హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..! | EUFF event held in hyderabad to show the european countries Movies | Sakshi
Sakshi News home page

EUFF-2025 Event: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఈవెంట్.. వేదికలు ఇవే..!

Dec 1 2025 3:51 PM | Updated on Dec 1 2025 3:51 PM

EUFF event held in hyderabad to show the european countries Movies

హైదరాబాద్గ్రాండ్ ఈవెంట్కు వేదికగా నిలవనుంది. ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్భాగ్యనగరంలో జరగనుంది. ఏడాది 30 ఎడిషన్లో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్, సారథి స్టూడియోస్లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ జెల్లే డే జోంగ్ తెరకెక్కించిన మేమెరీ లేన్ అనే మూవీతో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.

హైదరాబాద్వేదికగా నెల 5 నుంచి 14వరకు జరగనుంది. ఫిల్మ్ ఫెస్టివల్లో యూరప్ దేశాల్లో తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రదర్శించనున్నారు. బెల్జియం మూవీ జూలీ క్వీప్ క్వైట్.. ఆస్ట్రియా చిత్రం హ్యాపీలో లాంటి సినిమాలు తెరపై ఆవిష్కరించనున్నారు. అలాగే పలు దేశాలకు సంబంధించిన సూపర్ హిట్ చిత్రాలను ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారని యూరోపియన్ యూనియన్ రాయబారి హార్వే డెల్ఫిన్ వెల్లడించారు. ఈయూఎఫ్ఎఫ్‌-2025లో దాదాపు 23 దేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement