‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా (ఇంగ్లిష్, కన్నడ) చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అనేది ట్యాగ్‌లైన్స్ . యశ్‌తో కలిసి ఈ సినిమా కథ రాసి, దర్శకత్వం వహిస్తున్నారు గీతూ మోహన్స్ దాస్. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆమె నాడియాపాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కొన్నిపాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు.. సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి.
నాడియాపాత్రలో కియారా అద్వానీ సరికొత్తగా ట్రాన్స్ సఫార్మ్ అయ్యారు. ఆమె నటన చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కోసం ఆమె సపోర్ట్ చేస్తున్న తీరుకి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు గీతూ మోహన్స్ దాస్. వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంది. ఇంగ్లిష్, కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా మరికొన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.


