రూ.20 వేలకోట్ల పెట్టుబడి: ఎయిర్‌టెల్‌ ప్లాన్ ఏంటి? | Airtel Plans Rs 20000 Cr Push for Airtel Money | Sakshi
Sakshi News home page

రూ.20 వేలకోట్ల పెట్టుబడి: ఎయిర్‌టెల్‌ ప్లాన్ ఏంటి?

Feb 24 2026 8:07 PM | Updated on Feb 24 2026 8:15 PM

Airtel Plans Rs 20000 Cr Push for Airtel Money

మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ బ్యాంకింగేతర అనుబంధ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఎయిర్‌టెల్‌ మనీ లిమిటెడ్‌పై భారీ ప్రణాళికలు ప్రకటించింది. రానున్న కొన్నేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులకు తెరతీయనున్నట్లు పేర్కొంది. వీటిలో 70 శాతం ఎయిర్‌టెల్‌ సమకూర్చనుండగా.. మిగిలిన 30 శాతం ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా లభించనున్నట్లు తెలియజేసింది.

ఎయిర్‌టెల్‌ మనీ ఇటీవలే(2026 ఫిబ్రవరి 13న) ఆర్‌బీఐ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను పొందింది. పటిష్ట డిజిటల్‌ ఆస్తులు, 500కుపైగా సైంటిస్టులతో నడుస్తున్న భారీ డేటా ఎనలిటిక్స్, లోతైన నిర్వహణా సామర్థ్యాలు కలిగిన కంపెనీగా ఎయిర్‌టెల్‌ కొత్తతరహా డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసులను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్, సమీకృత చానళ్ల ద్వారా గత రెండేళ్లుగా క్రెడిట్‌ ఇంజిన్‌ను నిర్మించినట్లు పేర్కొంది. దీంతో దేశీయంగా పటిష్ట రుణ సర్వీసుల మోడళ్లలో ఒకటిగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఇప్పటికే రూ. 9,000 కోట్లకుపైగా రుణాల విడుదల ద్వారా ప్లాట్‌ఫామ్‌ అత్యున్నతస్థాయి(హైపర్‌స్కేల్‌)ని అందుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు పటిష్ట అండర్‌రైటింగ్‌ విధానాలు, క్రమశిక్షణాయుత పోర్ట్‌ఫోలియో నిర్వహణ, రియల్‌టైమ్‌ రిస్క్‌ పర్యవేక్షణ దోహదపడినట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement