కేటీఎం కంపెనీ 250 డ్యూక్ 2026 ఎడిషన్‌ను లాంచ్ చేసింది. స్లేట్ గ్రే, సిల్వర్ మెటాలిక్ అనే రెండు రంగుల్లో లభించే ఈ బైక్ ధర రూ. 2.13 లక్షలు (ఎక్స్ షోరూమ్).
సిల్వర్ మెటాలిక్ వెర్షన్ బైక్.. బూడిద రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & సిల్వర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు 250 డెకాల్స్ పొందుతుంది. అయితే స్లేట్ గ్రే బైక్ నారింజ రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & బూడిద రంగు ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లతో వస్తుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 240 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది.
2025 డ్యూక్ 2026 మోడల్ ఎలాంటి యాంత్రిక మార్పులకు లోను కాలేదు. కాబట్టి ఇందులో అదే 248.8 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9250 rpm వద్ద 30.75 BHP & 7,250 rpm వద్ద 25 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.


