ranbeer kapoor
-
హీరోగా రణ్‌బీర్.. విలన్‌గా సూర్య?
బాలీవుడ్ సక్సెస్ఫుల్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ధూమ్’ నుంచి ‘ధూమ్ 4’ రాబోతున్నట్లుగా కొన్ని రోజుల్నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘ధూమ్ 4’లో హీరోలుగా నటిస్తారనే వారిలో ఇప్పటికే షారుక్ ఖాన్ , ప్రభాస్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ధూమ్’ ఫ్రాంచైజీలోని ప్రతి భాగానికి కథ అందించి, నిర్మించిన ఆదిత్యా చో్ప్రా తాజాగా ‘ధూమ్ 4’ కథను కూడా రెడీ చేస్తున్నారని, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగానే నటీనటుల గురించిన వివరాలను ప్రకటిస్తారని బాలీవుడ్ సమాచారం. (చదవండి: హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు)అయితే ‘ధూమ్ 4’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తే బాగుంటుందని ఆదిత్యా చోప్రా అనుకుంటున్నారట. రణ్‌బీర్ కపూర్‌ను కలిసి ఆదిత్య మాట్లాడారని, ఈ హీరో కూడా ‘ధూమ్ 4’ పట్ల ఆసక్తిగా ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాలో సూర్య విలన్‌గా నటిస్తారట. రణ్‌బీర్ కపూర్ కెరీర్లో 25వ చిత్రంగా రానున్న ‘ధూమ్ 4’కు దర్శకత్వం వహించే వారిలో అయాన్ ముఖర్జీ, సిద్ధార్థ్ ఆనంద్ వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక శనివారం (సెప్టెంబరు 28) రణ్‌బీర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ధూమ్ 4’ వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ‘రామాయణ్’ చిత్రంతో బిజీగా ఉన్న రణ్‌బీర్ త్వరలోనే ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ తర్వాత ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ సెట్లోకి అడుగుపెడతారు. దీన్నిబట్టి ‘ధూమ్ 4’ గురించిన క్లారిటీ రావాలంటే మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. -
పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి అయిన ఇన్నాళ్లకి తన ఇంటి పేరును మార్చుకుంది. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో వివాహం తర్వాత తన ఇంటిపేరును మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఇటీవల అలియా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. జిగ్రా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తన పేరు పక్కన ‘కపూర్’ను చేర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు జిగ్రా టైటిల్స్ లో కూడా తన పేరు అలానే ఉంటుందని గందరగోళం వద్దని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ భాగంగా శనివారం ‘‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్-2’’ లో జిగ్రా టీమ్‌తో పాల్గొంది. ఈ సమయంలో ఒక అభిమాని హాయ్ అలియా భట్ అని సంబోధించగా, ‘‘నేనిపుడు అలియా భట్ కపూర్ అంటూ స్పందించింది అలియా దీంతో అభిమానులలో ఆనందం , ఆశ్చర్యం రెండింటినీ రేకెత్తించింది. మన భారత దేశంలో ప్రాంతాలను బట్టి, వివాహం జరిగిన తరువాత భార్యకు భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. ఇంటి పేరు మార్చుకోవాలా? వద్దా? అనేది ఇది వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)కాగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత 2022లో బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్రం, సడక్-2 లాంటి టాప్ మూవీలతోపాటు తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. రణ్‌బీర్, అలియాకు రాహా అనే కూతురు ఉంది. వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి! -
షూటింగ్ ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్.. చివరికి వాయిదా!
ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు ప్రకటన రోజే రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తున్నాయి. తీరా షూటింగ్ అయ్యేసరికి విడుదలను వాయిదా వేస్తున్నారు. తాజాగా అలా వాయిదా పడిన చిత్రమే ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్‌లో నటించనున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించి, 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. (చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!)ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. కానీ ‘లవ్ అండ్ వార్’ రిలీజ్‌ను మాత్రం వాయిదా వేశారు. 2026 మార్చి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదో పీరియాడికల్ ఫిల్మ్ అని, ముక్కోణపు ప్రేమకథగా ఉంటుందని సమాచారం. అలాగే వివాహం తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించనున్న చిత్రం కావడంతో ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలు ఉన్నాయి. -
ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్
సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రణ్‌బీర్‌తో పాటు బాబీ డియోల్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. తెరపై ఆయన కనిపించేది కాసేపయినా.. తనదైన నటనతో భయపెట్టాడు. అయితే పాత్ర కోసం బాబీ దాదాపు ఏడాదిన్నర వేచి చూశాడట. ఒకనొక దశలో సినిమాలో తన పాత్ర ఉంటుందో లేదో అని భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా బాబీ డియోలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒక రోజు నాకు సందీప్ వంగా నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను తీయబోతున్న కొత్త సినిమాలో విలన్ పాత్ర కోసం కలవాలని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. కథ చెప్పేందకు నా దగ్గరకు వస్తూ.. ఓ ఫోటోని తీసుకొని వచ్చాడు. అది నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఫోటో. అందులో నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నానని సందీప్ చెప్పడంతో ఆశ్చర్యపోయాను. కథ, నా పాత్ర నచ్చి వెంటనే ఒకే చెప్పేశాను. షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్న నన్ను మాత్రం పిలవలేదు. దీంతో నాకు అనుమానం కలిగింది. సందీప్ మనసు మార్చుకొని నా పాత్రను వేరే వాళ్లకి ఇచ్చాడేమో అనుకున్నాను. దాదాపు ఏడాదిన్నర తర్వాత నాకు పిలుపొచ్చింది.రణ్‌బీర్‌తో కలిసి నేను 12 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను. అయితే సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను తెరపై కనిపించేది కాసేపే అయినా.. ప్రతి ఒక్కరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించింది. సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయాను’అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’, బాలకృష్ణ 109వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్‌ను ఘనంగా నిర్వహించుకున్న లవ్‌బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణించే క్రూజ్‌లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్‌కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్‌లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్‌బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్‌బెల్స్, జిమ్ రోప్‌లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్‌బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్‌కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్‌బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ గతేడాది యానిమల్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అంతే కాకుండా మరో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ యానిమల్ హీరో దాదాపు రూ.8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలోని తన నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కాగా.. గతేడాది సైతం బెల్గ్రేవియా గ్రీన్ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేశాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను రణ్‌బీర్ కపూర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రాహా కపూర్ అనే కూతురు జన్మించారు. ఇటీవలే తమ కూతురి కోసం దాదాపు రూ.250 కోట్లతో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అత్యంత పిన్న వయసులోనే కోట్ల ఆస్తులున్న స్టార్ కిడ్‌గా రికార్డ్ సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. నితీష్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
బాలీవుడ్లో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఏకంగా షారుక్, అమితాబ్‌ను మించి!
గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరో రణ్‌బీర్ కపూర్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. రిచెస్ట్ స్టార్ కిడ్.. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్‌బీర్, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్‌తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు. -
ఓటీటీలో యానిమల్.. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది!
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే గతనెలలో ఓటీటీకి వచ్చేసిన యానిమల్.. అదే జోరుతో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే టాప్ టైన్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాకుండా మొదటి వారంలోనే ప్రభాస్ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. రెండోవారంలో ఏకంగా టాప్-1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. యానిమల్ మూవీకి మొదటి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. తాజాగా ఈ రికార్డ్‌ను యానిమల్ అధిగమించింది. ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్షిప్ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. -
యానిమల్‌పై మండిపడ్డ స్టార్ హీరోయిన్.. ఆ విషయంలో నేనైతే!
సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి రాధికా శరత్‌కుమార్ యానిమల్ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు. -
ఓటీటీలో యానిమల్.. నెట్‌ఫ్లిక్స్‌పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?
ఓటీటీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ సినిమా గణతంత్రం దినోత్సవం రోజునే ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రంపై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ ద్వారా నెటిజన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా యానిమల్ చిత్రంపై వ్యతిరేకత వస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. అయితే ఈ చిత్రంపై థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం తప్పుపట్టారు. ఈ సినిమా స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో విమర్శించారు. తాజాగా ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈ సినిమా చూసిన నెటిజన్స్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్‌ఫ్లిక్స్‌ను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఓటీటీ నుంచి యానిమల్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ తన ట్వీట్లో రాస్తూ.. "నేను యానిమల్ చిత్రం చూసి కలత చెందా. ఈ సినిమా భారతీయ మహిళలను కించపరిచేలా ఉంది. ఇది భారతీయ వివాహా బంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. మన సంప్రదాయం, వారసత్వం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అన్న భావనకు భంగం కలిగిస్తోంది. దయచేసి ఇలాంటి సినిమాపై చర్యలు తీసుకోండి.' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నయనతార నటించిన అన్నపూరణి చిత్రం నెట్‌ఫ్లిక్స్ తొలగించిన విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. మరో నెటిజన్స్ రాస్తూ..'దయచేసి నెట్‌ఫ్లిక్స్ నుంచి యానిమల్ సినిమాని తీసేయండి. ఇది మహిళలపై ఘోరమైన హింసను ప్రతిబింబిస్తోంది. దీన్ని ఎంటర్టైన్మెంట్ అని ఎవరూ పిలవరు" అంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్‌లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. Remove annapoorani @NetflixIndia but promotes Misogyny and hatred. And you ma'am @NayantharaU have apologized to these vadakans. Shame on Netflix #AnimalOnNetflix #Animal https://t.co/ouKElRp1G7 — Andrew (@Noob_Diablo) January 28, 2024 Lol good one, I watched Annaporani wondering what was so offensive in the movie that Netflix removed it. It is an average movie just like Animal. It came to my mind that, why didn't @netflix remove Animal as well which has hurt sentiments of women. — Kushel Giriraj (@g_kushel) January 27, 2024 Hello @NetflixIndia @annamalai_k I’m an Indian Hindu woman disturbed by the movie Animal which shows an Indian man having affairs outside marriage. Cultural heritage what makes India & this movie disturbs the “one man one wife” concept of this country. Plz take action. — Ana De Friesmass 2.0 (@ka_fries2366) January 27, 2024 @NetflixIndia @netflix please remove Hindi movie ANIMAL from Netflix, it reflects gore violence and abuse against women, this isn’t called entertainment — JaganN (@JaganJ80470849) January 26, 2024 -
Animal OTT Release: నేడు అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి 'యానిమల్'
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. యానిమల్ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు తాజగా నెట్‌ఫ్లిక్స్ ఒక టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో యానిమల్ చిత్రం ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈమేరకు చిన్న గ్లింప్స్ వదిలింది. అయితే ఈ వీడియో చివర్లో 'రూ.199 చెల్లించి చూడండి' అని సూచించింది. అంటే ఇది నెలవారీ సబ్స్క్రిప్షన్ వివరాలా? లేదంటే అద్దె పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు హింటిచ్చిందా? అన్నది అర్థం కాక నెటిజన్లు అయోమయానికి లోనవుతున్నారు. యానిమల్ రన్‌టైమ్ 3:21 గంటలు కానీ ఓటీటీ కోసం అదనపు సీన్లు యాడ్ చేస్తున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా మూడున్నర గంటల నిడివి ఉండనుంది. 'యానిమల్ పార్క్' టైటిల్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి యానిమల్.. ఆ రోజే రిలీజ్?
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు. అయితే బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. (ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) అసలేం జరిగిందంటే.. కాగా.. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది. వివాదం తొలగినట్లే..! ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. థియేటర్ వర్షన్‌కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు. -
అలియా భట్ ప్రొత్సాహంతోనే ఆ సన్నివేశాల్లో నటించా : రణ్‌బీర్ కపూర్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అంటే చాలా రేర్‌గా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకు అలాంటి సన్నివేశాలను పెడితే..మరికొన్ని సినిమాల్లో మసాల యాడ్ చేస్తేనే టికెట్లు తెగుతాయనే ఉద్దేశంతో శృంగార సన్నివేశాలను ఇరికిస్తున్నారు. ప్రేక్షకులు అయితే ఇంటిమేట్ సన్నివేశాలను లైట్ తీసుకొని, సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: ఆ హీరో సడన్‌గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ) ఇటీవల ఇంటిమేట్ సన్నివేశాలపై చర్చ జరిగిన ఏకైక సినిమా యానిమల్ మాత్రమే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మోతాదుకు మించిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ..అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. అలాంటి సన్నివేశాలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాల్లో నటించినప్పుడు హీరో రణ్‌బీర్ కపూర్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. కెరీర్ పరంగా చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడట. కానీ భార్య అలియా భట్ మాత్రం చాలా ఎంకరేజ్ చేసిందట. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించానని రణ్‌బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?) ‘ఒక నటుడిగా నాకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు సందీప్ వంగా యానిమల్ కథ చెబుతూ.. ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాలు ఇలా ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడేవాడిని. కానీ నా భార్య అలియా భట్ చాలా సపోర్ట్‌గా నిలిచింది. ‘సినిమా కోసమే చేస్తున్నావు. ఇది కేవలం పాత్ర మాత్రమే’ అంటూ ధైర్యం చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఆమెతో చర్చించేవాడిని. ఈ సినిమా విషయంలో తను నాకెంతో అండగా నిలిచింది’అని రణ్‌బీర్ చెప్పారు. యానిమల్ విషయానికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కించిన మూడో చిత్రమిది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..రణ్‌బీర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానుంది. -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్‌బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
యానిమల్ మూవీ ఎవరెవరో సాంగ్
-
2023లో ఉత్తమ చిత్రం యానిమల్: స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీపై ఇప్పటికీ మరో డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. 2023లో తాను చూసిన వాటిలో యానిమల్ బెస్ట్ మూవీ అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరణ్ జోహార్ యానిమల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలామంది నా వద్దకు వచ్చి నువ్వు రాకీ ఔర్ రాణి సినిమా తీశారు కదా.. అది యానిమల్ వంటి చిత్రానికి టీకా లాంటిదేనా అని ప్రశ్నించారు. దీనిపై కరణ్ స్పందిస్తూ..'నేను మీతో విభేదించలేను. ఎందుకంటే యానిమల్ 2023లో నా ఉత్తమ చిత్రంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రకటన చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన చుట్టు ప్రజలు ఉన్నప్పుడు.. మనం చెప్పే తీర్పు గురించి భయం ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అన్నారు. మొదట ఆ సినిమాను ఒక ప్రేక్షకుడిగా.. రెండోసారి సినిమాను అధ్యయనం చేసేందుకు చూసినట్లు తెలిపారు. సినిమా సక్సెస్‌ని గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న రౌండ్ టేబుల్ మీట్లో కరణ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. ఈ మూవీ సక్సెస్ సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథపై నమ్మకమే ప్రధాన కారణమని కరణ్ జోహార్ ప్రశంసించారు. సినిమా క్లైమాక్స్ గురించి కరణ్ మాట్లాడుతూ..'చివర్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. అప్పుడు నాకనిపించింది ఏంటంటే.. నాలో ఏదైనా లోపం ఉండాలి.. లేదంటే అతనిలో అయినా ఉండాలి. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది' అని అన్నారు. బంధాలను, సంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా యానిమల్ అని.. అందుకే తనకు నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్ల మార్క్‌ను దాటేసింది. -
Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్‌బీర్‌కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా కనిపించిన వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ స్టార్ కపుల్‌కు రాహా అనే కూతురు జన్మించింది. అయితే ఇప్పటివరకు తమ గారాల పట్టి మొహాన్ని అభిమానులకు పరిచయం లేదు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈ జంట ఎట్టకేలకు తమ కూతురి మొహాన్ని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. తమ ఇంటి వద్దకు విచ్చేసిన మీడియా ప్రతినిధులకను పలకరిస్తూ కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాహా చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అచ్చం రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ లానే ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. రణ్‌బీర్ కపూర్ ఇటీవలే యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు అలియాభట్ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. Rishi kapoor + Raj kapoor + Ranbir kapoor genes won for me😭♥️ https://t.co/0mX7C4xwAL — Susmita✨ (@SSusmita0319) December 25, 2023 Raha baby dito assemble of rishi kapoor 💏 God bless her#RanbirKapoor pic.twitter.com/Q0gY0AQ14S — r (@rajkbest) December 25, 2023 Raha is so beautiful , so elegant just looking like a Wow❤️🔥 Glimpse of Rishi Kapoor😍#AliaBhatt#RanbirKapoor#rahakapoorpic.twitter.com/ZxXiEKARwe — India's Elon Musk (@EshhanMusk) December 25, 2023 -
ఆ సీన్ లేకుంటే ‘యానిమల్’ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు: బాబీ డియోల్
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే దాదాపు 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. యానిమల్ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాపై మొదట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, హింస ఎక్కువగా చూపించారంటో కొంతమంది విమర్శించారు. ముఖ్యంగా బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాబీ డియోల్.. ఓ సీన్లో పెళ్లి వేదికపై పెళ్లికూతురిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా గదిలోకి రమ్మని బలవంతం చేస్తాడు. ఈ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బాబీ డియోల్‌ని ట్రోల్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై బాబీ డియోల్ స్పందించాడు. పాత్ర డిమాండ్ మేరకే ఆ సన్నివేశంలో నటించానని, ఆ సీన్ లేకుంటే యానిమల్ అంత పెద్ద హిట్ కాకపోయేదన్నాడు. ‘పాత్ర తీరుతెన్నులను అర్థం చేసుకొని నటించి ప్రేక్షకులను అలరించడమే నటుల పని. యానిమల్‌లో నేను పోషించిన అబ్రార్ హక్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్న సమయంలో క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థం కావాలనే అలాంంటి సీన్స్ క్రియేట్ చేశారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే సినిమాల్లో కనిపిస్తాయి తప్ప.. వాటిని సినిమాలు ప్రమోట్ చేయట్లేదు’ అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. -
బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 650కి పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో పఠాన్, జవాన్, గదర్-2 ఉన్నాయి. ఇదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకునేలా కనిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన యానిమల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. #Animal Roars Louder 🔥🪓 Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/rXLUe4SSod — Animal The Film (@AnimalTheFilm) December 10, 2023 -
‘యానిమల్’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కమెడియన్ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నెట్టింట యాక్టివ్‌గా ఉండరు కానీ..ఆయన మీమ్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి. సినిమాపైనే కాదు ట్రెండింగ్‌లో ఏ అంశం ఉన్నా..బ్రహ్మానందంపై మీమ్స్ రెడీ అయిపోతుంటాయి. అవి చూస్తే చాలు.. సీరియస్ అంశం అయినా సరే..పగలబడి నవ్వేస్తాం. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్ఫూప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ‘యానిమల్’సినిమాపై చేసిన స్ఫూప్ వీడియా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్‌కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఓ వీడియోని రూపొందించారు. అందులో బ్రహ్మానందం నటించిన పలు సినిమాల్లోని సీన్లతో వాడేశారు. ఇక అనిల్ కపూర్ పాత్రకి బదులుగా నాజర్ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్ తండ్రి కొడుకులైతే..యానిమల్ మూవీ ఇలా ఉంటుందంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యానిమల్’ లోని కొన్ని సీన్లకి సరిగ్గా సూట్ అయ్యేలా బ్రహ్మానందం సినిమాల సీన్లను పెట్టారు. ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోండి. Bramhi in & as Animal😁✂️ Share & Follow @TeluguBroEdits .#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU — Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023 -
'అమ్మాయిలు చప్పట్లు కొడుతుంటే బయటకొచ్చేశా'.. యానిమల్ చిత్రంపై తీవ్ర విమర్శలు..!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. స్వానంద్ కిర్కిరే తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది. యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. शांतराम की - औरत , गुरुदुत्त की - साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की - अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा — Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023 Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes.... now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI — Animal The Film (@AnimalTheFilm) December 6, 2023 -
యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ ఒక్క పేరే దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ అవుతోంది. అదేనండీ మన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ. రిలీజైన మొదటి రోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై కొందరు తప్పుపడుతున్నారు. ఇలాంటి సినిమాలను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఇటీవలే టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మండిపడ్డారు. మరోవైపు ఈ చిత్రంపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఆమె పేరే వినిపిస్తోంది. ఈ చిత్రంలో జోయా పాత్రలో నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి. హీరోయిన్ రష్మిక కంటే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని రణ్‌బీర్ కపూర్‌తో త్రిప్తి రొమాంటిక్ సీన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్, రష్మిక కెమిస్ట్రీ కంటే.. త్రిప్తి దిమ్రి కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. త్రిప్తినే అసలైన నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిప్తి ఓవర్‌నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుందని అంటున్నారు. రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీల జోడీ భవిష్యత్తులోనూ తెరపై చూడాలనుకుంటున్నట్లు పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఫిబ్రవరి 23, 1994న ఉత్తరాఖండ్‌లో జన్మించిన తృప్తి డిమ్రీ యానిమల్ చిత్రం కంటే ముందే చాలా సినిమాల్లో నటించింది. 'పోస్టర్ బాయ్స్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'కాలా', బుల్ బుల్ లాంటి చిత్రాలకు ప్రశంసలు అందుకుంది. తాజాగా రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్‌లో చేసిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. The New National Crush 💘#TriptiDimri pic.twitter.com/J8je1gfKji — RANVIJAY 🦁 (@EddyTweetzBro) December 4, 2023 Loving their Chemistry. ❤️🔥 Ft. Fitoor Song#RanbirKapoor𓃵 #RanbirKapoor #TriptiDimri #AnimalTheFilm pic.twitter.com/89k6Ad8jtu — Ayan Sanger (@I_Ranbir_Fan) December 4, 2023 #TriptiDimri stole the show 🥵 pic.twitter.com/IEbv4ckVMz — Sia⋆ (@siappaa_) December 4, 2023 -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?
'యానిమల్' మీలో చాలామంది చూసే ఉంటారు. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. సరే అదంతా పక్కనబెడితే సినిమాలో చాలామంది వావ్ అనిపింంచారు. హీరో రణ్‌బీర్ కపూర్ వేరే లెవల్ యాక్టింగ్‌తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ రష్మిక కూడా ఆశ్చర్యపరిచింది. కానీ ఈమె కంటే మరో బ్యూటీ.. ఈ మూవీలో ఎక్కువ హైలైట్ అయ్యింది. కిస్సలు, రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఎవరా బ్యూటీ? 'యానిమల్' సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే రణ్‌బీర్-రష్మిక పాత్రలకు పెళ్లయిపోతుంది. దీంతో హీరోయిన్ రష్మిక పాత్రకు గ్లామర్ చూపించడానికి కుదరదు. దీంతో ఇంటర్వెల్ తర్వాత జోయా అనే పాత్ర ఎంటర్ అవుతుంది. బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి.. ఈ క్యారెక్టర్ చేసింది. విలన్ గ్యాంగ్‌కి చెందిన ఈమె.. సీక్రెట్‌గా రహస్యాలు తెలుసుకోవడానికి హీరో దగ్గరికి వస్తుంది. తెలియకుండానే అతడితో ప్రేమలో పడిపోతుంది. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) అలాంటి సీన్లోనూ దీంతో ఈ రెండు పాత్రల మధ్య రొమాన్స్ దగ్గర కిస్సులు ఓ రేంజులో ఉంటాయి. ఓ సీన్లో అయితే బెడ్‌పై నగ్నంగా కనిపించే సీన్ ఒకటుంటుంది. ఇందులో రణ్‌బీర్-తృప్తి దిమ్రి రెచ్చిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే రష్మిక పాత్ర కంటే తృప్తి పాత్రనే ఎక్కువ హైలైట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే 'యానిమల్' మూవీ గురించి.. లేదంటే 'తృప్తి దిమ్రి' గురించే మాట్లాడుకుంటున్నారు. తృప్తి బ్యాక్‌గ్రౌండ్ ఈమె అసలు పేరు లైలా తృప్తి దిమ్రి. ఓటీటీ అభిమానులు మాత్రం ఈ బ్యూటీని 'బుల్బుల్' అని ముద్దుగా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ లో తృప్తి పుట్టింది. 2017లో 'పోస్టర్ బాయ్స్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'లైలా మజ్ను', 'బుల్ బుల్' సినిమాలు చేసింది. ఇకపోతే 'బుల్ బుల్' మూవీ ప్రొడ్యూసర్ కర్నేశ్తో ఈమె డేటింగ్లో ఉందని రూమర్స్ ఉన్నాయి. ఇకపోతే సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల కంటే సెకండాఫ్‌లో కనిపించిన బ్యూటీస్ అనుకోని విధంగా హైలైట్ కావడం విశేషం. (ఇదీ చదవండి: Animal Review: ‘యానిమల్’మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) #TriptiDimri #Animal pic.twitter.com/OBegRMvwyz — Madhu Parmar (@MadhuPa37121193) December 2, 2023 -
Animal Review: ‘యానిమల్’మూవీ రివ్యూ
టైటిల్: యానిమల్ నటీనటులు: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నిర్మాణ సంస్థలు:టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా విడుదల తేది: డిసెంబర్ 1, 2023 ‘యానిమల్’ కథేంటంటే.. బల్బీర్ సింగ్(అనిల్ కపూర్) దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త. అతని కొడుకు రన్ విజయ్ సింగ్ బల్బీర్(రణ్‌బీర్ కపూర్). విజయ్‌కి చిన్నప్పటి నుంచే కాస్త అగ్రెసివ్. తండ్రి అంటే చాలా ఇష్టం. అతనితో గడిపేందుకు చాలా ప్రయత్నిస్తాడు. కానీ బల్బీర్ బిజినెస్ పనుల్లో బిజీ కావడంతో ఫ్యామిలీకి టైమ్ కేటాయించేవాడు కాదు. ఇదిలా ఉంటే.. విజయ్ స్కూల్ డేస్‌లో తన అక్కను ఒకరు ర్యాగింగ్ చేశారని గన్‌తో బెదిరిస్తాడు. ఈ విషయం బల్బీర్‌కి తెలియడంతో బోర్డింగ్ స్కూల్‌కి పంపిస్తాడు. తండ్రికి దూరంగా పెరిగిన విజయ్..కొన్నాళ్లకు తిరిగి వస్తాడు. నాన్న 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బావతో గొడవ పడతాడు. దీంతో మళ్లీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. స్కూల్‌మేట్ గీతూ అలియాస్ గీతాంజలి(రష్మిక మందన్నా)ని పెళ్లి చేసుకొని విజయ్ అమెరికాకు వెళ్తాడు. కొన్నాళ్లకు తండ్రిపై అటాక్ జరిగిందని తెలిసి తిరిగి ఇండియాకు వస్తాడు. నాన్నను చంపేందుకు ప్రయత్నించివారిని తలలు నరుకుతానని ప్రామిస్ చేస్తాడు. అసలు బల్బీర్‌పై అటాక్ చేసిందెవరు? వారిని విజయ్ ఎలా కనిపెట్టాడు? తండ్రిని కాపాడుకోవడం కోసం విజయ్ ఏం చేశాడు? సొంత బావను ఎందుకు చంపాల్సివచ్చింది? అబ్రార్ హక్(బాబీ డియోల్) ఎవరు? అతనికి బల్బీర్ సింగ్ ప్యామిలీకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? చివరకు విజయ్ తన తండ్రిని కాపాడుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పిచ్చి ప్రేమ కథే ‘యానిమల్’. ఇదొక రివేంజ్ డ్రామా. కానీ సందీప్ రెడ్డి వంగా ఈ కథను చాలా బోల్డ్‌గా, వయోలెంట్‌గా తెరపై చూపించాడు. కథగా చూస్తే..ఇందులో తండ్రి కొడుకుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భార్య భర్తల బాండింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా కథనం సాగుతుంది. అలాగే కామెడీ కూడా బోల్డ్‌గానే ఉంటుంది. సినిమా మొత్తం సందీప్‌రెడ్డి వంగా స్టైల్లోనే సాగుతుంది. నాన్న పాటతో చాలా ఎమోషనల్‌గా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో పాత్ర అగ్రెసివ్‌గా ఉంటుందని ఒకటి, రెండు సన్నివేశాలతో తెలియజేశాడు. హీరోయిన్ ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ని..తన మాటలతో హీరో ప్రేమలో పడేసే సీన్ చాలా కొత్తగా,థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ చాలా బోల్డ్‌గా ఉంటాయి. అలాగే వయోలెన్స్ కూడా ఎక్కువే. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. తనదైన స్క్రీన్‌ప్లేతో ఫస్టాఫ్‌ని చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు సందీప్ రెడ్డి. ఇక సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. హీరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన తర్వాత ఇంట్లో డాక్టర్లతో మాట్లాడే మాటలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. హీరో నగ్నంగా ఆరు బయటకు రావడానికి గల కారణం కన్విన్సింగ్‌గానే ఉంటుంది. ఈ సీన్ కంటే ముందు వచ్చే సన్నివేశాల్లో రణ్‌బీర్ ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంటుంది. విజయ్ ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ.. గీతాంజలి ఎందుకు భరిస్తుందో తెలియజేసే సీన్..భార్య భర్తల మధ్య ఉన్న బాడింగ్ని తెలియజేస్తుంది. ఇక జోయాతో రొమాన్స్ తర్వాత..గీతాంజలి, విజయ్ మధ్య వచ్చే సీన్లు చాలా మెచ్యుర్డ్‌గా ఉంటాయి. బాబీ డియోల్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో బాబీ, రణ్‌బీర్‌కి మధ్య వచ్చే యాక్షన్ సీన్ సినిమాకు మరో హైలెట్. యాక్షన్, ఫ్యాక్షన్ కలబోసిన ఓ ఎమోషననల్ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే మితిమీరిన హింస, శృంగార సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కాస్త ఇబ్బంది అనిపించొచ్చు కానీ, మిగతావారికి మాత్రం ఓ డిఫరెంట్ మూవీ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. రణ్‌బీర్ కపూర్ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. రణ్ విజయ్ సింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. టీనేజ్.. యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఇలా మూడు దశల పాత్రల్లోనూ తనదైన నటనతో అదరగొట్టేశాడు. ఈ క్యారెక్టర్లో రణ్‌బీర్ తప్ప మరొకరు నటించలేరు అనేంతలా అతని యాక్టింగ్ ఉంటుంది. గీతాంజలి పాత్రకు రష్మిక న్యాయం చేసింది. రణ్‌బీర్, రష్మికల మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ సీన్స్‌లో ఇద్దరూ జీవించేశారు. జోయా గా తృప్తి దిమ్రి తన పాత్ర పరిధిమేర నటించింది. బల్బీర్ సింగ్ పాత్రలో అనిల్ కపూర్ ఒదిగిపోయాడు. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. బాబీ డియోల్ విలనిజం బాగా పండించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రామేశ్వర్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. యాక్షన్ సీన్స్‌కి అతను అందించిన బీజీఎం వేరే లెవెల్. ఈ చిత్రం నిడివి 3.23 గంటలు. అయితే చాలా సన్నివేశాలను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ..డైరెక్టర్ సందీప్ రెడ్డే ఎడిటర్‌గా వ్యవరించడంతో కత్తిరించడానికి మనసు ఒప్పుకోనట్లుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
యానిమల్ అసలు రన్‌టైమ్ అది కాదు.. వామ్మో అంతకుమించి!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు అమాంతెం పెంచేసింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్రబృందం చెన్నైలోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు రణ్‌బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మూవీ రన్‌టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!) ప్రస్తుతం ఆడియన్స్ రెండున్నర గంటల సినిమా చూసేందుకే బోరింగ్‌గా ఫీలవుతున్నారు. అలాంటిది సందీప్ రెడ్డి ఏకంగా మూడు గంటల 21 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే దీనిమీదే ప్రస్తుతం ఆడియన్స్‌లో తెగ చర్చ నడుస్తోంది. అయితే చెన్నైలో జరిగిన ఈవెంట్లో దీనిపై మేకర్స్ చేసిన కామెంట్స్ మరింత వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగా చిత్రానికి అసలు రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత లాంగ్ రన్‌టైమ్ మూవీని చూడాలంటే ఆడియన్స్‌కు కష్టమే. అందులోనూ రోజు నాలుగు షోలు వేయాలంటే కూడా వీలు కాదు. అందువల్లే 3 గంటలా 21 నిమిషాలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రణ్‌బీర్ కపూర్ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏకంగా 18 నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అయితే ఓటీటీలోనైనా ఫుల్ మూవీని రిలీజ్ చేస్తారేమో చూడాలి. (ఇది చదవండి: రణ్‌బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్‌ను..) -
నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనిల్ కూపూర్ మాట్లాడుతూ..' అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకు ఓ విషయం చెప్పాలి. ఒక నటుడిగా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే. నాకు మొదటి చిత్రం తెలుగులోనే. 1980లో వంశవృక్షం చిత్రంలో నటించా. డైరెక్టర్ బాపు నన్ను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. దాదాపు 43 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇది ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తోంది. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్. ఇది నా రెండో తెలుగు చిత్రం. మహేశ్ బాబుతో నాకు కుటుంబంలాంటి అనుబంధం. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్. ది గ్రేటెస్ట్, గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సార్. మన సినిమా ఇండస్ట్రీలోని ప్రపంచానికి పరిచయం చేశారంటూ ' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘యానిమల్’ లుక్ కోసం బాబీ కఠోర సాధన.. నాలుగు నెలలు నో స్వీట్స్!
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాబీ దేవోల్ లుక్,యాక్టింగ్‌పై ప్రేక్షకులను నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ చిత్రంలోని తన పాత్ర కోసం బాబీ చాలా కష్టపడ్డాడట. రణ్‌బీర్ కంటే భారీగా కనిపించేందుకు నాలుగు నెలల పాటు కఠోర సాధన చేశాడట. బాబీ ఫిట్నెస్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘యానిమల్ చిత్రంలో విలన్ పాత్ర పోషించేందుకు బాబీ చాలా కష్టపడ్డాడు. లుక్ విషయంలో దర్శకుడు సందీప్ కొన్ని సూచనలు చేస్తూ.. రణ్‌బీర్ కంటే భారీగా కనిపించాలని కండీషన్ పెట్టాడు. దీంతో బాబీ..నాలుగు నెలల పాటు కచ్చితమైన డైట్ ఫాలో అయ్యాడట. తనకు బాగా ఇష్టమైన స్వీట్స్ కూడా తినకుండా.. సాధన చేశాడు. దీంతో బాబీ డియోల్ శరీరంలోని కొవ్వు శాతం 12కి తగ్గింది. అతని బరువు 85 నుండి 90 మధ్యకు చేరింది.ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్ చూసి చిత్ర యూనిట్ అంతా షాకైంది. క్లైమాక్స్ షూట్ రోజు బాబీ నన్ను సెట్‌కి పిలించుకొని అందరి ముందు అభినందించారు’అని ప్రజ్వల్ తెలిపాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. -
లైవ్‌లో దొరికిపోయిన రష్మిక.. అడ్డంగా బుక్ చేసిన హీరో!
ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ట్రైలర్ చూడాగనే చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమా రిలీజ్ రోజు దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సందీప్, హీరో, హీరోయిన్ యానిమల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే వీరంతా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే ఈ షో మధ్యలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న వీరు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఫోన్ కాల్ చేశారు. ఫోన్లో విజయ్ మాట్లాడుతుండగా స్పీకర్ ఆన్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా గురించి ఫోన్లో రష్మిక మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న రణ్‌బీర్ కపూర్ మధ్యలో మాట్లాడారు. అసలు రష్మికను సందీప్ రెడ్డి మొదటిసారి అర్జున్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీలో విజయ్ వాళ్ల మేడపై కలిశారంటూ అనుకోకుండానే నిజం చెప్పేశారు రణ్‌బీర్. దీంతో ఒక్కసారిగా షాకైన రష్మిక ఈ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. రణ్‌బీర్ కామెంట్స్‌తో విజయ్-రష్మిక జోడీపై మరోసారి డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. -
సందీప్ రెడ్డి యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషనల్‌గా కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ మూవీ రన్‌టైమ్ చూస్తే భారీ నిడివితోనే వస్తోంది. ఏకంగా మూడు గంటల 21 నిమిషాల పాటు ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వెల్లడించారు. -
నా పెళ్లి జీవితంపై అలాంటి రూమర్స్: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేనిపేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంతో అభిమానులను పలకరించింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో పాటు హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తన పెళ్లి జీవితంపై వచ్చిన రూమర్స్‌పై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ కాలం. ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను సన్నగా మారడానికి.. అంతే కాకుండా తెల్లగా అయ్యేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం చేశారు. అలాగే మ్యారేజ్ లైఫ్‌పై రూమర్స్ వచ్చాయి. నేను గతంలో రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్ నచ్చదని.. వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. అయితే ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను వేధిస్తున్నాడంటూ రాశారు. రణ్‌బీర్ మంచి వ్యక్తి. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. ' అని అన్నారు. -
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆ పాత్రకు భారీగా డిమాండ్ చేసిన యశ్!
రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మరో బాలీవుడ్ డైరెక్టర్ పెద్ద సాహసానికి రెడీ అయ్యారు. రామాయణం ఆధారంగా భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!) ఆదిపురుష్ లాంటి ఫలితం వచ్చిన తర్వాత కూడా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రావణుడి పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్‌ను చిత్రబృందం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం యశ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రావణుడి పాత్రకు దాదాపు రూ.150 కోట్లు డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. అయితే ఇందులో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. తివారీ రామాయణం ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ద్వారానే యశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్-3 మూవీ కూడా చేయాల్సి ఉంది. (ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
రణ్‌బీర్- రష్మిక ఫ్లైట్ సీన్.. ఆ మూవీ నుంచి కొట్టేశారా?
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించగా.. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో ఈ పాటను విడుదల చేశారు. అయితే ప్రైవేట్ జెట్‌లో రష్మిక, రణ్‌బీర్ కపూర్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఆడియన్స్‌కు అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుకు తెచ్చాయి. తాజాగా ఈ ఫ్లైట్‌లో రొమాంటిక్ సీన్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది. (ఇది చదవండి: 'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్) అయితే ఈ ఫ్లైట్ సీన్ కాపీ కొట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జామీ డోర్నాన్, డకోటా జాన్సన్ నటించిన 2015లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రేలోని హెలికాప్టర్ సన్నివేశంలా ఉందని అంటున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. బాలీవుడ్ ప్రస్తుతం కాపీకి బ్రాండ్‌గా మారిందని పోస్ట్ చేశారు. మరొకరు ఫిఫ్టీ షేడ్స్ కాపీ క్యాట్ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా కూడా నటించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అనే ఐదు భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!) View this post on Instagram A post shared by Alright (@thealrightsquad) -
'సిగ్గుండాలి కొంచెమైనా.. చేసింది చాలు.. బయటికి గెంటెయ్'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్'. ఇప్పటికే కబీర్ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యానిమల్’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే పేరుతో సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ముద్దు సీన్స్ మరింత రొమాంటిక్‌గా ఉన్నాయి. అయితే ఈ సాంగ్ ప్రారంభంలో ఫ్యామిలీ అందరిముందే ఈ జంట ముద్దు పెట్టుకోవడం హైలెట్‌గా ఉంది. ఈ సాంగ్‌లో వచ్చే సీన్లో తన ప్రేమ గురించి చెప్పమని రష్మికను 'ఏం గీత ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలిగా.. ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏం చేశాడో చూడు.' అని ఆమె తల్లి, సోదరుడు అడుగుతుండగానే.. పక్కన ఉన్న మరొకరు మాట్లాడుతూ.. 'సిగ్గుండాలి కొంచెమైనా? చేసింది చాలు' అనగానే.. అంతలోనే ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత జెట్‌లో వచ్చే ముద్దు సన్నివేశాలు అభిమానులకు ఫుల్ రొమాంటిక్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇటీవల రణబీర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. . -
విజయ్- రష్మిక జోడీ.. ఆ మాత్రం ఉండాల్సిందే!
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ- రష్మిక జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లోనూ కలిసి నటించారు. దీంతో వీరిద్దరు టాలీవుడ్లో ఫేవరేట్ జోడీగా నిలిచారు. ఇండస్ట్రీలో విజయ్, రష్మిక గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు) ప్రస్తుతం రష్మిక, రణ్‌బీర్ కపూర్ జంటగా యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 28న రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం సర్ప్రైజ్ ఇచ్చింది. యానిమల్ టీజర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. అయితే దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. విష్ యూ మై డార్లింగ్స్ అంటూ పోస్ట్ చేశారు. విజయ్ ట్వీట్‌కు రష్మిక మందన్నా కూడా రిప్లై ఇచ్చింది. థ్యాంక్యూ.. యూ ఆర్ ది మై బెస్ట్.. అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు బెస్ట్ పెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా..రష్మిక, రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) కాగా.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కిస్తోన్న యానిమల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Thankyouuuuuuu @TheDeverakonda 🤗❤️ You be the bestestestestttt! ❤️ https://t.co/vz9MCFhsiA — Rashmika Mandanna (@iamRashmika) September 28, 2023 -
అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!
పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అల్లు అర్జున్ సరసన నటించిన ఈ చిత్రమే కన్నడ బ్యూటీని బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా బాలీవుడ్లోనే ఈ అమ్మడు పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. హిందీలో నటించిన తొలి చిత్రం గుడ్ బై పూర్తిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన మిషన్ మజ్ను కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రం ఒకటే ఉంది. (ఇది చదవండి: పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్‌బాస్ ప్లాన్ అదేనా?) రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబిడియోల్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపైనే రష్మిక ఆశలన్నీ పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కెరీర్ ఈ చిత్రం రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తమిళంలో రష్మికకు పెద్దగా క్రేజ్ లేదు. ఎందుకంటే రష్మిక కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్ డిజాస్టర్‌గా మిగిలింంది. ఇకపోతే వారియర్స్ చిత్రం ఒకే అనిపించుకున్న అందులో రష్మిక పాత్ర గ్లామర్‌కు, సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) దీంతో హిందీ చిత్రం యానిమల్ హిట్ కాకపోతే నటి రష్మిక టాలీవుడ్‌నే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగులో అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న పుష్ప–2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తరువాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. కాగా.. టాలీవుడ్లో ప్రస్తుతం పుష్ప–2 తో పాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ కలిసి నేషనల్ క్రష్‌కు కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడు ఏదో ఒక కామెంట్స్ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. గతంలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌పై పలుసార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది. పరోక్షంగా ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటను ఉద్దేశించి ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అయితే తాజాగా విజయ్ సేతుపతితో కలిసి కంగనా ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే నెట్టింట్లో వచ్చిన స్క్రీన్షాట్లను షేర్ షేర్ చేస్తూ పరోక్షంగా విమర్శలు చేసింది. (ఇది చదవండి: అడల్డ్ మూవీ 'బార్బీ'.. సెన్సార్ ఓకే.. కానీ ఓ కండీషన్ ..!) ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ.. 'నేను ఎప్పుడైనా సినిమా ప్రకటించినప్పుడు నాతో పాటు సహానటులను కించపరిచేలా హెడ్‌లైన్స్ పెడుతున్నారు. అసహ్యమైన బల్క్ మెయిల్స్ పంపుతూ ప్రచారం చేస్తున్నారు. అన్ని పేపర్లలో ప్రతి చోటా ఒకే హెడ్లైన్ ఎలా వస్తుంది. దీన్ని బల్క్ మాస్ మెయిల్ అంటారు. నన్ను చూసి మీరు బాధపడితే.. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. భగవాన్ వారి ఆత్మకు శాంతి చేకూర్చండి. ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్న చెంగుమంగు గ్యాంగ్‌కు ఒక్కటే చెబుతున్నా. నన్ను చూస్తే మీకెందుకు అంత అసూయ కలుగుతోంది.' అంటూ రాసుకొచ్చింది. కంగనా మరో పోస్ట్‌లో రాస్తూ..' బాలీవుడ్ జంట వేరు వేరు అంతస్తులలో నివసిస్తున్నారు. కానీ బయటికి మాత్రం కలిసి ఉన్నట్లు నటిస్తారు. మింత్రా బ్రాండ్‌ను తమ సొంతం అంటూ.. నా సినిమా గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఇటీవలి అతను కుటుంబసభ్యులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్లిగా.. భార్య ఆలియా భట్, కుమార్తె రాహా ఇండియాలో ఉన్నారు. కానీ దాని గురించి ఎవరూ వ్రాయలేదు. కానీ ఆమె భర్త మాత్రం కలవాలని ఆమెను వేడుకుంటున్నట్లు మెసేజ్‌లు పంపుతున్నాడని' చెబుతోంది.' మరోవైపు ఇన్‌స్టాలో రాస్తూ.. 'సినిమా ప్రమోషన్స్, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే జరుగుతుంది. అతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నందుకు ప్రతిఫలంగా సినిమాల్లో అవకాశమిస్తానని అతను హామీ ఇచ్చాడు. ఇప్పుడు తను ఈ నకిలీ వివాహం నుంచి విముక్తి పొందాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. కానీ పాపం ఇప్పుడు అతనికి ఎవరూ లేరు. ఇకనుంచి తన భార్య, కుమార్తెపై దృష్టి పెట్టాలి. ఇండియాలో ఒకసారి పెళ్లయితే అంతా అయిపోనట్లే.. ఆబ్ సుధార్ జావో.' అని రణ్‌బీర్‌ను ఉద్దేశించి కౌంటరిచ్చింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకోవాలనుంది, నాకంటూ ఓ కుటుంబం కావాలి: కంగనా) గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే. తన గురించి ఫోటోగ్రాఫర్లకు ఎలా సమాచారం అందుతుంది అని ప్రశ్నించింది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం లీకవుతోందని కూడా ఆమె ఆరోపించింది. కాగా.. కంగనా తదుపరి చిత్రం 'తేజల్లో కనిపించనుంది. అంతేకాకుండా ఆమె తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎమర్జెన్సీ'లో నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. ఆ తర్వాత 'చంద్రముఖి 2'లోనూ కీలకపాత్ర పోషించనుంది. -
రణ్‌బీర్ 'యానిమల్' ప్రీ టీజర్.. ఆ సీన్‌పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ నుంచి చిన్న సీన్‌ను ప్రీ టీజర్‌గా ఆదివారం విడుదల చేసింది సంగతి తెలిసిందే. ‘వైల్డ్ యానిమల్’, ‘వైలెంట్ యానిమల్’ అంటూ ‘యానిమల్’ ప్రీ టీజర్ గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే ఈ చిత్రం ఫుల్ టీజర్ ఈ నెల 16న విడుదల కానుందని సమాచారం. (ఇది చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు ) తాజాగా ఈ చిత్రంలోని ప్రీ టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టీజర్‌లోని ఫైట్ సీన్ వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ కాపీ కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. దక్షిణ కొరియా చిత్రం ఓల్డ్ బాయ్‌తో చిత్రంలోని ఫైట్ సీన్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. ఓల్డ్బాయ్లోని హాల్వే సీక్వెన్స్ మాదిరిగానే ఈ ఫైట్ సీన్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఐదు భాషలలో ఆగస్ట్ 11 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్, సినీవన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. (ఇది చదవండి: కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు! ) Inspired from old boy? #Animal — Dexter White (@navin_twt) June 11, 2023 Pre teaser #Animal pic.twitter.com/sBkPC61egB — R R (@RacchaRidhvik) June 11, 2023 #Animal - #RanbirKapoor𓃵 is full with RAGE but director #SandeepReddyVanga seems to copy the Oldboy action sequence for the teaser. C'mon can't you do any better, still this is a teaser so I'll keep my expectations low. The last gif is the Original. #AnimalTeaser #Bollywood pic.twitter.com/M2DNWAQRiG — Adithya Chakravarthy (@Adi7394) June 11, 2023 -
త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే!
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి) అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్ హీరో యశ్‌ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి.. ఎన్ని కోట్లంటే!
బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో విశాలమైన ఫోర్ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను దాదాపు రూ.17.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే 10న రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్‌కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ప్రస్తుతం పాలి హిల్‌లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్‌లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) సూరజ్ సినిమాతో అరంగేట్రం చేసిన నీతూ కపూర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్ చిత్రాల్లో నటించారు. కాలా పత్తర్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్‌ను వివాహం చేసుకోగా.. రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ జన్మించారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) -
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్) -
బేబీ ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్.. !
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు బేబీ ఎక్కడా కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా ఆలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె కూతురే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రెండేళ్ల వరకు తమ బేబీని చూపించబోమని ఇప్పటికే ఆమె సన్నిహితులు కూడా తెలిపారు. అందుకే సోషల్ మీడియాలోను ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో తాజాగా ఆమె షేర్ చేసిన బేబీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పింక్ డ్రెస్‌లో ఉన్న బేబీ ఫోటో అచ్చం ఆలియా భట్ లాగే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పాప ఆలియా-రణ్‌బీర్ గారాలపట్టి రాహా అని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు కేవలం ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అలియా భట్ దంపతులు స్పందిస్తేనే మరింత క్లారిటీ రానుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఎంతవారైనా సరే వదిలే ప్రసక్తే లేదు.. కంగనా స్ట్రాంగ్ వార్నింగ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనపై గూఢచర్యం జరుగుతోందని ఆరోపించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి తనను ఎవరో టార్గెట్ చేశారని చెబుతోంది. అంతే కాకుండా పరోక్షంగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ను ఉద్దేశించి చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. నా ప్రతి కదలికను వారు గమనిస్తున్నారని పేర్కొంది. అయితే ఆమె ఈ ప్రకటన చేసిన ఒక్కరోజులోనే తనను ఫాలో చేస్తున్నవారు వెనక్కి తగ్గారని వివరించింది. ప్రస్తుతం తనపై నిఘా విరమించుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా తనపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించిన చాంగు మంగు 'ఫిల్మ్ మాఫియా'కు కంగనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఇంట్లోకి దూరి మరీ కొడతా అంటూ ఓ రేంజ్లో హెచ్చరించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'మై పాగల్ హు, ఘర్ మే ఘుస్ కే మారుంగి' అంటూ హిందీలో రాసుకొచ్చింది. గూఢచర్యంపై ప్రకటన చేసిన ఒక రోజులోనే తన చుట్టూ ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం లేదని తన అనుచరులకు తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ దయచేసి నా హెచ్చరిక. గత రాత్రి నుంచి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగలేదు. కెమెరాలతో ఎవరూ నన్ను అనుసరించలేదు. ఆ చాంగు మంగు గ్యాంగ్‌కు నేను ఒకటే చెబుతున్నా. నేను పిచ్చిదాన్ని అని మీరు అనుకుంటే పొరపాటు. ఇందులో ఎంత పెద్దవారైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇంట్లోకి దూరి మరీ కొడతా.' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్. కాగా.. కంగనా తదుపరి ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. రజనీకాంత్ తమిళ చిత్రానికి సీక్వెల్ 'చంద్రముఖి 2'లో కూడా తాను నటిస్తానని కంగనా ప్రకటించింది.ఆ తర్వాత 'తేజస్'లో కనిపించనుంది, ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించనుంది. ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. -
నాపై గూఢచర్యం జరుగుతోంది.. కంగనా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది కంగనా. తనపై ఎవరో గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. నా ప్రతి కదలికను గమనిస్తున్నారని పేర్కొంది. తన వ్యక్తిగత, వృత్తి పరమైన సమాచారాన్ని కూడా లీక్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీనిపై తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో సుదీర్ఘమైన నోట్ రాసింది. అయితే ఆమె ఆరోపణలు బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ గురించేనని బీ టౌన్లో చర్చ నడుస్తోంది. కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నేను ఎక్కడికెళ్లినా నన్ను ఫాలో అవుతున్నారు. నాపై గూఢచర్యం చేస్తున్నారు. వీధుల్లో మాత్రమే కాకుండా నా బిల్డింగ్ పార్కింగ్, నా ఇంటి టెర్రస్‌లో కూడా వారు నన్ను పట్టుకోవడానికి జూమ్ లెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఛాయా చిత్రకారులు నక్షత్రాలను సందర్శిస్తారని అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో వారు నటీనటులు ఇలాంటి పనులు ప్రారంభించారు. ' అంటూ రాసుకొచ్చింది. కంగనా రాస్తూ..' ఉదయం 6:30 గంటలకు నా ఫోటోలు తీశారు. వారికి నా షెడ్యూల్ గురించి ఎలా తెలుస్తోంది. ఈ చిత్రాలను వారు ఏం చేస్తారు? నేను తెల్లవారుజామున కొరియోగ్రఫీ ప్రాక్టీస్ సెషన్‌ను ముగించా. నా వాట్సాప్ డేటా, వృత్తిపరమైన ఒప్పందాలు, వ్యక్తిగత వివరాలు కూడా లీక్ అవుతున్నాయని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఒకప్పుడు నా ఆహ్వానం లేకుండా నా ఇంటి వద్దకు వచ్చి నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు అతని భార్యను నిర్మాతగా మారాలని.. మరిన్ని మహిళా ఓరియంటెడ్ సినిమాలు చేయమని.. నాలాగా దుస్తులు ధరించేలా ఇంటి ఇంటీరియర్లను తయారు చేయమని బలవంతం చేస్తున్నాడు. వారు నా స్టైలిస్ట్, హోమ్ స్టైలిస్ట్‌లను కూడా నియమించుకున్నారు. అతని భార్య ఇలాంటి ప్రవర్తనను ప్రోత్సహిస్తోంది. నా ఫైనాన్షియర్లు, వ్యాపార భాగస్వాములు ఎటువంటి కారణం లేకుండా చివరి నిమిషంలో ఒప్పందాలను విరమించుకున్నారు. అతను నన్ను ఒంటరిని చేసి, మానసిక ఒత్తిడికి గురిచేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నా.' అని ఆమె రాసుకొచ్చింది. అతను ఆమెను ప్రత్యేక అంతస్తులో ఉంచి.. వారిద్దరూ ఒకే భవనంలో విడివిడిగా నివసిస్తున్నారు. ఈ ఏర్పాటుకు ఆమె నో చెప్పాలని.. అంతే కాకుండా అతనిపై ఓ కన్ను వేసి ఉంచాలని నేను సూచిస్తున్నా. అతను నా డేటా మొత్తాన్ని ఎలా పొందుతున్నాడు. అతను ఇబ్బందుల్లో పడితే, ఆమెతో పాటు బిడ్డ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఆమె తన జీవితానికి బాధ్యత వహించాలి. అతను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొనకుండా చూడాలి. ప్రియమైన నీపై, నీ బిడ్డపై నాకు చాలా ప్రేమ ఉంది .' అంటూ పరోక్షంగా ఆలియా భట్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, అలియా భట్ గురించేనా? కంగనా తన పోస్ట్‌లో ఎలాంటి పేర్లు వెల్లడించనప్పటికీ.. ఆమె రణబీర్ కపూర్, అలియా భట్ గురించే రాసినట్లు తెలుస్తోంది. రణబీర్‌తో తన పెళ్లికి అలియా తెల్లటి సబ్యసాచి చీరను ధరించింది. అలాగే కంగనా తన సోదరుడి వివాహానికి కూడా అదే దుస్తులను ధరించింది. అలియా, రణబీర్‌లు కూడా బాంద్రాలో వేర్వేరు అంతస్తులలో రెండు ఫ్లాట్ల్లో నివసిస్తున్నారు. నవంబర్ 2022లో వారిద్దరికీ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. కంగనా ఇన్స్టాగ్రామ్ కథనాలు నెటిజన్లను షాక్‌కి గురిచేస్తున్నాయి. ఇది చూసి చాలామంది అభిమానులు కంగనా పేర్కొన్న మిస్టరీ మ్యాన్ రణ్‌బీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కంగనా తదుపరి ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. రజనీకాంత్ తమిళ చిత్రానికి సీక్వెల్ 'చంద్రముఖి 2'లో కూడా తాను నటిస్తానని కంగనా ప్రకటించింది.ఆ తర్వాత 'తేజస్'లో కనిపించనుంది, ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించనుంది. ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. -
ఆలియా భట్‌కు రెండోసారి ప్రెగ్నెన్సీ.. అప్పుడేనా?
బాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరొందిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఈ బాలీవుడ్ జంట గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు నటించిన బ్రహ్మస్త్ర-పార్ట్-1 విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దంపతులకు నవంబర్ ఆరో తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆ ముద్దుల కూతురికి రాహా కపూర్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ జంటపై అప్పుడే ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆలియా త్వరలోనే రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పనుందని బీ టౌన్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు మరోసారి గర్భవతి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలియా భట్ తన రెండో బిడ్డను ఆశిస్తున్నట్లు బీ టౌన్లో వార్తలొస్తున్నాయి. అయితే ఆమె ఇటీవల ఓ దుస్తుల కోసం కంపెనీ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అందులో కొత్త మెటర్నిటీ కలెక్షన్స్‌ను లాంఛ్ చేసినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు మళ్లీ గర్బం ధరించిందనే విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జంట అధికారికంగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కెరీర్ పరంగా రణబీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో అలియా మరోసారి రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది. ఆమె తొలి హాలీవుడ్ చిత్రం వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌తో కలిసి హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది. కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ మూవీ "జీ లే జరా"లో కూడా నటించనుంది. రణబీర్ రాబోయే ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న "యానిమల్" లో నటిస్తున్నారు. రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ నటించిన రోమ్-కామ్ ఈ ఏడాది విడుదల కానుంది. -
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ‘సీత’గా మెప్పించేనా?
విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సాయి పల్లవి..ఇప్పుడు నార్త్ ఆడియన్స్‌ని మెప్పించేందుకు సిద్దమైందట. బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ఓ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుందట. ఈ చిత్రంలో రణబీర్ రాముడిగా కనిపిస్తే.. సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతుందట. ఇక ఈ చిత్రంలో రావణాసూరుడి పాత్రని హృతిక్ రోషన్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి సీతగా సాయి పల్లవి బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. -
బ్రహ్మస్త్ర సాంగ్.. ఆ డిలీటెడ్ సీన్ మీరు చూశారా?
ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా బాలీవుడ్లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో డిలీటెడ్ సీన్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలియా భట్ ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సాంగ్‌లో అలియా భట్, రణబీర్ కపూర్ మధ్య 'తొలగించబడిన సీన్' చూసి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, తుషార్ జోషి ఆలపించారు. ఆ సీన్లో ఆలియా చెవిపోగులతో నారింజ రంగు దుస్తులను ధరించి కనిపించింది. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడంచారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. For when love cannot be explained in words, you’ll have #RasiyaReprise. Video out now. ❤️https://t.co/4PyPh95zbl#Brahmastra — BRAHMĀSTRA (@BrahmastraFilm) October 7, 2022 View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
బ్రహ్మస్త్ర కలెక్షన్లపై దర్శకుడు క్లారిటీ.. 25 రోజుల్లోనే..!
ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా బాలీవుడ్లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. ( చదవండి: ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?) అయితే ఈ సినిమా కలెక్షన్లపై కాస్త గందరగోళం ఏర్పడింది. తాజాగా ఈ మూవీ సాధించిన కలెక్షన్లపై దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఇన్‌స్టాలో రాస్తూ ' 2022లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్‌గా నిలిచిన హిందీ మూవీ. ఇందుకు మీ అందరికి ధన్యవాదాలు. హ్యాపీ నవమి' అంటూ క్యాప్షన్‌తో కలెక్షన్ల వివరాలతో ఓ కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో బ్రహ్మాస్త్ర రూ.425 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని పోస్టర్లో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూల్ భులయ్యా 2, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాల కలెక్షన్ల కంటే ఎక్కువ మొత్తం బ్రహ్మాస్త్రకు వచ్చినట్లు అయాన్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బడ్జెట్ అనూహ్యంగా పెరిగినట్లు చెప్పారు అయాన్ ముఖర్జీ. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (చదవండి: దసరా సెలవుల్లో బ్రహ్మస్త్ర బంపర్ ఆఫర్.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై టాక్ నడుస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌లోనే స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే బ్రహ్మస్త్రను చూడాలనుకుంటున్న అభిమానులకు పండగే. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
బ్రహ్మస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్.. ఇదొక పెద్ద..!
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) బ్రహ్మాస్త్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు. బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాలీవుడ్‌ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. బాలీవుడ్లో ఇతర సినిమాల్లాగే ఇది కూడా పెద్ద వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కేఆర్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people. — KRK (@kamaalrkhan) September 16, 2022 కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
రూ.600 కోట్లు తగలబెట్టాడు.. వారందర్నీ జైల్లో పెట్టాలి: కంగనా ఫైర్
‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్‌పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు. అతని సినీ కెరీర్లో ఒక్క మంచి చిత్రం కూడా లేదని, అతన్ని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సినీ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. చిత్ర బృందంపై, ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు) ‘అయాన్ ముఖర్జీని మేధావి అని మెచ్చుకున్న వారందర్నీ జైలుకు పంపించాలి. ‘బ్రహ్మాస్త్ర’చిత్రానికి తెరకెక్కించడానికి అతనికి 12 ఏళ్లు పట్టింది. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి, 14 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చాడు. ప్రొడక్షన్స్ ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. బాహుబలి సినిమా సక్సెస్ కావడంతో.. బ్రహ్మాస్త్ర సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా చివరి నిమిషంలో మార్చి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అవకాశవాదులు, సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులను మేధావి అని పిలవ కూడదు’అంటూ కంగనా రాసుకొచ్చారు. అలాగే కరణ్ జోహార్‌పై కూడా కంగనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అతను సినిమా స్క్రిప్ట్‌లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులను కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్ ఉన్న వాళ్లతో సినిమా తీస్తే సరిపోతుంది కదా’అని కంగనా రనౌత్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికొస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. -
‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్ మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోలు నటించడంతో తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాలీడే కాకపోయినప్పటికీ ఇండియా వైడ్‌గా రూ. 35-38 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్లో కూడా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 6.7 కోట్లు గ్రాస్(రూ.3.7 కోట్ల షేర్) వసూళ్లను సాధించింది. తెలుగులోకి అనువాదమైన బాలీవుడ్ చిత్రాల్లో ఇది సరికొత్త రికార్డు. అంతకు ముందు ఆమిర్ ధూమ్ 3 చిత్రం రూ.4.7 కోట్లు సాధించింది. ఆ రికార్డుని బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్(హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి) జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. Humbled…grateful…yet can’t control my excitement! Thank you♥️ #Brahmastra pic.twitter.com/00pl9PGO5K — Karan Johar (@karanjohar) September 10, 2022 -
Brahmastra Review: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ
టైటిల్: బ్రహ్మాస్త్రం నటీనటులు: రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్, షారుఖ్‌ఖాన్ తదితరులు నిర్మాణ సంస్థలు : స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ దర్శకత్వం : అయాన్ ముఖర్జీ సంగీతం : ప్రీతమ్ సినిమాటోగ్రఫీ:సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 9) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటంతో ‘బ్రహ్మాస్త్రం’పై టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. మరి బ్రహ్మాస్త్రలోని మొదటి భాగం ‘శివ’ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అన్ని అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం. మూడు ముక్కలైన ఈ శక్తివంతమైన అస్త్రాన్ని తరతరాలుగా బ్రహ్మాన్ష్ సభ్యులు కాపాడుతుంటారు. ఈ మూడు ముక్కల్లో ఒక భాగం సైంటిస్ట్ మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్), రెండో భాగం ఆర్టిస్ట్ అనీష్(నాగార్జున)దగ్గరు ఉంటాయి. మూడో భాగం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ బ్రహ్మాస్త్రం స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంది జునూన్(మౌనీరాయ్). తన టీమ్‌తో కలిసి మూడు ముక్కలను వెతికి పట్టుకొని వాటిని అతించేందుకు ప్రయత్నిస్తుంది. జునూన్ బృందం ప్రయత్నానికి అడ్డుతగులుతాడు శివ(రణ్‌బీర్ కపూర్). డీజే నడుతూ జీవనం సాగించే శివకి, బ్రహ్మాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? అతను ఎందుకు జునూన్ టీమ్ చేసే ప్రయత్నానికి అడ్డుతగులుతున్నాడు? శివ నేపథ్యం ఏంటి? అగ్నికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? బ్రహ్మాస్త్రంలోని మూడో ముక్క ఎవరి దగ్గరు ఉంది? హిమాలయాల్లో ఉన్న గురు(అమితామ్ బచ్చన్) దగ్గరికి వెళ్లిన తర్వాత శివకు తెలిసి నిజాలు ఏంటి? ప్రియురాలు ఈషా(అలియా భట్)తో కలిసి బ్రహ్మాస్త్రాన్ని శివ ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకొని రాసుకున్న కథే ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల ప్రకారం అన్ని అస్త్రాల్లోకెల్లా అంత్యంత శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం. దీనిని ఆధారంగా చేసుకొని దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు. ప్రపంచానికి మంచి చేసే ఓ శక్తివంతమైన అస్త్రం అది. దానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి. దానిని రక్షించడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. అదేసమయంలో ఆ శక్తిని దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనుకునే ఓ దుష్టశక్తి ఉంటుంది. ఆ దుష్టశక్తి భారీ నుంచి ఆ అస్త్రాన్ని ఎలా కాపాడారు అనేదే ఈ చిత్ర కథ. ఈ తరహా నేపథ్యం ఉన్న చిత్రాలు హాలీవుడ్లో చాలానే వచ్చాయి. ఇలాంటి చిత్రాలకు అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు తలతిప్పుకోకుండా చేసే స్క్రీన్‌ప్లే కూడా అత్యవసరం. ఈ విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ పూర్తిగా తేలిపోయాడు. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోదు. బ్రహ్మాస్త్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ చిరంజీవి ఇచ్చే వాయిస్ ఓవర్‌తో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. వానారాస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్ మోహన్(షారుఖ్)తో జునూన్ టీమఠ్ చేసే పోరాట ఘట్టంతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. డీజే శివగా రణ్‌బీర్ ఎంట్రీ ఇవ్వడం.. ఈషాతో ప్రేమలో పడడం.. తనకు వచ్చే కలల్ని ఆమెతో పంచుకోవడం.. అనీష్ని రక్షించేందుకు వారణాసి వెళ్లడం..అక్కడ నంది అస్త్రాన్ని అనీష్ ప్రయోగించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తెరపై వచ్చే సీన్స్ మనకు ఎమోషనల్ గా టచ్ అవ్వకుండా అలా వెళ్లిపోతూ ఉంటాయి. శివ, ఈషాల మధ్య ప్రేమ చిగురించడం కూడా పూర్తి సినిమాటిక్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో గురుగా అమితాబ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. శివ గతం..అతనిలో ఉన్న అగ్ని అస్త్రాన్ని బయటకు తీసుకురావడానికి గురు చేసే ప్రయత్నం కొంతమేర ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఈషాతో శివ నడిపించే ప్రేమాయణం కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సన్నీవేశాలు మాత్రం సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్‌పై పెట్టిన శ్రద్ధ.. కథ, కథనంపై పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో రణ్‌బీర్ చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఈషా పాత్రకు న్యాయం చేసింది అలియా భట్. రణ్‌బీర్, అలియా మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. అయితే వారిద్దరు ప్రేమలో పడిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోదు. వానర అస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్ మోహన్‌గా షారుఖ్, నంది అస్త్రాన్ని కలిగిన ఉన్న ఆర్టిస్ట్ అనీష్‌గా నాగార్జున ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గురుగా అమితాబ్ బచ్చన్ తెరపై మరోసార తన అనుభవాన్ని చూపించాడు. జునూన్గా మౌనీరాయ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 9) ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘బ్రహ్మాస్త్ర’పై హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. సినిమాలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేదనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. రణ్‌బీర్, అలియా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు. అయితే లవ్ స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం ఈ సినిమాను మైనస్ అంటున్నారు. Interval 👌 Apart from love track I loved frst half Pre interval to Interval Rampppp🔥 Special credits for BGM's #Brahmastra https://t.co/mjBNbdEzw9 — . (@ravi_ssmbfan) September 9, 2022 What an amazing film. My jaw dropped so many times. Ayan Mukerji’s labour of love is the type of passion project where you feel the passion in each frame. The biggest technical achievement in the history of Bollywood. #Brahmastra is one of my all time favourite Bollywood films. pic.twitter.com/nQsZJvaDL4 — THE DISSENTER (@IamSamSanyal) September 9, 2022 But I feel #AyanMukerji for the most part has succeeded in what he set out to do ! It’ll depend on part 2 & 3 !! For this one, full marks to Ayan for the effort ! His hard work really shows!👏🏻 Can’t wait for part 2 !!🤩🤩 PS - Some amazing cameos !😋 #Brahmastra — N (@namitha995) September 9, 2022 Brahmashtra One word review:: "Naagin serial with extra budget"#Brahmashtra#Brahmastra#BrahmashtraReview — you idiot (@in_seconds2) September 9, 2022 Brahmastra Part One: Shiva absolutely blew me away. My first experience with a Bollywood movie and this has me all in. It feels very Avengers/Marvel and the 2 hour and 40 minute runtime actually flew by. Packed with action and gorgeous visuals, it's a must watch!#Brahmastra pic.twitter.com/hYPF579te8 — Tessa Smith - Mama's Geeky (@MamasGeeky) September 8, 2022 Contd.....#BrahmastraReview ⭐⭐⭐⭐1/2 4.5/5 Xclusive- Do not foget to see the teaser of #Brahmastra #Brahmashtra part 2 after the end credit rolls.#RanbirKapoor #AliaBhatt — Nitesh Naveen (@NiteshNaveenAus) September 9, 2022 Interval variyum super ah irukku bro Vfx perfect Konjam love story irukkum Otherwise mathathellam super Sharukhkhan and nagarjuna cameo works well#Brahmastra — Mohamed Abdulla (@Maideenhussain1) September 9, 2022 -
ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎందుకంటే ప్రేక్షకులకు ఇంకా ఏదో కొత్తగా కావాలి. ఆ ఒత్తిడి ఉన్నప్పుడే మనం బాగా చేయగలం. ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి. మన ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు, గొప్ప చిత్రాలు తీయాలి.. తీస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. కాగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది నటులున్నారు. కానీ, కొందరు మాత్రమే నాపై ప్రభావం చూపారు. అమితాబ్ బచ్చన్‌గారు, రణ్‌బీర్ కపూర్ ఇంటెన్సిటీ అంటే నాకు చాలా ఇష్టం. వీరి నుంచి ఓ యాక్టర్‌గా నేను స్ఫూర్తి పొందాను. రాజమౌళి, కరణ్ జోహార్గార్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగా మార్చారని నమ్ముతున్నాను. మా నాగార్జున బాబాయ్ నటించిన హిందీ చిత్రం ‘ఖుదాగవా’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ తెలుగు హీరో హిందీలో డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తొలిసారి ఆ సినిమా చూసి తెలుసుకున్నాను’అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ–‘‘రాజమౌళిగారు ‘బ్రహ్మాస్త్రం’ని సమర్పిస్తున్నారంటే సినిమా అలా ఇలా ఉండదు. ఆయాన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో భాగమయ్యారు. రాజమౌళిగారు ఓ సినిమాని మూడేళ్లు చెక్కుతారు.. అలా ఆయాన్ కూడా ‘బ్రహ్మాస్త్రం’ ని మూడేళ్లు చెక్కారు’’ అన్నారు. (చదవండి: తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు) రాజమౌళి మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా చేయాలనుకుని ఏర్పాట్లు చేశాం. ఐదు రోజుల కిందట పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నాం. అయితే శుక్రవారం ఎక్కువగా వినాయక నిమజ్జనాలు ఉండటం వల్ల ప్రీ రిలీజ్ వేడుకకి బందోబస్తు ఇవ్వడం కష్టమని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు.. దీంతో ప్రీ రిలీజ్ వేడుకని క్యాన్సిల్ చేసి, ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నాం. ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో భాగం కావాలని ఐదేళ్ల కిందట కరణ్‌గారు చెప్పడంతో ఓకే అన్నాను. ఆయాన్ ముఖర్జీ ఈ కథ చెప్పినప్పుడు నా బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి’’ అన్నారు. ‘‘తారక్ అమేజింగ్ యాక్టర్. ఆయాన్ ముఖర్జీ పదేళ్ల ఆలోచనల రూపం ‘బ్రహ్మాస్త్రం’’ అన్నారు కరణ్ జోహార్ ‘‘నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్రం’. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రణ్‌బీర్ కపూర్. ‘‘ఈ సినిమా మాకో ఎమోషన్’’ అన్నారు ఆలియా భట్. నటి మౌనీరాయ్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా, ప్రైమ్ ఫోకస్ ఫౌండర్ నమిత్ మల్హోత్రా, డీస్నీ స్టార్ ప్రెసిడెంట్ మాధవన్, స్టార్ స్టూడియోస్ హెడ్ విక్రమ్ దుగ్గల్ తదితరులు పాల్గొన్నారు. -
చిరు వాయిస్‌తో ‘బ్రహ్మాస్త్ర` ట్రైలర్.. విజువల్స్ అదుర్స్
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని నామకరణం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలవుతుంది. (చదవండి: కోలీవుడ్‌కు నయన్ బిగ్ షాక్.. పెళ్లి తర్వాత కొత్త కండీషన్!) ‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందన్న విషయం ఆ యువకునికే తెలియదు. అతనే శివా’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ గంభీరంగా ఉంది. బ్రహ్మాస్త్రం కోసం పోరాటం, దుష్టశక్తుల యుద్దం.. అద్భుతమైన లవ్‌స్టోరీ..ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్లో చూపించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. -
ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడు: రాజమౌళి
‘నాలుగేళ్ల క్రితం కరణ్ జోహార్ ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను. మా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒకసారి మీకు కథ వినిపిస్తాడు. నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ మూవీ సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను. ఆయన కథ చెప్పిన విధానం కంటే ఆయన బ్రహ్మాస్త్ర సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నా ఎక్సయిట్మెంట్ కి నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తరువాత తను తయారుచేసుకున్న విజువల్స్, అప్పటివరకు షూట్ చేసిన మెటీరియల్ అంత చూపిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను’అని అన్నారు దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్,దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం వైజాగ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘బ్రహ్మాస్త్ర సినిమా పెద్ద స్క్రీన్ మీదే చూడాలని తీశారు. డైరెక్టర్ అయాన్ ఈ మూవీని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్న(రచయిత విజయేంద్రప్రసాద్)కు మొత్తం చూపించాడు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నేను రెండుసార్లు ముంబైకి వెళ్లాను అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు. అయినా అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది’అని అన్నారు. ఇక అలియా భట్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం అని చెప్పుకొచ్చారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది, దీనికి రెండు కారణాలు ఉన్నాయ్, నా రెండో సినిమా "యే జవానీ హై దీవానీ" తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం నేను పదేళ్లు తీసుకున్నాను. నేను చాలా పెద్దగా ఊహించాను. మునుపెన్నడూ తీయని ఒక గొప్ప సినిమాను తీయాలనే ఆలోచన నాకు ఉండేది. అప్పటికీ రాజమౌళి ఇంకా బాహుబలి కూడా చెయ్యలేదు. ఇంత గొప్ప సినిమాను ఊహించేది నేను మాత్రమే అని ఫీల్ అయ్యేవాన్నీ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ బ్రహ్మస్త్రం. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి వాటి మూలాలు ఈ సినిమా బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అని చెప్పుకొచ్చారు. -
ఫోన్ వాల్‌పేపర్ చూపిస్తూ బ్లష్ అయిన అలియా.. ఇంతకీ ఏముందంటే!
బాలీవుడ్ క్యూటీ అలియా భట్ దీపావళి రోజున హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలియజేసింది. అలియా భట్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు ఒక యూట్యూబర్ కూడా. యూట్యూబ్‌లో ఆమెకు 1.6 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె శనివారం తన తాజా వ్లాగ్‌ను షేర్ చేసింది. ఇందులో తన బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్ కపూర్‌తో సంభాషణలో నిమగ్నమై కనిపించింది. ఈ సంభాషణలో మధ్యలో తన ఫోన్లోని వాల్‌పేపర్ చూపించింది. రణ్‌బీర్‌తో అలియా సన్నిహితంగా, ప్రేమగా ఉన్న సెల్ఫీ వాల్‌పేపర్‌గా ఉంది. ఇది చూపిస్తూ బాలీవుడ్ బ్యూటీ క్యూట్‌గా బ్లష్ అయింది. కాగా, రణ్‌బీర్, అలియాలు ఈ నెల ప్రారంభంలో వారి రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించి అభిమానులకు ఆశ్చర్యం కలిగించారు. కపూర్ ఫ్యామిలి ఫంక్షన్స్‌కి అలియా హాజరైన ప్రతిసారి వారిద్దరు డేటింగ్లో ఉన్నట్లు గాసిప్స్ వచ్చాయి. అప్పుడు ఎవరూ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అయితే దీపావళి రోజున అలియా పెట్టిన పోస్ట్‌తో ఈ పుకార్లకు బ్రేక్ పడింది. దీపావళి సందర్భంగా అలియా తన ఇన్‌స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో మొదటి ఫొటోకు 'కొంత కాంతి.. హ్యాపీ దివాళి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: కరణ్ జోహార్ ఇంటర్వ్యూ.. అలియా క్యూట్ క్యూట్ సమాధానాలు తర్వాతి ఫొటో మాత్రం ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. అందులో రణ్‌బీర్‌ను అలియా కౌగిలించుకుని, ఒకరినొకరు చూస్తు స్మైల్ చేస్తున్నట్టు ఉంది. ఆ ఫొటోలో వారిద్దరూ నీలి రంగు దుస్తులు ధరించారు. ఇంకా 'కొంత ప్రేమ.. హ్యాపీ దివాళి' అని క్యాప్షన్ పెట్టింది. ఇలా వారి రిలేషన్ బహిర్గతమైంది. అధికారికంగా తమ ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కేందుకు ఎక్కువ సమయం పట్టదని అభిమానులు అనుకుంటున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) రణ్‌బీర్ కపూర్ త్వరలో లవ్ రంజన్, బ్రహ్మాస్త్ర, యానిమల్, షంషేరలో కనిపించనున్నాడు. బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ, గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్, ఆర్ఆర్ఆర్, తఖ్త్ చిత్రాల్లో నటిస్తోంది. -
‘ఎంత అందంగా ఉన్నావో.. నీ పెళ్లెప్పుడు?’
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ వస్తే చాలు.. అందరి కళ్లు రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ల మీదకే వెళ్తాయి. గత కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్న వీరిద్దరి పెళ్లి గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా వీరిని అడిగే ఫస్ట్ ప్రశ్న పెళ్లి గురించే. తాజాగా మరో సారి రణ్‌బీర్-ఆలియా పెళ్లి ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం ఏంటంటే కొద్ది రోజుల కిత్రం ఆలియా మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్డా కోసం బ్రైడల్ యాడ్ షూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని వీణా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పీచ్ కలర్ లెహంగా.. దానికి మ్యాచింగ్ భారీ ఆభరణాలు ధరించి.. చేతుల్లో ఎర్రగా పండిన మెహందీని చూపుతూ ఆలియా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘‘పెళ్లి కుమార్తెగా ఎంత అందంగా.. ముద్దుగా ఉన్నావో’’.. ‘‘త్వరగా పెళ్లి చేసుకో’’.. ‘‘ఇంతకు నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఈ ఫోటోలో ఆలియాతో పాటు మెహందీ డిజైనర్ వీణా నగ్డా కుడా ఉన్నారు. తాజాగా వీణ.. వరుణ్ ధావన్-నటాషా దలాల్ వివాహం సందర్భంగా వారికి మెహందీ డిజైనర్‌గా వ్యవహరించారు. View this post on Instagram A post shared by ᴀʟɪᴀ💕 (@mylife_aliabhatt) ఇక ఆలియా-రణ్‌బీర్‌ల విషయానికి వస్తే.. ఈ జంట 2020లోనే వివాహం చేసుకోవాల్సి ఉండేనని.. అయితే కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని ప్లాన్స్ అటకెక్కాయని స్వయంగా రణ్‌బీర్ కపూరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆలియా తెలుగులో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి: నన్ను దారుణంగా తిడుతున్నారు.. -
నేడు రణ్‌బీర్, అలియా నిశ్చితార్థం.. రణ్‌ధీర్ క్లారిటీ!
బాలీవుడ్ నటీనటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొన్నాళ్లుగా ప్రేమలోకంలో విహరిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా ఈ ప్రేమపక్షులు బయట విహరిస్తూ కెమెరాల కంట పడుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట రాజస్థాన్‌లో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం (డిసెంబర్ 29) అక్కడకు చేరుకున్నారు. వీరి వెంట కపూర్ కుటుంబం, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె కూడా పింక్ సిటీకి పయనమయ్యారు. వీరంతా రాజస్థాన్‌లోని రణతంభోర్ పార్కుకు సమీపంలోని సవాయి మధోపూర్‌లో బస చేస్తున్నారు. అయితే మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి అలియా, రణ్‌బీర్ ఒకే చోటుకు వెళ్లడంతో ఈ ప్రేమ జంట జైపూర్‌లో వివాహం ప్టాన్ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రోజే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబుతున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో రణ్‌బీర్ నిశ్చితార్థపు వార్తలపై ఆయన అంకుల్ రణ్‌ధీర్ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఈ జంట ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకోవడం లేదని రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టారు. చదవండి: తనే నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్ ‘రణ్‌బీర్, అలియా నిశ్చితార్థ వార్తలు వాస్తవం కావు. కేవలం పుకార్లు మాత్రమే. ఒకవేళ రణ్‌బీర్ అలియా నిశ్చితార్థం చేసుకుంటే మా కుటుంబ సభ్యులు కూడా వారితో అక్కడికి వెళ్లే వాళ్లం. రణ్‌బీర్, అలియా, నీతు కలిసి న్యూ ఇయర్ హాలీడ్ ట్రిప్‌కు వెళ్లారు. అని స్పష్టం చేశారు. కాగా ఇటీవల ఆలియాతో పెళ్లి విషయమై రణ్‌బీర్ షాకింగ్ విషయం చిప్పిన విషయం తెలిసిందే. తామిద్దరం 2020లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నామని తెలిపారు. అయితే కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని, లేకపోతే ఈపాటికే జరిగిపోయి ఉండేదని తెలిపాడు. ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: ప్రియుడి బంగ్లాలో అలియా కొత్త ఇల్లు -
ప్రసాదు.. మీ పెళ్లెప్పుడు..?!
(వెబ్ స్పెషల్) మన సమాజంలో ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి. పదేళ్లలోపు పిల్లలకు వివాహం చేసేవారు. తర్వాత కాలానుగుణంగా పెళ్లికి వయసు మారిపోతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అమ్మాయిలే 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. సామాన్యులమే ఇలా ఉంటే ఇక సెలబ్రెటీల మాట. అవును 50 ఏళ్లు దాటిన పెళ్లి ఊసెత్తని హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల మీద ఓ లుక్కేయండి.. 1. సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది కండల వీరుడు సల్మాన్ ఖాన్. 54 సంవత్సరాలు వచ్చిన ఈ హీరో ఇంకా పెళ్లి ఊసేత్తడం లేదు. అలా అని వివాహం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అంటే ఏం లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపాడు. మొదట ఐశ్యర్య రాయ్‌ని ప్రేమించాడు. కానీ బ్రేకప్ అయ్యింది. తర్వాత ఐశ్యర్య, అభిషేక్‌ని వివాహం చేసుకుంది. కొద్ది రోజులు సంగీతను ప్రేమించట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో మరోసారి ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె, రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో పడింది. దాంతో కొద్ది రోజుల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్నాడు భాయిజాన్. ప్రస్తుతం రొమేనియన్ మోడల్ లూలియా వంతూర్‌తో ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు.. త్వరలో పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. మరి ఈ సారైనా సల్మాన్ ప్రేమ సక్సెస్ అయ్యి.. పెళ్లి పీటలేక్కుతుందేమో చూడాలి. (చదవండి: ఆగేది లేదు!) 2. ప్రభాస్ బాహుబలితో అంతర్జాతీయ క్రేజ్ సంపాదించుకున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. బాహుబలి అవ్వగానే ఓ ఇంటి వాడిని అవుతానని చెప్పిన డార్లింగ్ ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని.. ప్రస్తుతం స్వీటీ పెళ్లికి సిద్ధంగా లేదని.. అందుకే డార్లింగ్ పెళ్లి వాయిదా వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనక నిజమయ్యి.. ప్రభాస్, అనుష్కలు వివాహం చేసుకుంటే అభిమానులకు పండగే! చూడాలి మరి ఏం జరుగుతుందో. 3. రణ్‌దీప్ హుడా బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఉంటాడు. 44 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఊసెత్తడం లేదు. పైగా ఇంతవరకు తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు అంటాడు. ఇతను కూడా సుస్మితా సేన్, నీతూ చంద్ర వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. (చదవండి: వారం వారం ఆశ్చర్యం) 4. రామ్ హీరో రామ్ కూడా ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. లాక్డౌన్ కాలంలో రామ్ వివాహం గురించి చర్చలు మొదలయ్యాయని టాక్. రామ్ వయసు ఇప్పుడు 32 ఏళ్ళు. మూడు పదుల వయసులోకి వచ్చినప్పటి నుంచే ఈ హీరోను పెళ్లి చేసుకోమ్మని ఇంట్లో వాళ్ళు పోరుతున్నారట. కానీ రామ్ మూడేళ్ళుగా కెరీర్ కారణంగా పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి ఈసారి తప్పించుకుంటాడో లేదో చూడాలి. 6. ఉదయ్ చోప్రా దర్శకుడు యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా కూడా సింగిల్‌గానే ఉన్నారు. గతంలో ఈ హీరో నర్గిస్ ఫక్రిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించాడు. కానీ ఎందుకో మరి అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ నటుడు సోలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. 7. రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ కూడా ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. కాకపోతే ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయాణం నడిపాడు. తొలుత దీపిక, తర్వాత కత్రినా. అయితే వీరిద్దరూ ఇతడికి బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఈ లవర్ బాయ్ అలియా భట్‌తో రిలేషన్లో ఉన్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక వీరితో పాటు టాలీవుడ్లో వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్ వంటి హీరోలు సింగిల్‌గా ఉన్నారు. ఇక హీరోయిన్ టబు, అమిషా పటేల్, సుస్మితా సేన్, దివ్యా దత్తా సింగిల్‌గానే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే వీరంతా ఓ ఇంటి వారు కావాలని కోరుకుందాం. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) -
హీరోయిన్ కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ తాజాగా ట్విట్టర్ వేదికగా మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈసారి వ్యక్తుల పేర్లను ప్రస్తవిస్తూ టార్గెట్ చేసింది. ‘రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌషల్ ‘కొకైన్ బానిసలు’ అని పుకార్లు ఉన్నాయి. వీరందరూ డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ఈ పుకార్లకు స్వస్తి పలకాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. క్లియర్ శాంపిల్స్‌తో ఈ యువ నటులందరూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని కంగనా తన ట్వీట్లో పేర్కొంది. ఇక ఈ ట్వీట్‌పై కాలమిస్ట్ ఆశ్విని మహాజన్ స్పందిస్తూ ‘నేషనల్ అవార్డుకు ఎంపిక చేసేముందు ఆ ఆర్టిస్ట్‌లందరికి డ్రగ్ టెస్ట్ చేయాలంటూ కంగనా మంచి డిమాండ్ చేశారు. అలాంటివారు మనకు రోల్ మోడల్స్ ఎలా అవుతారు’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది రాజకీయ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా కరణ్ జోహార్ పార్టీకి చెందిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఆ వీడియోలోని వారందరూ డ్రగ్స్ తీసుకున్న స్థితిలోనే ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోను కరణ్ జోహార్ ఇంట్లో తీశారు. దీనిని మొదట కరణ్ జోహారే షేర్ చేశారు. ఈ వీడియోలో రణబీర్, అయాన్, విక్కీ, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ తదితరులు ఉన్నారు. I request Ranveer Singh, Ranbir Kapoor, Ayan Mukerji, Vicky Kaushik to give their blood samples for drug test, there are rumours that they are cocaine addicts, I want them to bust these rumours, these young men can inspire millions if they present clean samples @PMOIndia 🙏 https://t.co/L9A7AeVqFr — Kangana Ranaut (@KanganaTeam) September 2, 2020 దీని కరణ్ స్పందిస్తూ వారు డ్రగ్స్ తీసుకొని వుంటే నేను ఎందుకు దానిని షేర్ చేస్తాను అంటూ ప్రశ్నించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారు అన్న కంగనా ఆరోపణలపై ఇటీవల రవీనా టాండన్, హన్సాల్ మెహతా స్పందించారు. బాలీవుడ్‌లోని ప్రతి ఒక్కరికి దానిని అపాదించడం అన్యాయమని వారు అన్నారు. ఇతర వృత్తులలో ఉన్నట్లుగానే చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని వారు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ఇంటర్వ్యూ తర్వాత అమ్మ ఏడుస్తూనే ఉంది -
రణ్‌బీర్, దీపిక మూవీకి ఏడేళ్లు
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తారు. ఇక దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న వేళ సినీ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తాజాగా కరణ్ 2013లో తాను నిర్మించిన రొమాంటిక్ ఎంటర్టెయినర్ ‘యే జవానీ హై దీవానీ’ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆ సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, ఆదిత్య రాయ్ కపూర్, కల్కి కోచ్‌లిన్ల పాత్రలను పరిచయం చేస్తూ వచ్చే ఫొటోలతో కూడిన ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. (తాప్సీ ఇంట్లో విషాదం..) ‘‘యే జవానీ హై దీవానీ’ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు అవుతోంది. సినిమాలో నటించిన ఆ నలుగురు స్నేహితుల బృందం మన జీవితాల్లోకి వచ్చి వారిలో ఉన్న స్నేహం, ప్రేమను చూపించారు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్‌కు తగిన సినిమా ఇది’ అని కరణ్ కామెంట్ జత చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శికుల ప్రశంసలు అందుకుంది. It's been 7whole years since this gang of friends came into our lives & taught us all about friendship and love. A movie still so relevant for all generations!!♥️ #7YearsOfYJHD@apoorvamehta18 #RanbirKapoor @deepikapadukone #AdityaRoyKapur @kalkikanmani #AyanMukerji @DharmaMovies pic.twitter.com/gisF6ANoxg — Karan Johar (@karanjohar) May 31, 2020 -
ఆ హీరో అంటే చాలా ఇష్టం: విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో విజయ్ ఒకరు. టాలీవుడ్ సెన్సెషన్‌ల స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడిగా ఎవరిని స్పూర్తిగా తీసుకుంటారని ప్రశ్నించగా.. రణ్‌బీర్ కపూర్ అని సమాధానమిచ్చారు. తను ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో రణ్‌బీర్ ముందు వరుసలో ఉంటాడని, అతన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెబ్బుకొచ్చారు. (సాయంలోనూ ప్రత్యేకత చాటుకున్న విజయ్ దేవరకొండ) ఇటీవల చూసిన కొన్ని షోలు, డాక్కుమెంటరీ సినిమాల గురించి విజయ్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘నేను తాజాగా ‘ఫౌధా’, ‘చీర్’ అనే డాక్యుమెంటరీలను చూశాను. ప్రతి ఒక్కరూ దీనిని చూడాలని కోరుతున్నాను. వీటితోపాటు మైఖేల్ జోర్డాన్, చికాగో బుల్స్‌కు సంబంధించిన ‘లాస్ట్ డాన్స్’ అనే డాక్యుమెంట్ సిరీస్‌ను చూశాను. ఈ సిరీస్ మీకు ఆశను, ప్రేరణను ఇస్తుంది. జీవితంలో ఆశయం కలిగిన వ్యక్తులను నేను ఇష్టపడతాను. వీళ్లు ఆ పని చేశారు.’ అని పేర్కొన్నారు. వీటిని చూడటం వల్ల నిరాశ నుంచి కోలుకోవడానికి, ప్రేరణ పొందడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. (కొత్త వినతులకు బ్రేక్ : విజయ్ ఫౌండేషన్) ఒకవేళ నటుడు కాకపోతే ఆర్కిటెక్ట్ అయ్యేవాడినని విజయ్ అన్నారు. అర్కిటెక్స్ అంటే ఇష్టమని, ప్రయాణాలు చేసే సమయాల్లో అర్కిటెక్చర్‌పై ఆకర్షితుడైతానని తెలిపారు. ప్రపంచ అర్కిటెక్చర్‌పై వీడియోలను చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని. ఆర్కిటెక్చర్ కోసం జపాన్ను సందర్శించాలనుకుంటున్నానని తన మనుసులో మాటను బయట పెట్టారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూర్తి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రౌడీకి జోడిగా అనన్యపాండే నటిస్తున్నారు. (నువ్వు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోతారా? ) -
గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు
ఒక్కసారి రిలేషన్షిప్లో మోసపోతే మళ్లీ ఆ బంధాన్ని యథావిధిగా కొనసాగించలేమని అంటున్నారు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే. గతంలో తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆమె తెలిపారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తన గత ప్రేమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.(రోమి దేవ్ పాత్రలో అదిరిపోయిన దీపిక!) ‘‘శృంగారం కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. భావోద్వేగాలతో కూడుకొని ఉంటుంది. నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎవ్వరిని మోసం చేయలేదు. ఒకవేళ నేను ముర్ఖుల మధ్య ఉన్నా అని నాకు తెలిసినప్పుడు.. నేను ఎందుకు రిలేషన్షిప్లో ఉంటాను. ఒంటరిగా, ఆనందంగా ఉండటమే మంచిది కదా. అయితే అందరూ అలా ఆలోచించరు. బహుశా అందుకే నేను గతంలో బాధపడ్డాను. తెలివి తక్కువదానిలా అతనికి రెండో అవకాశం ఇచ్చాను. ఎందుకంటే తాను నన్ను వేడుకున్నాడు. అప్పటికే నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తన ఇంకా నన్ను మోసం చేస్తున్నాడని చెబుతూనే ఉన్నారు. అప్పడు నేను అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. అయితే ఆ సంఘటన నుంచి బయటికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. కాని ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్నాక. మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఏమి చేయలేం. జీవిత ప్రయాణంలో ముందుకు సాగాల్సిందే’’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రభాస్‌తో బాలీవుడ్ భామ రొమాన్స్..!) "అతను నన్ను మోసం చేసిన మొదటిసారి, బంధంలోనో, లేదా నాలో లోపం ఉందని అనుకున్నాను, కాని ఎవరైనా మోసాన్ని అలవాటుగా చేసుకున్నప్పుడు, అతనే సమస్య తెలిసి పోతుంది. నేను రిలేషన్లోషిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కానీ తిరిగి ప్రతిఫలంగా ఆశించను. కానీ ఒక్కసారి రిలేషన్షిప్లో మోసం చేస్తే.. గౌరవం పోతుంది, బంధానికి ఉన్న నమ్మకం పోతుంది. అతనితో కలిసి ఉండలేం అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు. కాగా కొన్నేళ్లపాటు హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమ వ్యవహారం నడిపించిన విషయం తెలిసిందే. దీపిక.. రణ్‌బీర్ రెండేళ్లపాటు డేటింగ్ చేసి, అనంతరం 2009లో విడిపోయారు. -
ఆ హీరోను మరోసారి పొగిడిన అమితాబ్
