breaking news
Yash
-
ట్రెండ్ మారింది..‘టాక్సిక్’కు టికెట్ రేట్లు పెంచుతారా?
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు దగ్గరవడంతో ఇటీవల వచ్చిన పలు సినిమాల టికెట్ రేట్లను పెంచకుండా రిలీజ్ చేయడం ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడం వంటి అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల టికెట్ రేట్లు పెంచకుండా విడుదలైన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, ‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘లెనిన్’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో టికెట్ రేట్లు పెంచకపోవడం వల్లే థియేటర్లకు ఫుట్‌ఫాల్ పెరుగుతోందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక జీవో ఇంకా రాలేదు కానీ, పెంపు దాదాపు ఖరారైందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.ఉదయం 6 గంటల ఎర్లీ మార్నింగ్ షోకు రూ.500–600 వరకు, రెగ్యులర్ షోలకు టికెట్‌పై రూ.50 వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. ఇటీవల వచ్చిన సినిమాల అందుబాటు ధరలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ‘టాక్సిక్’కు ఇంత భారీ రేట్లు పెడితే ఏపీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అప్పటికి టికెట్ ధరలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయిన విషయం తెలిసిందే. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రావణుడి పాత్ర అందుకే చేస్తున్నా: యశ్
‘‘శ్రీరాముడి గొప్పతనం, మంచితనం చె΄్పాలంటే రావణుడి పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి. అందుకే ‘రామాయణ’ సినిమాలో రావణుడి పాత్రకు నేను అయితేనే న్యాయం చేయగలననే నమ్మకం కూడా కలిగింది. అందుకే రావణుడి పాత్రని నేను చేస్తున్నాను’’ అని యశ్ తెలిపారు. ఆయన హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ , కేవీఎన్ ప్రోడక్షన్స్ పై నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆప్ కీ అదాలత్’ అనే టాక్ షోలో పాల్గొన్నారు యశ్.ఈ సందర్భంగా హోస్ట్ రజత్ శర్మ నుంచి ఆయనకి ఓ ప్రశ్న ఎదురైంది. ‘రామాయణ’ సినిమాకు మీరు సహ నిర్మాతగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు రాముడి పాత్ర కాకుండా రావణుడి పాత్రను ఎందుకు ఎంపిక చేసుకున్నారు?’ అన్నారు. ఇందుకు యశ్ బదులిస్తూ–‘‘మంచి పాత్రలు చేసేందుకు నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ‘రామాయణ’ ప్రాజెక్ట్‌ను ఏ నటుడి స్టార్డమ్ కోసమో చేయట్లేదు.ఆహం పక్కన పెట్టేసి యూనిట్ అంతా కష్టపడి పని చేస్తున్నాం’’ అన్నారు. అదేవిధంగా పాన్ ఇండియా స్టార్డమ్ గురించి ఎదురైన మరో ప్రశ్నకు యశ్ స్పందిస్తూ–‘‘స్టార్డమ్ అన్నది ఎవరికీ శాశ్వతం కాదు. ఇండస్ట్రీలో పరిస్థితులు, తలరాతలు మారి΄ోవడానికి ఒక్క శుక్రవారం చాలు. ప్రేక్షకులు ఇచ్చే తీర్పే హీరో స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది’’ అని తెలిపారు. -
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్ (KGF) స్టార్, యష్ (Yash)కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట సందడిగా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత యష్‌పై క్రేజ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సౌత్ సూపర్ స్టార్ యష్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే. ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతారని మీకు తెలుసా?అవును ఈ కన్నడ హీరో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యేది కేవలం ఒకే ఒక్కరిని. ఇటీవల ఒకటీవీ షోలో యష్ తన రాబోయే చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా పంచుకున్నారు. ఆ సమయంలో, ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఒక అమ్మాయి యష్‌ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?” అన్న ప్రశ్నకు యశ్ ఇచ్చిన సమాధానం అతని లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.దీనికి సమాధానంగాయష్ నవ్వుతూ, “ఆమె నా భార్య” ఎంతో ప్రేమగా బదులిచ్చారు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. "ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు" అని సరదాగా వ్యాఖ్యానించారు. "నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం." అంటూ చెప్పారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంరెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణునిగా, యశ్ రావణునిగా కనిపించనున్నారు. ఇక సన్నీ డియోల్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. 'రామాయణం మొదటి భాగం' విదేశాలలో నవంబర్ 6, 2026న, భారతదేశంలో నవంబర్ 8, 2026న విడుదల కానుంది. 'రామాయణం: రెండవ భాగం' 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. 'రామాయణం'తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. యష్‌తో పాటు, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార మరియు రుక్మిణి వంటి కథానాయికలు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చివరకు, ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరికకాగా యష్ రాధికా పండిట్ 2007లో 'నంద గోకుల' అనే కన్నడ సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి, 2016 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Coreculture (@coreculture.inn) -
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్‌పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి)'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు.ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్) -
అవసరమైతే కండోమ్ యాడ్ కూడా చేస్తా : యష్
కన్నడ స్టార్ హీరో యష్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కనిపించిన బోల్డ్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఈ పాటను ఏకంగా కండోమ్ ప్రకటనతో పోల్చుతూ ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై యష్ స్పందించారు.ఓ టీవీ షోలో పాల్గొన్న యష్‌కు ‘తబాహీ’ పాటపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ‘అవసరమైతే కండోమ్ ప్రకటన కూడా చేస్తాను. కానీ అందుకు డబ్బులు తీసుకుని చేస్తాను. అలా ఉచితంగా చేయను’ అని యష్ వ్యాఖ్యానించారు. ఆయన సమాధానంతో కార్యక్రమంలో ఉన్న ప్రేక్షకులంతా గట్టిగా నవ్వారు. విమర్శలను సీరియస్‌గా తీసుకోకుండా హాస్యభరితంగా స్పందించడం ద్వారా యష్ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు.ఇక టాక్సిక్ చిత్రంలోని బోల్డ్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సాధారణంగా అందరికీ ఉద్దేశించిన కథ కాదని, పెద్దలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫెయిరీ టేల్ అని ఆయన స్పష్టం చేశారు. ‘పిల్లలు ఇంట్లో ఉండాలి. ఈ చిత్రాన్ని చూడకూడదు’ అని ఆయన అన్నారు. దీంతో సినిమాలోని కంటెంట్ ఏ వర్గం ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే దానిపై మరింత స్పష్టత వచ్చింది.గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
'టాక్సిక్‌లో బోల్డ్ కంటెంట్'.. స్పందించిన హీరో యశ్
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే హీరో యశ్ స్పందించారు. టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన యశ్.. బోల్డ్ కంటెంట్ విమర్శలపై మాట్లాడారు. అసభ్యత తప్పేనని.. కానీ నేను ఇందులో కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. దానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. అది మాకు తెలుసని స్పష్టం చేశారు. ఇక్కడ సినిమా అంటే దృశ్యపరంగా ఆకట్టుకునేలా కనిపించాలని.. అదే ఒక క్రియేటర్ గొప్పతనం అని అన్నారు.ప్రస్తుతం మీ సినిమాలపై జెన్ జీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని యశ్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ప్రతి పాత తరం వారు యువతరం తప్పు చేస్తోందని భావిస్తుంటారని తెలిపారు. తన చిత్రంలోని బోల్డ్ సీన్స్‌పై వస్తున్న విమర్శలకు యశ్ సమాధానమిచ్చారు. -
'అభిమాని అంత్యక్రియలు.. నేనలా చేయడం కరెక్ట్ కాదు'
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా అనిపించింది. ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.టాక్సిక్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే తన అభిమాని అంత్యక్రియలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అతని మరణం నన్ను బాధించిందని.. కానీ నేను వెళ్తే మిగతా అభిమానులు కూడా అదే పని చేస్తారని యశ్ తెలిపారు.కాగా.. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ అభిమాని రామకృష్ణ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన అంత్యక్రియలకు యశ్, రాజకీయ నాయకుడు సిద్దరామయ్య హాజరు కావాలని కోరుతూ ఒక లేఖను రాశాడు. ఇది చూసి సిద్దరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ యశ్ హాజరు కాలేదు. తాజాగా తాను అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే.. మిగతా ఫ్యాన్స్ కూడా అలానే చేస్తారని.. ఆ ఆలోచనా విధానమే తప్పని యశ్ స్పష్టం చేశారు. -
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
నేడు తెరపై కనిపిస్తున్న కొంతమంది స్టార్ హీరోల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటే.. మరికొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. అయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలను వదులుకోకుండా ముందుకు సాగిన వారిలో కన్నడ స్టార్ యశ్ ఒకరు. రోజుకు రూ.50 కూలీతో టీలు అందించిన ఈ స్టార్ ఇప్పుడు రూ.4,000 కోట్ల భారీ సినిమా ప్రాజెక్టులకు స్టార్‌గా నిలిచాడు.బస్సు డ్రైవర్ కుమారుడిగా..హసన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నవీన్‌కుమార్ గౌడగా జన్మించిన యశ్.. ప్రభుత్వ బస్సు డ్రైవర్ అరుణ్‌కుమార్, గృహిణి పుష్ప దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ కుమారుడు జీవితంలో ఎదుగుతాడనే నమ్మకాన్ని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కోల్పోలేదు.తొలి ప్రయత్నం విఫలం..చిన్నప్పటి నుంచే యశ్‌కు సినిమాలంటే ఎంతో ఇష్టం. దీంతో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత తన కలను నెరవేర్చుకోవడానికి బెంగళూరుకు వెళ్లాడు. సహాయ దర్శకుడిగా మారాలన్న ఆయన తొలి ప్రయత్నం అందని ద్రాక్షగానే మిగిలింది. అయినా నిరాశ చెందకుండా బీవీ కారంత్కు చెందిన బెనక నాటక బృందంలో రోజుకు రూ.50 వేతనంతో పనిచేశాడు. కళాకారులకు టీలు అందించడం, వేదికలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూనే నటనపై దృష్టి పెట్టాడు.బుల్లితెరతో గుర్తింపు..2004లో నాటక రంగంలో తొలి ప్రధాన పాత్రను దక్కించుకున్న యశ్.. అదే ఏడాది బుల్లితెరపై కూడా అడుగుపెట్టాడు. అనంతరం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2007లో 'జంబాడ హుడుగి' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన యశ్.. 'మొగ్గిన మనసు' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 'మోడలసాల', 'కిరాతక', 'లక్కీ', 'జాను' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. 2012 నుంచి 2014 వరకు వచ్చిన 'డ్రామా', 'గూగ్లీ', 'రాజా హులి', 'గజకేసరి', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' చిత్రాలు ఆయనను కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా నిలబెట్టాయి.తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు..అయితే, యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు.నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ 'టాక్సిక్', 'రామాయణ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ రెండు చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుగా నిలిచాయి. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ', రూ.500 కోట్ల వ్యయంతో రూపొందుతున్న 'టాక్సిక్' చిత్రాల్లో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రోజుకు రూ.50 కూలీతో ప్రారంభమైన యశ్ ప్రయాణం.. నేడు వేల కోట్ల ప్రాజెక్టులకు నాయకత్వం వహించే స్థాయికి చేరడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. -
మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)
-
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ చాలా ఎక్కువే?
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. మోస్ట్ వయొలెన్స్ అండ్ బోల్డ్‌గా అనిపించింది. అంతకుముందు బోల్డ్ సాంగ్‌పై విమర్శలు రాగా.. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మరిన్ని విమర్శలొచ్చాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి రన్ టైమ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 3 గంటల 14 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. మూడు గంటలకు పైగా లాంగ్ రన్ టైమ్ కావడంపై ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. -
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం: టాక్సిక్‌పై ప్రముఖ నటి ఆగ్రహం
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్లో ఎక్కువగా వయొలెన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని కియారాతో బోల్డ్ సాంగ్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే కన్నడ నటి రిషికా సింగ్ టాక్సిక్ చిత్రంపై విమర్శలు గుప్పించింది. ఈ ట్రైలర్‌లోని బోల్డ్ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని తెలిపింది. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలను గౌరవించకపోతే అతడిని కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తామంటూ మాట్లాడింది. అంతేకాకుండా నేను టాక్సిక్ అంటూ కామెంట్స్ చేసింది.దీంతో రిషికా వ్యాఖ్యలపై నెట్టింట్ యశ్ అభిమానులు మండిపడుతున్నారు. 'టాక్సిక్'లోని బోల్డ్ సన్నివేశాలపై ఆమె చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషీకా గతంలో నటించిన చిత్రాలు, ఫోటోషూట్లకు సంబంధించిన క్లిప్‌లు కొందరు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. అసలు రిషికా సింగ్ ఎవరు?కన్నడ భామ రిషికా సింగ్ 'కల్ల మల్ల సుల్లా', 'బెంకి బిరుగలి', 'కంతిరవ', 'తుంటరు' లాంటి చిత్రాలతో ఫేమస్ అయింది. ఆమె చిత్రనిర్మాత రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె కావడం విశేషం. అంతేకాకుండా బిగ్ బాస్ కన్నడ మొదటి సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. -
ఎప్పటికీ నువ్వే నా ఫేవరేట్: యశ్ సతీమణి వీడియో వైరల్
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మోస్ట్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా కనిపించింది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ సంగతి పక్కనపెడితే తాజాగా యశ్..సతీమణి ఆసక్తికర పోస్ట్ చేసింది. యశ్‌తో ఎంగేజ్మెంట్ అయిన రోజును గుర్తు చేసుకుంది. ఇప్పటికీ పదేళ్లు పూర్తయింది.. జీవితకాలపు ప్రేమ.. మనకిష్టమైన కథ, ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఎప్పటికీ నువ్వే నా ఫేవరేట్ అంటూ ఆయన రాధికా పండిట్ ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ అంతేనా?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 26న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మరింత బోల్డ్ అండ్ వయొలెంట్‌గా చూపించారు. ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమేనని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రన్‌టైమ్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ రన్‌టైమ్ దాదాపు 3 గంటల 11 నిమిషాలని ప్రచారం జరుగుతోంది. ఈ రన్‌టైమ్ చూస్తుంటే కాస్తా తక్కువగానే ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో అధికంగా వయొలెన్స్, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించాయి. అందువల్లే గీతూ మోహన్ దాస్ ఇదే నిడివితో సెన్సార్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను ప్రైమ్ బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఐమాక్స్‌లో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫార్మాట్లో రిలీజవుతోన్న రెండో కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. -
యశ్ టాక్సిక్.. పారితోషికం ఎవరికి ఎన్ని కోట్లంటే?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ బోల్డ్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలుసార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా ఉంది. ఈ ట్రైలర్‌తో టాక్సిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ తర్వాత టాక్సిక్ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు యశ్, కియారా, నయనతార ఎంత తీసుకున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి కాస్తా గట్టిగానే ఛార్జ్ చేశారని తెలుస్తోంది.ఈ సినిమాకు కేజీఎఫ్ స్టార్ యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని శాండల్‌వుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ కియారాకు కూడా భారీగానే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆమెకు ఏకంగా రూ.15 కోట్లు చెల్లించనున్నారని సమాచారం. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12 నుంచి 18 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నట్లు తెలుస్తోంది.అలాగే కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ సైతం భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఛార్జ్ చేయనుందని టాక్. అలాగే బాలీవుడ్ భామలు హ్యుమా ఖురేషీ, తారా సుతారియా రూ.2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన కేవలం హీరో, హీరోయిన్లకే దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని అర్థమవుతోంది. ఇంత భారీ ఎత్తున నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే. -
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యశ్ టాక్సిక్.. ఆ రూల్‌కు నయనతార బ్రేక్
కన్నడ హీరో యశ్ నటిస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ చూస్తుంటే వయొలెన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్‌ను తలపిస్తోంది.అయితే ఈ మూవీ సంగతి పక్కనపెడితే.. నయనతార చేసిన పనికి సినీ ప్రియులు షాకవుతున్నారు. గతంలో ఏ మూవీకి కూడా ప్రమోషన్స్ చేయడం నాకు ఇష్టముండదని ప్రకటించింది. అందుకే తాను ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటానని తెలిపింది. అలా చెప్పిన నయన్.. మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కావడం అభిమానులను, నెటిజన్లను షాకింగ్‌కు గురి చేస్తోంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు నయనతార రావడంపై సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. తాను టాక్సిక్ ఈవెంట్‌కు హాజరు కావడంపై కోలీవుడ్ భామ క్లారిటీ ఇచ్చింది.నయనతార మాట్లాడుతూ.. 'సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం నాకు ఇష్టం లేదని కాదు. నాకు వాటిలో అంతగా నైపుణ్యం లేదు. అందుకే నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ చాలా కొన్ని కారణాల వల్ల ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే యశ్ కారణం. అతను కేవలం ఒక ఫోన్ కాల్ చేశాడు. నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దీనికి చాలా కారణాలున్నాయి.' అని అన్నారు. కాగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. #Nayanthara’s speech at #Toxic trailer launch!.. pic.twitter.com/utsRVrK9Ku— Gv (@gowtham0725) August 8, 2026 -
‘టాక్సిక్’లో కియారా విధ్వంసం.. యశ్ స్పందన ఇదే!
కియారా అద్వానీకి టాక్సిక్ సినిమా కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందా..? అంటే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో యశ్, నయనతార చేసిన వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది. సినిమాలో కియారా నటన, ఆమె అంకితభావంపై వీరిద్దరూ ప్రశంసలు కురిపించారు. వేదికపై కియారాను ఉద్దేశించి యాశ్ మాట్లాడుతూ..‘ ఈ సినిమాలో నీ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డావు. నీ అంకితభావాన్ని నేను దగ్గర నుంచి చూశాను. ఈ సినిమాలో నువ్వు చూపించిన నటన భవిష్యత్తు కంటే ముందుంది. ఇప్పుడు చాలా మంది ఎదో మాట్లాడొచ్చు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లే ప్రశంసలు కురిపిస్తారు’ అన్నారు. నయనతార సైతం కియారా కోసం ఆకాశానికెత్తేశారు. ‘ ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. టాక్సిక్‌కు ముందు కియారా.. తరువాత కియారా అనేలా నీ కెరీర్ మారిపోతుంది. ఈ సినిమాలో నువ్వు అద్భుతంగా నటించావు’ అని ప్రశంసించారు. కాగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మొన్న ప్యారడైజ్.. నిన్న టాక్సిక్.. ఏం సందేశం ఇస్తున్నారు?
