరేకంగా కాకుండా.. మీ కోసం పనిచేయనివ్వండి. మీ కెరియర్ గురించి ఆలోచించండి అని బఫెట్ చెబుతారు.
➤పెట్టుబడిలో.. భద్రత మార్జిన్ అనేది ధర & విలువల మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో రెండు పాటించాల్సి ఉంటుంది. ఒకటి.. మీకు ఆర్థిక మార్జిన్ అవసరం, కొన్ని నెలల ఖర్చులను కవర్ చేసే అత్యవసర నిధి & ప్రాథమిక ఆరోగ్య బీమా. రెండవది.. ఖర్చు మార్జిన్, అధిక EMIలు లేదా విలాసవంతమైన జీవనశైలిని నివారించడం. ఈ రెండింటిని పాటిస్తే.. మీరు త్వరగా ఆర్థికంగా ఎదుగుతారు.
➤గాసిప్‌లు, సోషల్ మీడియా పోస్టులు, ఆఫీస్ పోలికలను పూర్తిగా నివారించుకోవాలి. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. కోపంతో వెళ్లిపోవడం, విమర్శలకు అతిగా స్పందించడం వంటివి మానుకోవాలి. దీనికి బదులు పెట్టుబడుల విషయంలో తెలివిగా ఆలోచించండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
➤మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. వేరేవాళ్లను కాపీ చేయడం మానుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక దృఢమైన సంకల్పం చేసుకోండి. దానికోసం ప్రయత్నించండి.
➤సమయం దొరికినప్పుడు చదువుతూ ఉండండి, నిరంతరం ఎదో ఒకటి నేర్చుకోవడం పట్ల అభిరుచి కలిగి ఉండాలని బఫెట్ చెబుతారు. రోజుకు కనీసం 30 నిమిషాలు చదవండి. పుస్తకాలు మాత్రమే కాకుండా, న్యూస్ పేపర్, ఆర్థిక నివేదికలు కూడా చదువుకోవచ్చు. ప్రతి నెలా, మీరు నేర్చుకున్న వాటిని ఎక్కడ ఉపయోగించారో ఆలోచించండి.
ఇదీ చదవండి: యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..


