సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇక, నేడు(మంగళవారం) కూడా పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలో సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెం.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 3 సెం.మీల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిశాయి.
Today's FORECAST - March 17, 2026 ⚠️⛈️
Today, scattered INTENSE THUNDERSTORMS along with HAILSTORMS ahead in Vikarabad, Sangareddy, Rangareddy, Kamareddy, Bhadradri - Kothagudem, Mulugu, Mahabubabad, Yadadri - Bhongir, Jangaon, Medak, Siddipet during afternoon to night
Isolated…— Telangana Weatherman (@balaji25_t) March 17, 2026
కాగా, మంగళ, బుధవారాల్లో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈదురు గాలులు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటలకు, తోటలకు నష్టం వాటిళ్లే ప్రమాదముందని అధికారులు సూచిస్తున్నారు. నేడు ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో పిడుగులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రాత్రి సమయంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి.
Sangareddy District
Heavy Hailstorm Rain pic.twitter.com/OqnO9TmSuy— Ts Troller (@Ts_Troller) March 16, 2026


