బిగ్‌బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో మొదటివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. కామనర్స్ నుంచి డిమాన్ పవన్, సెలబ్రిటీలలో భరణి మినహా మిగతా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఈ షోకి కావాల్సిన కంటెంట్ నేనిస్తానంటూ ఫుల్ జోష్ మీదుంది సంజనా. మొన్న షాంపూ కోసం పంచాయితీ పెట్టిన ఆమె నిన్న గుడ్డు దొంగిలించి అందరికీ బీపీలు వచ్చేలా చేసింది. గుడ్డు ఎవరు కొట్టేశారో అర్థం కాక ఓనర్స్ (కామనర్స్) తల పట్టుకున్నారు. టెనెంట్స్లోనే అసలైన దొంగ ఉన్నాడని తెలిసి వాళ్లందరిపైనా ఒంటికాలిపై లేచారు.అందరి అనుమానం తనపైనేమీరు ఇంట్లో అడుగుపెట్టేదే లేదని టెనెంట్స్‌పై ఆంక్షలు విధించారు. అయితే అందరి అనుమానం సంజనా (Sanjana Galrani)పైనే.. కానీ ఆమె మాత్రం ఓపక్క నవ్వుతూ, మరోపక్క అమయాకంగా ముఖం పెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. ఈ క్రమంలో భరణి, హరీశ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇలా అందరూ అరుచుకుంటూ ఉంటుంటే అప్పుడు సంజనా సైలెంట్‌గా వచ్చి.. ఆకలేసి నేనే గుడ్డు తిన్నా.. అడిగితే ఇవ్వరనే అలా చేశాను అని తాపీగా చెప్పింది. ఇరికించేసిందిగా!దీంతో ఓనర్లు.. అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పొచ్చు కదా? అని ఫైర్ అయ్యారు. ఇక సంజనా తాను తినేటప్పుడు కిచెన్‌లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని, రాముకు కూడా తెలుసని ఇరికించేసింది. దాంతో అందరూ షాకయ్యారు. శ్రష్టి అయితే సంజనా దగ్గరకు వెళ్లి.. గుడ్డు తినడానికి సిగ్గు లేదా? అని తిట్టేసింది. అటు రీతూ చౌదరి.. మీ ముగ్గురూ కలిసి గేమ్ ఆడారు అని భరణిపై ఫైర్ అయింది. అప్పుడు భరణి నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ఏడ్చేసిన సంజనామేము కిచెన్‌లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజకి చెప్పిందట. 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను.. ఏదో ప్రాబ్లమ్ ఉందంది. అందుకే నేను సైలెంట్‌గా ఉన్నా అన్నాడు. అప్పుడు సంజనా ఎంటరై.. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా గురించి మీకు తెలీదు. నేను బాధితురాలిని. నేను ప్రతిరోజు ఏడుస్తూనే పడుకుంటాను అని ఏడ్చేసింది. అలా ఒక్క గుడ్డు దొంగతనంతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా