కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.
అయితే, ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న అంజలికి ఆ కార్యక్రమంలో ఇబ్బందికరమైన అనుభవం ఎదురైందని తెలుస్తోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. అవార్డ్ అందుకునేందుకు కొచ్చి విమానాశ్రయంలో ఆమె దిగారు. అయితే, ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఫిల్మ్‌ఫేర్ యూనిట్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఎవరూ రాలేదట.


