అక్టోబరులో ఆరంభం | Venkatesh and directed by Trivikram Srinivas is regular shooting begin in October | Sakshi
Sakshi News home page

అక్టోబరులో ఆరంభం

Sep 22 2025 12:25 AM | Updated on Sep 22 2025 12:25 AM

Venkatesh and directed by Trivikram Srinivas is regular shooting begin in October

వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను అక్టోబరు మొదటివారంలో ప్రారంభించనున్నారని తెలిసింది. తొలి షెడ్యూల్‌లోనే వెంకటేశ్‌తోపాటు ఈ చిత్రం ప్రధాన తారాగణంపాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్  చేశారట త్రివిక్రమ్‌. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు ‘ఆనంద నిలయం, వెంకట రమణ: కేరాఫ్‌ ఆనంద నిలయం’ అనే టైటిల్స్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని, వైజాగ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్‌ కథ, సంభాషణలు అందించారు. ఈ రెండు సినిమాలూ విజయాలు సాధించాయి. దీంతో వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొంద నున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement