breaking news
trending
-
ది ప్యారడైజ్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు
-
భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు
-
పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత
ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యులో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారతీయ వివాహ సంప్రదాయాలు, మహిళలపై రుద్దుతున్న ఆచారాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మగవాళ్లకు లేని కొన్ని నిబంధనలు ఆడవాళ్లకు మాత్రమే ఎందుకని ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?మగవాళ్లూ ఈ పనులు చేయచ్చు కాదా..‘పెళ్లి అనేది ఇద్దరిదీ.. మరి తాళి ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి. మహిళలే బొట్టు ఎందుకు పెట్టికోవాలి. అన్ని సంప్రదాయాలు వాళ్లే ఎందుకు పాటించాలని అందరూ అంటారు. వివాహానికి సంబంధించిన సంప్రదాయాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. మగవాళ్లు కూడా ఈ పనులు చేయచ్చు కదా. భర్త కోసం ఉపవాసం చేయాలని ఎక్కడైనా ఉందా. అలాంటిదేమీ లేదు కదా. అన్ని నిబంధనలు మహిళలకే ఎందుకు? ఇవన్నీ మనం సృష్టించుకున్నవే తప్పా ఏ గ్రంథంలోనూ ఇలాంటివి లేవు’ అని నమిత అభిప్రాయ పడ్డారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..సొంతం సినిమాతో.7 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)
-
‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. వైరల్‌గా నానీ వీడియో!
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో..ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. Trailer cut has already been done and it is all set to air. The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026 -
'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)
-
వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)
-
అప్పటి కాలేజ్ లుక్.. ఇప్పటి స్టార్ హీరోయిన్స్! (ఫోటోలు)
-
భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)
-
రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
-
భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
సారీలో సారా.. ధురుంధర్ భామ (ఫొటోలు)
-
సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 06 -సెప్టెంబర్ 12)
-
ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)
-
ఆరేళ్లకే తొలి సంపాదన! ఆ ఒక్క నిర్ణయంతో మారిన మమితా రేంజ్
ఒకట్రెండు హిట్లు రాగానే స్టార్డమ్ వచ్చేసిందంటూ హడావుడి చేసే హీరోయిన్లు చాలామందే. కానీ.. వరుసగా మూడు భారీ విజయాలతో తన స్థాయినే మార్చేసుకుంటే? ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు చేస్తున్నది అదే. ఈ ఏడాదిలో విజయ్, సూర్య, నివిన్ పౌలీ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె.. వరుస విజయాలతో సౌత్ ఇండియాలో తన మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచుకుంది. తెరపై కనిపించే ఆ పక్కింటి అమ్మాయి ఇమేజ్ వెనుక.. కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ కూడా తయారవుతోంది.మమితా బైజు కెరీర్లో 2026 ఓ ప్రత్యేక అధ్యాయం. జూలై 23న విజయ్ నటించిన జన నాయగన్ విడుదలైంది. ఆ తర్వాత ఆగస్టు 14న సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటి తర్వాత.. ఆగస్టు 21న నివిన్ పౌలీతో కలిసి నటించిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో.. ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ జస్ట్.. 11 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా.. ఈ మూడు చిత్రాల విడుదల మధ్య వ్యవధి కేవలం 29 రోజులు. దీంతో ఒకే ఏడాదిలో(ఇప్పటివరకు..) మూడు రూ.200 కోట్ల సినిమాల్లో నటించిన భారతీయ నటిగా మమితా రికార్డు సృష్టించినట్లైంది. ఈ మధ్యకాలంలో మరేయితర హీరోయిన్ ఖాతాలో ఇలాంటి అరుదైన రికార్డు నమోదు కాలేదు.‘ప్రేమలు’తో మారిపోయిన కెరీర్అయితే ఈ స్థాయికి ఆమె ప్రయాణం ఒక్కరోజులో మొదలైనదేమీ కాదు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన మమితా.. ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య వంటి చిత్రాల్లో కనిపించింది. కానీ 2024లో వచ్చిన ప్రేమలు ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందులో రీనూ పాత్రలో ఆమె చూపించిన సహజమైన నటన, ఎక్స్ప్రెషన్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రసీమల్లోనూ అవకాశాలు వరుసకట్టాయి. అక్కడి నుంచి మమితా ఎంచుకున్న సినిమాలూ ఆమె మార్కెట్‌ను పెంచాయి. డ్యూడ్, కరా వంటి తమిళ చిత్రాలతో పాటు విజయ్ జన నాయగన్, సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌లో నటించడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు సొంత భాషలో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సక్సెస్‌తో ఆ జాబితాలో మరో భారీ హిట్ చేరింది.డాక్టర్ కావాలనుకుని.. హీరోయిన్గామమితా జీవితంలో ఆసక్తికరమైన మలుపు స్కూల్లో ఉండగానే జరిగింది. ఆమె స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్. మె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్.. తల్లి మినీ బైజు. అన్నయ్య మిథున్ కెనడాలో చదువు పూర్తి చేశారు. చిన్నతనంలో ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదట. అయితే తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో ఓ ఆడిషన్‌కు వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చింది. ఆ తర్వాత చదువుతో పాటు నటనపైనా దృష్టి పెట్టింది. చివరకు వైద్య వృత్తికి బదులు సినీ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంది.ఫ్యాన్స్ ముద్దుగా ‘SSMB’..మమితకు ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ఆమె షార్ట్ వీడియోలు, డ్యాన్సింగ్ క్లిప్పులు వైరల్ అవుతుంటాయి. సాదాసీదాగా ఉంటూ అభిమానులతోనూ ఆమె అంతే హుందాగా వ్యవహరిస్తుంటారు. ఫ్యాన్స్ సరదాగా ‘SSMB’ సూపర్‌స్టార్ మమితా బైజు అనే ట్యాగ్ కూడా ఇస్తున్నారు. ‘సూపర్‌స్టార్’ అనే అర్థంలో ఈ పేరును వాడుతూ.. మలయాళ సినీ పరిశ్రమకు మమ్ముట్టి, మోహన్‌లాల్ తర్వాత మరో ఎం(M) దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకున్న క్రేజ్, వరుస అవకాశాలను చూసి సోషల్ మీడియాలో ఈ సరదా పోలికలు వైరల్‌గా మారుతున్నాయి.రెమ్యునరేషన్ విషయంలో.. ఇక సంపాదన విషయానికొస్తే.. ఆరేళ్ల వయసులో పాల్గొన్న ఫ్యాషన్ షోలో తొలిసారి రూ.500 సంపాదించిన విషయాన్ని ఆమె తరచూ చెబుతుంటారు. అలాగే తొలి సినిమా ‘సర్వోపరి పాలక్కారన్’కు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, రెండో సినిమాకు మాత్రం రూ.6,000 అందుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఇన్నేళ్ల శ్రమకు ఆమెకు అవకాశాలు, సక్సెస్‌లు దక్కుతున్నాయి. వరుస విజయాలతో మమితా బైజు పారితోషికం కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె సుమారు రూ.2–3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్, స్కిన్‌కేర్, జ్యువెలరీ తదితర బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తోంది. దీంతో నటనతో వచ్చే ఆదాయానికి అదనంగా ఎండార్స్మెంట్లు, పెట్టుబడులు కూడా ఆమె సంపాదనలో భాగమవుతున్నాయి.కోచిలో కోట్ల విలువైన ఇల్లు.. కార్లు కూడామమితా బైజు ఆస్తుల గురించి కూడా మాలీవుడ్ వెబ్సైట్లు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తుంటాయి. కోచిలో ఆమెకు సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో కోచినే ఆమెకు ప్రధాన నివాసంగా మారినట్లు సమాచారం. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూరులో కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇల్లు కూడా ఉంది.కార్ల విషయానికొస్తే.. మమితా బైజు గ్యారేజీలో వోక్స్వాగెన్ టైగన్, మారుతి సుజుకీ జిమ్నీ ఉన్నాయి. అయితే ఆమె మొత్తం ఆస్తుల విలువపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. మాలీవుడ్ మూవీ సర్కిల్స్ వెబ్సైట్లు మాత్రం.. ఆమె నికర ఆస్తుల విలువను సుమారు రూ.20–30 కోట్లుగా అంచనా వేస్తున్నాయి.ఇష్టాలుఫేవరెట్ యాక్టర్: ధనుష్ ఇష్టమైన హాబీస్: డ్యాన్స్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్. ఇష్టమైన ఆహారం: చైనీస్ ఫుడ్ ఇష్టమైన రంగు: బ్లాక్ఇష్టమైన సింగర్: ఆంథోనీ దాసన్ఇష్టమైన పెర్ఫ్యూమ్: చానెల్ఇష్టమైన హాలిడే డెస్టినేషన్: దుబాయ్ఇష్టమైన ఆట: క్రికెట్ఇకపై మమితా రేంజ్ మరింత పెరిగేనా?ప్రేమలుతో వచ్చిన గుర్తింపు.. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు.. ఇప్పుడు మూడు రూ.200 కోట్ల చిత్రాలతో వచ్చిన రికార్డు. మమితా బైజు కెరీర్ గ్రాఫ్ చూస్తే.. తక్కువ సమయంలోనే ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అర్థమవుతుంది. పాతికేళ్ల వయసులోనే ఇలాంటి మార్కెట్ రావడం ఆమెకు కలిసొచ్చిన మరో అంశం. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగితే.. మమితా బైజు దక్షిణాది చిత్రసీమలో మరో బలమైన హీరోయిన్గా ఎదగడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇదీ చదవండి: ఆమె దోసె వేస్తే లక్షలు కురవాల్సిందే! -
శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)
-
బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు
-
అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)
-
నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)
-
‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’
ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె.. కెరీర్ మొదట్లో తన ప్రవర్తన ఎలా ఉండేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఎం చెప్పారంటే..‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో నాలో చాలా గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. అయితే ఓ సందర్భంలో కొంతమంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవు. ఇలా ఉండటం మంచిది కాదు’ అని చెప్పారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా నా ప్రవర్తనను మార్చుకున్నాను’ అని నమిత తెలిపారు. తన వల్ల తోటి నటులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ‘నా ప్రవర్తన కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయం నాకు చాలా మంది చెప్పారు. ఆ తర్వాత నా తప్పును అర్థం చేసుకుని నన్ను నేను మార్చుకున్నాను’ అని నమిత పేర్కొన్నారు.ఎక్కువ మంది చదివింది: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!17 ఏళ్ల వయసులో..17 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.ఇదీ చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ -
యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)
-
అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు
-
ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)
-
సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)
-
'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)
-
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లోని సీన్‌పై మీమ్స్ వైరల్
ప్రేక్షకులకు సినిమాల్లోని కొన్ని సీన్లు అలరించడమే కాదు.. కొన్ని మీమ్ మెటీరియల్‌గా కూడా మారుతుంటాయి. తాజాగా సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి నెల 27వ తేదీ రాగానే సూర్య పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.27న విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సూర్య పోషించిన సంజయ్ విశ్వనాథ్ పాత్రకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి నెల 27న వ్యక్తిగత కారణాలతో అతడు విదేశాలకు వెళ్తుంటాడు. దీంతో ఆ తేదీరాగానే సంజయ్ విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ అభిమానులు సరదాగా మీమ్స్ పెడుతున్నారు. గతంలో దృశ్యం2’ సినిమాలోనివి కూడా..మొన్నటి వరకు వెంకటేశ్ నటించిన ‘దృశ్యం2’ సినిమాలోని కొన్ని తేదీలు కూడా ఇలాగే వైరలయ్యాయి. ఆగస్టు 3 అంటే రాంబాబు విజయనగరం నుంచి వచ్చిన రోజు అని ఇలా ఆగస్టు నెలకు సంబంధించిన తేదీలు మీమ్‌గా మార్చి సోషల్‌మీడియాలో పోస్ట్చేసేవారు.కాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబెట్టింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, భవానీ శ్రీ, నాజర్, ఆది, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
డైమండ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు
-
డీసీ బ్యూటీ సంజనా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
-
నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్
నటీనటుల ప్రతిభకు స్టార్డమ్తో సంబంధం ఉండదు. మంచి నటన ఎక్కడ కనిపంచినా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బాలనటి నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. ‘ఇరుముడి’ చిత్రంలోని ఆమె నటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోకాల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.వీడియో కాల్ చేసి ప్రశంసలు..నక్షత్ర నటనను చూసిన ధనుష్ స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారిని అభినందించడంతోపాటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పుడైనా మనం కలిసినప్పుడు నీ దగ్గర నటన నేర్చుకోవాలని ఉంది. చాలా అద్భుతంగా, అందగా నటించావు. నీ నటన నాకు చాలా నచ్చింది. ఎప్పుడైనా మనం కలుద్దాం. గ్రేట్ జాబ్ కన్నా.. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి’. అంటూ వీడియో కాల్లో మాట్లాడాడు. ఈ సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన అమాయకరమైన, ఉత్సాహభరితమైన స్పందన కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. A cloud-nine moment for our little star ❤️The extraordinary @dhanushkraja Garu praised #Nakshatra for her performance and showered #Irumudi with appreciation ❤️🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/oJbwLVl3N0— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! -
'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)
-
అందాల భామ అదిరిపోయే లుక్ మమితా బైజు..(ఫొటోలు)
-
సైమా 2026 నామినేషన్ వేడుకలో మెరిసిన పాయల్ రాజ్‌పుత్ (ఫొటోలు)
-
అందంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ అనఘా మాయా రవి.. (ఫొటోలు)
-
న్యూజిలాండ్‌లో టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. (ఫోటోలు)
-
షారుక్ ఇంటికి కొత్త హంగులు.. ఖర్ఛు ఎన్ని కోట్లంటే..
షారుక్ ఖాన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఇల్లు ‘మన్నత్’. బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ విలాసవంతమైన భవనం పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది. రోజూ అభిమానులు అక్కడికి చేరుకుని తమ అభిమాన హీరోను చూసేందుకు,ఇంటి ముందు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం ఇక్కడ భారీ రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత అనంద్ పండిట్‌కు చెందిన ఓ సంస్థ దీని నిర్మాణ పనులు చేస్తోంది.ఖర్చు ఎంతంటే..మన్నత్‌లో రెండు అంతస్తులు నిర్మించేందుకు షారుక్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో భవనం విస్తీర్ణం 616.02 చదరపు మీటర్లు పెరగనుంది. ఈ పనులకు సుమారు రూ.25 కోట్లు ఖర్చుఅవుతుందని అంచనా. మన్నత్ వారసత్వ కట్టడం కావడంతో పాటు సముద్రానికి అత్యంత సమీపంలో ఉండడంతో విస్తరణకు మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతి కూడా అవసరం.తొలి ఇల్లు కూడా.. ఆనంద్ పండిట సంస్థ చేపడుతున్న మరో ప్రాజెక్ట్ కూడా షారుక్‌కు ఎంతో ప్రత్యేకమైనదేనట. బాంద్రాలోని శ్రీ అమృత్ సొసైటీలో ఉన్న 4బీహెచ్‌కే ఫ్లాట్‌ను ఈ సంస్థ రీడెవలప్ చేస్తోంది. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత 1991లో గౌరీని వివాహం చేసుకున్న సమయంలో షారుక్ కొనుగోలు చేసిన తొలి ఇల్లు ఇది కావడంతో ఇది ఆయనకు ఎంతో ప్రత్యేకమని తెలుస్తోంది.‘కింగ్’తో బిజీ..సినిమాల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన కుమార్తె సుహానా ఖాన్ తొలిసారి థియేట్రికల్ డెబ్యూ చేయనుంది. సిద్ధార్థ్ అనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రంలో షారుక్ హిట్‌మ్యాన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నటుడు అరెస్ట్.. 28 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం..!
‘దేవా’ చిత్రంలో నటించిన మోడల్ రోహుల్లా మెహ్దీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 28 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న తెలుస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దహిసర్ చెక్ నాకా వద్ద డ్రగ్స్ సరఫరా చేసేందుకు రోహుల్లా మెహ్దీ రానున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ రాజేంద్ర కాంబ్లే ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సమాచారం అందిన విధంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెహ్దీ, అతడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి ఐదు రోజులు రిమాండ్ విధించినట్లు సమాచారం. ఎవరీ రోహుల్లా మోహ్దీ..రోహుల్లా మెహ్దీ జమ్మూకాశ్మీర్‌లోని బుద్దామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ముంబైలోని గోరేగావ్ నివసిస్తున్నట్లు వెల్లడించారు. నటుడిగా, మోడల్‌గా రాణిస్తున్న మోహ్దీ.. షాహిద్ కపూర్ నటించిన ‘దేవా’ చిత్రంలోనూ కనిపించాడు. పలు వెబ్సరీస్లోనూ నటించాడు. ఇదీ చదవండి: వరుసగా విలన్ పాత్రలు.. బాబీ డియెల్ రియాక్షన్ ఇదే.. -
ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్!
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ సిద్ధమవుతోంది. ఒకేసారి అయిదు భాషల్లో కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా సెప్టెంబర్ 6న కొత్త సీజన్లలతో ప్రారంభం కానున్నాయి. ఫ్రాంచేజీ చరిత్రలోనే తొలిసారిగా ఇలా ఏకకాలంలో ప్రారంభం కానున్నాయని జీయోస్టార్ ప్రకటించింది.హోస్ట్‌లుగా వీరే.. కొత్త సీజన్లలోనూ పలువురు స్టార్ హీరోలు మళ్లీ సందడి చేయనున్నారు. బిగ్‌బాస్ మలయాళంకు మోహన్‌లాల్, తమిళ్లో విజయ్ సేతుపతి, తెలుగులో నాగార్జున, కన్నడలో సుదీప్, హిందీలో సల్మాన్ ఖాన్లు హోస్టులుగా వ్యవహరించనున్నారు.బెంగాలీలో ఆగస్టు 31 నుంచే..బిగ్‌బాస్ 3 బెంగాలీ ఆగస్టు 31 నుంచి ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. దీనికి హోస్టుగా సౌరవ్ గంగూలీ వ్యవహరించనున్నారు.తెలుగులో మంచి ఆదరణబిగ్బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు 19.6 టీవీఆర్ నమోదైనట్లు జియాస్టార్ వెల్లడించింది. తెలుగు బిగ్‌బాస్ ఇప్పటివరకు 36 కోట్ల వ్యూయింగ్ మినిట్స్‌ను నమోదు చేసినట్లు తెలిపింది. తమిళంలోనూ ..విజయ్ సేతుపతి హోస్టుగా వ్యవహరించిన బిగ్‌బాస్ తమిళ్‌కు కూడా మంచి స్పందన వచ్చిందని జియాస్టార్ తెలిపింది. 2025 అక్టోబరు 5న ప్రారంభమైన సీజన్ 9 తొలి రోజే 1.5 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను నమోదు చేసిందని జియోస్టార్ తెలిపింది. -
Zarna Garg: హాస్యనటికి వింత అనుభవం.. బాత్రూమ్లోనే గంటపాటు..
ప్రముఖ హాస్యనటి జర్ణా గార్జ్ ప్రస్తుతం తన కామెడీ స్పెషల్ ‘ది మిలియన్ డాలర్ ఎక్స్క్యూసెస్’ టూర్‌తో ప్రపంచవ్యాపంగా పర్యటిస్తున్నారు. జర్మనీలోని ఓ షోకు వెళ్లిన ఆమెకు ఓ వింత అనుభవం ఎదురైంది. అక్కడి బాత్రూమ్లోకి వెళ్లి డోర్ ఓపెన్ కాకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు అందులోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి క్లిష్టంగా మారిందని తెలిపారు. ఆ గదిలో చిక్కుకున్నా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘తెరవడానికి, మూయడానికి సాధ్యం కాని పరిస్థితిలో బాత్రూమ్ డోర్ ఉండడం చాలా వ్యగ్యం. ఇది షేక్స్పియర్ వివాదంలా ఉంది’ అని జర్ణా ఘాటుగా స్పందించారు. భారతీయ-అమెరికన్ స్టాండ్-అప్ హాస్యనటి అయిన జర్ణా 'ఎ నైస్ ఇండియన్ బాయ్' అనే అమెరికన్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. సోషల్‌మీడియాలో ఆమెకు సుమారు 2మిలియన్స్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Zarna Garg (@zarnagarg) -
‘హాయ్’ అంటున్న నయన‘తార’.. (ఫోటోలు)
-
DC MOVIE: ‘డీసీ’ విజయం వెనుక.. ఇంత కఠోర శ్రమనా!
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీసీ’. రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నటుడిగానూ ఆరంగేట్రం చేశారు. అయితే సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.50 రోజుల పాటు..లోకేశ్ బాడీని ఫిట్‌గా మార్చుకునేందుకు ఏకంగా 50 రోజుల పాటు కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను ఫాలో అయ్యారట. ఆయన ట్రైనర్ తాజాగా షేర్ చేసిన వీడియోలో జిమ్‌లో లోకేశ్ కసరత్తులు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు అప్పర్, లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తూ బైసెప్స్, కండరాలను టోన్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారే క్రమంలో లోకేశ్ చూపించిన అంకితభావాన్ని ట్రైనర్ ప్రశంసించారు.అరుణ్ మాథేశ్వరన్కు నాలుగో చిత్రం‘డీసీ’ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘రాకీ’ (2021), ‘సాని కాయిదమ్’ (2022), ‘కెప్టెన్ మిల్లర్’ (2024) చిత్రాలను ఆయన తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ అందించగా.. జీకే ప్రసన్న ఎడిటింగ్, పీసీ స్టంట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఆడుకలం నరేన్, తలైవాసల్ విజయ్, కస్తూరి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదీ చదవండి: షూటింగ్లో అస్వస్థత..! డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్ -
చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)
-
పింక్ మోడ్రన్ గౌనులో కరిష్మా 'గులాబీ వైబ్స్' లుక్..! (ఫోటోలు)
-
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
-
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు)
-
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
-
‘సాV3’లో కొత్తగా కనిపిస్తా : హీరో సామ్రాట్
సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సాV3'. లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణమాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టీజర్ విడుదల కార్యక్రమానికి పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. 'సాV3' నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని తెలిపింది.ఈ చిత్రంలో తాను ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నానని హీరో సామ్రాట్ అన్నారు. టీజర్‌కు వస్తున్న స్పందన ఆనందంగా ఉందని హీరో డీమోన్ పవన్ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ.. సినిమాలో టీజర్లో చూపించిన దానికంటే మరింత బలమైన కథాంశం ఉంటుందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. -
తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-18’ కార్యక్రమంలో అమితాబ్ ఇంటి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తండ్రి ప్రముఖ హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్ చిన్నప్పటి నుంచే కుల వ్యవస్థను వ్యతిరేకించేవారని అందుకే కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ ఎంచుకున్నారని తెలిపారు.పాఠశాల అడ్మిషన్ సమయంలో దరఖాస్తు ఫారంలో కులానికి సంబంధించిన కోలమ్ ఉండేదని చెప్పారు. అక్కడ నింపినప్పుడు తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ కుల వ్యవస్థను అంగీకరించకుండా మా కులం బచ్చన్ అని నమోదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి తమ కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.కాగా, అమితాబ్ బచ్చన్ అసలు పేరు అమితాబ్ శ్రీవాస్తవ. 1942లో అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్(ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జన్మించారు. ఆయన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రముఖ కవిగా గుర్తింపు సాధించారు.ఇక అమితాబ్ సినీ ప్రయాణం ‘సాత్ హిందుస్తానీ’ చిత్రంతో ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్న ఆయన.. ‘జంజీర్’, ‘దీవార్’, వంటి చిత్రాలతో బాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. -
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
‘డీసీ’ ఐదో రోజు కలెక్షన్లు ఎంతంటే..
