హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి ఈమె.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే చాలాసార్లు వీళ్లు జంటగా కనిపించారు. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తూ సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.
పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈరోజు (డిసెంబరు 01) ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో కేవలం 20 మంది అతిథుల సమక్షంలోనే సామ్-రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ మేరకు మొదట వార్తలు బయటకొచ్చాయి. కాసేపటికే సమంత.. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)
'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో పనిచేసింది. నాగచైతన్యతోనూ పలు చిత్రాల్లో కలిసి పనిచేసింది. అలా చేస్తున్న టైంలోనే సామ్-చైతూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ చేస్తున్న టైంలో సమంత-రాజ్ మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటయ్యారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
(ఇదీ చదవండి: భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్‌లో ఆరుగురు)



