బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. దీంతో ఫైనల్‌కి ఎవరొస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే ఆసక్తి.. షో చూస్తున్న వారిలో నెలకొంది. మరోవైపు హౌస్‌కి చివరి కెప్టెన్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. దీంతో ఎక్స్(ట్విటర్)లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. గతం వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం వస్తుండటం విశేషం.
స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కల్యాణ్.. బిగ్‌బాస్ షో అంటే ఇష్టంతో, ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనలాంటి చాలామంది సామాన్యులని దాటుకుని షోలో అడుగుపెట్టాడు. ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికైతే ఫినాలే రేసులో ఉన్నాడు. తనూజతో నువ్వా నేనా అన్నట్లు కల్యాణ్ గేమ్ సాగుతోంది.
ఈ వారం కల్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కాబట్టి నామినేషన్స్‌లో లేడు. వచ్చే వారంలో నామినేషన్స్ ఉన్నాసరే కల్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి కల్యాణ్.. ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.