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్,వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డీసీ’. తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఐదో రోజైన మంగళవారం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటింది. ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఇండియాలో రూ.5.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. సోమవారం నమోదైన దాదాపు రూ.6 కోట్లతో పోలిస్తే ఇది 10శాతం తక్కువ. గడిచిన ఐదు రోజుల్లో దేశీయంగా రూ.32.35కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్లు రూ.37.21 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్లో రూ.14.50 కోట్లు రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.51.71 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ నుంచి రూ.1.60 కోట్లుఐదో రోజు భారత్‌లో ‘డీసీ’ రూ.6.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేరళ నుంచి 1.85 కోట్లు, తమిళనాడు నుంచి 1.75 కోట్లు, ఏపీ, తెలంగాణ నుంచి రూ.1.60 కోట్లు, కర్ణాటక నుంచి రూ.65 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి రూ. 35 లక్షల వసూళ్లు వచ్చాయి. రోజుకలెక్షన్లు (రూ. కోట్లలో)1 4.402 7.0039.5546.0055.40మొత్తం 32.35 -
నసీరుద్దీన్ షా ఒక గుంటనక్క: కంగనా ఫైర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలపై బాలీవుడ్ నటీనటులు మౌనంగా ఉండటంపై షా ఇటీవల విమర్శలు చేశారు. ‘నోటిలో ఎముక ఉన్న కుక్క మొరగలేదు’ అని వ్యాఖ్యానిస్తూ, సెలబ్రిటీల మౌనాన్ని ఆయన ఎద్దేవా చేశారు.ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్‌లో జరుగుతున్న నిరసనల గురించి నసీరుద్దీన్ షా ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, సీనియర్ నటుడిని ‘లొమ్డి’ (నక్క) అని అభివర్ణించారు. ‘ఇక్కడ నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి వద్ద పని చేస్తున్నారు. కానీ, ఏ దేశపు రొట్టె తింటున్నానో, ఆ దేశాన్ని రక్షించడం, దాని కోసం పోరాడటం నాకు గర్వకారణం. నసీరుద్దీన్ షా తిన్నది ఈ దేశపు అన్నమే అయినా, పక్క దేశం కోసం వాదిస్తున్నారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.కుక్కను ‘లొమ్డి’తో పోలుస్తూ, ‘నేటి కాలంలో విశ్వసనీయత చాలా అరుదు. అందుకే నసీరుద్దీన్ షా లాంటివారు నక్కగా ఉండటం కంటే, కుక్కగా ఉండటమే మేలు’ అని ఆమె పేర్కొన్నారు. గతంలో నసీరుద్దీన్ షా .. బాలీవుడ్ నటుల మౌనంపై అసహనం వ్యక్తం చేశారు. వారి మనస్సాక్షికి తగిన సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా స్పందిస్తారని, అయితే ప్రస్తుతం వారు ఎముక నోట్లో పెట్టుకున్న కుక్కల్లా ఉన్నారని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Time Travel: 1977 నుంచి 4413కు వెళ్లాక .. ఏం జరిగిదంటే.. -
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
మూగజీవాలకు అండగా అడివి శేష్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ హీరో అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా సామాజిక అంశాలపైనా దృష్టిసారిస్తున్నారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న మూగజీవాల కోసం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటికి అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఏం చేయబోతున్నాడంటే..అసోం, కేరళ, గుజరాత్, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణెతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని మూగజీవాలను రక్షించేందుకు స్థానిక జంతు సంరక్షణ సంస్థలు, రెస్క్యూ బృందాలతో కలిసి అడివి శేష్ బృందం పనిచేయనుంది. వరదల్లో చిక్కుకున్న, గాయపడిన జంతువులను రక్షించడంతో పాటు వాటికి ఆహారం, తాగునీరు, ఆశ్రయం, వైద్య చికిత్స అందించనున్నారు.ఓ ప్రాణాన్ని కాపాడొచ్చు..అడివి శేష్ మాట్లాడుతూ.. ‘వర్షాకాలం మనలో చాలామందికి అందంగా కనిపిస్తుంది. కానీ వేలాది మూగజీవాలకు ఇది అత్యంత కష్టమైన సమయం. మనకు వర్షం పడితే వెళ్లేందుకు ఇల్లు ఉంది. కానీ వాటికి అలాంటి సౌకర్యం ఏదీ లేదు. ఆహారం దొరకకపోవడం, ఆశ్రయం లేక వర్షంలో తడవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం.జంతు సంరక్షణ కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇంటి బయట వాటికి కాస్త ఆశ్రయం కల్పించడం, ఆహారం, స్వచ్ఛమైన నీరు అందించడం వంటివి చేస్తే చాలు. మనం చేసే ఈ చిన్న సాయంతో ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు’ అని అన్నారు.జంతు సంరక్షణ సంస్థలు, రెస్క్యూ సిబ్బంది, వాలంటీర్లు ప్రతిరోజూ చేస్తున్న సేవలను అడివి శేష్ అభినందించారు. వర్షాకాలంలోనే కాకుండా ఏడాది పొడవునా మూగజీవాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే.. అడివి శేష్ చివరిగా ‘డకాయిట్’లో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన డెబ్యూ దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడితో కలిసి ‘G2’ (గూఢచారి 2) చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్!
కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు
సినీ తారలు అనుకున్నది సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయరు అనడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ చక్కటి ఉదాహరణ. మాతృత్వం వంటి కీలక దశలోనూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉంది. అయినప్పటికీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా ‘రాకా’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు కష్టపడుతోందట. సంబంధించిన విషయాలు వైరల్ కావడంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.షూటింగ్లో మళ్లీ బన్నీ..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కాస్త విరామం తీసుకున్న బన్నీ.. మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు దీపికాకు సెప్టెంబర్‌లో డెలివరీ ఉండటంతో.. అంతకంటే ముందే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆమె పట్టుదలతో పనిచేస్తోందట. షూటింగ్ షెడ్యూల్ రాత్రివేళ వరకు కొనసాగుతున్నా సెట్లోనే ఉంటూ తన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.గతంలోనూ వైరల్..దీపికా దాదాపు ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలోనూ ‘రాకా’ కోసం రోజూ షూటింగ్లో పాల్గొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండటంతో ఆమె పాత్ర సవాల్‌తో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మాస్ టేకింగ్‌కు అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. -
ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు
-
మమితా బైజు సంచలన నిర్ణయం.. కారణం ఇదే!
మలయాళ నటి మమితా బైజు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ‘డ్యూడ్’, ‘జన నాయకన్’ వంటి చిత్రాలతో బిజీగా మారారు. త్వరలో స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.‘సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను వ్యక్తిగతంగా కాకుండా పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తా’ అని స్పష్టం చేశారు. తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌కు వీరాభిమానినని మమితా తెలిపారు. ఆయన నటించిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలు’ సినిమా ఇష్టమన్నారు. ఆ సినిమాలో ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. తాను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేసేదాన్నని చెబుతూ నవ్వులు పూయించారు. -
అమితాబ్‌తో నటించాలనే కోరిక.. కోమాలో పాత్ర
బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనలతో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్ తొలి ఎపిసోడ్లో అమిర్‌ఖాన్, సన్నీడియోల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాల్లో తనకు అత్యంత ఇష్టమైనది ఏంటని ప్రీతిని అడగ్గా.. ఓ సరదా సంఘటన గుర్తుచేసుకుంది.‘బచ్చన్ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తా, గౌరవిస్తా. అమిత్జీతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూశాను. అందుకోసం చాలా ప్రయత్నించాను. చివరకు 2003లో వచ్చిన ‘అర్మాన్’లో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు హనీ ఇరానీతో ఈ సినిమాలో అమిత్జీతో నాకు ఒక్క సీన్ అయినా ఉండాలని అడిగాను. అందుకు హనీ ఇరానీ సరదాగా.. ‘‘అమిత్జీతో నటించాలని అంతగా కోరుకుంటున్నావా? అయితే ఆ సీన్లో నువ్వు చనిపోవాల్సిందే’’ అన్నారు. దీంతో మూవీ నా పాత్రని కోమాలో ఉండేలా పెట్టారు. నేను కోమాలో ఉన్నట్లు నటించాలి. అమిత్జీ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఎదురుగా ఉండటంతో తెగ భయపడిపోయాను. చనిపోయినట్లు నటించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. నేను కదులుతుండటంతో.. ‘ప్రీతి సీన్ పాడుచేస్తున్నారు.. మీరు కదులుతున్నారు’ అని టీమ్ వాళ్లు నాపై కోపంగా అరిచేవాళ్లు’ అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.2003లో రిలీజైన ‘అర్మాన్’లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు చేశారు. ప్రీతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. వెంకటేశ్ సరసన ‘ ప్రేమంటే ఇదేరా’, మహేశ్ రాజకుమారుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
నటిగా కాదు.. భార్యగా ఆ ఛాన్స్ వదులుకున్నా: ఐశ్వర్య
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కూడా నటిస్తుండటం, షారుఖ్‌తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది. -
కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే..!
ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆమె మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే ఈసారి ఆమె చీర, హ్యాండ్‌బ్యాగ్ కంటే చేతిలో పట్టుకున్న గొడుగే హైలైట్‌గా మారింది. సాధారణంగా వర్షం నుంచి రక్షణ కోసం ఉపయోగించే గొడుగును కూడా ఫ్యాషన్ స్టేట్మెంట్గా మార్చేశారు కంగనా. ఇంతకీ ఆమె చేతిలో ఉన్న ఆ గొడుగు ప్రత్యేకత ఏంటి? దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే!కంగనా రనౌత్ పార్లమెంట్ హౌస్‌కు వెళ్లే సమయంలో రంగురంగుల ప్రింటెడ్ గొడుగుతో కనిపించారు. సాధారణ నలుపు రంగు గొడుగులకు భిన్నంగా ఆమె చేతిలోని ఆక్వా కలర్ గొడుగు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ గొడుగును ప్రముఖ లగ్జరీ డిజైన్ హౌస్ గుడ్ ఎర్త్ రూపొందించిందట. దీని ధర రూ.6,100. అంటే గొడుగు కోసం ఆరు వేలకు పైగా ఖర్చు చేశారు కంగనా. చీర, బ్యాగ్‌తో పాటు రంగురంగుల గొడుగు ఆమె లుక్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. -
‘ఓహ్ మై డాగ్’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘ఓహ్ మై డాగ్’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జంతుప్రేమికులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కుక్కలు, మనుషుల మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించారు. ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు బోల్తాకొట్టినట్లు కనిపిస్తోంది. సాక్నిల్క్(saknilk) ప్రకారం.. ఇండియాలో తొలి రోజు ‘ఓహ్ మై డాగ్’ సుమారు రూ.85లక్షల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు దాదాపు రూ.1.02 కోట్లుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ సినిమా 844 షోలను ప్రదర్శంచారు. తక్కువ సంఖ్యలో తెరలపై విడుదల కావడం కూడా ఈ వసూళ్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశముంది.ఈ సినిమాని కుక్కలు,వాటితో మనుషులకు ఏర్పడే అనుబంధమే ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు దర్శకుడు అమిత్ రాయ్. గతంలో పంకజ్ త్రిపాఠితో ‘ ఓహ్ మై గాడ్’ గా ఇప్పుడు ‘ఓహ్ మై డాగ్’గా టైటిల్ మార్చి తెరకెక్కించారు. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. -
స్పెయిన్ వెకేషన్లో సచిన్ కూతురు సారా (ఫొటోలు)
-
హంసలా మెరిసిపోతూ సింగర్ శ్రేయాఘోషల్ (ఫొటోలు)
-
కొండ కోనల్లో టాలీవుడ్ హీరోయిన్ ఎంజాయ్ (ఫొటోలు)
-
ఈ హీరోయిన్‌కి 40 ఏళ్లంటే నమ్మడం చాలా కష్టం! (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)
-
బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు
-
సీఎం విజయ్‌తో సినిమా ట్రెండింగ్ లో మమితా బైజు (ఫొటోలు)
-
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
'బాసింగ బలాలే'.. తెలంగాణ జానపదానికి కొత్త ఊపు.. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఫోక్ సాంగ్..ఒక మంచి జానపద పాటకు కాలంతో సంబంధం ఉండదు. మట్టివాసన, పల్లె పలుకులు, సంప్రదాయాల సోయగం కలిస్తే ఆ పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది 'బాసింగ బలాలే' ఫోక్ సాంగ్. తెలంగాణ పల్లె సంస్కృతిని, పెళ్లి వేడుకల సందడిని, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే ఈ పాట సోషల్ మీడియా వేదికలపై విపరీతమైన ఆదరణ పొందుతోంది. "బాసింగం" అనేది తెలుగు సంప్రదాయ వివాహాల్లో వధూవరులు నుదుటిపై ధరించే పవిత్రమైన అలంకారం. పెళ్లి వేడుకలో దానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అదే సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన "బాసింగ బలాలే" పాటలో తెలంగాణ యాస, జానపద సంగీతం, డప్పు బీట్లు, ఉత్సాహభరితమైన సాహిత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.పాట విడుదలైన నాటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది వీడియోలు రూపొందుతున్నాయి. పెళ్లిళ్లు, హల్దీ వేడుకలు, కాలేజీ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా ఎక్కడ చూసినా 'బాసింగ బలాలే' పాటే మార్మోగుతోంది. చిన్నారుల నుంచి యువత వరకు ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. -
సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)
-
బయటపడిన అత్యంత పురాతన డైనోసార్ తోక!
న్యూయార్క్: భూమిపై జీవించిన అత్యంత భారీ డైనోసార్ రకానికి చెందిన ‘టైటానోసార్’ శిలాజాన్ని శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో కనుగొన్నారు. ఈ శిలాజాన్ని 1985లోనే బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే సభ్యులు, భూగర్భ శాస్త్రవేత్త మైక్ థామ్సన్ జేమ్స్ రాస్ ఐలాండ్‌లో సేకరించారు. అయితే అప్పట్లో ఇది ఏదో సముద్ర జీవికి చెందినదని భావించి, యూకేలోని ఒక సేకరణలో భాగంగా అల్మారాలో పడేసారు.‘ఆక్టా పలేయోంటోలాజికా పొలోనికా’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఇది డైనోసార్దేనని తేల్చింది. శిలాజ శాస్త్రవేత్త పలేయోంటోలాజిస్ట్ మార్క్ ఎవాన్స్ దీనిపై అనుమానంతో లండన్ సహచరుడు పాల్ బారెట్‌ను సంప్రదించగా, అది 82 మిలియన్ల సంవత్సరాల నాటి టైటానోసార్ తోక ఎముక (వర్టెబ్రా) అని స్పష్టమైంది. పది సెంటీమీటర్ల పొడవున్న ఈ ఎముకకు ఒక వైపు గుంత, మరోవైపు గుండ్రటి ఉబ్బెత్తు భాగం ఉన్నాయి. ఇది బాల్-అండ్-జాయింట్ సాకెట్ అమరికను సూచిస్తుందని, ఈ లక్షణం కేవలం ఈ రకమైన డైనోసార్లలోనే ప్రత్యేకంగా ఉంటుందని బారెట్ పేర్కొన్నారు. ఈ శిలాజం అసంపూర్తిగా ఉండటం వల్ల ఖచ్చితమైన జాతిని గుర్తించలేకపోయారు. కానీ ఇది కేవలం 23 అడుగుల పొడవు కలిగి, చిన్న వయసులోనే చనిపోయి సముద్రంలో మునిగి ఉంటుందని ప్రాథమిక విశ్లేషణలో తేలింది.మిలియన్ల సంవత్సరాల క్రితం అంటార్కిటికా ఖండం ప్రస్తుతం ఉన్నట్లు మంచుతో కాకుండా, అధిక కార్బన్ డయాక్సైడ్, తీవ్రమైన అగ్నిపర్వత చర్యల వల్ల డైనోసార్ల మనుగడకు అనుకూలమైన పచ్చని ప్రాంతంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఇది గడ్డకట్టే మంచు ఖండంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 98 శాతం మేర మైళ్ల కొద్దీ మంచు పేరుకుపోవడంతో, ఇలాంటి పురాతన శిలాజాలను వెలికితీయడం పరిశోధకులకు అత్యంత కష్టతరంగా మారింది. -
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
-
త్రిష కంటే ఎక్కువ హైలైట్.. సోషల్ మీడియాలోనూ ఈమెనే ట్రెండింగ్ (ఫొటోలు)
-
ట్రెండింగ్‌లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’
సాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్‌లో నిలిచింది. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్ అవుతున్నాయి. #2yearsforTdpbackstabbing పేరుతో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై జనం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సమర శంఖం(ఫోటో గ్యాలరీ) -
మోదీతో విజయ్.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న (ఫొటోలు)
-
రుక్మిణి వసంత్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
పాక్ లో ధురంధర్ ఫీవర్.. సినిమా విడుదలైన కొద్ది నిమషాల్లోనే సర్వర్ క్రాష్
-
బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆహా అనిపిస్తున్న అనసూయ (ఫొటోలు)
-
విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆలియా భట్ (ఫొటోలు)
-
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా
మెగాడాటర్ నిహారిక నిర్మించిన హారర్ కామెడీ సినిమా 'రాకాస'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రీసెంట్గా ఓటీటీలోకి కూడా వచ్చి అందులోనూ దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్‌లో టాప్ 7కి చేరుకుంది. 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి.సంగీత్ శోభన్ –గెటప్ శ్రీను ట్రాక్, వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాను పదేపదే చూసేలా చేయడంలో ఎంతగానో దోహదపడ్డాయి. పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్టైన్మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'రాకాస' ఆకట్టుకోవడంతో ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. ఈ మూవీ మానస శర్మ దర్శకురాలు కాగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. (ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
సెల్ఫీ విత్ సీఎం విజయ్.. సోషల్ మీడియా షేక్ (ఫొటోలు)
-
విజయ్ విజిల్ మోత.. రీసౌండ్ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)
-
మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)
-
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)
-
విజయ్ పెళ్లిలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ అట్రాక్షన్ (ఫోటోలు)
-
ట్రెండింగ్ లో హీరోయిన్ త్రిష.. ఎందుకో తెలియదు (ఫొటోలు)
-
నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్
-
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ట్రెండింగ్ లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
-
ప్రియురాలు సోఫీ షైన్‌తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
-
దురంధర్ మరో రికార్డ్.. ఏకంగా 59 రోజుల పాటు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వసూళ్లపరంగా పలు రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్.. రెండు నెలలు పూర్తయినా తగ్గేలేదే అంటోంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ చిత్రం బుక్ మై షోలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, స్త్రీ-2, ప్రేమలు, పుష్ప-2 సినిమాలను దాటేసింది. ఈ మూవీ అత్యధికంగా 59 రోజులు బుక్ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని అతి పెద్ద ఘనతను దక్కించుకుంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్.. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బుక్ మై షోలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.కాగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది.బుక్ మై షోలో ట్రెండింగ్ సినిమాలు..1. ధురంధర్- 59 రోజులు2. ఛావా -58 రోజులు3. స్ట్రీ 2 -57 రోజులు4. ప్రేమలు- 53 రోజులు5. పుష్ప 2: ది రూల్- 53 రోజులు6. మంజుమ్మెల్ బాయ్స్- 50 రోజులు7. కల్కి 2898 ఏడీ- 49 రోజులు8. జవాన్- 48 రోజులు9. లోకా చాప్టర్- 1- 46 రోజులు10. మహావతార నరసింహ- 42 రోజులు -
క్లబ్బుల్లో భక్తి పారవశ్యం.. 20 వేల కోట్లకు పైగా బిజినెస్
సాక్షి స్పెషల్ డెస్క్: మసక వెలుతురు, దట్టమైన పొగలు, నియాన్ లైట్లు, తెల్లవార్లూ సాగే ‘టకీలా’ షాట్ల సేవనం.. ఇవన్నీ ఇప్పుడు పాత కాలపు యూత్ ఫ్యాషన్. కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా? ‘ఆధ్యాత్మిక ఓలలాట’! భక్తి భావనల ‘దమ్ మారో దమ్’! నైట్ క్లబ్బుల్లో జరుగుతున్నఈ ‘సోబర్ రేవ్’ (మందు లేని మత్తు) పార్టీలు తాజా ఇండియన్ ట్రెండ్! అక్కడ డీజే బేస్ చప్పుళ్ల బదులు.. వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే, దేహం తాదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది.ఆలయాలు దాటిన పారవశ్యంఇప్పటి వరకు, ప్రశాంతత అలుముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన మన భక్తి ధ్యానం.. ‘ఎరీనా ఎరా’ (స్టేడియం రేంజ్ స్టేజ్) లోకి అడుగుపెట్టింది. భక్తికి కార్పొరేట్ గ్లామర్ తోడై, భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ జీవం పోసుకుంది.కాక్‌టైల్స్‌కు బదులుగా తేనీరు జెన్–జెడ్ మెట్రో కుర్రకారు పూర్తిగా పంథా మార్చేశారు. మూస నైట్ క్లబ్‌ల గందరగోళాన్ని వదిలేసి, ఆధ్యాత్మిక క్లబ్బులలోకి క్యూ కడుతున్నారు. చేతిలో కాక్టెయిల్ గ్లాసులకు బదులు వేడి వేడి కుల్హద్ చాయ్ పట్టుకుని.. రాధికా దాస్, కేశవమ్ వంటి కళాకారుల భజన పాటలకు చిందులేస్తున్నారు.‘సన్ బర్న్’ కే సవాలుగా నిలిచి..!అంతర్జాతీయ స్థాయి ఎల్.ఈ.డి స్క్రీన్లు, మెరిసిపోయే స్ట్రోబ్ లైట్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌తో ఈ భజన్ క్లబ్బింగ్ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ ఈవెంట్స్ ఇప్పుడు ‘సన్ బర్న్’ వంటి పాశ్చాత్య శైలి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి.పెరుగుతున్న ఆదరణ– మూస క్లబ్ కంటే భజన్ ఈవెంట్లలో జనం ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. స్పాన్సర్ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్ లాభదాయకంగా ఉంటోంది.– ఆల్కహాల్, గొడవలు లేని ఈ వాతావరణం కుటుంబాలను, యువత ఇద్దరినీ ఆకట్టుకుంటోంది.– భారత ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఇలాంటి ‘కల్చరల్ ఎకానమీ’ని దేశ ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా గుర్తించటం కూడా భజన్ క్లబ్బింగ్‌కు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.సాంస్కృతిక సునామీ పరిశ్రమ దిగ్గజాలు ఈ భజన్ క్లబ్బింగ్ కల్చర్‌ను ముద్దుగా ‘భారత్కోర్’ అని పిలుస్తున్నారు. ఇదేమీ చిన్న మార్పు కాదు, ఏకంగా రూ. 20,000 కోట్ల లైవ్ ఈవెంట్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఒక సాంస్కృతిక సునామీ!మార్చిలో సాజ్–ప్రఖర్ టూర్2026 మార్చిలో ‘సాజ్–ప్రఖర్’ బృందం దేశవ్యాప్త టూర్ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్ లుధియానా వంటి నగరాలను సాజ్, ప్రఖర్ దంపతులు భక్తి మత్తులో ముంచేయనున్నారు. సంప్రదాయ భక్తి సంగీతానికి (భజనలు) ఆధునిక క్లబ్ శైలిని సమ్మిళతం చేయటం వీరి ప్రత్యేకత.‘మన్ కీ బాత్’లో ప్రస్తావన!2026 జనవరి 25న ప్రసారం అయిన 130 వ ‘మన్ కి బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రెండ్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సైతం ఈ కొత్త ఒరవడిని ‘భజన్ క్లబ్బింగ్’ గా పేర్కొనటంతో దీనికి ఎక్కడ లేని ప్రాముఖ్యం లభించింది.ప్రధాని ఏమన్నారంటే..‘‘మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి జెన్–జెడ్ యువత ఆ భక్తిని తమదైన శైలిలో, ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడం విశేషం. ఇది ఆధునికత, సంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం’’ -
ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)
-
ఫుల్ జోష్‌లో బిగ్‌బాస్ విష్ణు ప్రియ (ఫోటోలు)
-
ట్రెండింగ్‌లో హీరోయిన్ అసిన్ (ఫొటోలు)
-
ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
-
యాపద్బాంధవులు
ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ యాప్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి...మై సేఫ్టీపిన్క్రౌడ్ సోర్స్ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్ యాప్. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్ ట్రాకింగ్’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్ రూట్, క్విక్ అడిట్, సపోర్ట్ నెట్వర్క్, లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లాంటి కీలకమైన ఫీచర్లు ‘మై సేఫ్టీపిన్’ యాప్‌లో ఉన్నాయి.నూన్లైట్నూన్లైట్ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్ సేఫ్టీ యాప్. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా మనం ఉన్న స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్ ఆపరేటర్లను మనకు కనెక్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే... ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్‌స్క్రీన్ బటన్‌ను నొక్కాలి. సర్టిఫైడ్ ఆపరేటర్లు మనకు టెక్ట్స్ లేదా ఫోన్ కాల్ చేస్తారు. మనం ఉన్న లొకేషన్‌కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్ షేరింగ్, పీస్ ఆఫ్ మైండ్లాంటి కీలక ఫీచర్లు ‘నూన్‌లైట్’లో ఉన్నాయి.112 ఇండియా యాప్మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్...112 ఇండియా. ఇది కస్టమర్లను ఒకే నంబర్ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్ రూమ్ లేదా సమీపంలోని వాలంటీర్లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్’ ఫీచర్ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్’ సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లను అప్రమత్తం చేస్తుంది.యూ ఆర్ సేఫ్హ్యాండ్స్–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్కు ఉపయోగపడే పర్సనల్ సేఫ్టీ యాప్... యూఆర్సేఫ్. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్–ఫ్రీ ఎస్‌వోఎస్: సింగిల్ ట్యాప్ లేదా వాయిస్ కమాండ్‌తో అలర్ట్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ అండ్ స్ట్రీమింగ్: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్‌ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌తో సేఫ్టీ స్కాడ్ (మన సన్నిహిత బృందం)కి షేర్ చేస్తుంది.ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్‌ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్ చేస్తుంది. సేఫ్టీచెక్స్: లొకేషన్ బేస్డ్ సేఫ్టీ ట్రిగ్గర్స్తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్ అండ్ ఫాల్ డిటెక్షన్: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్ పంపుతుంది.విత్ యూ‘ఐయామ్ ఇన్ డేంజర్’లాంటి మెసేజ్‌ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్... ‘విత్యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్ పదేపదే రిపీట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్స్ మూమెంట్‌ను ట్రాక్ చేస్తుంది. ఫోన్ పవర్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ‘విత్యూ’ యాక్టివేట్ అవుతుంది. ‘ఐయామ్ ఇన్ డేంజర్’ ‘ఐ నీడ్ హెల్ప్’ ‘ప్లీజ్ ఫాలో మై లొకేషన్’లాంటి మెసేజ్‌లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపుతుంది.షేక్ 2 సేఫ్టీమహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్... ‘షేక్ 2 సేఫ్టీ’. ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా లేదా పవర్‌బటన్‌ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్ఎంఎస్/కాల్) పంపుతుంది. ఆఫ్‌లైన్, లాక్డ్ స్క్రీన్‌లోనూ పనిచేస్తుంది. యాప్ సెట్టింగ్స్‌లో ఎమర్జెన్సీ కాంటాక్స్‌ను యాడ్ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్‌వోఎస్ మెసేజ్‌లకు సంబంధించి సైరన్ బట్ యాడ్ చేయవచ్చు. సర్కిల్ ఆఫ్ 6మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్‌ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్ ఆఫ్ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్ వివరాల ప్రీ-ప్రోగ్రామ్డ్ ఎస్ఎంఎస్ను మన సర్కిల్‌కు పంపిస్తుంది. హాట్‌లైన్‌కు వేగంగా యాక్సెస్ అయ్యేలా చేస్తుంది. సింపుల్ ఐకాన్స్, జీపీఎస్‌ని ఉపయోగించి ‘సర్కిల్’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్ అండ్ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్డ్గా రూపొందించిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వరల్డ్ ఎమర్జెన్సీ అసోషియేషన్... టాప్ 10 ఉమెన్ సేఫ్టీ యాప్స్దిల్లీ పోలీసులు ‘హిమ్మత్ ప్లస్’ అనే ఉమెన్ సేఫ్టీ యాప్‌ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్ లొకేషన్–షేరింగ్ యాప్...లైఫ్360. లైవ్ లొకేషన్ షేరింగ్, ఎస్‌వోఎస్ అలర్ట్స్. ప్లేస్ అలార్ట్స్, రైడ్–షేర్ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్ ఎమర్జెన్సీ అసోసియేషన్’ ప్రకటించిన టాప్ 10 సేఫ్టీ యాప్‌లలో...మై సేఫ్పిన్, నూన్‌లైట్, లైఫ్ 360, యూఆర్సేఫ్ యాప్‌లతో పాటు మై ఎస్‌వోఎస్ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్ అయిన సిటిజన్, ఐయామ్ సేఫ్. గూగుల్ పర్సనల్ సేఫ్టీ, సేఫ్టీ యాప్‌లు ఉన్నాయి.అక్కలాంటి... అమ్మలాంటి యాప్ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్ లిటిల్సిస్టర్’ వారి యాప్ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్ లిటిల్ సిస్టర్ యాప్’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్’ అనే యాప్ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్‌కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్‌ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్‌లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి. -
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)
-
2025 వెడ్డింగ్స్.. రాయల్‌గా పెళ్లి..రీల్స్ మళ్లీ మళ్లీ!
