10 సీట్లు, మూడు పార్టీలు : విజయ్‌ మ్యాజిక్‌ ఫిగర్‌, ట్విస్టులే ట్విస్టులు! | Tamil Nadu TVK Vijay to reach magic mark with 3 parties | Sakshi
Sakshi News home page

10 సీట్లు, మూడు పార్టీలు : విజయ్‌ మ్యాజిక్‌ ఫిగర్‌, ట్విస్టులే ట్విస్టులు!

May 7 2026 5:03 PM | Updated on May 7 2026 5:13 PM

Tamil Nadu TVK Vijay to reach magic mark  with 3 parties

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. క్షణం క్షణానికి  ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు 10 సీట్ల దూరంలో  ఉన్న టీవీకే అధినేత విజయ్‌ సీఎం పీఠం అధిరోహించాలంటే  నెంబర్‌ గేమ్‌ తప్పనిసరిగా మారింది. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్‌ అర్లేకర్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే  కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించినప్పటికీ,  మ్యాజిక్‌ ఫిగర్‌ పూర్తికాని  నేపథ్యంలో ఆ మూడు  పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకు దానికవసనమైన 'మ్యాజిక్ ఫిగర్' చేరుకోవడానికి మద్దతు కీలకం అనడంలో సందేహం లేదు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీలకు  విజయ్‌ లేఖ రాశారు కూడా. విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, విజయ్ సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.

విజయ్‌కు మద్దతిచ్చే అవకాశమున్న 3 కీలక పార్టీలు:
విడుతలై చిరుతైగల్ కట్చి (VCK): డిఎంకె (DMK) కూటమిలో ఉన్న VCK కి 2 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేత తొల్ తిరుమావళవన్ ఇప్పటికే గవర్నర్‌ను కలిసి, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ పంపిన మద్దతు లేఖపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

సీపీఐ (CPI): ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ, టీవీకే (TVK) కి మద్దతు ఇచ్చే విషయంపై వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పేర్కొన్నారు.

సీపీఐ(ఎం): ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే ఈ పార్టీకి అధికారికంగా లేఖ రాశారు. శుక్రవారం జరగబోయే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు గతంలో డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), ఇప్పుడు విజయ్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించడం టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. డీఎంకే  అధినేత స్టాలిన్‌ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా  ఎన్నికలైన విజయ్‌ను తాము అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ VCK, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము వారిని అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌

మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలు 

  • టీవీకే :  108

  • డీఎంకే :  59, ఏఐడీఎంకే : 47

  • కాంగ్రెస్: 5

  • సీపీఐ(ఎం), సీపీఐ,  బీసీకే :   తలా 2 స్థానాలు

  • బీజేపీ-1, DMDK: 1 అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం: 1
     

ట్విస్ట్‌ ఏంటంటే..
ప్రస్తుత ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నడుమ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి, తమ పార్టీ అధినేత తోల్ తిరుమావలవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని VCK ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్, ప్రధాన ద్రవిడ పార్టీలైన DM, AIADMKలకు విజ్ఞప్తి చేయడం మరో ట్విస్ట్‌. దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ క్షణం, ఏం జరుగుతుంది అనేది  జస్ట్‌  వెయిట్‌ అండ్‌ వాచ్‌ అంతే.

ఇదీ చదవండి: సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!

Advertisement
 
Advertisement
Advertisement