యశ్ హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కేవలం పెద్దల కోసం మాత్రమేనని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయిఅయితే తాజాగా టాక్సిక్ మూవీలో కియారా రోల్‌పై మొదటి నుంచి విమర్శలొస్తున్నాయి. ఆమె తల్లి అయిన కొద్ది నెలల్లోనే ఇలాంటి బోల్డ్ రోల్ చేయడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. టాక్సిక్ బోల్డ్ సాంగ్ రిలీజ్ తర్వాత ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ కూడా లేడీ కావడంతో టాక్సిక్‌పై మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ వయొలెన్స్, బోల్డ్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్.. హీరోయిన్ కియారాపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక ప్రళయం అంటూ కొనియాడారు. ముఖ్యంగా ట్రోలింగ్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు యశ్. నువ్వు ఈ సినిమాలో చాలా గొప్ప పాత్ర పోషించావని కొనియాడారు. నయనతార సైతం కియారాపై ప్రశంసలు కురిపించింది.అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం వయొలెన్స్, బోల్డ్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మూవీ తీస్తే కథలో కొంతైనా సందేశాత్మకంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎక్కువగా తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టాక్సిక్ మాత్రమే కాదు.. ఇటీవలే రిలీజైన ది ప్యారడైజ్ టీజర్లో కూడా కేవలం హింసనే చూపించారు. రక్తపాతాన్ని తలపించేలా టీజర్ విడుదల చేశారు. ఇదంతా చూస్తుంటే డైరెక్టర్స్ సృజనాత్మకత పక్కనపెట్టి.. కేవలం హింస, బోల్డ్నే నమ్ముకున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా అంటే సమాజానికి ఓ సందేశం ఇచ్చేలా ఉండాలి కానీ.. కేవలం డబ్బుల కోసం ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఓ సారి ప్రశ్నించుకోవాలి. సినిమాను సినిమాగానే చూడాలి అని అంటారు.. కరెక్టే కానీ.. దానికి కూడా లిమిట్స్ ఉంటాయని గ్రహించాలని నెటిజన్స్ కోరుతున్నారు. -
యష్ 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్
యశ్ హీరోగా నటించిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్’. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘టాక్సిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కన్నడ స్టార్శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. యశ్ నాకు బ్రదర్‌లాంటివాడు. తను ప్రతి సినిమాతో ఎదుగుతుండటం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నాకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. దాని కోసం చాలా సమయం అవసరమైంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఎంతోమంది ప్రతిభావంతులు ప్యాషన్‌తో హార్డ్ వర్క్ చేశారు. (ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)గీతూ మోహన్‌దాస్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. నిర్మాత వెంకట్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. అలాగే నా భార్య రాధిక స పోర్ట్ లేక పోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పని చేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా గుర్తుండి పోతుంది’’ అన్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని నమ్మి కేవీఎన్గారు అన్నీ సమకూర్చడంవల్లే ఈ సినిమా సాధ్యమైంది. యశ్ వండర్ఫుల్ యాక్టర్, బ్రిలియంట్ ప్రోడ్యూసర్, అద్భుతమైన కో రైటర్. మా ప్రోడక్షన్ టీమ్‌కి, డైరెక్షన్ టీమ్‌కి, నటీనటులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వాళ్లందరి హార్డ్ వర్క్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది’’ అని చెప్పారు.‘‘దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వెంకట్ కె. నారాయణ. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించే అడుగుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని హ్యూమా ఖురేషి అన్నారు. ‘‘నా కెరీర్లో ‘బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్’ అని తప్పకుండా అంటారు. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ’’ అని కియారా అద్వానీ తెలిపారు. ‘‘మంచి క్యారెక్టర్ ఇచ్చి, నన్ను ప్రోత్సహించిన గీతూగారికి థాంక్యూ. ఈ సినిమా నాకో గొప్ప అనుభవం’’ అని రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. ‘‘గతంలో గీతూతో కలిసి ఒక సినిమా చేశాను. కానీ ‘టాక్సిక్’ చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా వేరుగా కనిపించారు. ఈ సినిమా కథను ఆమె మైండ్ బ్లోయింగ్‌గా చెప్పారు’’ అని నయనతార చెప్పారు.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ) -
100 కోట్ల వ్యూస్.. భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనత
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ: పార్ట్-1' ట్రైలర్ అన్ని భాషలు, డిజిటల్ వేదికలు కలిపి 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించి భారతీయ సినీ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ట్రైలర్ ఈ ఘనత సాధించలేదు. హిందీ ట్రైలర్ ఒక్కటే 'వరల్డ్ ఆఫ్ రామాయణ' ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 588 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర వేదికల్లో కూడా భారీ స్పందన లభించింది.ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాన్స్ జిమ్మర్–ఏ.ఆర్. రెహమాన్ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రబృందం ఇంగ్లిష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏఐ ఆధారిత సరికొత్త లిప్-సింక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వెర్షన్‌ను రూపొందించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ విడుదల చేయనుండటం విశేషం. -
టాక్సిక్‌లో బోల్డ్ రోల్.. అందుకే ఒప్పుకున్నా: కియారా
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్.. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యశ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. మరీ బోల్డ్‌గా సీన్స్ ఉన్నాయంటూ పలువురు విమర్శించారు.తమ సినిమాపై విమర్శల వస్తోన్న నేపథ్యంలో తన రోల్‌పై హీరోయిన్ కియారా అద్వానీ స్పందించింది. తన పాత్రకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కథ వినగానే ఆ పాత్రకు కనెక్ట్ అయ్యానని తెలిపింది. మహిళలను కేవలం మూసధోరణి పాత్రలే కాకుండా బలంగా, మరింత సహజంగా ఉండాలని పేర్కొంది. అలాంటి అవకాశం ఈ పాత్రలో ఉన్నందుకే వెంటనే ఓకే చెప్పానని కియారా వెల్లడించింది.ఇలాంటి పాత్ర చేయడం ప్రతి నటికీ ఓ కల అని అన్నారు. నా కెరీర్లో ఇలాంటి క్లిష్టమైన పాత్రను పోషించగలననే ధైర్యం కలిగిందని తెలిపారు. నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లతో కలిసి పనిచేయడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇంతమంది ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు నచ్చుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాపై నాకు ఇష్టం కలగడానికి ఇలాంటి క్షణాలే కారణమని వెల్లడించారు. -
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్
-
చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన సినిమా 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే దీనిని ఈ రోజు(జూలై 24) యూట్యూబ్‌లో విడుదల చేస్తామని కొన్నిరోజుల ముందే ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఇప్పుడు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అందుకు గల కారణాన్ని కూడా నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ)నా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేయనున్నాం. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో 'రామాయణ' ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది.ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని నమిత్ మల్హోత్రా ఓ నోట్ రిలీజ్ చేశారు.ఇప్పటివరకు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చే క్రమంలోనే వాయిదాల మీద వాయిదాలు పడటం చూస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్స్‌ని కూడా వాయిదా వేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరగడం బదులు నెగిటివిటీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన 'రామాయణ' గ్లింప్స్‌కి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. ట్రైలర్ అయినా బాగుంటే పర్లేదు లేదంటే మాత్రం మూవీ హైప్‌పై ఇది ప్రభావం చూపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
అమ్మ బాటలో...
సాక్షి క్రీడా విభాగం : దాదాపు మూడు దశాబ్దాల క్రితం భారత మహిళల హాకీ జట్టు... నెదర్లాండ్స్ వేదికగా ప్రపంచకప్ బరిలోకి దిగింది. ఆ టోర్నమెంట్లో భారత జట్టు 12వ స్థానంతో సరిపెట్టుకోగా... జట్టుకు సారథిగా వ్యవహరించిన ప్రీతమ్ రాణి సివాచ్ దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసింది. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత అదే నెదర్లాండ్స్ వేదికగా... పురుషుల హాకీ ప్రపంచకప్ జరగనుండగా... ప్రీతమ్ సివాచ్ కుమారుడు యశ్దీప్ సివాచ్ భారత జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో హాకీ ప్రపంచకప్‌లో ఆడిన తొలి భారత తల్లీకుమారులుగా ప్రీతమ్, యశ్దీప్ రికార్డుల్లోకెక్కనున్నారు. ఆగస్టు 14 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం 20 మందితో కూడిన భారత జట్టును ఇటీవల ప్రకటించగా... అందులో 25 ఏళ్ల డిఫెండర్ యశ్దీప్ సివాచ్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘ఇది నాకెంతో ప్రత్యేకమైంది. వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కిన వెంటనే ఈ విషయం మొదట అమ్మకు చెప్పా. ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే 1998లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఆమె భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది అక్కడే నేను వరల్డ్‌కప్ ఆడనుండటం చాలా ప్రత్యేకమైన విషయం’ అని అన్నాడు. తన కాలంలో భారత మహిళల జట్టు అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతమ్... 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో చారిత్రాత్మక స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. ఇంటి నిండా ఫొటోలే... యశ్దీప్ పుట్టక ముందే ప్రీతమ్ ప్రపంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రీతమ్... తన కెరీర్‌కు సంబంధించిన విశేషమైన సందర్భాల ఫొటోలను ఇంటి నిండా అతికించారు. చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగిన యశ్దీప్ ఇప్పుడు అత్యున్నత స్థాయిలో బ్లూ జెర్సీలో వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ‘మా ఇంటి నిండా అమ్మా హాకీ ఆడే ఫొటోల ఆల్బమ్‌లు ఉన్నాయి. టోర్నమెంట్లలో పాల్గొన్నవి, ట్రోఫీలు అందుకున్నవి, జట్టు సభ్యులతో కలిసి దిగినవి... ఇలా లెక్కలేనన్ని ఫొటోలు ఉన్నాయి. సోదరి కనిక చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. అమ్మ సహచరులు చాలా మంది నుంచి ఎన్నో విలువైన సలహాలు పొందాను’ అని యశ్దీప్ వెల్లడించాడు. చిన్నప్పుడు స్విమ్మింగ్‌పై మక్కువ చూపిన అతడు... 2010లో న్యూ ఢిల్లీ వేదికగా జరిగిన హాకీ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసిన తర్వాత హాకీపై దృష్టి సారించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల సూచనతో మెరుగైన శిక్షణతో అంచలంచెలుగా ఎదిగిన యశ్దీప్... తన ప్రతిభతో భారత జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ నిలకడైన ప్రదర్శన కనబర్చడంతో అతడికి సీనియర్ జట్టులో చోటు దక్కింది. తల్లిదండ్రులతో.. తల్లిని మించిన తనయుడవ్వాలి! తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగనున్నప్పటికీ... ఎలాంటి బెరుకు లేకుండా ఆడాలనుకుంటున్నట్లు యశ్దీప్ వెల్లడించాడు. ఇప్పటికే ఆ్రస్టేలియాలో క్లబ్‌ల తరఫున ఆడిన అనుభవం ఉన్న యశ్దీప్... హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ సూచనలు తనకెంతో మేలు చేశాయని చెప్పాడు. ‘హెడ్ కోచ్ ఎప్పుడూ ఆటను మార్చుకోమని ఒత్తిడి చేయలేదు. నా సహజసిద్ధమైన ఆటతీరు కొనసాగించమని చెప్పారు. భువనేశ్వర్‌లో జరిగిన ప్రొ లీగ్ సందర్భంగా ప్రత్యర్థి ఎవరైనా మనకు అవసరం లేదు... మన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రభావం చూపాయి’ అని యశ్దీప్ అన్నాడు. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సీనియర్ ప్లేయర్లు అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్ తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పాడు. చిన్నప్పటి నుంచి వారి ఆట చూస్తూ పెరిగి... ఇప్పుడు వారితోనే కలిసి ప్రపంచకప్ ఆడనుండటం ఆనందంగా ఉందని ఈ డిఫెండర్ వెల్లడించాడు. 2021లో జూనియర్ ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో సభ్యుడైన యశ్దీప్... సీనియర్ స్థాయిలో పోటీ మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నన్నంతా ప్రీతమ్ రాణి సివాచ్ కుమారుడు అని గుర్తిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు యశ్దీప్ సివాచ్ తల్లి ప్రీతమ్ రాణి అనే స్థాయికి ఎదగాలనేదే నా లక్ష్యం’ అని యశ్దీప్ వివరించాడు. కుటుంబం మొత్తం ప్లేయర్లే! యశ్దీప్ సివాచ్ కుటుంబం మొత్తం హాకీ క్రీడాకారులే. అతడి తండ్రి కుల్దీప్ మంచి హాకీ ప్లేయర్. దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న కుల్దీప్ను గాయాలు వెనక్కి లాగాయి. దీంతో అతడు తన భార్య ప్రీతమ్ సివాచ్ పేరిట హరియాణాలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీలో యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో మునిగిపోయాడు. ఇక యశ్దీప్ సోదరి కనిక ఇప్పటికే భారత జూనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. నిలకడగా రాణిస్తున్న కనిక... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. ప్రీతమ్ మిడ్‌ఫీల్డర్ కాగా... కనిక ఫార్వర్డ్ ప్లేయర్. వీరిద్దరికీ భిన్నంగా తండ్రి కుల్దీప్ సూచనతో యశ్దీప్ డిఫెండర్‌గా కొనసాగుతున్నాడు. ‘మా అమ్మా, సోదరికి గోల్స్ చేయడం అంటే ఇష్టం కానీ. నాకు వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడం ఇష్టం. దాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తా. నేను చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అందుకే నాకు స్కోర్ చేయడం కన్నా దాన్ని అడ్డుకోవడం ఇష్టం. మా నాన్న మంచి డిఫెండర్... చిన్నప్పటి నుంచి నన్ను కూడా అదే దిశగా ప్రోత్సహించారు’ అని యశ్దీప్ వెల్లడించాడు. -
అఫీషియల్: యశ్ టాక్సిక్.. పెద్దలకు మాత్రమే!
కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ హీరో యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం పూర్తిగా పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ వచ్చేసింది. యశ్ టాక్సిక్‌పై ఆ నిర్మాత వెంకట్ కె. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పెద్దల కోసం రూపొందించిన సినిమా అని స్పష్టం చేశారు. యశ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సాధారణ కమర్షియల్ సినిమా కాదని నిర్మాత తెలిపారు. కథ చెప్పే విధానం, విజువల్స్, సినిమా స్థాయి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను వంద శాతం ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.“టాక్సిక్ చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. దీని స్కేల్, గ్రాండియర్, కథన శైలి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్లలో చూసిన తర్వాత మేము చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు. అయితే ఇది పూర్తిగా పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో నిండిన చిత్రం” అని నిర్మాత వెంకట్ కె. నారాయణ పేర్కొన్నారు.ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా గ్లామర్, డార్క్ టోన్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించడంతో ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతోందన్న చర్చ మొదలైంది. కొందరు అభిమానులు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్ ఉంటుందని అంచనా వేస్తుండగా.. మరికొందరు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనదైన శైలిలో కొత్త అనుభూతిని అందించబోతున్నారని భావిస్తున్నారు.తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా, మానవ సంబంధాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత యశ్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఖరారైంది. 2026 ఆగస్టు 26న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'టాక్సిక్' మరో రొమాంటిక్ సాంగ్.. గన్‌తో లవ్ ప్రపోజ్
'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. వచ్చే నెల 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ గ్యాంగస్టర్, యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు కాగా నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)ఈ సినిమా నుంచి తొలుత వచ్చిన టీజర్లో శృంగరభరిత కంటెంట్‌ని ఎంతలా చూపించారో తెలిసిందే. తర్వాత వచ్చిన 'తబాహి' అనే పాటలోనూ యష్-కియారా తమదైన శైలిలో రొమాన్స్ పండించారు. ఇప్పుడు తాజాగా 'మనసాగదే' అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో యష్-తారా సుతారియా అలానే రొమాన్స్ పండించారు. బాత్ టబ్‌లో గన్‌తో ప్రపోజ్ చేసిన సీన్ వెరైటీగా అనిపించింది.'టాక్సిక్' ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే యాక్షన్ కంటే గ్లామరస్ రొమాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా అని సందేహం కలుగుతోంది. ఇప్పటివరకు అయితే మూవీపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్‌కి ఎలానూ మరో నెల రోజులు టైముంది. ఆ లోపు ట్రైలర్ వల్ల ఏమైనా హైప్ పెరుగతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియాలోకి రాను) -
ఊహించని డైరెక్టర్‌తో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ పాన్-ఇండియన్ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. మరి బోల్డ్‌గా ఉన్నాయంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఈ సినిమా సంగతి పక్కన పెడితే యశ్ నెక్ట్స్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే యశ్ తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్న విషయంపై శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సప్త సాగరదాచే ఎల్లో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు హేమంత్ ఎం రావుతో జతకట్టనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ తన పేజీలో ప్రస్తావించింది. దీంతో ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మూవీని ఓ ఆర్మీ జవాన్.. పోలీసుగా మారిన కథాంశంగా తెరకెక్కించనున్నారని ఐఎండీబీ తన పేజీలో పేర్కొంది. ఈ సినిమాకు హేమంత్ ఎం రావుతో పాటు యశ్ రచయితగా ఉండడం మరో విశేషం. ఈ మూవీని కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతాల నిర్మించనున్నారు. అయితే ఈ విషయంపై యశ్ కానీ, హేమంత్ ఎం రావు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హేమంత్ ఎం రావు ప్రస్తుతం '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో బిజీగా ఉన్నారు. -
టాక్సిక్‌లో నయనతార.. అన్ని కోట్లు తీసుకుంటోందా?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చేనెల 26న థియేటర్లకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అది టీజర్ లాగే విమర్శలకు దారితీసింది. ఓవర్‌గా రొమాన్స్ ఉండడంతో విమర్శలొస్తున్నాయి.అయితే ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. నయన్ ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ నేపథ్యంలోనే నయనతార పారితోషికంపై నెట్టంట చర్చ మొదలైంది. అసలు టాక్సిక్ కోసం నయన్ ఎంత తీసుకుందనే దానిపై శాండల్‌వుడ్‌తో పాటు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ చిత్రంలోని తన పాత్రకు నయనతార భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో నయనతారకు ఎక్కున స్క్రీన్ టైమ్ లేకపోవడంతో మేకర్స్ ఆమె పారితోషికాన్ని తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. నిర్మాతలతో పలు దఫాల చర్చల తర్వాత నయన్ రూ. 12 కోట్లకు ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమెకు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించడం విశేషం. -
ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!
పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే తీశారు. ఆగస్టు 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే దీనిలో కథ, యాక్షన్, స్టార్ నటీనటుల కంటే హింస, శృంగార కంటెంట్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విడుదలైన "తబాహీ" వీడియో సాంగ్ ఆ చర్చ మరింత ముదిరేలా చేసింది.(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి)టాక్సిక్ మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచే దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పై విమర్శలు వస్తున్నాయి. టీజర్లో హింస, రక్తపాతం, శృంగార సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హింస ఉండటం కొత్తేమీ కాదు. అయితే టాక్సిక్‌లో హింసను చూపించిన తీరు, దానికి తోడు గ్లామర్‌ని మిళితం చేసిన విధానం చర్చకు దారితీసింది.ఆ తర్వాత మహిళా తారాగణాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక వీడియో కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొంది. పాత్రల పరిచయం కంటే స్టైలిష్ విజువల్స్, సెక్సువల్ టోన్, డార్క్ ప్రెజెంటేషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సినీ అభిమానుల్లో కొందరు అభిప్రాయపడ్డారు.తాజాగా విడుదలైన "తబాహీ" వీడియో సాంగ్ ఈ చర్చను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలో యాక్షన్‌తో పాటు శృంగార సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండటంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సినిమా కథకు తగ్గ ప్రెజెంటేషన్‌గా సమర్థిస్తుంటే, మరికొందరు అవసరానికి మించి రెచ్చగొట్టే విజువల్స్‌ను ఉపయోగించారని విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)పాటలో కనిపించిన కియారా అద్వానీపైనా సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. పెళ్లయి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, వ్యక్తిగత జీవితం, నటిగా చేసే పాత్రలను కలిపి చూడకూడదని మరికొందరు అంటున్నారు. నటీనటులు తమ పాత్రల ప్రకారం నటిస్తారని, వ్యక్తిగత జీవితంతో వాటికి సంబంధం లేదని సినీ విశ్లేషకులలో మరో వర్గం అభిప్రాయపడుతోంది.ఈ పరిణామాల మధ్య మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కనిపించే మితిమీరిన హింస, ముద్దు సన్నివేశాలు, బోల్డ్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకర్షించాయని, ఇప్పుడు అదే ఫార్ములాను గీతూ మోహన్ దాస్ కూడా అనుసరిస్తున్నారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇది ఇప్పటివరకు కేవలం ప్రేక్షకులు, సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమే. సినిమా విడుదలైన తర్వాతే కథకు ఈ అంశాలు ఎంతవరకు అవసరమో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మరోవైపు 'టాక్సిక్' టీమ్ మాత్రం సినిమాని ఒక డార్క్, స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ప్రచారం చేస్తోంది. ప్రచారంలో భాగంగా విడుదల చేస్తున్న ప్రతి వీడియోతో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది. అదే టైంలో హింస, శృంగార సన్నివేశాలే ప్రధాన చర్చగా మారడం చిత్రబృందానికి లాభమా? నష్టమా? అనేది విడుదల తర్వాతే తేలనుంది. చూస్తుంటే ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ కూడా తక్కువే అనిపిస్తోంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పెద్ది'.. ఆ సీన్లు మార్చేశారు) -
'టాక్సిక్' రొమాంటిక్ వీడియో సాంగ్.. పెద్దలకు మాత్రమే
యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'.. వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్‌ని వరసగా వదులుతున్నారు. కొన్నిరోజుల క్రితం హీరోయిన్లకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు యష్-కియారా అడ్వాణీల రొమాంటిక్ సాంగ్ వీడియోని విడుదల చేశారు.'టాక్సిక్' సినిమాని ముందు నుంచి పెద్దలకు మాత్రమే అని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ కూడా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంది. ఎందుకంటే యష్-కియారా రొమాన్స్ తప్పితే ఇందులో వేరే ఏం లేదు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా మిగతా పాత్రలు చేశారు.లెక్క ప్రకారం ఈ సినిమా మార్చిలో రిలీజ్ కావాలి. కానీ అరబ్ దేశాల్లో అనిశ్చితి కారణంగా వాయిదా వేశారు. తర్వాత జూన్ 4 అని ప్రకటించారు. కానీ రిలీచ్ చేయలేకపోయారు. ఇప్పుడు చివరగా ఆగస్టు 26వ తేదీని ఫిక్స్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ ఏం లేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ బట్టి చూస్తే రొమాన్స్, ఫైట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. -
పిల్లలను దూరంగా ఉంచండి!
‘కేజీఎఫ్’ మూవీస్ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూ పొందిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్) చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’.1940–1970 కాలంలో గోవా తీర్రపాంతం నేపథ్యంతో సాగే ఈ సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం (రాయ, టికెట్) చేశారు. ఈ సినిమాలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హ్యూమా ఖురేషీ, రెబెక్కా పాత్రలో తారా సుతారియా, మెలిస్సా రోల్లో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.కాగా ‘లేడీస్ అండ్ లేడీస్’ అంటూ ఈ సినిమా నుంచి బుధవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఉమెన్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. మహిళా ఫైటర్స్‌తో యశ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ఈ సినిమాలోని హీరోయిన్లు ఈ వీడియోలో కనిపించారు. ‘పిల్లలూ... దూరంగా ఉండండి. తల్లిదండ్రులూ... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్‌పై చూడండి‘ అనే డిస్క్లైమర్‌తో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ఇంటెన్స్, బోల్డ్, యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. -
'టాక్సిక్' లేడీస్ స్పెషల్.. రొమాన్స్ ప్లస్ వయలెన్స్
'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా చేసిన సినిమా 'టాక్సిక్'. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఎట్టకేలకు ఆగస్టు 26న రిలీజ్ అని ప్రకటించారు. ఇప్పటికే టీజర్, ఓ పాట వదలగా అవేం పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇప్పుడు సడన్‌గా లేడీస్ స్పెషల్ పేరిట హీరోయిన్లతో ఓ టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?)టాక్సిక్ మూవీలో హీరోయిన్లు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు హీరోయిన్? ఎవరికి కీలక పాత్రలు అనేది తెలియాల్సి ఉంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అయితే నయనతార, రుక్మిణి వసంత్ గన్స్ పట్టుకుని కనిపించగా.. కియారా, హ్యూమా, తారా గ్లామర్ చూపించారు.యష్.. లేడీ ఫైటర్స్ చేసిన యాక్షన్ ఇందులో చూపించారు. మధ్యమధ్యలో రొమాన్స్ చూపిస్తూ మరోవైపు ఫైట్స్ చూపిస్తూ ఆసక్తి కలిగించారు. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకురాలు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
ఎట్టకేలకు మూడో రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా?
'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు. అయితే ఈ ఏడాది అసలు దీన్ని విడుదల చేయరని, వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొస్తారనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. దీంతో మేలుకున్న మూవీ టీమ్.. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది.(ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే)ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ 'టాక్సిక్'.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ రోజు బుధవారం. సాధారణంగా సినిమాల్ని శుక్రవారం విడుదల చేస్తుంటారు. మరీ కాదంటే గురువారం తీసుకొస్తుంటారు. కానీ యష్ మాత్రం కాస్త భిన్నంగా బుధవారం ఎంచుకున్నాడు. బహుశా వీకెండ్ లోపు ఎంతైతే అంత కలెక్షన్స్ రాబట్టేయాలని ప్లాన్ ఏమో? ఎందుకంటే పలుమార్లు వాయిదా పడటంతో ఈ మూవీపై బజ్ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ రిలీజ్ ముంగిట ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి?1980ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీశారు. ఇందులో యష్ సరసన కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా.. ఇలా ఐదుగురు హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'రామాయణ'లో యష్. రావణుడిగా విలన్ పాత్ర చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)Honour Thy Father...#Toxic In Cinemas Worldwide from 26-08-2026#ToxicTheMovie#Nayanthara @advani_kiara #TaraSutaria@humasqureshi @rukminitweets #GeetuMohandas @VishalMMishra #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/oAlW0JdldO— Yash (@TheNameIsYash) June 21, 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
-
టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్..ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. జూన్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో అదే తేదీన రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది.అయితే తాజాగా ఈ మూవీపై కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై హీరో యశ్ తీవ్ర అసంతప్తిగా ఉన్నారని టాక్. అందుకే దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద రోజుల షూటింగ్‌ను రీ షూట్ చేయాలని అడిగారని ఓ వార్త వైరలవుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. రీ షూట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ చిత్రానికి ఎలాంటి రీషూట్లు షెడ్యూల్ చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. మొదట 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.. ఆ తర్వాత జూన్ 4వ తేదీని అనౌన్స్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు చిత్ర నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు.'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటిస్తోన్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. -
టాక్సిక్ డైరెక్టర్ బర్త్ డే.. స్పెషల్ వీడియో వైరల్
యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్.. ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్. ఈ మూవీ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. టాక్సిక్ పోస్ట్‌పోన్ కావడంతోనే రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఇవాళ టాక్సిక్ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియో పంచుకున్నారు. ఆమె మూవీ షూటింగ్లో సీన్స్ తెరకెక్కించిన విధానాన్ని చూపించారు. ఈ వీడియో చూస్తుంటే టాక్సిక్ కోసం ఆమె ఎంత డెడికేషన్‌తో పనిచేశారో తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు గీతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.టీజర్‌పై విమర్శలు..అయితే గతంలో టాక్సిక్ టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలకు గురైంది. ఆ టీజర్లో ఇంటిమేట్ సీన్ కాస్తా ఓవర్‌గా ఉందంటూ పలువురు విమర్శించారు. లేడీ డైరెక్టర్ కావడంతో ఇలాంటి సీన్స్ తెరకెక్కించడంపై వివాదానికి కారణమైంది. కానీ ఇలాంటివీ సినిమా కోణంలోనే చూడాలని మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి టీజర్‌తోనే టాక్సిక్‌పై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది గీతూ మోహన్‌దాస్. Behind every shot that hit different, every silence that said more than dialogue ever could, there she was!❤️🔥 Happy birthday, Geetu Mohandas ✨️#Toxic#ToxicTheMovie@TheNameIsYash#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas… pic.twitter.com/PjtUiLlDhi— TOXIC (@Toxic_themovie) June 8, 2026 -
ముంబైలో రాఖీ భాయ్ అడ్డా! కోహ్లి, దీపికా పక్కనే యశ్ కూడా..
-
'కేజీఎఫ్' యష్.. రూ.24 కోట్ల డీల్
కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్.. ప్రస్తుతం 'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్నాడు. మరోవైపు హీరోగా నటించిన 'టాక్సిక్' రిలీజ్ కావాల్సి వచ్చింది. లెక్క ప్రకారం రెండోసారి వాయిదా పడిన తర్వాత జూన్ 4నే విడుదల అని అన్నారు గానీ ఇప్పటివరకు సౌండ్ లేదు అంటే కచ్చితంగా వాయిదా పడినట్లే. ఇవి అలా ఉండగానే యష్ దంపతులు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)యష్, అతడి భార్య రాధిక పండిట్ కలిసి.. మహారాష్ట్రలోని ప్రముఖ తీర ప్రాంత పర్యాటక కేంద్రం అలీబాగ్‌లో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టారు. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ ప్రకారం అలీబాగ్ తాలూకా కమత్ గ్రామంలో ఉన్న భూమిని రూ.24 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీ 18వ తేదీన అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు అయింది.5,289 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన రెండు అనుబంధ వ్యవసాయ భూములు ఇందులో ఉన్నాయి. ఆ స్థలంలో ఒక నివాస గృహ నిర్మాణం కూడా ఉన్నట్లు పత్రాలతో తెలిసింది. అయితే ఈ స్థలాన్ని ఇల్లు కట్టుకునేందుకు కొనుగోలు చేశారా? లేదంటే రియల్ ఎస్టేట్ కోసమా తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా అలీబాగ్ ప్రాంతం సినీ ప్రముఖులు దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైకి సమీపంలో ఉండటంతో పాటు అందమైన కొంకణ్ తీర ప్రాంతం కారణంగా అలీబాగ్ హాట్ టాపిక్ అయిపోతోంది.(ఇదీ చదవండి: మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు.. సీఎం విజయ్ తో ఖుష్బూ) -
కేజీఎఫ్ హీరో గొప్ప మనసు.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్..!
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో ప్రస్తుతం టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జూన్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న రామాయణలోనూ యశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ యశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక అభిమాని సునీల్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతనిలో ధైర్యం నింపారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అభిమాన హీరో మాట్లాడడంతో క్యాన్సర్ బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. యశ్ ఆత్మీయ సంభాషణ అతనిలో కొత్త భరోసాను తీసుకొచ్చింది.క్యాన్సర్‌తో పోరాడుతున్న సునీల్ శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు కావడం విశేషం. అతనికి చికిత్స సమయంలో అండగా ఉంటానని కూడా యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎంత బిజీగా ఉన్నా తన అభిమానితో వీడియో కాల్ చేసి మాట్లాడటంతో యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
'యశ్‌తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్సెన్స్'
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్‌తో ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
యశ్‌తో బోల్డ్ సీన్స్.. తొలగించాలంటూ హీరోయిన్ విజ్ఞప్తి!
కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కన్నడ స్టార్ యశ్ నటించిన పాన్ వరల్డ్ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషంలో జూన్ 4వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్‌లో కూడా ఈ చిత్రం విడుదల కావడం లేదు. సినిమా ఔట్పుట్ బాగా వచ్చిందని..ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ప్రమోషన్స్ కోసమే వాయిదా వేస్తున్నట్లు యశ్ ప్రకటించారు. కొత్త తేదిని త్వరలో ప్రకటించనున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. చిత్రబృందానికి వింత విజ్ఞప్తి చేసిందట. షూటింగ్ సమయంలో కథ డిమాండ్ మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్లు చిత్రీకరించారట. ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని కియారాకి ముందే చెప్పారట. ఆమె అన్నింటికి ఒప్పుకొనే సినిమాకు సైన్ చేసిందట. ఇష్టంతోనే బోల్డ్ సీన్లు చేసినప్పటికీ.. ఫైనల్ కట్ చూసి ఇప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బోల్డ్ సీన్లు తెరపై మరింత ఘటూగా ఉన్నాయని..వాటిని అలాగే చూపిస్తే తన ఇమేజ్‌పై ప్రభావం పడుతుందని భయపడుతుందట. అందుకే వాటిని తొలగించడా లేదా నిడివి తగ్గించే ప్రయత్నం చేయమని దర్శకురాలికి రిక్వెస్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయా సన్నివేశాలు కథకి చాలా కీలకమని..వాటిని తొలగిస్తే సినిమాలోని భావోద్వేగ తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారట. మరి కియారా రిక్వెస్ట్ మేరకు ఆ సీన్లను తొలగిస్తారా లేదా అలానే ఉంచుతారా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. -
'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది
మనం ఎలాంటి సినిమా తీశామనేది ముఖ్యం కాదు చెప్పిన టైంకి రిలీజ్ చేశామా లేదా అనేది ప్రేక్షకులు చూస్తారు. ఒకసారి వాయిదా పడింది అంటే సరేలే ఏదో సమస్య ఉండొచ్చు అనుకుంటారు. కానీ మళ్లీ మళ్లీ వాయిదా పడితే లేనిపోని సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నట్లే యష్ 'టాక్సిక్' మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)ఈ సినిమాని జూన్ 4న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, అది కుదరడం లేదు. మూవీ అయితే సిద్ధంగా ఉందని కానీ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్, భాగస్వామ్యాలు జరుగుతున్న కారణంగా విడుదల తేదీని మారుస్తున్నాం. ప్రపంచవ్యాప్తగా ఒకే తేదీకి రిలీజ్ చేసేలా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. ఆడియెన్స్ అంచనాలు అందుకునేలా కాస్త టైమ్ తీసకుని, అత్యుత్తమ ఔట్పుట్ అందించాలనుకుంటున్నామని హీరో, నిర్మాత యష్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో యష్ హీరో కాగా రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కించింది. 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్.. ఈ చిత్రాన్ని కూడా యష్‌తో కలిసి నిర్మించింది. తొలుత మార్చి 19 అనుకున్నారు కుదర్లేదు. జూన్ 4 అనుకున్నారు కుదర్లేదు. మరి ఈసారైనా ఓ తేదీ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి?ఇకపోతే ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్ వీడియో, పాట రిలీజ్ చేశారు గానీ ఏ మాత్రం హైప్ ఏర్పడలేదు. ఇప్పుడిలా వాయిదాల మీద వాయిదాలు పడితే దీనిపై ఉన్న కాస్తోకూస్తో హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది.(ఇదీ చదవండి: కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ) -
టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా?
కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు పోస్ట్‌పోన్ అయింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్లో బోల్డ్ సీన్ ఉండడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కూడా ఉన్నట్లు సమాచారం.ఓటీటీ డీల్ ఆలస్యం..!ఈ బిగ్ మూవీ ఓటీటీ డీల్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఓటీటీ యాజమాన్యాలు రూ.110 కోట్లకు పైగా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల డిమాండ్ వల్లే టాక్సిక్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.యశ్ వల్లేనా..?ఈ మూవీ ఓటీటీ డీల్ ఆలస్యానికి హీరో యశ్ ఓ కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఓటీటీ డీల్ సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు సినిమా ప్రివ్యూ చూపించాలి. కానీ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడాలని..ముందే చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని యశ్ భావిస్తున్నారట. యశ్ నిర్ణయం వల్ల తీసుకున్న అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓటీటీలు వెనకాడుతున్నాయని లేటేస్ట్ టాక్. అందుకే టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
టాక్సిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు.. యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ కథ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్ జోనర్ మూవీ అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్ రిలీజ్ తర్వాత అందరూ ఇది గ్యాంగ్‌స్టర్ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. యాక్షన్ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అలాగే యశ్ రావణుడిగా, రణ్‌బీర్ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్‌బీర్‌తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్‌బీర్ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది. -
అదేం పెద్ద సమస్య కాదు.. 'రామాయణ'పై యష్ కామెంట్స్
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా పరిమిత బడ్జెట్‌తో తీశారు. కానీ రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తాము రామాయణాన్ని తీస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పేసరికి అంతా షాకయ్యారు. కానీ కొన్నిరోజుల క్రితం రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా.. చెప్పిన బడ్జెట్‌కి చూపించిన విజువల్‌కి అస్సలు సంబంధం లేదే అనే కామెంట్స్ వినిపించాయి. ఆ విషయాలన్నీ పక్కనబెడితే ఇందులోనే రావణుడిగా చేస్తున్న యష్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సంగతులు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్న యష్.. ఈ చిత్రం నిర్మాణంలోనూ భాగమయ్యాడు. తాజాగా అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌కి నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి హాజరయ్యాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ గురించి చెప్పుకొచ్చాడు. రణ్‌బీర్ కపూర్, తనకు మధ్య తొలి భాగంలో సీన్స్ ఏం లేవని క్లారిటీ ఇచ్చాడు. అంటే రాముడు-రావణుడి మొదటి భాగంలో అస్సలు కలిసే అవకాశం లేదు.కలిసి సీన్స్ లేనప్పటికీ రణ్‌బీర్ కపూర్‌ని తాను పలుమార్లు కలిశానని చెప్పిన యష్.. అతడు ఓ అద్భుతమైన నటుడు అని ప్రశంసించాడు. తమ ఆలోచనలు కలిశాయని, కాబట్టి తామిద్దరి కెమిస్ట్రీ అనేది పెద్ద సమస్య కాదని యష్ అన్నాడు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి చేస్తోంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి వస్తారా లేదంటే అన్ని పాన్ ఇండియా సినిమాల్లానే వాయిదా వేస్తారా అనేది చూడాలి?యష్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'రామాయణ' తొలి భాగంలో రాముడి, అతడి రాజ్యానికి సంబంధించిన సీన్స్.. మరోవైపు రావణుడు, అతడి రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలు చూపించనున్నారు. బహుశా రాముడు, సీత వనవాసానికి వచ్చే ఎపిసోడ్‌తో తొలి భాగాన్ని ముగిస్తారేమో అనిపిస్తుంది. రాముడు-రావణుడి మధ్య వైరం, యుద్ధం తదితర అంశాలన్ని సీక్వెల్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్‌ని వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.(ఇదీ చదవండి: పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు)#Yash confirms he and #RanbirKapoor won’t share screen space in #Ramayana Part 1.He praised Ranbir as a brilliant actor and said their vision matches, so chemistry won’t be an issue. 🔥 pic.twitter.com/g4PSkHzBjw— Filmyscoops (@Filmyscoopss) April 15, 2026 -
టాక్సిక్ మరోసారి వాయిదా.. మేకర్స్ ఏమన్నారంటే?
కన్నడ హీరో యశ్.. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్‌గా ఉండడంతో మేకర్స్‌పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్‌లో మరో ఆందోళన కలిగిస్తోంది.తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. -
పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!
కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
కాంట్ అవాయిడ్
‘వయొలెన్స్ ... వయొలెన్స్ ... వయొలెన్స్ ... ఐ డోంట్ లైక్... ఐ అవాయిడ్... బట్.. వయొలెన్స్ లైక్స్ మీ... ఐ కాంట్ అవాయిడ్’ అంటూ ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాల్లో అధిక శాతం ‘కాంట్ అవాయిడ్... కథలో వయొలెన్స్ ఉంటే తప్పదు గురూ’ అన్నట్లుగా వయొలెన్స్ డామినేటెడ్ కథల్లో నటిస్తున్నారు కొందరు స్టార్స్. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలు వెండితెరపై వయొలెన్స్ చూపించనున్నారు. ఆ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం...కాన్సెప్ట్ పోస్టర్‌తోనే అంచనాలు చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బ్లాక్‌బస్టర్ అందున్నారు. ఈ మూవీకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తర్వాత తన భుజానికి చిన్న సర్జరీ చేయించుకున్నారు చిరంజీవి. ఈ కారణంగా బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న షూటింగ్ ఆరంభం కాలేదు.ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకున్న ఆయన బాబీ డైరెక్షన్లో రూపొందనున్న మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే... మరో యువ దర్శకుడు, ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లోనూ చిరంజీవి ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ మూవీతో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించి, హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చిరంజీవితో సినిమా చేసే లక్కీ చాన్స్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్. ఈ మూవీలోనూ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు నాని. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.ఈ చిత్రం విడుదల తర్వాత చిరంజీవి సినిమాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారాయన. చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. చేతి నుంచి రక్తం కారుతున్న ఆ పోస్టర్ ఈ మూవీలో ఏ స్థాయి వయొలెన్స్ ఉండబోతోందో చెప్పింది. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హీరో నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనుడంటం విశేషం. 1970–74లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ షూటింగ్‌ని ఆరంభిస్తామని సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. మూడువేల మందితో... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో వయొలెన్స్ , యాక్షన్‌కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి ‘కేజీఎఫ్ 1, 2 ’ చిత్రాల్లో వయొలెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీ కోసం జోర్డాన్ లోనూ రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట.ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సినిమాలో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించారు. ఈ సెట్లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట మేకర్స్. ఇలా... ఈ సినిమాలోని ఫైట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సినిమాకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో... ‘ది రాజా సాబ్’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ లో వైలెన్స్ ని ఏ స్థాయిలో చూపించారో సందీప్ రెడ్డి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ వయొలెన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తన పంథా ఏమాత్రం మార్చుకోకుండా తనదైన శైలిలోనే వెళుతున్నారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్‌ని కూడా ఫుల్ వయొలెన్స్ గా చూపించనున్నారట ఆయన. తన మార్క్ ఇంటెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. సలార్ 2లోనూ.... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్ 1–సీజ్ ఫైర్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో వయొలెన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ ఎపిసోడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతాయని తెలిసింది.ఇదిలా ఉంటే... ఈ మూవీపై గత కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ– ‘‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయ భాగం అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్–నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట ప్రశాంత్ నీల్.అంతకు మించి... ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ మూవీస్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రో డక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే...‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ సినిమాలకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ ‘టాక్సిక్’లో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం యశ్ సరికొత్త ఫిజిక్‌తో మేకోవర్ అయ్యారు.ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. ఎంతో అంకితభావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జూన్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం. మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం ఉంటాయని ఆశిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ‘టాక్సిక్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్్సపై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పవర్ఫుల్ కల్ట్విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మించారు.ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే రక్తంతో తడిసిన ఇంటెన్స్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించగా, భారీ హైప్ సృష్టించింది. అదే విధంగా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘‘జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను.‘ఫలక్‌నుమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి’’ అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్ జడల్ ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీలో నానీని పవర్ఫుల్ మాస్ పాత్రలో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారు నాని. ‘హిట్ 3’లో నాని వయొలెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ‘ది ప్యారడైజ్’లోని వయొలెన్స్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని మరింత స్పష్టం అవుతోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నానిపై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్...’ని ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని కూడా యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి విడుదల వాయిదా వేశారు మేకర్స్. మాస్ రణబాలి హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి ‘రౌడీ జనార్థన, రణబాలి’ వంటి రెండు వయొలెన్స్ సినిమాలు చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఫుల్ వయొలెంట్‌గా ఉంటుంది. 1980 దశకం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదంటూ నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు కూడా.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతుండటం విశేషం. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. ఒక హీరో నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అలాంటి కథ, కథనాలతో ‘రౌడీ జనార్థన’ మూవీని తెరకెక్కిస్తున్నా. ఫ్యాన్స్ కి పండగే. ఎక్కడా నిరుత్సాహపడరు’’ అంటూ డైరెక్టర్ రవికిరణ్ కోలా స్పష్టం చేశారు. టీజర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2018 నవంబరు 17న విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమించిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ వయొలెన్స్ , యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్లో ఉండనున్నాయి. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పాట ‘ఏందయ్య సామీ...’కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.రగ్డ్ డెకాయిట్ అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీతో కొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో తన కెరీర్లో ఇప్పటివరకూ కనిపించని మాస్, రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్. ‘‘డెకాయిట్’ ఒక కొత్త జోనర్లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్‌లో చెప్పిన లవ్ స్టోరీ. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ల జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్‌గా ఉంటుంది. చుట్టూ గన్స్, బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యాసీవ్ ఔట్‌డోర్‌లో చిత్రీకరించిన ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అంటూ అడివి శేష్ పేర్కొన్నారు. ఎ బ్లడ్ ఫెస్ట్శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌గా పెట్టారంటే ఈ మూవీలో ఏ స్థాయిలో వయొలెన్స్ , రక్తపాతం సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి విడుదల చేసిన ఆయన ఇంటెన్స్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.గుబురు గడ్డంతో రా అండ్ రెబెలియస్ లుక్‌లో కనిపించారు శర్వా. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని యాటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేసింది. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఈ చిత్రం ఒకటిగా ఉంటుంది. మా సినిమాని రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కథానాయకులు కూడా వయొలెన్స్ , ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
కూతురితో బిగ్‌బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
-
యశ్ వల్లనే 'టాక్సిక్' వాయిదా.. యుద్ధం సాకు మాత్రమేనా?
కన్నడ హీరో యశ్ నటించిన కొత్త చిత్రం ‘టాక్సిక్’.. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ మూవీని వెంకట్ కె. నారాయణ, యశ్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్ను సడెన్‌గా వాయిదా వేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దీన్ని జూన్ 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అసలు నిజం మరోకటని నెట్టింట వార్తలు వస్తున్నాయి.టాక్సిక్ సినిమా వాయిదాకు అసలు కారణాలు ఇవ్వే అంటూ పలు కథనాలు వస్తున్నాయి. ఇటీవల యష్ కోసం ఒక ప్రత్యేక స్క్రీనింగ్‌ను మేకర్స్ ఏర్పాటు చేశారట. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో యశ్ సంతృప్తి చెందాడని సమాచారం. ముఖ్యంగా మూవీలో VFX, నేపథ్య సంగీతం అతన్ని నిరాశపరిచాయని, అందుకే అతను విడుదలను వాయిదా వేయమని సూచించారట. మూవీలోని లోటుపాట్లను సరిచేసి రిలీజ్ చేద్దామని ఆయన కోరారట. దీంతో అసలు విషయం చెప్పకుండా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నామనేది కేవలం సాకు మాత్రమేనని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే సినిమా అవుట్‌ఫుట్ మరింత బలంగా వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.టాక్సిక్ చిత్రంలో యశ్‌తో పాటు హ్యుమా ఖురేషీ , నయనతార, కియారా, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు రిలీజ్ హక్కులను ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.వాయిదాపై నిర్మాణ సంస్థ ఏం చెప్పిందిటాక్సిక్ వాయిదా గురించి చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెప్పింది. ‘‘మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విడుదలను వాయిదా వేయాలనుకున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. గల్ఫ్ ్రపాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం’’ అని యూనిట్ పేర్కొంది. -
మార్చి నుంచి జూన్‌కి...
యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు రిలీజ్ హక్కులను ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ఈ నెల 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది.. అయితే పోస్ట్‌పోన్ చేసి, జూన్ 4న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. ‘‘మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విడుదలను వాయిదా వేయాలనుకున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. గల్ఫ్ ్రపాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం’’ అని యూనిట్ పేర్కొంది. -
'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా
ఈ నెలలో రావాల్సిన పెద్ద సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హీరో యష్ చేసిన మూవీ ఇది. లెక్క ప్రకారం మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ అన్నారు. నిన్నటి వరకు అదే మాటపై ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఆడియెన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ప్రస్తుతం యుద్ధ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనిశ్చితి నెలకొందని, తమ పార్ట్నర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.'టాక్సిక్' వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబరులో పెద్దగా హడావుడి లేకుండానే 'ధురంధర్' వచ్చింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇది కూడా వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 'ధురంధర్ 2' గురించి వాయిదా లాంటివి రూమర్స్ అయితే ఇప్పటివరకు ఏం రావట్లేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?) -
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ విడుదల.. నిరాశపరిచిన యశ్
కన్నడ నటుడు యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. యశ్, కియారా ఆద్వాణిల మధ్య సాగే 'తాబాహీ..' ఈ పాటను విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తెలుగు సాహిత్యం రాశారు. టాక్సిక్‌లో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్న విషయం తెలిసిందే.టాక్సిక్ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఈ పాట మొదటిసారి వినగానే బాగుంది. కానీ, మరింత బలంగా ఆకర్షించేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. సినిమా నుండి రొమాంటిక్ సాంగ్‌ను ఆశించిన వారు కొంచెం నిరాశ చెందవచ్చు. ఒకే పోస్టర్‌తో సాంగ్‌ను విడుదల చేశారు. కనీసం వీరిద్దరి స్టిల్స్, విజువల్స్ చేర్చకుండా పాటను విడుదల చేయడంతో ఇది అభిమానులను మరింత నిరాశపరచవచ్చు. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. -
యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్. ఇటీవలే టీజర్, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
8 ఏళ్ల తర్వాత తీసేశాడు.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?
పాన్ ఇండియా ట్రెండ్ కలిసొచ్చిన హీరోల్లో ఇతడు ఒకడు. చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడికి అభిమానులయ్యారు. 2022లో చివరగా పలకరించిన ఈ హీరో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఓ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే గత 8-9 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ వచ్చిన ఇతడు.. ఎట్టకేలకు కొత్తగా కనిపించాడు. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన కనిపిస్తున్నది 'కేజీఎఫ్' ఫేమ్ యష్. సడన్‌గా చూస్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమాల కోసం చాలా గడ్డం పెంచేసిన ఇతడు.. దాన్ని అలానే ఉంచేశాడు. తర్వాత 'టాక్సిక్' మూవీ చేసినప్పటికీ అందులో గడ్డం లుక్‌తోనే ఓ పాత్ర ఉంది. ఇది కాకుండా మరో రోల్లో క్లీన్ షేవ్‌తో కనిపించాడు. కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్ చివరలో కనిపించి కనిపించకుండా లుక్ చూపించారు. దాన్ని ఏఐతో క్రియేట్ చేశారని చాలామంది కామెంట్స్ చేశారు.ఆ ట్రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ట్.. యష్ క్లీన్ షేవ్ లుక్ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'నమ్మకం నిజమైనది అయినప్పుడు.. పనే మాట్లాడుతుంది' అని సదరు హెయిర్ స్టైలిష్ట్ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇన్నాళ్లు గడ్డంతోనే యష్‌ని చూసిన ఫ్యాన్.. ఈ లుక్ చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్లకు ఈ యష్.. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపిస్తుండటం విశేషం.'టాక్సిక్' విషయానికొస్తే 1970ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీసింది. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి తదితరులు హీరోయిన్లుగా నటించారు. మార్చి 19న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. టీజర్ రిలీజ్ తర్వాత యష్ సొంత భాషలో పెద్దగా సౌండ్ లేదు. తెలుగులోనే కాస్తంత ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. దానికి తోడు.. మార్చి 19నే 'ధురంధర్ 2' రిలీజ్ కానుంది. యష్ మూవీతో పోలిస్తే దీనిపైనే ఎక్కువ హైప్ ఉంది.(ఇదీ చదవండి: అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!: గాయత్రి భార్గవి) View this post on Instagram A post shared by Alex Vijaykanth (@alex.vijaykanth) -
'టాక్సిక్' వైలెంట్ టీజర్ విడుదల
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ టీజర్ వచ్చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా విడులైన టీజర్లో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చూపించారు. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. -
యశ్ టాక్సిక్.. రిలీజ్‌కు ముందే మరో వివాదం..!
కేజీఎఫ్ హీరో నటించిన ఫుల్ యాక్షన్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత బోల్డ్ సీన్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ సీన్ విషయంలో కొందపు ఏకంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌పై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌కు ముందే మరో కొత్త వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా చిత్రీకరించారని ఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మత విశ్వాసాలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధిత అధికారులకు లేఖ రాసింది. తమ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై ఈ బృందం ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్ను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాడని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధికారులను కోరారు. వివాదాస్పద దృశ్యాలను, ఆన్లైన్ వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అదనంగా చిత్రనిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రనిర్మాతలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా.. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ధురంధర-2తో పోటీ పడనుంది. -
యశ్ టాక్సిక్.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్.. మరో బిగ్ డీల్..!
శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్-2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ఇండియన్ లాంగ్వేజేస్‌కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్ ఓకే అయినట్లు సమాచారం. ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్‌తో ఈ డీల్ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు దక్కిన ఘనతగా భావిస్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్‌తో ఓవర్సీస్లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. -
యశ్ టాక్సిక్.. భారీ ధరకు తెలుగు రాష్ట్రాల రైట్స్..!
శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్- 2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను భారీ డీల్‌కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్‌గా రికార్డ్ సృష్టించనుంది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్ అని టాలీవుడ్లో చర్చ మొదలైంది.ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్ఫుల్ స్టార్‌గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అందించడానికి థ్రిల్‌గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్‌తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం' అని అన్నారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. The chaos is beginning to unfold. Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCReleaseIntoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th @TheNameIsYash#Nayanthara@humasqureshi… pic.twitter.com/1uB4RbQ9sg— KVN Productions (@KvnProductions) February 6, 2026 -
బిగ్‌బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి సోనియా ఆకుల 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. యష్ వీరగోనిని ప్రేమించి పెళ్లాడింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కాగా సోనియా- యష్ దంపతులు పెళ్లయిన ఏడాదికే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2025 డిసెంబర్ 8న వీరి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది. తనకు శిఖ వీరగోని అని నామకరణం చేశారు.నిద్రలేని రాత్రులుతాజాగా కూతురి బారసాల ఫంక్షన్ ఫోటోలను సోనియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. '28 డిసెంబర్ 2025.. 21 రోజుల ఫంక్షన్ ఎంత అద్భుతంగా గడిచిందో.. నీ చిన్ని పాదాలు, నాకు నిద్రలేని రాత్రులు, వెల్లివిరిసిన ఆనందాలు.. మాటల్లో చెప్పలేంతన సంతోషాన్ని మా కుటుంబంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది. ఇల్లు నిండుగా కనిపిస్తోంది' అంటూ పాపను ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేసింది. తొలిసారి ఊయలలోసోనియా దంపతులిద్దరూ కలిసి పాపను తొలిసారి ఊయలలో వేశారు. అయితే చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. పాపను చూపించొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా మూడునెలలవరకు చూపించకూడదనే ఆగాం.. వచ్చే నెలలో చూపిస్తాను అని సోనియా బదులిచ్చింది. నార్మల్ డెలివరీయా? సీ సెక్షనా? అని మరో నెటిజన్ అడగ్గా సీ సెక్షన్ జరిగిందని పేర్కొంది. సోనియా.. జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ సినిమాల్లో నటించింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొంది. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) చదవండి: విడాకులు తీసుకున్న బుల్లితెర జంట -
టాక్సిక్ టాక్స్: ట్రైలర్‌తో వైరల్ అయిన లేడీ డైరెక్టర్
‘కేజీఎఫ్’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్ తన స్వంత బ్యానర్ మాన్స్టర్ క్రియేషన్స్ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. ఇందులో యష్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ లీడర్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘ది టీజ్’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది. కెమెరా టేకింగ్ యాక్టింగ్ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్‌దాస్.యాక్షన్ టూ డైరెక్షన్...ఆమె ఒక సెన్సేషన్...పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్ డైస్’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.ఈ చిత్రం సండాన్స్ రోటర్‌డామ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్ అవార్డ్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి గీతూ మోహందాస్ భర్త కావడం. ఆయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కు తన రఫ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్‌దాస్ వైవిధ్యభరిత లైన్స్‌కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.‘టాక్సిక్’ కోసం గీతూనే ఎందుకు?‘కేజీఎఫ్’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత, యష్ గీతూ మోహన్‌దాస్ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్’ (సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్ రియలిజం, అంతర్జాతీయ టచ్ – యశ్ మాస్ ఇమేజ్‌తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్‌బస్టర్ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి. -
ఒక్క సీన్‌తో వైరల్.. 'టాక్సిక్' బ్యూటీ ఇన్‌స్టా డిలీట్
కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త సినిమా టాక్సిక్ టీజర్ పాన్ ఇండియా రేంజ్లో హీట్ పెంచుతుంది. టీజర్లో ఉన్న ఇంటిమేట్ సీన్‌పై మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరం తెలిపాయి. యశ్‌తో పాటు బోల్డ్ సీన్లో కనిపించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ (Beatriz Taufenbach) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. తన ఇంటిమేట్ సీన్స్‌పై వివాదాలు రావడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.టాక్సిక్ టీజర్లో చాలా బోల్డ్‌గా నటించిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు పోటీపడ్డారు. ఈ క్రమంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఆమె వివరాలు షేర్ చేశారు. దీంతో ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని పంచుకున్నారు. హాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇదే ఫస్ట్ ఇండియన్ సినిమా... దీంతో ఆమెకు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. జనవరి 13 వరకు ఆమె ఖాతా యాక్టివ్గానే ఉంది. కానీ, సెడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతా కనిపించకపోవడంతో నెటిజన్లు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. -
'టాక్సిక్' సినిమా దర్శకురాలిపై ఫిర్యాదు
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. వారం క్రితం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్ సీన్ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది. తాజాగా చిత్ర నిర్మాత, దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీజర్ బాగుందని అందులో యశ్ లుక్ అదిరిపోయిందని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా.., కారులో యశ్‌తో పాటు మరో యువతిల మధ్య ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై పలు అభ్యంతరాలు వస్తున్నాయి.కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా విభాగం ఈ టీజర్‌పై భగ్గుమంది. దీంతో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీజర్‌లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మహిళలు, పిల్లలతో పాటు సాంస్కృతిక విలువలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపై చర్యలు తీసుకోవాలన్నారు.విమర్శలరు రావడంతో టీజర్‌పై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ స్పందించారు. అయితే, ఆమె చాలా వ్యంగ్య ధోరణిలో కామెంట్ చేశారు. నేటి సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నా అన్నారు. ఆ సీన్‌ను శృంగార దృశ్యంగా చూడకిండి అంటూ హితవు పలికారు. మహిళల అనుభవాలతో పాటు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని గీతూ మోహన్‌దాస్ చెప్పారు. టాక్సిక్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. -
పిల్లలకు టాక్సిక్ టీజర్ చూపించవద్దు
ప్రముఖ నటుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. దీని ప్రసారం నిలిపివేయాలని, లేదా గైడ్‌లైన్స్ సమేతంగా టీజర్ ప్రసారం చేయాలని ఓ న్యాయవాది రాష్ట్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ లాయరు శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ టాక్సిక్ టీజర్లో బాలల చట్టాల ఉల్లంఘన జరిగింది. టీజర్లో అతి హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కూడా గైడ్‌లైన్స్ లేవు. కాబట్టి దానిని చూసేముందు గైడ్‌లైన్స్ వేయాలి, దానిని బట్టి ప్రేక్షకులు చూడాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటారు అని చెప్పారు. టాక్సిక్ సినిమాను కుటుంబ సమేతంగా చూడటానికి సాధ్యపడదని అన్నారు. పిల్లలతో కలసి కుటుంబంతో కలసి టీజర్ చూశామని అనేక మంది అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. కుమారస్వామి వీడియో యశవంతపుర: టాక్సిక్ టీజర్‌ను ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి వీడియోను ఆయన అభిమానులు రూపొందించారు. టాక్సిక్ మ్యూజిక్ వస్తుండగా ఈ వీడియోలో మొదట సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు కనిపిస్తారు. 2028లో జరిగే ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడతారు. తరువాత కుమారస్వామి ఎంట్రీ ఇస్తారు. -
టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్‌ను మాత్రం తెగ మెప్పించింది. అయితే ఆ ఒక్క సీన్‌తో టీజర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఓ మహిళ దర్శకురాలు ఇలాంటి సీన్స్ పెట్టడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైరయ్యారు.తన మూవీ టీజర్‌లోని ఇంటిమేట్ సీన్‌పై విమర్శలు రావడంతో డైరెక్టర్ గీతూ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు చూసి చిల్ అవుతున్నానంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ డైరెక్టర్ ఇలాంటి సీన్స్ తెరకెక్కించడం కరెక్టేనా అంటూ కొందరు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. టీజర్ గ్లింప్స్‌లో శ్మశానం వద్ద కారులో ఇంటిమేట్ సీన్స్ చూపించారు. ఆ సీన్స్‌లో నటించిన ఆమెను కూడా పరిచయం చేశారు. ఈ హాలీవుడ్ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ నటించారు. కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. -
యశ్‌తో 'టాక్సిక్' బ్యూటీ.. ఎవరో తెలుసా?
సుమారు నాలుగేళ్ల తర్వాత కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ వద్దకు రానున్నాడు. తన కొత్త సినిమా టాక్సిక్ నుంచి యశ్‌ను పరిచయం చేస్తూ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక శ్మశానంలో శత్రువులకు చుక్కలు చూపించేలా తన ఎంట్రీ ఉంటుంది. అయితే, కారులో ఒక నటితో యశ్ ఇంటిమేట్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్‌గా ఎలా తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, యశ్‌తో రొమాన్స్ చేసిన నటి ఎవరు అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు వెతుకుతున్నారు.ఈ టీజర్లో యశ్‌తో కలిసి సన్నిహిత సీన్లో కనిపించింది హాలీవుడ్ నటి 'బీట్రీజ్ టోఫెన్ బాఖ్' (Beatriz Taufenbach).. ఉక్రెయిన్‌కు చెందిన ఈ బ్యూటీ అమెరికాకు వెళ్లి, నటనలో కెరీర్ ప్రారంభించింది. నటనతో పాటు మోడల్, స్క్రీన్‌రైటర్, నిర్మాతగా కూడా విజయం అందుకుంది. తన నెట్ వర్త్ కూడా సుమారు రూ. 150 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తనను తక్కువ అంచనా వేశారో పప్పులో కాలేసినట్లే..అమెరికన్ పౌరసత్వం పొందిన తరువాత, ఆమె పలు స్టూడియోస్‌లలో కూడా భాగస్వామిగా ఉంది. హాలీవుడ్లో యాక్షన్ సినిమాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అయితే, టాక్సిక్ సినిమాతో ఆమె ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యశ్‌తో బోల్డ్ సీన్లో నటించడంతో ఒక్కసారిగా నెట్టింట తన పేరు వైరల్ అవుతుంది. -
యశ్ టాక్సిక్ మూవీ టీజర్ విడుదల
-
బోల్డ్ అండ్ వైల్డ్‌గా ‘టాక్సిక్’ టీజర్.. యశ్ విశ్వరూపం!
‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కియరా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి పాత్రలకు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి యశ్ లుక్‌తో పాటు టీజర్‌ని రిలీజ్ చేశారు. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా గురువారం (జనవరి 8)ఈ టీజర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్లో యశ్‌ను రాయా పాత్రలో పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుక్కి దహన సంస్కారాలు జరుగుతుండగా రాయా (యశ్) అక్కడికి కారులో వస్తాడు. దాని నుంచి వైర్ల ద్వారా స్మశానం లోపల డైనమేట్లు పెట్టించి కారు నుంచి బయటికి రాకుండా బాంబులు పేల్చేస్తాడు. అది ఎలా చేశాడనేది బోల్డ్‌గా చూపించారు. రూథ్‌లెస్ మాఫియా బాస్‌గా యశ్ కనిపిస్తున్నాడు. హాలీవుడ్ వైబ్స్‌తో కూడిన ఈ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Yash Birthday : యశ్ అసలు పేరేంటో తెలుసా? (ఫోటోలు)
-
యశ్ 'టాక్సిక్'లో 5వ హీరోయిన్ ఎంట్రీ
కన్నడ నటుడు యశ్ జోరు పెంచాడు.. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వారి పోస్టర్స్‌ను విడుదల చేశారు. అయితే, తాజాగా ఇందులో రుక్మిణి వసంత్ కూడా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో కనిపించనున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్ చేశారు.టాక్సిక్ నుంచి ఇప్పటికే నలుగురు హీరోయన్ల ఫస్ట్‌లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నదియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలతో పాటు తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు. అయితే, తాజాగా మెలిసా పాత్ర కోసం రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు.గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in - A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu— Yash (@TheNameIsYash) January 6, 2026 -
రెబెకా వచ్చేశారు
‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ని విడుదల చేశారు. తాజాగా తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ–‘‘తారా సుతారియా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఆమె కెరీర్లో ఇదొక కొత్త అధ్యాయం. తను ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. రెబెకా పాత్రలో తను జీవించింది. తన నటన నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులనూ ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు’’ అని చెప్పారు. -
‘ఛాంపియన్’లో ఈ నటుడిని గుర్తుపట్టారా?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్ టాక్ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్లో నటించింది విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని.నిర్మాతగా హిట్ సినిమాలు!యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.నటన పై ఇష్టంతో..నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్‌కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్‌లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. -
Toxic Movie: నయన్ చేతిలో గన్.. లుక్ అదిరింది!
యశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా నయనతార ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. ఒక భారీ క్యాసినో బ్యాక్‌డ్రాప్‌లో.. మోడ్రన్ డ్రెస్‌లో గన్ పట్టుకొని పవర్ఫుల్ లుక్స్‌తో నయన్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఆమె హావభావాలు సినిమాలోని ఇంటెన్సిటీని, భారీతనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పాత్ర గురించి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టాక్సిక్'లో నయనతార సరికొత్త నటనా ప్రతిభను చూస్తారు. షూటింగ్ జరుగుతున్న కొద్దీ గంగ పాత్ర ఆత్మకు, నయనతార వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని నేను గమనించాను’ అని ఆమె అన్నారు. ఈ చిత్రంలో నయనతారతో కలిపి మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే కియరా అద్వానీ, హ్యుమా ఖురేషీకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కియారా..నదియా పాత్రలో కనిపించగా, ఖురేషీ ఎలిజబెత్ పాత్రలో అలరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Introducing Nayanthara as GANGA in - A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie @advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC— Yash (@TheNameIsYash) December 31, 2025 -
ఎలిజబెత్
‘‘నాకు ఎలిజబెత్ లాంటి మంచి బహుమతి ఇచ్చినందుకు నీకు (గీతు మోహన్‌దాస్‌ని ఉద్దేశించి) ధన్యవాదాలు. ‘టాక్సిక్’లో ఎవరూ ఊహించని అంశాన్ని వెండితెరపై చూపించాలన్న నీ ఆలోచనకు ఆశ్చర్యపోయాను’’ అని హూమా ఖురేషి పేర్కొన్నారు. యశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎలిజబెత్పాత్రలో నటిస్తున్నారు హూమా ఖురేషి.ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ – ‘‘ఎలిజబెత్పాత్రకు ఓ డిఫరెంట్ లుక్, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. అలాగే నటనా సామర్థ్యం కూడా మెండుగా ఉండాలి. హూమా ఖురేషి అయితే కరెక్ట్ అనిపించి, ఆమెను తీసుకున్నాం. హూమా ఓ టాలెంటెడ్ పవర్ హౌస్’’ అని పేర్కొన్నారు. యశ్, గీతు మోహన్ దాస్ కలిసి ఈ ‘టాక్సిక్’ కథ రాశారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. కన్నడంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సహా మరికొన్ని భాషల్లో అనువదించి, రిలీజ్ చేయనున్నారు. -
సరికొత్త నాడియా
‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా (ఇంగ్లిష్, కన్నడ) చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అనేది ట్యాగ్‌లైన్స్ . యశ్‌తో కలిసి ఈ సినిమా కథ రాసి, దర్శకత్వం వహిస్తున్నారు గీతూ మోహన్స్ దాస్. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆమె నాడియాపాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కొన్నిపాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు.. సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి.నాడియాపాత్రలో కియారా అద్వానీ సరికొత్తగా ట్రాన్స్ సఫార్మ్ అయ్యారు. ఆమె నటన చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కోసం ఆమె సపోర్ట్ చేస్తున్న తీరుకి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు గీతూ మోహన్స్ దాస్. వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంది. ఇంగ్లిష్, కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా మరికొన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. -
నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్ భార్య
కన్నడ స్టార్ హీరో యష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్ సంతానం. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా రాధిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ అద్భుతమైన వీడియో షేర్ చేసింది. నా సర్వస్వం నా భర్తే అని ఎందుకంటానో తెలుసా? అంటూ మొదట్లో ఓ క్యాప్షన్ వచ్చింది. అతడే నా సర్వస్వంఆ వెంటనే దానికి సమాధానంగా.. నా భర్త నా పర్సనల్ బాడీగార్డ్, నా చాట్‌జీపీటీ, నా చెఫ్, నా పర్సనల్ ఫోటోగ్రాఫర్, నా మెంటార్, నా డీజే, నా డాక్టర్, నా కాలిక్యులేటర్, నా స్ట్రెస్ బస్టర్ అంటూ యష్ ఏఐ ఫోటోల్ని జత చేసింది. చివర్లో మాత్రం నా ప్రశాంతతకు కారకుడు అంటూ భర్తపై వాలిపోయి ఉన్న ఒరిజినల్ ఫోటోను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని యష్‌ను కొనియాడుతున్నారు.సినిమాకేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్ ప్రస్తుతం రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
ఐటీ నోటీసుల కేసులో నటుడు యశ్‌కు ఊరట
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్, ప్రముఖ కన్నడ నటుడు యశ్‌కు ఆదాయ పన్ను శాఖ(ఐటీ) నోటీసుల కేసులో ఉపశమనం లభించింది. కేజీఎఫ్ సినిమాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో 2021లో ఐటీ అధికారులు యశ్ ఇళ్లు, హోంబాళె నిర్మాణ సంస్థ ఆఫీసులు, యజమానుల ఇళ్లలో దాడులు చేసింది. సేకరించిన సమాచారం ఆధారంగా 2013 నుంచి 2019 వరకు ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి వివరాలను సమర్పించాలని అప్పట్లో ఐటీ అధికారులు యశ్‌కు నోటిసులిచ్చారు.వీటిని సవాల్ చేస్తూ యశ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణలో యశ్ విచారణ పరిధిలోని వ్యక్తి కాదని, నోటీసులు ఇవ్వడం తప్పని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఆర్.కృష్ణ కుమార్ నోటీసులను రద్దు చేస్తూ అదేశాలిచ్చారు. కాగా, యశ్ నటించిన కొత్త సినిమా ట్యాక్సిక్ విడుదలకు సిద్ధమైంది. కేజీఎఫ్–2 తరవాత వస్తున్న యశ్ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
పోలీసులకు కేజీఎఫ్ హీరో మదర్ ఫిర్యాదు.. అంతా ఆ సినిమా వల్లే!
కేజీఎఫ్ హీరో యశ్ మదర్ పుష్పలత పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది నిర్మాతగా ఆమె నిర్మించిన కోతలవాడి మూవీ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ ప్రమోషన్స్ విషయంలో తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు చిత్ర ప్రమోటర్ హరీష్ అరసుపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తనకు రూ.65 లక్షలు మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను బెదిరించాడని పుష్పలత పోలీసులకు తెలిపారు.కాగా.. పాన్-ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్పలత.. పిఏ ప్రొడక్షన్స్ అనే తన సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పేరు పుష్ప, ఆమె భర్త అరుణ్ కుమార్ మొదటి అక్షరాలు వచ్చేలా పెట్టారు. ఈ బ్యానర్లో తన మొదటి ప్రాజెక్ట్ కోతలవాడి పేరుతో సినిమా తెరకెక్కిచారు. ఈ చిత్రానికి శ్రీ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు పృథ్వీ అంబార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. -
రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యష్. ట్రోల్స్‌పై స్పందించిన సద్గురు!
ప్రస్తుతం మన దేశంలో అత్యంత పేరొందిన ఆధ్యాత్మిక గురువుగా సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev ) చెప్పొచ్చు. ఆయనకు ఏ ఆధ్యాత్మిక గురువుకూ లేనంతగా సినిమా రంగంలో అభిమానులు ఉన్నారు, అలాగే సినీ రంగంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన శివరాత్రి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో తారలు హాజరై నృత్యాలు చేయడం చూస్తుంటాం. అలాగే తరచుగా సినిమా నటీనటులు, ఇతర ప్రముఖులు ఆయనతో సంభాషణలు జరుపుతూ ఉండడం ఆ విశేషాలు మీడియాలో బాగా హల్ చల్ చేయడం తెలిసిందే. అదే క్రమంలో ఆయన ఇటీవల ప్రతిష్టాత్మక చిత్రం ’రామాయణ’(Ramayana) నిర్మాత నమిత్ మల్హోత్రాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముని పాత్రను రణబీర్ కపూర్ పోషించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రణబీర్ గతంలో పోషించిన పాత్రలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తల గురించి సైతం ప్రస్తావిస్తూ పెద్ద యెత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఈ సంభాషణలో ఇద్దరూ చర్చించారు. దీని గురించి సద్గురు మాట్లాడుతూ ‘రామ్ పాత్ర కు రణబీర్ సరికాదని చెప్పడం న్యాయమైన తీర్పు కాదు అతను ఏదో ఒక విధంగా గతంలో నటించాడనేది అప్రస్తుతం.. రేపు, మరొక సినిమాలో, అతను రావణుడిలా నటించవచ్చు. అతను ఒక ప్రొఫెషనల్ నటుడు. అంతవరకు చూడాలి. అయితే ఒకటి సినిమా అనేది నటులు లేదా దర్శకుల వల్ల కాదు, ప్రజల వల్ల నడుస్తుంది. కాబట్టి, వారి అంచనాలను కూడా పూర్తిగా తోసిపుచ్చలేం’’ అంటూ వ్యాఖ్యానించారు.కేజీఎఫ్ స్టార్ యష్(Yash)ను రావణుడిగా ఎంపిక చేయడం పట్ల సద్గురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యష్ నాకు బాగా తెలుసు. అతను ఈ సినిమా లో రావణుడు ఎలా అయ్యాడో నాకు తెలియదు. విలన్ అంటే అతనికి చట్టి ముక్కు వంటివి ఉంటాయి. అయితే యష్ ఒక అందమైన వ్యక్తి కదా అంటూ ఆ పాత్రకు యష్ ఎంపిక పట్ల సద్గురు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై సినిమా నిర్మాత నమిత్ తన వైఖరిని సమర్థించుకుంటూ అవును మీరన్నది నిజమే. అతను చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు దేశంలో చాలా ప్రతిభావంతుడైన స్టార్ కూడా ‘మేం ఆ పాత్ర ఒక సూపర్ స్టార్ స్థాయి వ్యక్తి పోషించాలని అనుకున్నాం. అంతేకాక అతను కూడా ఆ పాత్ర పోషణను చాలా ఇష్టపడ్డాడు.’’ అంటూ యష్ ఎంపిక గురించి చెప్పాడు. అయితే, సాధారణంగా విలన్లు ఒక ప్రత్యేక రూపంతో ముఖ్యంగా చదునైన ముక్కును కలిగి ఉంటారే తప్ప పదునైన ముక్కు తో ఉండరని సద్గురు అంటూ అది మీరు గమనించారా?‘ అని అంటే... ‘ఇకపై గమనిస్తాను’ అంటూ నమిత్ చమత్కరించారు.ఇదే చర్చలో ఒక సందర్భంలో తెలుగు దిగ్గజ కధానాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కూడా సద్గురు ప్రస్తావించడం విశేషం. ఎన్నో సినిమాల్లో ఎన్టీయార్ కృష్ణుడిగా కనిపించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, అదే ఆయనను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నికల్లో గెలిచేందుకు కూడా దోహదం చేసిందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా, సోషల్ మీడియాలో...ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తింది. భక్తి చిత్రాలకు ఎంపిక చేసేటప్పుడు చిత్రనిర్మాతలు ఆధ్యాత్మిక నాయకులను సంప్రదించాలా? దీనిపై తెలుగు దర్శకుడు డాలీ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘సద్గురు గొప్ప వ్యక్తి, ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించే ధైర్యం చేయను. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉంటారు. కానీ పాత్రల ఎంపిక విషయంలో చివరికి, నిర్మాత దర్శకుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి రణ్‌బీర్‌ను రామ్‌గా, యష్‌ను రావణ్‌గా నటింపజేయడం ఉత్తర దక్షిణ భారత ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునే ఒక తెలివైన ప్రయత్నం. రణ్‌బీర్ అద్భుతంగా నటించగలడు..అలాగే యష్ కూడా మెరిపిస్తాడు. ఇక ట్రోల్స్ అంటారా? విశాల థృక్పధం లేని ట్రోల్‌లను విస్మరించడం ఉత్తమం‘ అంటూ స్పష్టం చేశారు. -
కేజీఎఫ్ హీరో టాక్సిక్‌పై రూమర్స్.. నిర్మాతలు ఏమన్నారంటే?
కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్-2 రిలీజై ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. దీంతో టాక్సిక్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆతృతగా ఉన్నారు. అయితే ఈ మూవీపై కొన్ని రోజులుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. టాక్సిక్ రిలీజ్ వాయిదా పడనుందని తెగ టాక్ నడుస్తోంది. దీంతో యశ్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మేకర్స్ స్పందించారు. తమ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టాక్సిక్ను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇంకా 140 రోజులే.. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ సందడి చేయనుందని వెల్లడించారు. తరణ్ ఈ ప్రకటనతో గత కొద్ది కాలంగా వస్తున్న వాయిదా రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.కాగ.. టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుంచే పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా వీఎఫ్ఎక్స్ పనులు ప్రారంభమమైనట్లు తెలుస్తోంది. మరో వైపు యశ్ ప్రస్తుతం ముంబయిలో రామాయణ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. టాక్సిక్ సినిమాకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు టాక్. ఈ సినిమా కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.140 days to go…His Untamed Presence,Is Your Existential Crisis.#ToxicTheMovie releasing worldwide on 19-03-2026 https://t.co/9RC1D6xLyn— KVN Productions (@KvnProductions) October 30, 2025 -
యశ్ 'టాక్సిక్'లో జరుగుతున్న మిస్టరీ! ఇండస్ట్రీ టాక్ ఇదే!
-
యాష్ బాలీవుడ్ ఎంట్రీ.. షారుఖ్ సినిమాలో విలన్ గా ఛాన్స్!
-
సలార్ సినిమాటోగ్రాఫర్ పెళ్లి.. సందడి చేసిన కేజీఎఫ్ హీరో..!
కేజీఎఫ్ హీరో యశ్ (yash) తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రముఖ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినిమాటోగ్రాఫర్ భూవన్ గౌడ వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించిన యశ్.. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ఎంటర్ప్రెన్యూరర్ నిఖితను పెళ్లాడారు. భువన్ గౌడ, నికిత వివాహానికి కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు.కాగా..హీరో యశ్, భువన్ గౌడ కేజీఎఫ్ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ సినిమాలకు గానూ అతను ప్రశంసలు అందుకున్నారు. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్ చిత్రానికి కూడా పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీకి కూడా భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. అంతేకాకుండా కన్నడలో 'లోడ్డే', 'రథావర', 'భరాతే' వంటి చిత్రాలకు పనిచేశాడు.కాగా.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేజీఎఫ్ హీరో యశ్ (yash) ప్రస్తుతం టాక్సిక్(toxic) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇదేందయ్యా యష్.. నిజమేనా..?
-
నన్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: యశ్ తల్లిపై హీరోయిన్ ఫైర్
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), హీరోయిన్ దీపికా దాస్ వరుసకు కజిన్స్ అవుతారు. కానీ, ఎక్కడా తమ చుట్టరికాన్ని బయటకు చెప్పకుండా ఎవరి కెరీర్ వారే నిర్మించుకున్నారు. అయితే యశ్ తల్లి పుష్ప ఇటీవల నిర్మాతగా మారి కొత్తలవాడి సినిమా తీసింది. ఆగస్టు 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పుష్ప.. దీపికా దాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఆమె గురించి ఎందుకు?నెక్స్ట్ సినిమాలో దీపికా దాస్‌ను ఎంపిక చేసుకునే ఆలోచనలున్నాయా? అన్న యాంకర్ ప్రశ్నపై పుష్ప అసహనం వ్యక్తం చేసింది. అస్తమానూ ఆమె గురించే ఎందుకు అడుగుతారు? రమ్య రక్షిత.. ఇలా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. దీపిక పెద్ద స్టార్ హీరోయినా? ఆమె ఏం సాధించిందని తన గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు? అని మండిపడింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది.గౌరవం ఇవ్వడం నేర్చుకోండిరెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా ఈ వివాదంపై దీపికా దాస్ స్పందించింది. కొత్తగా ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులకు పరిచయం చేయాలనుకునేవారు, ముందుగా ఆ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సినీ ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు సంపాదించుకునేందుకు ఎవరి పేరు కూడా వాడుకోలేదు. అవతల ఉన్నది అమ్మ అయినా పుష్పమ్మ అయినా సరే.. నా గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.అందుకే మౌనంగా ఉన్నాఏదో వారిపట్ల గౌరవంతో ఇంతవరకు సైలెంట్‌గా ఉన్నాను తప్ప భయంతో కాదు! నేను పెద్దగా ఏదీ సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నాగురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా? కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని ఘాటుగా రియాక్ట్ అయింది. నాగిని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దీపికా దాస్ కన్నడ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.చదవండి: ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్ -
హాలీవుడ్ యాక్షన్
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్–అప్స్’. ఈ ద్విభాషా(ఇంగ్లిష్, కన్నడ) చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్నారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీ ‘టాక్సిక్’ సినిమాకు వర్క్ చేస్తున్నారు.తన హాలీవుడ్ స్టంట్ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ‘టాక్సిక్’ కోసం 45రోజుల సుదీర్ఘమైన యాక్షన్ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబైలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో పెర్రీ తన రెగ్యులర్ స్టంట్ టీమ్‌ని పక్కన పెట్టి, ఇండియన్ స్టంట్ టీమ్‌తో వర్క్ చేయనుండటం విశేషం.ఈ అంశంపై జేజే పెర్రీ మాట్లాడుతూ–‘‘నా 35 ఏళ్ల కెరీర్లో 39 దేశాల్లో పని చేశాను. భారతీయ సంస్కృతి, నాగరికత ఎంతో గొప్పది. మా అమెరికన్ కల్చర్ కొన్ని వందల ఏళ్ల క్రితంనాటిదే. భారతీయ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. ఇండియన్ స్టంట్ టీమ్ వరల్డ్ క్లాస్‌గా ఉంది. ‘టాక్సిక్’ కొత్త షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
'ఘాటి' హక్కులు దక్కించుకున్న స్టార్ హీరో మదర్
కన్నడ హీరో యష్ మాతృమూర్తి 'పుష్ప' నిర్మాతగా కొద్దిరోజుల క్రితమే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఇప్పుడు పాన్ ఇండియా సినిమాను కన్నడలో విడుదల చేసేందుకు ఆ చిత్ర హక్కులను పొందారు. పుష్ప తన భర్త అరుణ్ కుమార్‌తో కలిసి PA (Pushpa Arun Kumar) ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. రీసెంట్గా కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. ఇప్పుడు అనుష్క నటించిన ఘాటీ చిత్రం కర్ణాటక హక్కులను ఆమె పొందారు.అనుష్క ప్రధానపాత్రలో నటించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఘాటీ చిత్రాన్ని కర్ణాటకలో యష్ అమ్మగారు పుష్ప విడుదల చేయనున్నారు. దీంతో కన్నడలో మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయి. -
కేజీఎఫ్ మూవీ యశ్ కోసం కాదట.. నిర్మాణ సంస్థ ఏమందంటే?
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. కోలార్ గనుల నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు కన్నడ స్టార్ యశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాలను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.అయితే ఇటీవల కేజీఎఫ్ సినిమాకు మొదట అనుకున్నది యశ్ కాదంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ వార్తలపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఇవన్నీ తప్పుడు కథనాలు అంటూ కొట్టిపారేసింది. ఈ కథను యశ్ కోసమే సిద్ధం చేశామని తెలిపింది. యశ్‌తో తమకు దీర్ఘకాలం భాగస్వామ్యం ఉందని.. తాను మా కుటుంబంలో ఓ భాగమని పంచుకున్నారు. అతను ఎల్లప్పుడూ మా రాకీ భాయ్‌గానే గుర్తుంటాడని హోంబలే ఫిల్మ్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.కేజీఎఫ్ సినిమాలతోనే కన్నడ సినిమా పాన్ ఇండియాలో గుర్తింపు వచ్చిందని హోంబాలే ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేజీఎఫ్ తర్వాత కాంతార లాంటి చిత్రాల విజయం కన్నడ సినిమా ఇమేజ్ను పెంచిందన్నారు. కర్ణాటక వెలుపల కన్నడ చిత్రాల గురించి చాలా మందికి తెలియదని.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.కాగా.. 2018లో విడుదలైన కేజీఎఫ్: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా నిలిచింది. 2022లో విడుదలైన కేజీఎఫ్- 2 మరిన్ని రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది. -
'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. -
భారత్‌లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రంగా 'రామయణ'అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్‌లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్‌లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్ మొదలైంది. రామయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది.భారీ తారాగణంరామాయణ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంస్ధతో మ్యాజిక్ఈ మూవీ కోసం ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్‌లను మేకర్స్ అందించనున్నారు. అందు కోసం కోట్ల రూపాయలే ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బ్రిటిష్-ఇండియన్ VFX కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కు గాను ఎనిమిది ఆస్కార్ అవార్డ్‌లను గెలుచుకుంది. ఆపై ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. -
'రామాయణ' సినిమా నుంచి ఫస్ట్ వీడియో విడుదల
'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఏఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్-2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. -
మీ కుమారుడితో సినిమా తీస్తారా?.. కేజీఎఫ్ హీరో యశ్ తల్లి ఆసక్తికర సమాధానం..!
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్. శాండల్‌వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు.అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్‌తో సినిమా చేయనని షాకింగ్ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్‌తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్‌కుమార్. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం. -
'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?
రామాయణం ఆధారంగా మన దేశంలో చాలా సినిమాలు ఇదివరకే తీశారు. తీస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ 'ఆదిపురుష్' ఇలానే తీశారు. కానీ గ్రాఫిక్స్, పాత్రల తీరుతెన్నులు దారుణంగా ఉండేసరికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు 'రామాయణ్' పేరుతో హిందీలో మళ్లీ సినిమా తీస్తున్నారు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో 'యానిమల్' ఫేమ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్ర చేస్తోంది. 'కేజీఎఫ్' యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )) ప్రస్తుతానికైతే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రావణుడి భార్య పేరు మండోదరి. రామాయణ్ మూవీలో ఈమె పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. మరి కాజల్ నిజంగా ఒప్పుకొందా? లేదంటే ఇవి రూమర్స్ మాత్రమేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీతో దర్శకనిర్మాతలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి?(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
చైనా ట్రిప్ వేసిన 'బిగ్ బాస్' సోనియా.. భర్తతో కలిసి (ఫొటోలు)
-
ముంబైలో రావణుడు
ముంబైలో ల్యాండ్ అయ్యారు హీరో యశ్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలోని రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడు పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు యశ్. ఈ షెడ్యూల్లో యశ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరుగుతుందని, రణ్‌బీర్ కపూర్ పాల్గొనరని సమాచారం. ఇక ‘రామాయణ’ తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పిల్లలతో రాధిక సమ్మర్ వెకేషన్.. యష్ ఎక్కడ? (ఫోటోలు)
-
నాకు పొగరనుకున్నారు.. సినిమా ఛాన్సులు కోల్పోయా: యష్
కేజీఎఫ్ (K.G.F Movie)తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్ (Yash). అభిమానులు ఈయనను వెండితెరపై చూసి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యష్.. టాక్సిక్: ఎ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అటు బాలీవుడ్లో రామాయణ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఇతడు బెంగళూరులో జరిగిన మనడ కదలు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. యోగరాజ్ భట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది. తలపొగరు అనుకున్నారుట్రైలర్ రిలీజ్ అనంతరం యష్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అందరూ నాకు పొగరు అనుకునేవారు. ఎందుకంటే దర్శకులను నేను స్క్రిప్ట్ కాపీ అడిగేవాడిని. కథ నచ్చకపోతే, దానిపై నాకు నమ్మకం కుదరకపోతే సినిమా ఎలా చేయగలను? ముందు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక సినిమా మొదలుపెడదాం అనుకునేవాడిని. అది కొందరికి నచ్చేది కాదు దీనివల్ల చాలా సినిమాలు కోల్పోయాను. అయితే మొగ్గిన మనసు సినిమా నిర్మాత నన్ను బలంగా నమ్మాడు. ఆయన వల్ల చివరి నిమిషంలో ఆ సినిమాలో జాయిన్ అయ్యాను. ఆ సినిమాయూనిట్పై ఇప్పటికీ గౌరవం..దర్శకుడు శశాంక్ కథ పూర్తిగా చెప్పడంతోపాటు నా పాత్ర గురించి కూడా వివరించాడు. ఇప్పటికీ ఆ ఇద్దరిపై, ఆ సినిమా యూనిట్ మొత్తంపై నాకు ఎనలేని గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు. టాక్సిక్ గురించి అప్డేట్ అడగ్గా.. ఇది సందర్భం కాదని దాటవేశాడు. తమపై నమ్మకం ఉంచి ఓపిక పట్టమని కోరాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్ 2026 మార్చి 19న విడుదల కానుంది. ఇందులో నయనతార, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: అమృతం నటుడు -
యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?
'కేజీఎఫ్' పేరుతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గుర్తొస్తారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో వీళ్ల కెరీరే మారిపోయింది. ప్రస్తుతం నీల్.. తారక్ తో మూవీ చేస్తుండగా, యష్ 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. భారీ స్థాయిలో తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో షూటింగ్ వల్ల ఈ మూవీ వివాదంలోనూ చిక్కుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)మార్చిలో అంటే పరీక్షల సీజన్. అయినా సరే యష్ వస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. మరోవైపు తర్వాత వారమే అంటే మార్చి 26న నాని 'ప్యారడైజ్' రిలీజ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్టుని కూడా 26నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం 'టాక్సిక్' వల్ల చరణ్ కి కాస్త ఇబ్బంది ఉండొచ్చు.ఎందుకంటే యష్, చరణ్.. ఇద్దరివీ పాన్ ఇండియా మూవీసే. వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజై హిట్ అయితే పర్లేదు. లేదంటే మాత్రం ఒకరి వల్ల మరొకరికి వసూళ్లపై దెబ్బ పడే ఛాన్స్ ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్‌ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి
కన్నడ స్టార్ యశ్ (Yash), నటి దీపికా దాస్ దగ్గరి బంధువులు. వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లవుతారు. కానీ ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు పెద్దగా మాట్లాడుకోరు, కలిసి కనిపించరు. దీంతో వీరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అన్న రూమర్లు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది దీపిక. దీపికా దాస్ (Deepika Das) ముఖ్య పాత్రలో నటించిన కన్నడ చిత్రం పారు పార్వతి. ఈ మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యష్‌తో విభేదాలుసినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె యశ్‌తో విభేదాలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించింది. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మేము బాగానే ఉన్నాం. కాకపోతే వృత్తిపరంగా ఎవరి కెరీర్‌ను వారే నిర్మించుకోవాలనుకున్నాం. సినిమాలను మా మధ్యలోకి రానివ్వం. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. పదేపదే మా బంధాన్ని పబ్లిక్‌లో చెప్పాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం.గోప్యతకే ప్రాధానంఅలాగే నేనేదైనా మంచిపని చేస్తే యశ్ నన్ను అభినందిస్తాడు. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం మాకు నచ్చదు. పాజిటివ్, నెగెటివ్ ఏదైనా కానీ చిన్న వార్త దేశమంతా చుట్టేస్తోంది. అందుకే మా వ్యక్తిగత జీవితాలను గోప్యంగానే ఉంచుకుంటాం, అందరికీ చెప్పాలనుకోం. మా కుటుంబాలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తాయి. అందువల్ల ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే మేము కలుసుకుంటూ ఉంటాం.సంతోషంగా ఉందియశ్ కన్నడ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అతడు కొనసాగుతున్న కన్నడ చలనచిత్ర పరిశ్రమ (Sandalwood)లో నేనూ ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. అతడు మున్ముందు సాండల్‌వుడ్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్నాడు.చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
టాక్సిక్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్న యాష్
-
ఇంగ్లిష్‌లో యశ్ ‘టాక్సిక్’
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్(yash). ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్(toxic): ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని కన్నడతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లిష్‌లోనూ చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యంలో రాబోతున్న ‘టాక్సిక్’ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇంగ్లిష్‌లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. మా సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అవుతుంది’’ అని వెంకట్ కె.నారాయణ తెలిపారు. -
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్‌గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చిరంజీవితో జయమాల..కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్‌గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్‌గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించింది జయమాల. -
తీసిన సీన్స్ మళ్ళీ చేస్తున్న యశ్
-
టాక్సిక్‌లో నయనతార ఫిక్స్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి చిత్రాలతో రాఖీ భాయ్‌గా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్నారు యశ్. ఆ సినిమాల తర్వాత యశ్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’. ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా జరుగుతోంది. అయినప్పటికీ హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో కియారా అద్వానీ, కరీనా కపూర్, నయనతార వంటి హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి.ఫైనల్‌గా యశ్‌కి జోడీగా నయనతార(Nayanthara) నటిస్తున్నట్లు ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ మాటలతో స్పష్టత వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ ఒబెరాయ్ మాట్లాడుతూ– ‘‘యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా భాగమయ్యారు. ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్‌దాస్ ఓ ప్రకటన చేస్తారు. అప్పటివరకు వేచి చూడండి’’ అని పేర్కొన్నారు. ఇక నయనతార గురించి దర్శక–నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
సేమ్ లుక్.. సేమ్ స్టైల్.. యష్ 'టాక్సిక్' టీజర్ పై ట్రోల్స్..!
-
'యశ్' బర్త్‌డే స్పెషల్.. 'టాక్సిక్' నుంచి అదిరిపోయే వీడియో
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా యశ్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను పంచుకుంది. గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో ‘టాక్సిక్’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్‌లో స్టార్ నటీనటులు నటించననున్నారు అని యూనిట్ పేర్కొంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన కేజీఎఫ్ చిత్రంతో యశ్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కేజీఎఫ్-2తో ఆయన మార్కెట్ పెరిగింది. ఈ చిత్రాలతో విపరీతమైన పాపులారిటీ దక్కడం వల్ల తన తర్వాతి సినిమా ఏ స్థాయిలో ఉండాలి అనే అంశంలో కాస్త టైమ్ తీసుకున్నాడు. అందుకే 2022 నుంచి ఆయన మరో సినిమా చేయలేదు. తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో టాక్సిక్ స్టోరీ నచ్చడం ఆపై నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాక్సిక్ షూటింగ్ ప్రారంభమైంది.రిలీజ్ ఎప్పుడు..?టాక్సిక్ సినిమాను వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, తాజాగా రిలీజ్ అయిన వీడియోలో సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో మేకర్స్ ప్రకటించలేదు. ఈ ఏడాది ముగింపు నెల డిసెంబర్ నెలలో టాక్సిక్ విడుదల కావచ్చని తెలుస్తోంది.టాక్సిక్‌లో బాలీవుడ్ బ్యూటీఈ చిత్రంలో కరీనా కపూర్ ( Kareena Kapoor ) ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతి హాసన్ , సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. యశ్‌కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా..? యశ్‌తో కియారా జోడీ కడతారా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.రామాయణంలో యశ్నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ చిత్రంలో రావణుడిగా యశ్ నటించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా ఉన్నారు. యశ్‌కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి 'రామాయణ' పేరుతో సినిమా రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బర్త్ డే వేడుకల్లో విషాదం.. అభిమానులకు కేజీఎఫ్ హీరో విజ్ఞప్తి
కేజీఎఫ్ హీరో, కన్నడ సూపర్ స్టార్ యశ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన బర్త్ డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్‌టౌన్‌కు రావద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్‌కు సూచించారు. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి యశ్ పోస్ట్ చేశారు.కాగా.. యశ్ తన పుట్టిన రోజును జవనరి 8న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని.. పుట్టిన రోజు అందుబాటులో ఉండనని తెలిపారు. అయినప్పటికీ మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యశ్ లేఖను విడుదల చేశారు. మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని.. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు అంటూ యశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఈ ఏడాది విషాదం..ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది. ఆయన బ్యానర్‌ను కడుతూ ముగ్గురు అభిమానులు విద్యాదాఘాతంలో మృతిచెందారు. కర్ణాటకలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు.మరో ముగ్గురికి గాయాలు..ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది కూడా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని లేఖ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 🙏 pic.twitter.com/lmTH0lqiDx— Yash (@TheNameIsYash) December 30, 2024 -
హీరోకన్నా విలన్ కు ఎక్కువ పేమెంట్
ఏదైనా సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ఖర్చు లెక్క రాసుకుంటే టాప్ రెమ్యునరేషన్ హీరోకు ఉంటుంది.. తరువాత హీరోయిన్.. అలా ఉంటుంది చివరి రేటు విలన్ కు ఉంటుంది. కానీ ఈ సరికొత్త రామాయణం సినిమాకు సంబంధించి హీరో అయిన రాముడి పాత్రధారి కన్నా విలన్ అయినా రావణుడి పాత్రధారికే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ అంటే అలాంటిలాంటి పేమెంట్ కాదండి.. ఏకంగా రెండొందల కోట్లు ఇస్తున్నారు. ఇంతకూ ఎవరా రాముడు.. ఎవరా రావణుడు అనేదేగా మీ అనుమానం..బాలీవుడ్ నిర్మాత, నటుడు నితీష్ తివారి నిర్మిస్తున్న రామాయణం(Ramayana) సినిమాకు సంబంధించి హీరోగా అంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ను ఎంపిక చేయగా అందులో మరో ప్రధాన పాత్రధారి అయిన రావణుడిగా కేజీఎఫ్ సిరీస్ హీరోగా చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన కన్నడ స్టార్ యష్(Yash) కు మాత్రం హీరోకన్నా ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఇచ్చిన పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు.. అన్నీకలిపి మొత్తం రూ. 200 కోట్లవరకు యష్ కు ఇచ్చేనందుకు తివారీ అంగీకరించారట. ఇది హిందీ సూపర్ స్టార్లు అయినా సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్ ల హీరోల పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది.(చదవండి: తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్)ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా రూ. 40 కోట్లలోపే తీసుకున్నారట. కానీ యష్ మాత్రం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకోవడాన్ని చూసి బాలీవుడ్ సైతం షాక్ అయిందని అంటున్నారు. సల్మాన్ , షారూక్.. అమీర్ ఖాన్లు సైతం ఇంతవరకూ హీరో పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సైతం తీసుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వంటివి అన్నీ కలుపుకున్న వారికి ఇంతవరకూ.. రూ. 150 కోట్లు దాటలేదట. కానీ తన అసాధారణ నటనతో కన్నడ బాక్సాఫీస్ కొల్లగొట్టిన యష్ మాత్రం విలన్ పాత్రకోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు నితీష్ తివారి అఫీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదంటే ఇక రణబీర్ కపూర్ పారితోషికం ఈయనతో సరికిపోల్చడం కూడా కుదరదు అంటున్నారు. ఇక షారూక్ వంటి స్టార్లతో సమానంగా పారితోషికం తీసుకున్నది సౌత్ ఇండియాలో ముగ్గురే ఉన్నారు. రజనీకాంత్, విజయ్ తలపతి , అల్లు అర్జున్ మాత్రమే ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట . మొత్తానికి మన సౌత్ ఇండియన్ నటుడు యష్ విలన్ పాత్రలో రెండు వందలకోట్ల పారితోషికం తీసుకుని బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరారు.- సిమ్మాదిరప్పన్న -
సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)
-
పదేళ్ల ప్రణయం తర్వాత పెళ్లి పీటలెక్కిన లవ్‌బర్డ్స్
-
యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు
'కేజీఎఫ్' ఫేమ్ యష్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఊహించని వివాదంలో ఈ చిత్రబృందం చిక్కుకుంది. అన్యాయంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అనేలా కర్ణాటక అటవీ శాఖ మూవీ టీమ్‌పై పోలీస్ కేసు పెట్టింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?బెంగళూరులోని పీణ్య-జలహళ్లి దగ్గరలో యష్ 'టాక్సిక్' మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న భూమికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములని గెజిట్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడి పర్స్ కొట్టేశారు)కానీ వ్యాపార అవసరాల కోసం హెచ్ఎంటీ భూమిని అద్దెకు ఇస్తోంది. ఈ క్రమంలోనే 'టాక్సిక్' చిత్రబృందం కొన్నిరోజుల కోసమా అని లీజుకు తీసుకుంది. కానీ సెట్స్ వేసేందుకు వందలాది ఎకరాల అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలొచ్చాయి. స్వయంగా అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఆ ప్రాంతాన్ని సందర్శించి మరీ శాటిలైట్ ఫొటోలు తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అనుమతి లేకుండా చెట్లను నరికడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.ఇది జరిగి కొన్నిరోజులు అవుతుండగా కర్ణాటక అటవీశాఖ ఇప్పుడు సీరియస్ అయింది. టాక్సిక్ మూవీ నిర్మాతలపై కేసు పెట్టింది. అలాగే కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడీ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
యశ్ ‘టాక్సిక్’ కోసం రంగంలోకి ‘అవతార్’ ఫైటర్స్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మలయాళ నటుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యశ్ సోదరి పాత్రలో నయనతార, యశ్ ప్రేయసిగా కియారా అద్వానీ నటిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల నయనతార, యశ్‌లు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు గీతూమోహన్ దాస్. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇందుకు హాలీవుడ్లో ‘జాన్ విక్: చాఫ్టర్2, ఎఫ్ 9, అవతార్: ద వే ఆఫ్ వాటర్’ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలకు పని చేసిన జేజే ఫెర్రీ ‘టాక్సిక్’ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలో వాలిపోయారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని యశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ తో ΄ాటుగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా చేస్తున్నారు యశ్. -
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
బర్త్ డే పార్టీలో కేజీఎఫ్ స్టార్.. అదరగొట్టేశాడుగా!
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాండల్‌వుడ్ హీరో యశ్. ప్రస్తుతం ఆయన టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది.అయితే తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ బర్త్ డే పార్టీకి హాజరైన కేజీఎఫ్ స్టార్ తనదైన స్టెప్పలతో హోరెత్తించారు. స్టార్ హీరో శివరాజ్‌కుమార్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ రాకింగ్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.వివాదంలో టాక్సిక్ టీమ్యశ్ నటిస్తోన్న టాక్సిక్ టీమ్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. రీసెంట్గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలొచ్చాయి.ఈ విషయంపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరంగా నిలిచిపోయింది.Rocking Star @TheNameIsYash bringing all the energy, dancing to Century Star @NimmaShivanna 's hit "Tagaru Bantu Tagaru" at Yatharv’s birthday party.#YashBoss #Shivanna pic.twitter.com/pM1mM413NZ— Bhargavi (@IamHCB) October 31, 2024 -
వివాదంలో 'కేజీఎఫ్' యష్.. ఏకంగా అటవీ భూమిలోనే
'కేజీఎఫ్' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న యష్.. ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలవగా.. రీసెంట్గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరాంగా నిలిచిపోయింది.(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)అటవీ, జీవావరణ, పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శికి రాసిన నోట్లో బెంగళూరులోని పీణ్య ప్లాంటేషన్ 1, ప్లాంటేషన్ 2లోని 599 ఎకరాల గెజిటెడ్ రిజర్వ్ ఫారెస్ట్ భూమిని హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT)కి చట్టవిరుద్ధంగా బదలాయించిన విషయాన్ని ఎత్తి చూపారు. హెచ్ఎంటీ ఆధీనంలో అటవీ భూమిని సినిమా షూటింగ్‌ల కోసం లీజుకు ఇస్తోందని, అటవీ భూమిలో అనధికారికంగా చెట్ల నరికివేత నేరమని మంత్రి ఈశ్వర్ చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.హెచ్ఎమ్టీకి ఈ భూమిని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అక్రమంగా విక్రయించింది. దీంతో అక్కడ చెట్ల నరికివేత జరిగింది. తాజాగా టాక్సిక్ షూటింగ్ కోసం చాలా చెట్లని కొట్టేసి మరీ సెట్ వేశారనే తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ఫొటోలని మంత్రి ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు!)ಎಚ್.ಎಂ.ಟಿ. ವಶದಲ್ಲಿರುವ ಅರಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ‘ಟಾಕ್ಸಿಕ್’ ಎಂಬ ಚಲನಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣಕ್ಕಾಗಿ ನೂರಾರು ಮರಗಳನ್ನು ಅಕ್ರಮವಾಗಿ ಕಡಿದು ಹಾನಿಗೊಳಿಸಿರುವ ವಿಚಾರ ಗಂಭೀರ ಚಿಂತೆ ಮೂಡಿಸಿದೆ. ಸ್ಯಾಟೆಲೈಟ್ ಚಿತ್ರಗಳಿಂದ ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದು, ಇಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದೇನೆ. ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯಕ್ಕೆ… pic.twitter.com/yrjHhG9kLA— Eshwar Khandre (@eshwar_khandre) October 29, 2024 -
సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్
కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఇతడు టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అలాగే భార్య రాధికతో తన అనుబంధం ఎలా ఉంటుందన్నది వెల్లడించాడు.నా అదృష్టంరాధిక నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. తనే నా బలం. ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడుతుంది. నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది. మొదట తనను స్నేహితురాలిగా చూశాను. తర్వాత భార్యగా స్వీకరించాను. నాకు ఏది నచ్చుతుంది? ఏంటనేది అన్నీ తనకు బాగా తెలుసు. అలాగే ఏదైనా సినిమా చేసినప్పుడు నా రెమ్యునరేషన్ ఎంత? ఫలానా మూవీ వల్ల ఎంత డబ్బు వస్తుంది? ఎంత సంపాదిస్తున్నావ్? వంటి ప్రశ్నలు వేయదు.ఒకే ఒక్కే ప్రశ్నకేవలం ఒకే ఒక్కే ప్రశ్న అడుగుతుంది.. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని! తనతో, కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం కేటాయించమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ టైమే నాకు పెద్దగా దొరకదు. అయినా సరే నావంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్యాషన్ (సినిమా) కోసం ఏం చేయడానికైనా వెనుకాడను. ఈ విషయంలో ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంటుంది. కాకపోతే ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? ఇంటికి ఎప్పుడు తిరిగొస్తావు? అని అడుగుతూ ఉంటారంతే అని చెప్పుకొచ్చాడు.ప్రేమ కహానీకాగా యష్, రాధిక 'నందగోకుల' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం తర్వాత ఫ్రెండ్షిప్గా, అనంతరం ప్రేమగా మారింది. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, శాంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్, మొగ్గిన మనసు, డ్రామా వంటి చిత్రాల్లోనూ కలిసి యాక్ట్ చేశారు. 2016లో యష్-రాధిక పెళ్లి చేసుకోగా వీరికి ఆర్య, యాత్రవ్ అని పిల్లలు జన్మించారు.చదవండి: 'అతను ఒక పవర్‌హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్! -
టాక్సిక్ ఆగిపోయిందా..? రాకీ భాయ్ ఫ్యాన్స్ కు టెన్షన్..
-
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్‌ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్‌గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్‌గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
టాక్సిక్ ఆరంభం
యశ్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. గురువారం బెంగళూరులో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘‘8.8.8న ఈ సినిమాను ఆరంభించాం. న్యూమరాలజీ ప్రకారం ఇది యశ్ బర్త్ డే (జనవరి 8)ని కూడా సూచిస్తుంది. పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో ‘టాక్సిక్’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్‌లో స్టార్ నటీనటులు నటిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
'టాక్సిక్' అధికారిక ప్రకటన.. ప్రభాస్‌తో పోటీ తప్పదా..?
కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ అధికారికి ప్రకటన వచ్చేసింది. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని యశ్ తెలిపారు. యశ్‌కు నంబర్ 8 అంటే చాలా సెంటిమెంట్. అందువల్లే నేడు (8-8-2024) టాక్సిక్ సెట్లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.వేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యశ్ ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించారు అయినా, ‘కేజీఎఫ్’ సిరీస్ వల్ల భారీ విజయాలను అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నయనతార భాగం కానున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల పేర్లు త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది.ఏప్రిల్ 10న టాక్సిక్ విడుదల అయితే ప్రభాస్‌తో పోటీ తప్పదు. అదేరోజున మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కూడా విడుదల కానుంది. రీసెంట్గా గ్ల్సింప్స్ కూడా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో సత్త చాటుతున్న ప్రభాస్ సినిమాకు పోటీగా టాక్సిక్ విడుదల కాకపోవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. -
దేవాలయాల సందర్శనలో 'కేజీఎఫ్' హీరో.. అన్నదానంలోనూ
'కేజీఎఫ్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ హీరో యష్ ఎక్కడా కనబడట్లేదు. 'టాక్సిక్' అనే మూవీ చేస్తున్నాడని అన్నారు గానీ లుక్ లాంటిదేం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల్ని కుటుంబంతో సందర్శిస్తూ కనిపించాడు. సామాన్యుడిలా దర్శనం చేసుకోవడమే కాదు అన్నదానంలోనూ సింపుల్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు!)'కేజీఎఫ్' తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడా? ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే 'టాక్సిక్' అనే మూవీని యష్ ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు అసలు షూటింగ్‌లోనే పాల్గొనలేదు. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆగస్టు 8 నుంచి యష్‌కి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.యష్‌కి బాగా కలిసొచ్చిన సంఖ్య 8. జనవరి 8వ తేదీన పుట్టాడు. బహుశా అందుకేనేమో ఈ నంబర్ కలిసొచ్చేలా ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖున షూటింగ్‌కి వెళ్లాలని ఇన్నాళ్లు ఆగినట్లున్నాడు. మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోతో పాటు అతడి తండ్రిని!) -
యశ్ 'టాక్సిక్' నిర్మాణ సంస్థకు కోర్టు నోటీసులు
కన్నడ హీరో యశ్ ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది. కేజీఎఫ్ సినిమాల తర్వాత యశ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ఆయన అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది.టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. టాక్సిక్ సినిమా సెట్‌ను అటవీ భూమిలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారని న్యాయవాది జి. బాలాజీ పిల్ దాఖలు చేశారు. వెంటనే సెట్‌ను క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిల్‌కు సంబంధించి కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు, హెచ్ఎంటిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.న్యాయవాది జి. బాలాజీ చెబుతున్న ప్రకారం అటవి ప్రాంతానికి సమీపంలోని 20 ఎకరాల స్థలం (అటవీ భూమి)లో అనధికారికంగా టాక్సిక్ సెట్‌ను నిర్మించారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ సెట్‌ను వెంటనే క్లియర్ చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ అంశంలో విచారణను ఆగష్టు 19కి కోర్టు వాయిదా వేసింది.నోటీసుల అంశంపై టాక్సిక్ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్ రియాక్ట్ అయ్యారు. సెట్ వేస్తున్న స్థలం తమ ఆత్మీయులదేనని ఆయన చెప్పారు. దీంతో కోర్టు నోటీసులు ఆఫీసుకి లేదా స్థలం యజమానికి వచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు. కెవిఎన్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ నుంచి టాక్సిక్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. -
5 మంది భామలతో రాకీ భాయ్ రొమాన్స్..
-
కెజియఫ్ 3 లో అజిత్.. కోలీవుడ్ షేక్..
-
శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ తారల లిస్ట్‌ను ప్రకటిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్‌లో జూన్ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్ మొదటిస్థానంలో నిలిచారు.తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్‌లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Ormax Stars India Loves: Most popular female Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/72De2ze5MK— Ormax Media (@OrmaxMedia) July 17, 2024Ormax Stars India Loves: Most popular male Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/NYPwHgPNUC— Ormax Media (@OrmaxMedia) July 17, 2024 -
యశ్ ‘ టాక్సిక్ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార!
తమిళసినిమా: కేజీఎఫ్ చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు నటించే చిత్రం అంటే ఆ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకూడదు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి. నటుడు యష్ అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారనిపిస్తోంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తరువాత ఈయన టాక్సిక్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. ముఖ్యంగా బీబీసీ సీరీస్ పిక్కీ బ్లైండర్స్ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ నాయకిగా నటించనున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యష్‌కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది. -
రాజధాని రౌడీ వస్తున్నాడు
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్గా నటించిన కన్నడ చిత్రం ‘రాజధాని’. కేవీ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం అందించారు. కన్నడలో విజయం సాధించిన ఈ మూవీని ‘రాజధాని రౌడీ’ పేరుతో సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ–‘‘మాదక ద్రవ్యాలు, మద్యపానం బారినపడి నలుగురు యువకులు వారి జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. చెడు పరిణామాలను ఎత్తి చూపించి, ఆలోచన రేకెత్తించే పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్ నటించారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు. -
కేజీఎఫ్ హీరో సూపర్ హిట్ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్ మంచి సందేశం ఇచ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
సినిమా కోసం నిజమైన బంగారం.. కారణం ఇదే
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.బారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ ధరించే ఆభరణాల నుంచి దుస్తులు, ఆయన ఉపయోగించే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రావణుడు లంకాధిపతి. ఆ నగరం మొత్తం బంగారంతో నిర్మితమై ఉందని ఇతిహాసాల్లో చెప్పారు. దీంతో సినిమాలో కూడా ఆ గొప్పతనాన్ని అలాగే చూపించాలని చిత్ర యూనిట్ భావించిందట. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రాన్ని నమిత్ మల్హోత్రా , యశ్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
సినీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే మన హీరోలు కూడా రొటీన్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో హీరో పాజిటివ్‌గా ఉంటే..విలన్ నెగటివ్‌గా ఉండేవాడు. కానీ ప్రస్తుతం హీరోనే విలన్‌గాను మారుతున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఒకే సినిమాలో నాయకుడిగా..ప్రతి నాయకుడిగానూ నటిస్తూ తమలో దాగిఉన్న మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి అంటున్న ఈ స్టార్ హీరోలపై ఓ లుక్కేయండి. -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
టాక్సిక్‌లో..?
యశ్ ‘టాక్సిక్’ సినిమాలో నయనతార భాగం కానున్నారా? అంటే అవుననే టాక్ కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది.దీనికి తోడు తాను సౌత్ సినిమా అంగీకరించినట్లు ఆ మధ్య కరీనా స్వయంగా వెల్లడించారు. అది ‘టాక్సిక్’ సినిమానే అనే ప్రచారం సాగింది. అయితే తాజాగా షూటింగ్ కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి కరీనా కపూర్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్లేస్‌లో నయనతారను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 2010లో ఉపేంద్ర నటించిన ‘సూపర్’ కన్నడలో నయనతారకు తొలి సినిమా. వార్తల్లో ఉన్న ప్రకారం నయనతార ‘టాక్సిక్’ సినిమా చేస్తే.. పద్నాలుగేళ్ల తర్వాత ఆమె కన్నడ సినిమా చేసినట్లవుతుంది. -
ఆ పాత్ర కోసం కేజీఎఫ్ హీరో సాహసం.. అదేంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం. -
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది. -
'రామాయణ' సినిమా కోసం నిర్మాతగా స్టార్ హీరో.. అధికారిక ప్రకటన
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ అధికారికంగా వచ్చేసింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి 'రామాయణ' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. 'US, UK, ఇండియా వంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు కూడా వెళ్లాను. నా జీవితంలో నేను చేసిన జర్నీ ప్రకారం ఇప్పుడు నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుంచి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరుకు, యశ్ చాలా కష్టపడ్డాడు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌ను ప్రపంచ వేదిక మీద ప్రెసెంట్ చెయ్యాలి అంటే అది యశ్ లాంటి వారితోనే సాధ్యమవుతుంది.' అని ఆయన అన్నారు. యశ్ మాట్లాడుతూ... ' నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, అందుకు రామాయణ సినిమానే కరెక్ట్ అనుకున్నాను. ఈ విషయంపై నమిత్‌తో నేను అనేక మార్లు చర్చించాను. కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మాములు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.' అని తెలిపారు. నమిత్ మల్హోత్రా యాజమాన్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో గ్లోబల్ కంటెంట్‌ను సినిమా చిత్రీకరించే ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ మూడు సినిమాల నిర్మాణంలో భాగమై ఉంది. అందులో రామాయణం కూడా ఒకటి. యశ్‌కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. -
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్‌కు సిస్టర్‌గా కరీనా కపూర్?
