తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ నుంచి దివ్య ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన వెంటనే సరాసరి బజ్ ఇంటర్వ్యూకి హాజరైంది. అక్కడ శివాజీ ఏయే ప్రశ్నలడిగాడు? తను ఎలా సమాధానాలిచ్చిందో ప్రోమో వదిలారు. అది ఓసారి చూసేద్దాం..
వాళ్ల చుట్టూయే ప్రశ్నలు
దివ్య గురించి మాట్లాడాలంటే కచ్చితంగా రెండు పేర్లు ముందుకు వస్తాయి. అవే భరణి, తనూజ. బజ్ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఈ రెండు పేర్ల చుట్టూనే తిరిగింది. దివ్య నిఖితలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు భరణి అవసరం ఏమొచ్చింది? ఆయన తనూజతో ఎలా ఉంటే నీకేంటి సమస్య అని శివాజీ నిలదీశాడు. నాకేం ప్రాబ్లం లేదని దివ్య చెప్తుంటే.. నీ పొసెసివ్‌నెస్ మాకు స్పష్టంగా కనిపిస్తోదన్నాడు శివాజీ.
తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య?
వాళ్లను విడగొట్టి నేనేం సాధిస్తాను? పోనీ.. నేను రాగానే విడిపోయారంటే వాళ్ల రిలేషన్ అంత వీకా? అని దివ్య తిరిగి ప్రశ్నించింది. భరణి.. తనూజను ఎత్తుకుని తింపుతాడు, ఆయింట్‌మెంట్ రాస్తాడు.. నీకేంటి ప్రాబ్లమ్? అని అడిగాడు. ఒకసారి బయటకు వెళ్లి వచ్చాక ఆయన నిన్ను అంతగా ఎంకరేజ్ చేయలేదు.. గమనించావా? అంటూ ఆమెను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకు దివ్య కూడా అవునని తలూపింది.
వెక్కెక్కి ఏడ్చిన దివ్య
నిన్ను భరణి (Bharani Shankar)కి దూరంగా ఉండమని చెప్పమని మీ తల్లి మాధురిని వేడుకుందన్న విషయం చెప్పాడు. అది విని దివ్య మౌనంగా కూర్చుండిపోయింది. ఇక భరణిని తల్చుకుని దివ్య ఎమోషనలైంది. భరణి నా అన్నయ్య.. మళ్లీ హౌస్‌లోకి వచ్చారు. ఆయనతో ఉండాలి, ఆయన్ని బాగా చూసుకోవాలి అనే అనుకున్నాను. బయటకు వచ్చాక ఆయన నాతో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆయన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగానే ఉంటానని ఏడ్చేసింది.


