తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. సీజన్ ముగింపుకు వస్తున్నా సరే కొట్లాటలు మాత్రం తగ్గలేదు. అందుకు 13వ వారం నామినేషన్స్ ప్రోమోయే నిదర్శనం. ఇద్దరి తలపై బాటిల్ పగలగొట్టి హౌస్‌మేట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఇమ్మాన్యుయేల్.. రీతూ, పవన్‌ను నామినేట్ చేశాడు.
సంజనాకు హెచ్చరిక
భరణి.. సంజనను నామినేట్ చేశాడు. నా మెడిసిన్స్ దాచేసి నాపైనే కామెడీ చేస్తావనుకోలేదు, ట్యాబ్లెట్సె్ దాయడం మీకు సరదాగా ఉందా? అని అడిగితే అందుకామె అవునని తేలికగా బదులిచ్చింది. ఈ ప్రాంకులు చేయడం ఆపండి అని హెచ్చరించాడు. అయితే ఇదే భరణి.. మొన్న ఎపిసోడ్‌లో మాత్రం.. ట్యాబ్లెట్స్ దాచేసినందుకు సంజనాతో మరేం పర్లేదన్నట్లుగా సంభాషించాడు. ఇప్పుడేమో ఉగ్రరూపం చూపించడం గమనార్హం.

ఇదే నా ఛాలెంజ్
భరణి.. పవన్ (Demon Pavan)ను నామినేట్ చేస్తూ.. నిన్ను వెనక్కులాగుతున్నదాన్ని పక్కనపెట్టు.. మానసికంగా వీక్ అయితే ఫిజికల్‌గా కూడా ఫోకస్‌గా ఆడలేం అని సూచించాడు. దీంతో పవన్.. ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే.. మీ అందరికీ ఇదే నా ఛాలెంజ్ అని సవాలు విసిరాడు. మరి ఆ మాటపై ఎంతవరకు నిలబడతాడో చూడాలి! ఇకపోతే ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కల్యాణ్ మినహా మిగతా ఆరుగురు ఈ వారం నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


