ఫండ్స్‌ ఆస్తులు.. @ రూ.455 లక్షల కోట్లు! | India Managed Funds Industry Projected AUM Grow To Rs 455 Lakh Crore By FY2030, Says CRISIL Report | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ ఆస్తులు.. @ రూ.455 లక్షల కోట్లు!

Feb 24 2026 1:51 PM | Updated on Feb 24 2026 2:00 PM

India managed funds industry projected AUM grow to Rs 455 lakh crore

2030 మార్చి నాటికి రెట్టింపు

2025 మార్చి నాటికి రూ.210 లక్షల కోట్లు

క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక  

ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు) నిర్వహణలోని మొత్తం ఆస్తులు (మేనేజ్డ్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీ ఏయూఎం) 2025 మార్చి నాటికి రూ.212 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత జీడీపీలో 64 శాతంగా ఉంటే, 2030 మార్చి నాటికి 73 శాతానికి పెరగనున్నాయి. ఈ వివరాలతో క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ (క్రిసిల్‌ రేటింగ్స్‌ సంస్థ) ఒక నివేదికను విడుల చేసింది. గృహ పొదుపులు ఈక్విటీ, ఏఐఎఫ్‌ల్లోకి వస్తుండడాన్ని ప్రస్తావించింది.

2025 మార్చితో ముగిసిన ఐదేళ్ల కాలంలో మేనేజ్డ్‌ ఫండ్‌ అసెట్స్‌ ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని.. అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 11 శాతాన్ని మించినట్టు తెలిపింది. సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా పేర్కొంది. ఏఐఎఫ్‌లు చాలా వేగవంతమైన వృద్ధిని చూస్తున్నాయని.. మేనేజ్డ్‌ ఫండ్స్‌ పరిశ్రమ (నిపుణులు నిర్వహించే ) మొత్తం ఆస్తుల్లో ఏఐఎఫ్‌ల వాటా 2020 మార్చి నాటికి 4 శాతంగా ఉంటే, 2030 మార్చి నాటికి 9 శాతానికి చేరనున్నట్టు తెలిపింది.  

క్యాపిటల్‌ మార్కెట్ల వైపు పొదుపు నిధులు

గృహ పొదుపుల్లో ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 2020లో 4 శాతంగాఉంటే, 2025 నాటికి 15 శాతానికి చేరిందని.. రిస్క్‌ తీసుకునే ధోరణి, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో భాగస్వామ్యం పట్ల ఆసక్తికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. రిటైర్మెంట్‌ ఫండ్స్, జీవిత బీమా ఆస్తులు సైతం స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితం అవుతుండడం, ఆదాయ స్థాయిలు పెరుగుతుండడం, 8వ వేతన కమిషన్‌ వంటివి అనుకూలిస్తున్నట్టు తెలిపింది. 2025 మార్చి నాటికి రిటైర్మెంట్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.53.39 లక్షల కోట్లు, జీవిత బీమా నిర్వహణ ఆస్తులు రూ.67.79 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (రీట్‌లు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు) నిర్వహణ ఆస్తులు 2020 మార్చి నాటికి రూ.2.60 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి రూ.7.78 లక్షల కోట్లకు పెరిగినట్టు, ఇది ఏటా 25 శాతం వృద్ధికి సమానమని తెలిపింది.

ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement