బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆ పాత్రకు భారీగా డిమాండ్‌ చేసిన యశ్! | Kannada superstar Yash Demands RS150 crore for Nitesh Tiwari Ramayana | Sakshi
Sakshi News home page

Yash: నితీశ్ తివారీ రామాయణం.. కేజీఎఫ్ స్టార్ రూ.150 కోట్ల డిమాండ్!!

Oct 22 2023 6:58 PM | Updated on Oct 23 2023 1:34 PM

Kannada superstar Yash Demands RS150 crore for Nitesh Tiwari Ramayana - Sakshi

రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మరో బాలీవుడ్ డైరెక్టర్‌ పెద్ద సాహసానికి రెడీ అయ్యారు. రామాయణం ఆధారంగా భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. 

(ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!)

ఆదిపురుష్ లాంటి ఫలితం వచ్చిన తర్వాత కూడా బాలీవుడ్  దర్శకుడు నితేష్ తివారీ రామాయణం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. అయితే  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రావణుడి పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్‌ హీరో యశ్‌ను చిత్రబృందం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పాత్ర కోసం యశ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రావణుడి పాత్రకు దాదాపు రూ.150 కోట్లు డిమాండ్ చేశారని లేటేస్ట్‌ టాక్. అయితే ఇందులో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. తివారీ రామాయణం ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ద్వారానే యశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్‌-3 మూవీ కూడా చేయాల్సి ఉంది. 

(ఇది చదవండి: రన్‌ టైమ్‌ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement