బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి నేషనల్ క్రష్, కాబోయే తెలుగింటి కోడలు రష్మిక మందన్నా (Rashmika Mandanna) వచ్చేస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీక్షిత్, రష్మిక బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చారు.
సీన్స్ రీక్రియేషన్
వీరుండగానే హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్‌గేమ్ ఆడించాడు నాగ్.. కొన్ని పాపులర్ సీన్స్ ప్లే చేసి.. వాటిని రీక్రియేట్ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్‌మేట్స్ తమ కళనంతా బయటపెట్టారు. పోకిరి, అదుర్స్ వంటి పలు హిట్ సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేశారు. వారి డైలాగులు, యాక్టింగ్ చూస్తుంటే జనాలు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. చివర్లో భరణి (Bharani Shankar) బ్రహ్మానందంలా మారిపోయాడు. వెంటనే మాధురి.. ఆ వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలంట ప్రేమ అని భరణిపై సెటైర్లు వేసింది.
బ్రహ్మానందంలా మారిపోయిన భరణి
అందరికీ ఏమైనా సిక్స్ ప్యాక్‌లు ఉన్నాయా? అని భరణి అంటుంటే.. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని కోపగించుకుంది. దాంతో భరణి.. నువ్వలా హార్ష్‌గా మాట్లాడకు చందు, హర్టవుతాను అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. అలాగే బామ్మ క్యారెక్టర్‌లో ఉన్న సంజనాతో.. మీరలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని డైలాగ్ వేశాడు. మొత్తానికి చాలాకాలం తర్వాత ఈ సండే ఫన్‌డేగా మారుతుందని అర్థమవుతోంది. అయితే, సోషల్ మీడియా లీక్స్ ప్రకారం మాధురి ఎలిమినేట్ అయిందట. అంటే రేపటినుంచి మంచి మాస్ మసాలా గొడవలు మిస్ అవుతామన్నమాట!


