
∙ఆది నారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్ రెడ్డి, బెల్లం రామకృష్ణారెడ్డి, అభినవ శౌర్య, అనుశ్రీ
‘‘దేవగుడి’ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ బాగున్నాయి. ఈ చిత్రంలోని డైలాగులు మా కడప మాండలికంలో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించి, దర్శక–నిర్మాత రామకృష్ణారెడ్డిగారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు తీసుకు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి చెప్పారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధానపాత్రలుపోషించిన చిత్రం ‘దేవగుడి’.
బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆదివారం నిర్వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు వినోదం కోసమే కాదు... ప్రేక్షకులకు మంచి సందేశాన్నిచ్చేలా ఉండాలి’’ అన్నారు. ‘‘నవంబరులో విడుదల కానున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి కోరారు. సంగీత దర్శకుడు షేక్ మదీన్, కెమెరామేన్ లక్ష్మీకాంత్, నటుడు నాగేశ్వరరావుపాల్గొన్నారు.