టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఇస్తున్న సర్‌ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్‌ప్రైజింగ్‌గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..
అదరగొట్టేసిన పవన్
బిగ్‌బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్‌ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్‌ను హౌస్‌మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.
తనూజ గెలుపు
మరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్‌బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్‌బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.
తనూజకు చెల్లి పెళ్లి ఫోటో
అనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో ఈ టాస్క్‌లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్‌లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.


