నెతన్యాహూ మరో సంచలన వీడియో | Netanyahu releases new video interacting with civilians after coffee shop draws AI flak | Sakshi
Sakshi News home page

నెతన్యాహూ మరో సంచలన వీడియో

Mar 16 2026 7:32 PM | Updated on Mar 16 2026 7:56 PM

Netanyahu releases new video interacting with civilians after coffee shop draws AI flak

ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్‌ దాడులతో మొదలైన యుద్ధం   వరుసగా 17వ  రోజు భీకరంగా సాగుతోంది.  ఒకవైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ  తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.  మరోవైపు  ఇరాన్‌ ప్రతీ కార దాడుల్ల  ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహూ, అతని భార్య,  మరో కీలక అధికారి మరణించారన్న   ఊహాగానాలు కూడా  నెట్టింట  విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తన మరణం గురించి వస్తున్న పుకార్లకు సమాధానమిచ్చేలా నెతన్యాహూ పేరిట విడుదలైన వీడియోలు ఏఐ  సృష్టి నెటిజన్లు వాదిస్తున్నారు. వీటిని తోసిపుచ్చుతూ  విడుదలైన  కాఫీ షాప్‌ వీడియో కూడా ఫేక్‌ అని గ్రోక్‌ తేల్చి చెప్పింది. 

ఇదీ  చదవండి: మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్‌ ట్విస్ట్‌!

దీంతో  మరోసారి నెతన్యాహూ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెతన్యాహు, 'మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, కలిసి గెలవడం' అని క్యాప్షన్‌తో సోమవారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆయన పౌరులతో సంభాషిస్తున్నట్లు కనిపించారు.


నెటిజన్ల విమర్శలు
ఈ వీడియోలో నెతన్యాహు కదలికలు సహజంగా లేవని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ద్వారా సృష్టించబడిన  వీడియో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరోవైపు  ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత ఇవ్వడానికి బదులు, ఇలాంటి వీడియోలు విడుదల చేయడం పట్ల చాలా మంది పెదవి విరిచారు.
 ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో

Advertisement
 
Advertisement
Advertisement