ఇళ్ల కూల్చివేత బాధితులను స్వయంగా పరామర్శించేందుకు మంగళవారం(డిసెంబర్ 16వ తేదీ) నాడు విజయవాడ జోజి నగర్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. వైఎస్ జగన్ రాకతో ఆయన వెళ్లే దారులన్నీ అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. జై జగన్ నినాదాలతో మార్మోగాయి.