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతీహాసన్, సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. మరి.. యశ్‌కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా? యశ్‌తో కియారా జోడీ కడతారా? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రితో ఆయన మరణిచారు. అనంతరం డేనియల్ నేత్రాలు ఒక ట్రస్ట్‌కు దానం చేశారు. 48 ఏళ్లు పూర్తి అయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాధించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలురకాలుగా ప్రచారం జరుగుతుంది. వీటంన్నిటిక సమాధానం ఆయన గతంలోనే పలు ఇంటర్వ్యూలలొ పంచుకున్నాడు. కుటుంబ నేపథ్యం డేనియల్ బాలాజీ తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన వ్యక్తి, ఆయన అమ్మగారు మాత్రం తమిళనాడుకు చెందిని వారు. డేనియల్ తండ్రి చెన్నైలో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అక్కడ హౌల్‌సేల్ క్లాత్ షోరూమ్స్ వారికి ఉన్నాయి. డేనియల్‌కు ఐదుగురు సోదరులతో పాటు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు అలా మెత్తం 11 మంది వారి కుటుంబ సభ్యులు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే.. తనకు 25 ఎళ్ల వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పారట.. అందుకు కారణం తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్లు అయ్యాక వారి ఇబ్బందులు చూసి వద్దనుకున్నట్లు ఆయన చెప్పాడు. పెళ్లి తర్వాత, భార్యా, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని ఆయన చెప్పాడు. వారి కోసం డబ్బు కూడబెట్టాలి.. అందుకోసం ఒక్కోసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొందరిని మోసం చేయాల్సి వస్తుంది.. ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. సొంత డబ్బుతో గుడి నిర్మాణం చెన్నైలో కొట్టివాక్కం ప్రాంతంలో డేనియల్ ఉంటున్నారు. తన సొంత డబ్బుతో అక్కడ ఒక గుడిని ఆయన నిర్మించారు. ఆ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుందని ఆయన చెప్పారు. జాతర కోసం లక్షల్లో ప్రజలు వస్తారని తెలిపారు. 'సినిమా ద్వారా నేను కొంతమేరకు సంపాధించాను.. ఇప్పటికే తమిళ్,తెలుగు ప్రజల్లో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతకు మించి ఇంకేమీ వద్దు అనుకున్నాను. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ గుడిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోట్లలో సంపాదించారు. కానీ వారెవరూ గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈ గుడి కోసం ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ గుడి మొత్తం 4వేల చదరపు గజాలు ఉంది. ఒక రూమ్ మాదిరిగా ఉన్న ఈ గుడిని ఇప్పడు భారీగా నిర్మించాను. ఈ గుడి అంటే మా అమ్మకు కూడా ఎంతో నమ్మకం ఉంది. అందుకే నేను దీనిని ఎలాగైనా నిర్మించాలని కోరుకున్నాను.' అని గతంలో ఓ ఇంటర్వయూలో ఆయన చెప్పాడు. సినిమాల్లో నటించి వచ్చిన డబ్బంతా కూడా డేనియల్ ఆ గుడి కోసమే ఖర్చు చేశాడు. ఆలయ నిర్మాణ కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్‌లో పలు వార్తలు కూడా గతంలో వచ్చాయి. గుడి కోసం కేజీఎఫ్ యష్ సాయం డేనియల్ బాలాజీ కన్నడలో కూడా పలు సినిమాల్లో మెప్పించాడు. కేజీఎఫ్ యష్‌తో డేనియల్‌కు మంది స్నేహం ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో యష్ గురించి డేనియల్ ఇలా అన్నారు. ' కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ ఉంది అందులో నటించాలని యష్ నన్ను కోరాడు. కానీ నేను ఆ సమయంలో అందుబాటులో లేను. దానికి ప్రధాన కారణం గుడి నిర్మాణ పనులే. ఆలయానికి సంబంధించి చాలా కీలకమైన పనులు ఉండటంతో నేను రాలేనని యష్‌కు చెప్పాను. రెండు రోజుల తర్వాత యష్ నాకు కొంత డబ్బు పంపాడు.. ఎందుకు అని నేను కాల్ చేసి మాట్లాడాను. గుడి నిర్మాణం కోసం తన వంతుగా ఇస్తున్నాను అన్నాడు. గుడి నిర్మాణం తర్వాత కూడా యష్ ఇక్కడికి వచ్చాడు. అని ఆయన చెప్పారు. డేనియల్ మరణం తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక్కోక్కటిగా ఇలా బయటకొస్తున్నాయి. డేనియల్ విలన్ కాదు.. రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. "அங்காள பரமேஸ்வரி அம்மனுக்கு கோயில் கட்டிய நடிகர் டேனியல் பாலாஜி காலமானார்" 😥😢💔#RIPDanielBalaji #DanielBalaji #OmShanthi pic.twitter.com/YN7SVdG1SA — Aadhi Shiva (@aadhi_shiva1718) March 29, 2024 -
నిరాశే మిగిల్చనున్న రామాయణం మూవీ డైరెక్టర్
-
సౌత్ ఎంట్రీపై రూమర్స్.. హింట్ ఇచ్చిన కరీనా
ఉత్తరాది హీరోయిన్లు శిల్పా శెట్టి, ప్రీతీ జింతా, రవీనా టాండన్, కత్రినా కైఫ్ వంటివారు గతంలో సౌత్‌లో సినిమాలు చేశారు. ఆ తర్వాత కంగనా రనౌత్, ఈ రెండు మూడేళ్లల్లో శ్రద్ధా కపూర్, అలియా భట్ వంటి వారు దక్షిణాదిలో.. మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో నటించారు. తాజాగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తో దీపికా పదుకోన్, ఎన్టీఆర్ ‘దేవర’తో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ ప్రముఖ తార కరీనా కపూర్ సౌత్ సినిమాకి సై అన్నారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కరీనా.. యశ్‌తో నటించాలనుంది అన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ‘‘దక్షిణాదిలోని ఓ స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్ మూవీ. షూటింగ్లో పాల్గొనే టైమ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని కరీనా చెప్పారు. దాంతో ‘టాక్సిక్’ చిత్రాన్ని ఉద్దేశించే ఆమె ఈ విధంగా పేర్కొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. -
స్టార్ హీరోతో సినిమా.. తొలిసారి సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. చాలా కథలను విన్న యష్.. టాక్సిక్ స్టోరీ మెచ్చి ఈ చిత్రాన్ని ఫైనల్ చేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఫ్యాన్స్‌లో కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కనిపించనున్నట్లు ఆమె ఒక హింట్ అయితే కొద్దిరోజుల క్రితం ఇచ్చింది. దీంతో యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్'లో ఆమె నటించబోతున్నట్లు అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. టాక్సిక్‌లో యష్‌తో పాటుగా ఆమె కలిసి స్క్రీన్‌ను పంచుకోనుందని గతంలో కూడా పలు వార్తలు అయితే వచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పలు విషయాలను పంచుకున్న కరీనా.. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ ప్రాజెక్ట్ తనకు తొలి సౌత్ ఇండియా మూవీ అని పేర్కొంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నానని ఆమె పేర్కొంది. కానీ షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటానో తెలయదన్న ఈ బ్యూటీ.. ఆ సమయం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ విషయాన్ని కరీనా ప్రకటించడంతో ఆమెను ఫ్యాన్స్ అభినందించారు. 42 ఏళ్ల వయసులో యష్‌తో పాన్-ఇండియా చిత్రంలో కరీనా భాగం కానున్నడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 2025 ఏప్రిల్‌లో టాక్సిక్ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. యష్, గీతు మోహన్‌దాస్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది. కరీనా కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
ఎన్నికల ప్రచారానికి దూరంగా పాన్ ఇండియా హీరోలు.. కారణం ఇదేనా..?
కర్ణాటక మాండ్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలత అంబరీశ్ మరోసారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు కంచుకోట లాంటి మాండ్యలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఆమె ఓడించారు. సుమారు లక్షా ముపై వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కోసం పాన్ ఇండియా స్టార్లు అయిన యశ్,దర్శన్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కోసం పెద్ద ఎత్తున వారు పలు ర్యాలీలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కూటమి నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తానని సుమలత చెప్పారు. మాండ్య లోసకభ నియోజకవర్గం నుంచి వంద శాతం నాకే సీటు దక్కుతుందని ఆమె తెలిపారు. గత సారి జరిగిన ఎన్నికల్లో స్టార్ నటులు యశ్, దర్శన్ తనకు మద్దతుగా ప్రచారం చేశారని.. ఈసారి ఎన్నికల ప్రచారానికి వారిద్దరూ రాకపోవచ్చని ఆమె అన్నారు. అప్పుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను.. ఇప్పుడు బీజేపీ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతున్నాను. ఇప్పుడు వారిద్దరినీ ఇబ్బంది పెట్టవద్దనుకున్నాను. అయినా తాను తప్పకుండా గెలిచి తీరుతానని ఆమె చెప్పుకొచ్చారు. '2019 ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి ఇద్దరు స్టార్ నటులు యశ్, దర్శన్ నాతో కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు నేను బీజీపీ- జేడీఎస్ కూటమి తరుపున బరిలో ఉన్నాను కాబట్టి వారి అవసరం ఉండకపోవచ్చు. సుమారు 25 రోజుల పాటు గత ఎన్నికల్లో వారిద్దరూ నా వెంటే ప్రచారం చేశారు. వారు నా కోసం త్యాగం చేశారు. మద్దతు మాత్రమే కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా నాకు అండగా నిలిచారు. నా కోసం వారి విలువైన సమయాన్ని మళ్లీ మళ్లీ వదిలేయడం సరికాదు. నేను అంగీకరించను కూడా. యశ్, దర్శన్‌లు సినిమా షూటింగ్స్‌లలో బిజీగా ఉన్నారు. అవి వదిలేసి రావడం సరికాదు. వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల వారిపై పలు విమర్శలు వస్తున్నాయి. ఒక పార్టీ వైపు సినిమా నటులు ఉంటే.. వారి కెరియర్ మీద కూడా ప్రభావం పడవచ్చు. వారిద్దరూ ఎప్పటికీ నా ఇంటి బిడ్డలే.. ఒకవేళ నాకు వారి అవసరం ఉంది అంటే వారు తప్పకుండా వస్తారు. వారు వస్తే, నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. ఎన్నికల ప్రచారం కోసం యశ్ వస్తే నాకు గొప్ప శక్తి అవుతారని భావిస్తున్నాను.' అని సుమలత అన్నారు. -
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
రోడ్డు సైడ్ కిరాణా షాపులో పాన్ ఇండియా హీరో.. ఫొటోలు వైరల్
సినిమా హీరోలు బయట పెద్దగా కనిపించరు. రోడ్ సైడ్ షాప్స్‌లో అయితే వస్తువులు కొనడం, తినడం లాంటివి అస్సలు చేయరు. అలాంటిది పాన్ ఇండియా స్టార్, 'కేజీఎఫ్' హీరో యష్ హఠాత్తుగా ఓ కిరాణా దుకాణంలో ప్రత్యక్ష్యమయ్యాడు. పక్కనే అతడి భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఏం జరిగింది? 'కేజీఎఫ్' ఫేమ్ యశ్.. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఉత్తర కర్ణాటక జిల్లా భత్కల్‌లోని షిరాలీకి వెళ్లారు. అక్కడే చిత్రపుర మఠాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్య రాధిక.. ఐస్ క్యాండీ అడగడంతో దగ్గర్లోనే చిన్న దుకాణానికి వెళ్లారు. ఐస్ క్యాండీతో పాటు కొన్ని చాక్లెట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. యష్ కేరింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా భార్య కోసం ఐస్ క్యాండీ కొనడం చూసి మురిసిపోతున్నారు. ఇకపోతే 'కేజీఎఫ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'ట్యాక్సిక్'లో హీరోగా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?) -
అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు
రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అభిమానులకు సినిమా అందించాలని ఆయన కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యశ్ తనతో పాటు ఉన్న వారిని మాత్రం మరిచిపోలేదని చెప్పవచ్చు. యశ్‌కు దగ్గరైన వ్యక్తుల కుటుంబాల్లో ఏదైన వేడుక జరిగితే ఆయన ఖచ్చింతంగా హాజరవుతారు. ఒక్కోసారి తన సతీమణితో కలిసే వెళ్తారు కూడా.. తాజాగా 'టాక్సిక్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యశ్.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటికి తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. యశ్ దగ్గర చేతన్ అనే వ్యక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా యశ్ సినిమా కెరియర్ నుంచి అతను ఉన్నాడని చెప్పవచ్చు. చేతన్ 2021లో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో కూడా యష్, ఆయన సతీమణి రాధిక పండిట్లు చేతన్ పెళ్లి వేడుక జరిపించిన విషయం తెలిసిందే. (చేతన్ వివాహ సమయంలో.. యశ్, రాధిక పండిట్) చేతన్ దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించాడు. షూటింగ్ పనిలో బిజీగా ఉన్న యశ్ ఈ శుభ సమయంలో చేతన్ ఇంటికి చేరుకున్నాడు. వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దీంతో చేతన్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఆయన సింప్లిసిటీని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
రాముడిగా రణ్‌బీర్.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్!
‘యానిమల్’ సినిమాలో రణ్విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్, అబ్రార్‌గా బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా రణ్‌బీర్, బాబీ డియోల్‌లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్. (చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?) అన్నీ కుదిరి ‘రామాయణ్’ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్ సెట్ అయితే.. ‘యానిమల్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
హీరో 'యశ్' కోసం వెళ్తూ మరో యువకుడు మృతి
కన్నడ స్టార్ హీరో యశ్‌కు చెందిన మరో అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనవరి 8న ఆయన పుట్టినరోజు నాడు ఫెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.. సమాచారం తెలుసుకున్న యశ్ దిగ్భ్రాంతి చెందాడు. దీంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానం ద్వారా గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడకు నిన్న చేరుకున్నారు. (ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. ఆ కుటుంబాల బాధ్యత నాదంటూ కన్నీరు పెట్టుకున్న యశ్) గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి తమ అభిమాన హీరో యశ్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో అప్పటికే అక్కడ 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఆ సమయంలో నిఖిల్ కరూర్ (22) అనే యువకుడు యశ్‌ను చూసేందుకు స్కూటీలో అక్కడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నిఖిల్ కరూర్ అనే యువకుడు కొంత సమయం క్రితం మృతి చెందాడు. బింకడకట్టి గ్రామానికి చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జనవరి 8న సాయంత్రం గడగ్‌లోని తేజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యువకుడు పోలీసు వాహనాన్ని ఢీకొనడంతో స్కూటీ విడిభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానుల మృతితో కన్నీళ్లు పెట్టుకున్న హీరో యశ్
పాన్ ఇండియా స్టార్ యశ్ బర్త్ డే సందర్భంగా జనవరి 8న ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. వారందరి కుటుంబాలను హీరో యశ్ సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆపై వారికి ఆయన భరోసా ఇచ్చారు. షూటింగ్ కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్న యశ్ సంఘటన తెలియగానే ప్రత్యేక విమానంలో హుబ్లీకి వచ్చి ఆపై నేరుగా కారులో గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. తన పుట్టినరోజు నాడు చనిపోయిన యువకుల కుటుంబాలను చూసి ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యశ్ రాకతో అక్కడ రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి జనాన్ని అదుపు చేశారు. ఘటనా స్థలంలో ఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు సహా వంద మందికి పైగా పోలీసులు ఉన్నారు. ఆ కుటాంబాలను ఓదార్చిన అనంతరం మీడియాతో యష్ స్పందిస్తూ.. 'ఇలా జరిగే అవకాశం ఉంటుందనే నా పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారంటే నాకు చాలా బాధగా ఉంది. చేతికి వచ్చిన బిడ్డలు ఇక తిరిగిరారని తెలిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ యువకుల కుటుంబానికి ఏది అవసరమో అది నేను చేస్తాను. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారు. కానీ ఆ కుటుంబాల కోసం ఎప్పటికీ నేను అండగా ఉంటాను. వారి కుటుంబాలకు ఏది అవసరమో ఇక నుంచి నేను చేస్తాను. ఆ యువకులను తిరిగి పొందలేము కానీ ఆ కుటుంబాలకు నేను ఖచ్చితంగా కుమారుడి స్థానంలో ఉండి నా బాధ్యతను నెరవేరుస్తాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే మీ జీవితంలో సంతోషంగా ఉండండి, మా గురించి ఆలోచించకండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా.. మరోసారి ఇలాంటి పనులు చేయకండి.. ఇక నుంచైనా ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు వదిలేయండి. ఇంత ప్రమాదకరమైన ప్రేమను తెలపడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా బైక్‌లపై కొందరు యువకులు వెంబడిస్తున్నారు. ఇలాంటి మెచ్చుకోలు నాకు అక్కర్లేదు. అని యశ్ అన్నాడు. ఆ కుటుంబాలను చూసిన యశ్ కంటతడి పెట్టాడు.. కానీ వారందరికీ అండగా ఉంటానని ఆయన మాట ఇచ్చాడు. తన పుట్టినరోజు నాడు ఎలాంటి కటౌట్లు కట్టొద్దని ఆయన గతంలోనే ఫ్యాన్స్‌కు చెప్పాడు. అలాంటి పనులు జరిగే అవకాశం ఉంటుందని గతేడాది తన పుట్టినరోజు నాడే తెలిపాడు యశ్. 'రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే నివేదికల కారణంగా ఈసారి నా పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నేను షూటింగ్ పనిమీద గోవాలో ఉన్నాను. ఈ వార్త వినగానే నేను చాలా బాధపడ్డాను. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది కూడా ఈ ప్రమాదం జరిగింది. నా బర్త్ డే అంటేనే భయమేస్తోంది.' అని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సురంగి గ్రామం నుంచి జిమ్స్ ఆసుపత్రికి యశ్ వెళ్లారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య వివారులు అడిగి ఆయన తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఆయన తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం వారి వైద్య ఖర్చులు పూర్తిగా యశ్ చెల్లించినట్లు సమాచారం. వారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనను వ్యక్తిగతంగా కలవాలని యశ్ సూచించారట. ಕರೆಂಟ್ ಶಾಕ್ ನಿಂದ ಸಾವನ್ನಪ್ಪಿದ ಸುದ್ದಿ ತಿಳಿಯುತ್ತಿದ್ದಂತೆ ಶೂಟಿಂಗ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿ ನಟ ಯಶ್ ಕೂಡ ಗದಗಕ್ಕೆ ತೆರಳಿ ಸಾವನ್ನಪ್ಪಿದ ಮೂವರು ಅಭಿಮಾನಿಗಳ ಮನೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದರು.#yashfansdeath #yashfansgadag #happybirthdayyash #rockingstaryash #yash #starkannada #NammaSuperstars #aslamsuperstars pic.twitter.com/fiZsWED0xi — Namma Superstars (@nammasuperstars) January 8, 2024 -
కేజీఎఫ్ 'యశ్' పుట్టినరోజు.. ముగ్గురు యువకులు మృతి
కర్ణాటకలో ప్రముఖ హీరో యశ్‌కు చెందిన ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేడు (జనవరి 8) 38వ పుట్టినరోజును ఆయన జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఈ వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న లక్ష్మేశ్వర్ ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది సినిమాల పనుల కారణంగా విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ లేఖ రాసి అభిమానులకు తెలియజేశారు. ఈ సంఘటన గురించి యశ్ త్వరలో రియాక్ట్ కానున్నాడని తెలుస్తోంది. 'జనవరి 8.. నాపై మీకున్న ప్రేమను వ్యక్తిగతంగా చెప్పాలనుకునే రోజు.. పుట్టినరోజు మీతో గడపాలని ఉంది. కానీ సినిమా పనులు మాత్రం నన్ను బిజీగా ఉంచాయి. అనివార్యమైన ప్రయాణాల కారణంగా నేను ఈ జనవరి 8న మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మీ ప్రేమ వెలకట్టలేనిది.. నా పుట్టునరోజు నాడు నేను మీతో గడపలేకపోతున్నాననే బాధ నాలో కూడా ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను.. నేను ఎక్కడ ఉన్నా మీరందరూ నాతోనే ఉంటారు. మీ ప్రేమ, అభిమానమే నాకు పుట్టినరోజు కానుక.' అని యష్ నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేశాడు. -
సముద్ర తీరంలో రకుల్.. బ్లూ డ్రెస్‌లో ఉప్పెన భామ!
►సముద్ర తీరంలో రకుల్ పోజులు ►బ్లూ డ్రెస్‌లో ఉప్పెన భామ కృతి శెట్టి ►న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో కేజీఎఫ్ హీరో యశ్ ►ఫ్యామిలీతో హీరోయిన్ కాజోల్ న్యూ ఇయర్ ట్రీట్ ►భర్తతో కలిసి కత్రినా కైఫ్ చిల్ ►జైపూర్‌లో మాళవిక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ►న్యూ ఇయర్ వైబ్స్‌తో బుట్టబొమ్మ లుక్స్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Yash (@thenameisyash) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)


