పాట్నా: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్‌పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్‌లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్‌తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్‌పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్‌లో ఓ ప్రైవేటు ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్‌ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్‌పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.
⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl
— The Tatva (@thetatvaindia) March 16, 2026
ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్‌ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.


