breaking news
devagudi
-
వాస్తవ ఘటనలతో...
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌కి శ్రీకాంత్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘2013లో రామకృష్ణా రెడ్డిగారు నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా? అనేవాడిని. ఆ తర్వాత ఆయన డైరెక్టర్‌గా మారారు.ఆయన దర్శకత్వంలో వాస్తవ ఘటనలతో రూపొందిన ‘దేవగుడి’ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు. బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో నిర్మించిన ‘దేవగుడి’తో హిట్ కొట్టబోతున్నాం. స్క్రీన్ ప్లే ఆశ్చర్యపరుస్తుంది. రఘు కుంచెగారు చక్కనిపాత్ర చేశారు’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని సక్సెస్ చేయాలి’’ అని అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచె, కెమెరామేన్ లక్ష్మీకాంత్ కనికే మాట్లాడారు. -
‘దేవగుడి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దేవగుడి విజయం సాధించాలి: మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి
‘‘దేవగుడి’ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ బాగున్నాయి. ఈ చిత్రంలోని డైలాగులు మా కడప మాండలికంలో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించి, దర్శక–నిర్మాత రామకృష్ణారెడ్డిగారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు తీసుకు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి చెప్పారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధానపాత్రలుపోషించిన చిత్రం ‘దేవగుడి’.బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆదివారం నిర్వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు వినోదం కోసమే కాదు... ప్రేక్షకులకు మంచి సందేశాన్నిచ్చేలా ఉండాలి’’ అన్నారు. ‘‘నవంబరులో విడుదల కానున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి కోరారు. సంగీత దర్శకుడు షేక్ మదీన్, కెమెరామేన్ లక్ష్మీకాంత్, నటుడు నాగేశ్వరరావుపాల్గొన్నారు. -
దేవగుడిలో 90 శాతం రీపోలింగ్
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: నియోజకవర్గంలోని దేవగుడిలో జరిగిన రీపోలింగ్‌లో 90శాతం ఓటింగ్‌నమోదైంది. ఈనెల 7వతేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని స్థానిక అధికారులు తెలిపినా దేవగుడి గ్రామంలోని 80,81,82 పోలింగ్‌కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం దేవగుడిలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించారు. మూడు పోలింగ్‌కేంద్రాల్లో 2982 మంది ఓటర్లు ఉండగా 2682 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గతంలో దాదాపు 93శాతం వరకు పోలింగ్జరిగింది. భారీ బందోబస్తు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సొంత గ్రామమైన దేవగుడిలో రీపోలింగ్ జరుగుతుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆశోక్‌కుమార్ ఉదయంనుంచి సాయంత్రం వరకు మకాం వేసి పోలింగ్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఐఏఎస్ కేడర్‌కు చెందిన సెంట్రల్, రాష్ర్ట పరిశీలకులు ఆర్కే మిశ్రా, హరీంద్ర వీర్‌సింగ్, ఆర్ఓ రఘునాథరెడ్డి కూడా పోలింగ్‌ను పర్యవేక్షించారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు 200 మందిపోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ఆవినాష్రెడ్డి ఆదేవిధంగా టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి పోలింగ్ సరళిని పరశీలించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన గ్రామంలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకున్నా రీపోలింగ్ నిర్వహించినందుకు నిరసనగా ఓటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. గ్రామంలో చిచ్చుపెట్టడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారని ఈ సందర్భంగా ఓటర్లు పేర్కొన్నారు.


