కార్లు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకుంటారు. ఇందులో కూడా కొంత తక్కువ ధరలో లభించే కార్లు అయితే బెస్ట్ అని భావిస్తారు. కాబట్టి ఈ కథనంలో అత్యుత్తమ మైలేజ్ (ఏఆర్ఏఐ) ఇచ్చే రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 కార్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి సెలెరియో (రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.73 లక్షలు): 25-26 కిమీ/లీ పెట్రోల్ & 35 కిమీ/కేజీ సీఎన్‌జీ
మారుతి సుజుకి స్విఫ్ట్ (రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షలు): 24.8 కిమీ/లీ పెట్రోల్ & 32.85 కిమీ/కేజీ సీఎన్‌జీ
మారుతి సుజుకి డిజైర్ (రూ. 6.26 లక్షల నుంచి రూ. 8.031 లక్షలు): 24.8 కి.మీ/లీ పెట్రోల్ & 33.73 కి.మీ/కేజీ సీఎన్‌జీ
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.84 లక్షలు): 25.19 కి.మీ/లీ పెట్రోల్ & 33.47 కి.మీ/కేజీ సీఎన్‌జీ
మారుతి సుజుకి ఆల్టో కే10 (రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షలు): 24.9 కిమీ/లీ పెట్రోల్ & 33.40 కిమీ/కేజీ సీఎన్‌జీ
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షలు): 25.30 కిమీ/లీ పెట్రోల్ & 32.73 కిమీ/కేజీ సీఎన్‌జీ
మారుతి సుజుకి బాలెనో (రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షలు): 22.35 కిమీ/లీ పెట్రోల్ & 30.61 కిమీ/కేజీ సీఎన్‌జీ
టాటా టియాగో (రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షలు): రూ. 19 కి.మీ./లీటర్ పెట్రోల్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ (రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.92 లక్షలు): 16-18 కి.మీ/లీ పెట్రోల్
రెనాల్ట్ క్విడ్ (రూ. 4.30 లక్షల నుంచి రూ. 6.45 లక్షలు): 22 కి.మీ/లీ పెట్రోల్


