కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్‌టెల్ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.
ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.
ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!
జూన్ 2026 నుంచి టారిఫ్‌లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.


