బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు చేశారు. ఈరోజు(జనవరి 30) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని సహించడు. తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి అతడిని ఊరు నుంచి గెంటేస్తాడు. వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా ఇద్దరు అనుచరులని ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతకు ఏమైంది? ధర్మ-శ్వేత ఒక్కటయ్యారా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
సమాజంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన కుల వ్యవస్థని ప్రశ్నిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు.. తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కొడుకుతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు. అబ్బాయిలు, స్నేహితులుగా మారితే.. అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని ఆమె తండ్రి.. అతన్ని ఊరి నుంచి పంపేస్తాడు. ర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ ఫ్లాట్.
రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు కానీ ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నారు. ఏదేమైనా చేయండి కానీ పెళ్లి విషయంలో చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇందులోనూ అదే అంశాన్ని చూపించారు.
సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. కాకపోతే స్టోరీలా ఊహించేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఉన్నంతలో బాగానే తీశారు.
నటీనటుల విషయానికి వస్తే హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్‌గా చేసి అనుశ్రీ.. ఆమె సోదరుడి పాత్రలో నరసింహ ఆకట్టుకున్నారు. దేవగుడి వీరారెడ్డిగా రఘు కుంచె ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్‌లో మదిన్ సంగీతం బాగుంది. నిడివి కూడా పర్లేదు. నిర్మాణ విలువలు ఓకే ఓకే.