బంగారం ధర కొండెక్కి కూర్చుంది.. వెండి వెల వెలుగులు జిమ్ముతోంది.. అయితే ఏంటట..? పెళ్లి మాత్రం ‘రాయల్’గా జరగాల్సిందే.. 2025 వెడ్డింగ్ సీజన్ కేవలం మూడు ముళ్ల ముచ్చట కాదు.. ఇప్పుడు అదొక భారీ ‘ఇన్‌స్ట్రాగామ్ ఈవెంట్’. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వంటి ప్రముఖుల పెళ్లిళ్లు ఆగిపోయి వార్తల్లో నిలిచినా.. అదర్ జైన్, అర్మాన్ మాలిక్ వంటి స్టార్ల పెళ్లి సందడి ట్రెండ్ సెట్ చేసింది. కేవలం కోటీశ్వరులే కాదు, మధ్యతరగతి జంటలు కూడా ’లగ్జరీ’ బాట పట్టడంతో వెడ్డింగ్ మార్కెట్ కళకళలాడుతోంది. ఇప్పుడు పెళ్లి అంటే కేవలం అక్షింతలు వేయించుకోవడం కాదు.. ఇన్‌స్టాలో ట్రెండ్ కావడం.. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో మెరిసిపోవడం.. ఖర్చు భారమైనా, అప్పులైనా.. పెళ్లి వేడుక మాత్రం ‘బ్లాక్ బస్టర్’ సినిమా రేంజ్లో ఉండాల్సిందేనని కుర్రకారు ఫిక్సయిపోయింది. → ఖర్చులో తగ్గేదే లే! ‘వెడ్‌మిగుడ్’ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో పెళ్లిళ్ల ఖర్చు సగటున 8 శాతం పెరిగింది. ఒక్కో పెళ్లి బడ్జెట్ సగటున రూ.39.5 లక్షలకు చేరింది. ఇక 2026లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → డెస్టినేషన్ వెడ్డింగ్‌కే ఓటు ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరు సొంతూరు వదిలి గోవా, జైపూర్ లేదా రిషికేష్ లాంటి ప్రాంతాల్లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ సెలబ్రేట్ చేసుకున్నారు. రూ.కోటి మించిన బడ్జెట్ ఉన్న పెళ్లిళ్లలో 60 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్వే. సగటున ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రూ.58 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాలి, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు ఇప్పుడు ఇండియన్ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ స్పాట్లుగా మారిపోయాయి. → రీల్స్ కోసమే అసలు గోల.. గతంలో లాగా పాత ఫొటోలు, గంటల కొద్దీ వీడియోలు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు. పెళ్లి పూర్తవగానే నిమిషాల్లో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడానికి వీలుగా ’క్విక్ అండ్ క్వాలిటీ’ కంటెంట్ కావాలి. అందుకే ఫొటోగ్రఫీ శైలి కూడా మారింది. క్యాండిడ్ షాట్స్, డాక్యుమెంటరీ స్టైల్ వీడియోల కోసం జంటలు ఎగబడుతున్నాయి. ఫొటోగ్రఫీ మార్కెట్లో అసైన్మెంట్లు కొంచెం తగ్గినా, డిమాండ్ మాత్రం పీక్స్‌లో ఉంది. → పాత బంగారానికే జై! 2025లో బంగారం ధర ఏకంగా 74 శాతం పెరిగి పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ల తండ్రులకు చుక్కలు చూపించింది. వెండి ధర అయితే ఏకంగా 137 శాతం ఎగబాకింది. దీంతో చాలామంది కొత్త నగలు కొనేకంటే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్లు చేయించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రీసైక్లింగ్ ట్రెండ్ గతంతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. → హోటళ్లకు కాసుల వర్షం హోటల్ రంగం కూడా ఈ వెడ్డింగ్ సీజన్లో భారీగా లాభపడుతోంది. మునుపటిలా ఒక రోజులో పెళ్లి ముగించకుండా, 2–3 రోజుల పాటు ఈవెంట్లను హోటల్స్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఈ ‘పెళ్లిళ్ల సీజన్’.. హోటళ్ల వ్యాపారంలో దాదాపు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. → 2026పై గురి.. ముందుముందు పెళ్లిళ్లలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగనుంది. ప్రణాళికల నుంచి చెల్లింపుల వరకు అంతా డిజిటల్ మయం కాబోతోంది. మొత్తానికి ధరల భారమున్నా.. భారతీయ పెళ్లిళ్ల గ్లామర్ మాత్రం తగ్గట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
ఆ కళారూపం అద్వితీయం
ఒక పది సెకన్లపాటు నీటమునిగితే అమ్మె, ఆ, ఊ, హే అంటూ ఎంతో ఇబ్బంది పడతాం కదూ. ఎందుకంటే నీటిలో మునిగితే శరీరానికి ప్రాణవాయువు అందక ప్రాణం తల్లడిల్లిపోతుంది. అయితే ఇక్కడ ఓ బాలిక మాత్రం ఏకంగా 20 అడుగుల నీటి లోతులో భరత నాట్యం చేసి అందరిని సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఈ వీడియోన చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.ప్లాస్టిక్ వల్ల కలిగే హాని ఎలాంటిదో అందరికీ తెలుసు అయినప్పటికీ దాని వాడకాన్ని ఏమాత్రం తగ్గించట్లేదు. ప్లాస్టిక్ వస్తువులతో పాటు ఇతర హానికరమైన వస్తువులు సముద్రగర్భంలో పడేయడం ద్వారా జలగర్భంలో నివసించే ఎన్నో రకాల ప్రాణులకు హాని కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసినా ఆ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు. అయితే సముద్ర కాలుష్యం వల్ల జల చరాలకు కలిగే హాని, ఇతర ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఓ 11ఏళ్ల చిన్నారి టీఏ తారగై ఆరాధన వినూత్న ప్రయత్నం చేసింది.తమిళనాడులోని రామేశ్వరం సముద్రతీరంలో 20 అడుగుల లోతులో ఆరాధన భరత నాట్య ప్రదర్శన చేసింది. నీటి అడుగునా ప్రాణవాయువు అందకున్నా తన ప్రదర్శనలో ఆ బాలిక ఏటువంచి అసౌకర్యానికి లోను కాలేదు. సాధారణ ప్రదేశంలో నృత్యం చేసిన మాదిరిగానే నీటిలోనూ తన కళను ప్రదర్శించింది. భరత నాట్యంలోని వివిధ భంగిమలు చేస్తూ అందరిని ఔరా అనిపించింది.ఆరాధన తండ్రి ప్రొఫెషనల్ డీప్-సీ- డైవింగ్ కోచ్ దీంతో తన తన పిల్లలైన టీఏ తారగై ఆరాధన, ఎస్డీ అశ్విన్ బాలకు శ్వాస నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో వారు సులువుగా ఈ ప్రదర్శన చేయగలుగుతున్నారు. ప్రస్తుతం తారగై ఆరాధన సముద్ర గర్భంలో చేసిన భరత నాట్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Puducherry Student Performs Bharatanatyam 20 Feet Underwater at RameswaramThis Video deserves to go viral on social media📈💥 pic.twitter.com/rDcgLbljvU— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) December 19, 2025 -
IndiGo Flight Crisis: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. విమానాల సంఖ్య తగ్గింపు
-
తిరుపతికి కొత్త రైలు..16వేల కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్
-
#BiggBossTelugu9 ట్రెండింగ్‌లో 'తనూజ' (ఫోటోలు)
-
గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..
భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే గుర్తుకొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి విలాసవంతమైన జీవనం.. ఇవన్నీ ఉన్నా మనుషులతో మమైకమయ్యే గొప్ప మనసు ఆ కుటుంబానిదని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి చాటారు. ఒక సాధారణ సిబ్బంది పుట్టినరోజు వేడుకలో ఆమె పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదికాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ఫలితంగా గూగుల్ ట్రెండ్స్‌లో నీతాఅంబానీ టాప్ స్థానంలో నిలిచారు.వైరల్ వీడియోలో..‘అంబానీ ఫ్యామిలీ’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోలని వివరాల ప్రకారం.. నీతా అంబానీ తన ఇంటి సిబ్బంది పక్కన నిలబడి తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఆమె చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పారు. కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్పూన్‌తో చాక్లెట్ కేక్ ముక్కను తీసి ఆ సిబ్బందికి ప్రేమగా తినిపించారు. ఈ ఊహించని చర్యతో సంతోషం పట్టలేకపోయిన సిబ్బంది చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ‘సో డౌన్ టు ఎర్త్’ క్యాప్షన్ ఉన్న ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు? -
బిగ్‌బాస్ 9.. ట్రెండింగ్‌లో కల్యాణ్ పడాల
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. దీంతో ఫైనల్‌కి ఎవరొస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే ఆసక్తి.. షో చూస్తున్న వారిలో నెలకొంది. మరోవైపు హౌస్‌కి చివరి కెప్టెన్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. దీంతో ఎక్స్(ట్విటర్)లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. గతం వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం వస్తుండటం విశేషం.స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కల్యాణ్.. బిగ్‌బాస్ షో అంటే ఇష్టంతో, ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనలాంటి చాలామంది సామాన్యులని దాటుకుని షోలో అడుగుపెట్టాడు. ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికైతే ఫినాలే రేసులో ఉన్నాడు. తనూజతో నువ్వా నేనా అన్నట్లు కల్యాణ్ గేమ్ సాగుతోంది.ఈ వారం కల్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కాబట్టి నామినేషన్స్‌లో లేడు. వచ్చే వారంలో నామినేషన్స్ ఉన్నాసరే కల్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి కల్యాణ్.. ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)
-
ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?
గత మూడు నాలుగు రోజుల నుంచి ఓ నటి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూ. అలా అని ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు, ఇంటర్వ్యూలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఏం చేయలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు వైరల్ అవుతుందనేది చూద్దాం.సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారనేది చెప్పలేదు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో మరాఠీ నటి గిరిజా ఓకే పాల్గొంది. తన గురించి పలు విషయాలు చెప్పింది. 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య.. తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చింది. ఈ బిట్‌తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విటర్లో తెగ కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎందుకో ఈమెని చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేసరికి ఈమె ఎవరా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. అలా అని ఈమేం కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటి కాదు. 2004 నుంచి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ ఫేమ్ సంపాదించింది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ కావడం ఏమో గానీ ఈమె యాక్ట్ చేసిన పాత మూవీ క్లిప్స్ అన్నీ ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఇలా వైరల్ అయిన వీడియోల్లో సందీప్ కిషన్‌తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ కూడా ఒకటుంది.గిరిజ వ్యక్తిగత జీవితానికొస్తే.. తండ్రి గిరీష్ ఓకే కూడా నటుడే. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత థియేటర్స్‌లో చేరింది. తొలుత అడ్వర్టైజ్మెంట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. సుహ్రుద్ గోడ్బోలే అనే నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా 37 ఏళ్ల వయసులో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకుని ఉండదేమో?(ఇదీ చదవండి: తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్) -
ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)
-
కొత్త ఇంటికి ఏం రంగులేద్దాం.. ఉందిగా ట్రెండింగ్ కలర్!
ఇంటికి రంగులు వేయడం ఒక కళ. జీవితకాలం కష్టపడి సొంతం చేసుకునే సొంతింటికి రంగుల ఎంపిక ఆషామాషీ వ్యవహారం కాదు. కలర్స్ ఇంటికి అందాన్ని, అనుభూతిని తీసుకురావడమే కాదు యజమాని అభిరుచిని, మానసిక స్థితిని తెలియజేసేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.కంటికి, మనసుకు ఆహ్లాదకరమైన రంగులతో రోజువారీ జీవితం రంగులమయం అవుతుంది. మనిషి ఇంద్రియాలు రంగులతో కనెక్ట్ అవుతాయి. స్పర్శ, రుచి, సువాసనలు మనలో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ఇంటీరియర్‌లో రంగులు, వాటి ఎంపికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రకృతి, ఆహార్యం, సువాసన, మృదుత్వం, ప్రకాశవంతం వంటి వాటితో రంగులు నివాసితులు, చూపరులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది.సోలార్ ఎల్లో.. సోలార్ ఎల్లోగా పిలవబడే ఈ రంగు ప్రస్తుతం ఇంటీరియర్‌లో ట్రెండ్‌గా మారింది. సూర్యుని నిజమైన రంగు తెలుపు. కానీ, మన వాతావరణం, దాని కాంతిని వెదజల్లే విధానం కారణంగా భూమి నుంచి చూస్తే సూర్యుని రంగు పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. అలాగే సోలార్ ఎల్లో రంగు కూడా వాతావరణాన్ని బట్టి రంగులు మారుతున్న అనుభూతిని కల్పిస్తుంది.స్వచ్ఛమైన కాంతి, ప్రకాశవంతంగా ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లక్కర్డ్ ఫర్నిచర్, గాజు ఫినిషింగ్‌తో కఠినమైన, కాంతిని ప్రతిబింబించే ఉపరితలంగా సోలార్ ఎల్లో అందంగా ఉంటుంది. దీని మెరుపులు, మృదుత్వం ఉల్లాసభరితంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
‘మాస్ జాతర’ సినిమా రిలీజ్..ట్రెండింగ్ లో శ్రీలీల (ఫొటోలు)
-
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్.ఏఐ ప్రాంప్ట్‌లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్ ప్రత్యేకత.ఈ ట్రెండ్ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్ స్టైల్స్..పోల్కా–డాట్ డిజైన్, బ్లాక్ పార్టీ–వేర్ శారీ, సాఫ్ట్ ఫ్లోరల్ యాక్సెంట్లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.మీరు కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి...∙జెమిని చాట్‌జీపీటీలో లాగిన్ కావాలి ∙ట్రై ఇమేజ్ ఎడిటింగ్–క్లిక్ చేయాలి. ∙క్లీయర్ సోలో ఫోటోను అప్లోడ్ చేయాలి. ∙బ్లాక్ శారీ, వైట్పోల్కా డాట్....మొదలైన వైరల్ ్రపాంప్ట్స్లో ఒకదాన్ని పేస్ట్ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్ క్షణాల్లో కళ్లముందుంటుంది. -
బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)
-
కిక్ ఇచ్చేలా 'దిశా పటాని' ఫోజులు.. ట్రెండింగ్‌లో (ఫోటోలు)
-
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో.. ఇలా చాలా హిట్ చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ కూడా రీసెంట్‌గానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?గత కొన్నేళ్లలో తెలుగులో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్.. లీడ్ రోల్ చేసిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటిది నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఈ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు సదరు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) 'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం చేస్తుంటాడు కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఓ దెయ్యంపై తొలి వీడియో చేస్తే అది తెగ వైరల్ అవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. కట్ చేస్తే బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో పరమేశ్వర్, అతడి స్నేహితులు ఆడుకునే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి ఆకలికి ఎక్కువ. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్) -
అల్లు కనకరత్నం పెద్దకర్మ... చిరు, రామ్ చరణ్ సహా (ఫొటోలు)
-
చిన్నోడి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు!
పడవ స్పీడుగా దూసుకెళుతోంది.ఆ స్పీడ్‌కు తగినట్లుగా దిఖా చేసిన మ్యాజిక్ డ్యాన్స్ సంచలనం సృష్టించింది. ఈ ఆన్లైన్ సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.పదకొండు సంవత్సరాల ఇండోనేషియా అబ్బాయి రెయాన్ అక్రన్ దిఖా చేసిన ఐకానిక్ బోట్ డ్యాన్స్ ‘ఆరా ఫార్మింగ్’ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. తాజాగా ఈ ట్రెండ్‌లో సింగపూర్ నేవీ సిబ్బందితో పాటు మన ముంబై పోలీసులు (Mumbai Police) కూడా భాగం అయ్యారు.ముంబై పోలీసుల ఐకానిక్ బోట్ డ్యాన్స్ హిట్ కావడంతో, ఒరిజినల్ డ్యాన్స్ చూడని వాళ్లు ఇది చూసి ‘ఆహా’ ‘ఓహో’ అంటున్నారు.ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు ఈ ఐకానిక్ బోట్ డ్యాన్స్ ట్రెండ్‌లో భాగం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్‌లో భాగం అవుతున్నవారు స్థానిక మ్యూజిక్‌ను వీడియోకు జత చేస్తున్నారు.‘ఆరా ఫార్మింగ్’ అనేది ఇప్పుడు ఆన్లైన్లో పాపులర్ అయింది. కదులుతున్న కారుపై.. జనమంతా చూస్తుండగా కదులుతున్న కారుపై ముంబై మహిళ ఒకరు చేసిన ఆరా ఫార్మింగ్ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. నవీ ముంబైలోని ఖార్ఘర్లో కదులుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్‌పై నజ్మీన్ సుల్దే అనే 24 ఏళ్ల మహిళ చెప్పులు లేకుండా డాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. చదవండి: రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన.. ఏకంగా 170 గంటల పాటు.. నజ్మీన్తో పాటు కారు నడిపిన ఆమె ప్రియుడు అల్-ఫెష్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరితో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు భారతీయ న్యాయ సంహిత, మోటారు వాహన చట్టం కింద వారిని అరెస్ట్ కూడా చేశారు. అల్-ఫెష్ షేక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని వార్తలు కూడా వచ్చాయి.🔥🚨BREAKING: This young man named Dika has taken over the Internet on all platforms for ‘legendary aura farming’ he can be seen dancing on the front of boat races in Indonesia to boost moral. The viral kid stealing hearts at Pacu Jalur, His dance isn't just moves, it's pure… pic.twitter.com/awify23gFh— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) July 7, 2025 View this post on Instagram A post shared by Nazmeen Sulde (@nazmeen.sulde) -
ముత్యాల హారంతో బేబమ్మ.. ఎంత ముద్దుగా ఉందో! (ఫొటోలు)
-
టాప్ ట్రెండింగ్‌లో టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో ఆసక్తికర సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు. బ్లైండ్ స్పాట్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించాడు. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు.అయితే ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ క్రైమ్ థ్రిల్లర్ కథేంటో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో రాశీసింగ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.బ్లైండ్ స్పాట్ కథేంటంటే?హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) -
Latte లాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. ఏమిటీ ‘ చిత్రం’
పొగలు కక్కే కాఫీ కావాలని అడిగేవారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కళ కళ లాడే కాఫీ కావాలని అడిగేవారు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. శతాబ్దాలుగా పానీయాల ప్రియుల్ని అలరిస్తున్న కాఫీ ఇప్పుడు కళాభిమానులనూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కళ కూడా శతాబ్దాల నాటిదేనని ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాల్లో 17వ శతాబ్దం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. చల్లని సాయంత్రాల్లో చేతికి అందే ఒక కప్పు కాఫీ మనల్ని రీఛార్జ్ చేస్తుంది. అదే కాఫీ నగరంలోని కొందరి చేతుల్లో నుంచి అద్భుత కళలను ఆవిష్కరిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో Latte Coffe చిత్రకారులు కాఫీపొడి, డికాక్షన్ వగైరాలతో పోట్రెయిట్స్, వన్యప్రాణుల చిత్రాలు, ల్యాండ్ స్కేప్‌లు, ఆబ్స్ట్రాక్ట్స్.. సృష్టిస్తున్నారు. ఆర్గానిక్ కలర్ ఉపయోగించడం కాఫీ ఆర్ట్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ సేంద్రీయ లేత, ముదురు బ్రౌన్ కలర్ ఆధారిత షేడ్స్ నుంచి పుట్టే చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కాఫీని రంగులా మార్చుకుని బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి చిత్రాలు గీస్తారు. ఇవి వైవిధ్యంగా, అనేక సంవత్సరాల పాటు నిలిచిపోయేలా ఉంటాయి. సోషల్ మీడియా ప్రచారం.. మన దేశంలో ఈ కళ కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా బాగా విస్తరిస్తోంది. యువ కళాకారులు తమ ఇన్‌స్టా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కాఫీ ఆర్ట్ ప్రదర్శిస్తూ ప్రాచుర్యం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో.. కాఫీతో పోట్రెయిట్స్ ఆవిష్కరించడం ద్వారా తమిళనాడుకు చెందిన ధనంజయన్ కాఫీ ఆర్ట్ ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలను రూపుదిద్దుతూ కర్ణాటక వాసి కవిత దివాకర్, అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా పటేల్ తన వీడియోల ద్వారా కాఫీ ఆర్ట్‌కు చిరునామాగా మారారు. నేను ఆర్కిటెక్ట్‌ని. డిగ్రీ మొదటి రోజుల్లో కొన్ని ప్రాథమిక చిత్రకళల పాఠాలు మాత్రమే నేర్పించేవారు. కానీ చిత్రకళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఎప్పటి నుంచో కాఫీ ప్రియురాలిని. ఒక ఆర్కిటెక్ట్‌గా నన్ను నన్నుగా గుర్తు చేసే రంగు నలుపు. ఒకే ఒక్క రంగుతో అలసిపోకుండా ప్రయాణం కొనసాగించడం పెద్ద సవాలు అనిపించి ఇంకో కలర్‌గా కాఫీని ఎంచుకున్నా. ఇది వాటర్ బేస్డ్ కావడం, నాకు వాటర్ కలర్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉండడం బెస్ట్ ఛాయిస్ అయ్యింది. పెయింటింగ్ వేస్తున్నప్పుడు గుబాళించే కాఫీ పరిమళం, అది అందించే ఆశక్తి, ఆ ఉల్లాసం..అద్భుతం. ప్రారంభంలో నేను సాధారణ కాఫీ పెయింటింగ్‌తో మొదలుపెట్టాను. చిన్న చిన్న హైలైట్ కోసం వాటర్ కలర్స్ కూడా కాఫీ పెయింటింగ్స్‌కి జోడించా. ఇటీవల పెయింటింగ్స్‌కి కాఫీతో బ్యాక్‌గ్రౌండ్ వేస్తూ, ఆపై వేరే రంగులతో పెయింట్ చేస్తున్నా. దీని వల్ల వింటేజ్ లుక్ వస్తుంది. ఈ ప్రయాణంలో హ్యారీ పోటర్ నేపథ్యంలో వేసిన పెయింటింగ్ చూసి హ్యారీ పోటర్ టీం నన్ను అభినందించింది. అంతేకాకుండా ఆ వీడియోను వారి అధికారిక ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. – జ్యోత్స్న మైథిలీ రెడ్డి, కాఫీ ఆర్టిస్ట్ నగరంలోనూ సందడి.. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్ట్ హౌస్ ప్రత్యేకంగా కాఫీ ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆర్ట్ స్టూడియోగా పేరొందింది. అలాగే నల్లగండ్లలోని కవి ఆర్ట్ స్టూడియో, గచి్చ»ౌలిలోని థర్డ్ వేవ్ కేఫ్, జూబ్లీహిల్స్‌లోని మాక్రో బ్రూ వరల్డ్ కాఫీ బార్, బంజారాహిల్స్‌లోని లాట్టే ఆర్ట్ కెఫేలో కాఫీ ఆర్ట్ వర్క్‌షాప్‌ల నిర్వహించడంతో పాటు కాఫీతో తయారు చేసిన పెయింటింగ్‌లను కూడా ప్రదర్శిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని లైజురే ఆర్ట్ కేఫ్ కాన్వాస్, క్రేవింగ్స్, కెఫైన్ కాన్సెప్‌్టతో అతిథులను ఆకట్టుకుంటోంది. ఫిల్మ్ నగర్‌లోని బాగ్ బీన్స్ కాఫీ అండ్ ఆర్ట్‌లో కాఫీ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయంలాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. కాఫీని రంగుగా వినియోగించే ఆర్ట్ ఒకెత్తయితే, కాఫీ కప్పులో భిన్న రూపాలు చిత్రించే కళను లాట్టే ఆర్ట్‌గా పేర్కొంటారు. ఇది చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే దీన్ని గతంలో కాఫీ షాప్స్‌లో పనిచేసే సిబ్బంది, కాఫీ మేకర్స్ ఎక్కువగా సాధన చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో దీనిపై నగర యువత కూడా ఆసక్తి చూపుతోంది. దీంతో కాఫీ ఆర్ట్ అంత కాకపోయినా అడపాదడపా లాట్టే ఆర్ట్ వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. నగరానికి చెందిన యువ చిత్రకారుడు సాయి అఖిల్ గౌడ్, రాధాకృష్ణ వంటివారు ఈ లాట్టే ఆర్ట్‌కు పేరొందారు. మరింత చేరువగా... దాదాపు నగరంలో పేరున్న కేఫ్స్ అన్నీ చిత్రకళకు పెద్ద పీట వేస్తున్న పరిస్థితులు, అలాగే తరచూ జరుగుతున్న కాఫీ ఫెస్టివల్స్ వంటి ఈవెంట్స్ వల్ల నగరవాసులకు కాఫీ ఆర్ట్ మరింత చేరువ అవుతోంది. విభిన్న రకాలుగా యువతలో క్రియేటివిటీకి వేదికవుతోన్న ఈ కాఫీ ఆర్ట్ ప్రపంచస్థాయి కాఫీ ఆర్టిస్టులను నగరానికి అందించినా ఆశ్చర్యం లేదు. (పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!) -
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చ మాఫియా అరాచకాలు... యథేచ్ఛగా డ్రగ్స్ దందా... పేకాట క్లబ్బులతో భారీగా దోపిడీ
-
ఖలేజా రీ రిలీజ్.. అనూహ్యంగా ట్రెండింగ్‌లోకి వచ్చిన నటి.. అసలు విషయం ఇదే!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో థియేటర్లలో అంతగా రాణించని ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్ రోజు మహేశ్ బాబు అభిమానులు థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేశారు. ఓ అభిమాని ఏకంగా పామును పట్టుకుని మూవీ థియేటర్‌కు వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.అయితే ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత అనూహ్యంగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆమె ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అని అందరూ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు.. ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్‌లో షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తాడు. ఈ సీన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సీన్స్‌లో నటించిన దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట తెగ వైరలైంది. అయితే ఇది చూసిన ఆమె.. ఖలేజా మూవీలో తాను నటించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది.తాజాగా ఖలేజా రీ రిలీజ్ కావడంతో దిలావర్ సింగ్ భార్యగా నటించింది దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ రోల్ తాను చేయలేదని స్పష్టం చేసింది. తానేనని చాలామంది పొరపాటుగా పోస్ట్ చేశారని తెలిపింది. View this post on Instagram A post shared by Divya Mary Cyriac (@divyacyriac) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మూవీ.. టాప్ టెన్‌లో ట్రెండింగ్!
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ చిత్రం చౌర్యపాఠం. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో సందడి చేసింది. అయితే ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన 'చౌర్య పాఠం (Chaurya paatam) ఓటీటీలో దూసుకెళ్తోంది. ఏకంగా టాప్ టెన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ అమెజాన్‌లో టాప్-7లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చౌర్యపాఠం మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ సినిమా కథేంటంటే..చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ. -
Podcast: యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్ - ట్రెండింగ్ పాడ్‌కాస్టింగ్!
శ్రీనగర్‌కాలనీ: ఓ వ్యక్తి అనుభవాలు.. ఎదుర్కొన్న కష్టాలు.. సాధించిన విజయాలు.. పలువురికి ఉపయోగ పడే సంఘటనలు.. ఇలా ఎన్నో అంశాలను తెలుసుకోవడానికి పేపర్ చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడటం చేసేవాళ్లం. ఆయా అంశాల గురించి తెలుసుకునేవారం.. ఇప్పుడంతా ఫోనే.. తింటున్నా.. నడుస్తున్నా.. జర్నీ చేస్తున్నా.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫోన్.. ఒక్కసారి యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర యాప్స్ ఓపెన్ చేస్తే చాలు వేలు, లక్షల సంఖ్యలో వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే.. ప్రస్తుతం పాడ్‌కాస్టింగ్(Podcast) ట్రెండ్ కొనసాగుతోంది. ఇది కొన్నేళ్ల క్రితమే మొదలైనా ప్రస్తుతం పాడ్‌కాస్టింగ్ అంటే అందరికీ తెలుస్తోంది. ఇంటర్వ్యూ ట్రెండ్ అవ్వాలంటే పాడ్కాస్టింగ్తోనే అన్నట్లుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏడాది కాలంగా మరింత ట్రెండింగ్‌గా మారి సెలెబ్రిటీస్‌తో పాడ్‌కాస్టింగ్ కోట్లలో వ్యూస్‌ని తెచ్చిపెడుతోంది. యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్.. భారత్‌లో పాడ్కాస్టింగ్కు డిమాండ్ పెరిగింది. ఫుడ్, బిజినెస్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, సైన్స్, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో రాణించిన వారు తమ అనుభవాలను పాడ్‌కాస్టింగ్‌లో వెల్లడిస్తున్నారు. ఇందులో వీడియో పాడ్‌కాస్టింగ్ చాలా పాపులర్ అయ్యింది. ఒక యూట్యూబర్ లేక ఒక వ్యక్తి ఫేమస్ పర్సన్‌ను వారి అనుభవాలను విశ్లేషణాత్మకంగా, పూర్తిగా వారి అనుభవాలను నెటిజన్లను తెలియజేయడం ట్రెండింగ్‌గా మారింది. ఫేమస్ పర్సనాలిటీస్ వారి జీవిత విషయాలను పాడ్‌కాస్టింగ్‌లో వెల్లడించడంతో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాల్లో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా చానల్స్‌కి కూడా రూ.లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇదీ చదవండి: చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగాపాడ్కాస్టింగ్.. పాడ్‌కాస్టింగ్ అంటే ఒక వ్యక్తి తన విజ్ఞానాన్ని, పలు విషయాలను పూర్తిగా వివరించే పక్రియే పాడ్‌కాస్టింగ్.. ఆడియో, వీడియో, మోనో, గ్రూప్ పాడ్‌కాస్టింగ్ చాలా రూపాల్లో ఉంటుంది. ఒకప్పుడు రేడియోలో ఒక వ్యక్తి తన రంగానికి సంబందించిన విషయాలను వెల్లడించడమే ఇప్పుడు రికార్డింగ్ రూపంలో ఒక క్లారిటీ ఆడియో, వీడియోను చేయడమే.. ఆడియో పాడ్‌కాస్టింగ్ చాలా తక్కువ టైంలో అవుతుంది. అదే గ్రూప్, ఇద్దరు వ్యక్తుల పాడ్‌కాస్టింగ్ వీడియో పాడ్‌కాస్టింగ్ చేయాలంటే మైక్స్, మ్యూజిక్, ఎడిటింగ్ ఖచ్చితంగా చేయాలి. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్ -
బర్త్‌డే స్పెషల్.. విజయ్ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్!
Ghibli & style (గిబ్లీ–స్టైల్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. అందరూ తమ ఫొటోలను ఏఐకి ఇచ్చి, దాని ద్వారా గిబ్లీ–స్టైల్ ఫొటోలను పొందుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కారణంగా చాలామంది OpenAI దగ్గరయ్యారు. ఈ ట్రెండ్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, చివరకు OpenAI సీఈవో శామ్ ఆల్ట్మాన్ వచ్చి ‘మీరు కాస్త నిదానించండి. ఇవతల మా ఉద్యోగులు పనిభారంతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు’ అని యూజర్లను అభ్యర్థించేంత. మరి బొమ్మలకు ఇంత ప్రచారం కల్పించిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే సీటల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ్రాంట్ స్లాటన్.మార్చి 26న స్లాటన్ తన భార్య, కుక్కపిల్లతో కలిసి దిగిన ఫొటోను OpenAI ద్వారా గిబ్లీ–స్టైల్ బొమ్మగా మార్చి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఆ ఫొటో వైరల్‌గా మారింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమకూ అలాంటి ఫొటోలు తయారు చేసుకోవాలని ఉందన్నారు. 50 మిలియన్ల మందిపైగా ఆ పోస్ట్ చూశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల్లోనే ఈ విషయం ట్విట్టర్లో ట్రెండ్‌గా మారింది. ఇప్పటివరకు 5 కోట్ల 10 లక్షల వ్యూస్ వచ్చాయి.చదవండి: జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!కొందరు ఆ ఫొటోను మెచ్చుకోగా, మరికొందరు దాన్ని విమర్శిస్తూ.. ‘అది చిత్రకారుల గౌరవాన్ని దెబ్బతీస్తోందని’ కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఫొటో ట్రెండ్ సృష్టించడంతో OpenAI ఆ విషయాన్ని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టింది. అందరు యూజర్లు గిబ్లీ–స్టైల్ ఫొటోలు తయారు చేసుకునే అప్డేట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా మనం తయారుచేస్తున్న ఫొటోల వెనుక గ్రాంట్ స్లాటన్ చేసిన పని ఉందన్నమాట! tremendous alpha right now in sending your wife photos of yall converted to studio ghibli anime pic.twitter.com/FROszdFSfN— Grant Slatton (@GrantSlatton) March 25, 2025 -
ప్రియుడితో 'అభినయ' నిశ్చితార్థం.. వివరాలు ఇవే (ఫోటోలు)
-
షాడో మిక్స్డ్ ఫోజులతో శ్రియారెడ్డి.. ఫర్పెక్ట్ ఆవుట్ఫిట్తో (ఫొటోలు)
-
రోజాపూరెక్కల మధ్య సీతాకోక చిలుకలా...ఎవరీ బ్యూటీ (ఫొటోలు)
-
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. ఫోటోలు
-
Divi Vadthya: నెలవంక సైతం సిగ్గుపడే అందం దివి సొంతం (ఫోటోలు)
-
రీతూ చౌదరికి ఆల్రెడీ పెళ్లయిందా? అందుకేనా ఆ సలహా! (ఫోటోలు)
-
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది. ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో వైయస్ జగన్ బర్త్‌డే కొనసాగుతోంది.#HBDYSJagan#HBDYSJagananna#HbdysJagansir200K Tweets Done & Dusted✅🔥#HBDYSJagan pic.twitter.com/mrLVHcdqTr— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 21, 2024తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో కూకట్పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్‌డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్‌లో టాప్ త్రీ పొజిషన్లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్‌లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరోవైపు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్‌బుక్‌లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం! -
మెడలో తాళిబొట్టు.. మోడ్రన్ డ్రెస్‌లో కీర్తి సురేష్ ట్రెండింగ్ (ఫోటోలు)
-
ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్‌లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్‌గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్‌గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
బామ్మ ఫ్యాషన్ రేంజ్ మాములుగా లేదుగా.. అదిరిపోయే స్టన్నింగ్ స్టిల్స్..!
-
వైరల్ 'రియా'.. అసలు ఈ అమ్మాయి ఎవరంటే? (ఫొటోలు)
-
సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న జబర్దస్త్ వర్ష (ఫోటోలు)
-
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (ఫొటోలు)
-
పచ్చని అందాల నడుమ కేతిక సోయగాలు (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఫేమ్ అశ్విని దుబాయ్ అందాల ట్రీట్ (ఫొటోలు)
-
పులుల కంటే ఎక్కువగా బలిగొన్నాయని తెలుసా?
-
హేట్ టు లవ్.. నాలుక మడతేసిన ట్రంప్