ముంబై : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఏడు పదుల మయసులోనూ నిర్విరామంగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మస్త్ర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే రణ్‌బీర్, అమితాబ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రణ్‌బీర్‌తో కలిసి ఉన్న ఫోటోలను అమితాబ్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. (డిసెంబర్ 4న ‘బ్రహ్మస్త్ర’) ‘‘నేను ఇష్టపడే వారిలో ఒకరైనా రణ్‌బీర్‌తో కలిసి పని చేస్తున్నాను. అతని టాలెంట్‌తో సమానం కావడానికి నాకు నాలుగు కుర్చీలు అవసరమయ్యాయి’’. అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. అయితే బిగ్‌బీ రణ్‌బీర్‌ను ప్రశంసించడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రణ్‌బీర్ చాలా సునాయసంగా హావాభావాలను వ్యక్తపరచగలడు. అది అతనికి దేవుడిచ్చిన వరం. కానీ నేనైతే భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఎల్లప్పుడూ కష్టపడుతుంటాను. అలాగే ఈ విషయంలో డైరెక్టర్ సలహాను తీసుకుంటాను’. అంటూ పొగడ్తలతో ముంచేశాడు. ఇక బిగ్‌బీ ట్వీట్‌పై రణ్‌బీర్ స్పందించారు. ఇంతకంటే గొప్ప ప్రశంసను నేను ఎప్పటికీ పొందలేనని,. అమితాబ్ నాకు కుటుంబంలోని వ్యక్తి వంటి వారని.. ఎందుకంటే నన్ను కూడా ఆయన తన కుటుంబంలోని వ్యక్తిలా ట్రీట్ చేస్తారని తెలిపారు. కాగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.(అమితాబ్‌పై అమర్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు) చదవండి: ప్రధాని మోదీ తరువాత బిగ్‌బీనే T 3452 - .. work starts early .. like 6 am .. rehearsing, blocking and then shooting it .. with one of my favourites ❤️👍.. I need 4 of those🪑s to keep up with his enormous talent .. !! pic.twitter.com/7m3Noaa7pT — Amitabh Bachchan (@SrBachchan) February 25, 2020 -
డిసెంబర్ 4న ‘బ్రహ్మస్త్ర’
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదలకు సంబందించి ఒక ఫోటోను బిగ్‌బీ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘బ్రహ్మస్త్ర సినిమా హింది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి.. డిసెంబర్ 4, 2020 ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని బిగ్‌బీ వెల్లడించారు. T 3429 BRAHMĀSTRA.. coming to cinemas on 4/12/20 & Ayan is NOT allowed to change it now! #Brahmastra #RanbirKapoor @aliaa08 @iamnagarjuna @RoyMouni #AyanMukerji @ipritamofficial @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @MARIJKEdeSOUZA @DharmaMovies @FoxStarHindi @BrahmastraFilm — Amitabh Bachchan (@SrBachchan) February 2, 2020 ‘బ్రహ్మస్త్ర’ ఓ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అదేవిధంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఆలియా భట్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో చిత్ర విడుదలకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘బ్రహ్మస్త్ర మూవీ డిసెంబర్ 4న విడుదల అవుతుంది’ అని ఆమె తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెరుకెక్కుతున్న ఈ సినిమా చూడాలంటే డిసెంబర్ నాలుగు వరకు ఆగాల్సిందే. చదవండి: పరిశోధకుడు View this post on Instagram @amitabhbachchan #RanbirKapoor #AkkineniNagarjuna @imouniroy @ayan_mukerji @ipritamofficial @karanjohar @apoorva1972 #NamitMalhotra @marijkedesouza @dharmamovies @foxstarhindi @brahmastrafilm A post shared by Alia ☀️ (@aliaabhatt) on Feb 1, 2020 at 9:50pm PST -
‘రణబీర్ సలహాతో కోలుకున్నా’
న్యూఢిల్లీ : కళంక్ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో నిరాశలో కూరుకుపోయిన తాను రణ్‌బీర్ కపూర్ సూచనలతో కోలుకున్నానని బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పుకొచ్చారు. రూ 100 కోట్లతో తెరకెక్కిన కళంక్ లైఫ్‌టైమ్ వసూళ్లు రూ 80 కోట్లకే పరిమితమవడం చిత్ర బృందాన్ని నిరుత్సాహపరిచింది. తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా తన కష్టానికి ఫలితం దక్కలేదని తాను తీవ్ర నిర్వేదానికి లోనయ్యాయని అలియా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమయంలో తనకు తన బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్ అండగా నిలిచారని, ఆయన చెప్పిన మాటలు తనకు స్వాంతన చేకూర్చాయని అలియా చెప్పారు. నువ్వు నీ శక్తిమేర కష్టపడ్డావని, అది ఇప్పటికిప్పుడు ఫలితాలు ఇవ్వకపోయినా కష్టపడే నటిగా, వ్యక్తిగా నీ శ్రమ వృధా కాదని, మరో సినిమా రూపంలో మంచి ఫలితంగా అది కనిపిస్తుందని రణబీర్ తనలో ధైర్యం నూరిపోశారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళంక్ నిర్మాత కరణ్ జోహార్, నటి కరీనా కపూర్లు కూడా పాల్గొన్నారు. -
‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’
రణబీర్ కపూర్, అలియా భట్ల ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని బీటౌన్‌లో పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ పబ్లిక్‌గానే తిరగేస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో వీరి పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రణ్‌బీర్ సోదరి, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వీరిద్దరి బంధంపై స్పందించారు. తాజాగా కరీనా, అలియాభట్‌లు కరణ్‌జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరించే షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్, అలియాను ఉద్దేశిస్తూ.. ‘నీ జీవితంలో ఎప్పుడైనా కరీనా కపూర్ నీకు వదిన అవుతుందని అనుకున్నావా’ అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు అలియా కంటే ముందే కరీనా స్పందించారు. ‘అలియా నాకు మరదలైతే.. నాకంటే ఎక్కువు సంతోషించే వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు’ అన్నారు. దానికి అలియా సిగ్గుపడుతూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అంతేకాక ‘ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేద’ని తెలిపారు. కరణ్ ఈ టాపిక్‌ను ఇంతటితో వదిలేయకుండా.. ‘ఒక వేళ నీకు, రణ్‌బీర్‌కు వివాహం అయితే నేను, కరీనా చాలా సంతోషిస్తాం.. థాలీతో ఎదురుచూస్తూంటాం. అంతేకాక ఒక వేళ నువ్వు, రణ్‌బీర్ వివాహం చేసుకున్నప్పటికి కరీనా లానే మీ కెరియర్ను కొనసాగించాలి’ అన్నారు. అలియా ఈ వ్యాఖ్యలకు మద్దతిస్తూ.. ‘అవును గతంలో ఓ హీరోయిన్‌కు వివాహం అయ్యిందంటే ఇక ఆమె కెరియర్ ముగిసిపోయినట్లే అని భావించేవారు. కానీ కరీనా వీటన్నింటిని బద్దలు చేశారు. వ్యక్తిగత జీవితం, కెరియర్ రెండింటిని ఆమె చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆమె దగ్గర పని చేసే వారంతా కరీనా గురించి ఎంతో గొప్పగా చెప్తారు’ అన్నారు అలియా. (చదవండి: ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!) -
రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు ఏమైంది మరి?!
ఒకప్పుడు ప్రేమికులుగా ఉన్న బాలీవుడ్ రీల్ కపుల్ రణ్‌బీర్ కపూర్- దీపికా పదుకొనే ప్రస్తుతం స్నేహితులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీపికతో పాటు ఆమె భర్త రణ్వీర్ సింగ్ కూడా రణ్‌బీర్ ఇంటికి కూడా వెళ్లడం ద్వారా.. కపూర్ ఫ్యామిలితో అనుబంధం ఏర్పరచుకున్నాడు. కాగా రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో దీపికా రిషి కపూర్‌ను పరామర్శించింది. కపూర్ దంపతులను కలిసి కాసేపు వారితో ముచ్చటించింది. ఈ సందర్భంగా దీపికాకు బ్రేస్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్.. ఆమెతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘దీపిక రాకతో మా సాయంత్రం ఎంతో ఆత్మీయంగా మారింది. మాపై ఎంతో ప్రేమను కురిపించింది’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. కాగా నీతూ పోస్ట్‌పై స్పందించిన దీపిక అభిమానులు.. ‘ కపూర్ ఫ్యామిలి సమయానికి తగ్గట్టుగా భలే నాటకాలు ఆడుతున్నారు. రణ్‌బీర్‌తో దీపిక ప్రేమలో ఉన్న సమయంలో ఆమెను ఎంతగా బాధపెట్టారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఎలా చేయగలుగుతున్నారు నీతూ కపూర్’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ‘దీపిక అందమైన మనస్సు ఉన్నది కాబట్టే తనను బాధ పెట్టిన వారిని కూడా పెద్ద మనస్సుతో క్షమించగలదు. దటీజ్ దీపికా’ అంటూ పద్మావత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీపికాకు బ్రేకప్ చెప్పిన తర్వాత కత్రినాతో ప్రేమలో పడ్డ రణ్‌బీర్ ఆమెతో కూడా తెగదెంపులు చేసుకుని.. ప్రస్తుతం అలియా భట్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా కూడా తన సోల్‌మేట్ రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ మాజీ ప్రేమజంట ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు కూడా. View this post on Instagram Such a fun evening with adorable @deepikapadukone .. gave lot of love n warmth 😍🥰 A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on May 11, 2019 at 10:15pm PDT -
‘ఇప్పటిదాకా అన్నీ తన ఇష్టప్రకారమే జరిగాయి’
అందరు తల్లుల్లాగే తాను కూడా కూతురు సంతోషాన్నే కోరుకుంటానంటున్నారు బాలీవుడ్ నటి సోనియా రాజ్దాన్. తన కూతురు అలియా భట్- రణ్‌బీర్ కపూర్ గురించి ప్రచారమవుతున్న రూమర్లపై ఆమె స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఇది అలియా వ్యక్తిగత విషయం. ఇప్పటివరకు తను ఎవరితో డేటింగ్ చేసినా అది ఆమె ఇష్టప్రకారమే జరిగింది. ప్రస్తుతం తను ఎవరిని ప్రేమిస్తుందో నాకు తెలియదు. ఒక తల్లిగా తనను జాగ్రత్తగా చూసుకుంటూ, సంతోషంగా ఉంచడమే నా విధి. తన వ్యక్తిగత విషయం గురించి పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు’ అని పేర్కొన్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ గురించి ప్రస్తావించగా.. ‘రణ్‌బీర్ చాలా మంచి వ్యక్తి.. తన చుట్టూ ఉన్న వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’ అంటూ సోనీ ప్రశంసలు కురిపించారు. కాగా చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో అలియా రిలేషన్లో ఉన్నారంటూ బీ-టౌన్లో వార్తలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అలియా ఎప్పుడూ బయటపడలేదు గానీ.. రణ్‌బీర్- అలియా కుటుంబ సభ్యులు చనువుగా ఉండటం, తరచుగా డిన్నర్లకు వెళ్లడం చూస్తుంటే త్వరలోనే వీరి పెళ్లి బాజాలు మోగనున్నాయని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
బాయ్‌ఫ్రెండ్ ఫోటో షేర్ చేసింది ఆపై..
‘మరి కొద్ది రోజుల్లో ఇంకొకరిని వివాహం చేసుకోబోతూ ఇదేం పని’ అంటూ బాలీవుడ్ ‘పద్మావత్’ దీపికా పదుకోన్‌ను విమర్శిస్తున్నారు నెటిజన్లు. అభిమానులకు అంత ఆగ్రహం తెప్పించే పని దీపిక ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా.. ఆదివారం (నిన్న) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను పోస్టు చేశారు దీపికా. గతంలో ‘తమషా’(2015) షూటింగ్ సందర్భంగా క్రొయేషియాలో రణ్‌బీర్ కపూర్‌తో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు దీపికా. కానీ ఇది ఆమె అభిమానులకు నచ్చలేదు. Capturing Moments 📸📸 #WorldPhotographyDay A post shared by Deepika Padukone (@deepikapadukone) on Aug 19, 2018 at 1:16am PDT దాంతో ‘నువ్వు నీ గతాన్ని షేర్ చేస్తే నీ జీవితం కూడా తమాషా అవుతది’, ‘నువ్వు దీపిక కాదు చీపికా’, ‘నువ్వు త్వరగా ఒక మానసికి నిపుణుడిని కలిస్తే మంచిది’, ‘నీ హృదయం ఇంకా నీ మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసమే తపిస్తోంది.. కానీ ఇప్పుడు నువ్వు నీకు ఏ మాత్రం ఇష్టం లేని ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నావు.. ఎందుకంటే సింగిల్‌గా ఉండి నీకు బోర్ కొట్టింది కాబట్టి’ అంటూ దీపికను తెగ ట్రోల్ చేస్తున్నారు. దీపికా, రణ్‌బీర్ కపూర్లు విడిపోయి దాదాపు ఒక దశాబ్దం అవుతోంది. అయినప్పటికి వీరిద్దరూ మంచి స్నేహితులాగానే ఉంటున్నారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ‘యే జవానీ హై దివానీ’(2010), ‘తమాషా’(2015) వంటి చిత్రాల్లో కలిసి నటించారు. -
కుదిరితే ఈసారి అందరం కలిసి!: హీరోయిన్
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, సీనియర్ నటుడు రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్ రణ్‌బీర్ - అలియా అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. ‘ఎంతో ప్రతిభావంతులైన భట్ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేశాను. మహేష్ భట్, ముఖేష్ భట్, రాబిన్, పూర్ణిమా, సోనీ, ఇమ్రాన్ హష్మీ, అలియా భట్ మీ అందరికీ కృతఙ్ఞతలంటూ’ ఆయన ట్వీట్ చేశారు. కపూర్ అండ్ సన్స్ సినిమాలో రిషి కపూర్‌తో కలిసి నటించిన అలియా.. ‘మనం మరోసారి కలిసి నటిస్తామని నేను ఆశిస్తున్నాను. కుదిరితే ఈసారి అందరం కలిసి..’ అంటూ ట్వీట్ చేశారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన సమయంలో రణ్‌బీర్ కపూర్- అలియా భట్ ప్రేమలో పడ్డారని వదంతులు ప్రచారం అయ్యాయి. సోనమ్ కపూర్ పెళ్లికి వీరిద్దరూ జంటగా హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పలు సందర్భాల్లో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ కూడా అలియాపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలపడం.. ఇప్పుడు రిషీ కపూర్ కూడా భట్ ఫ్యామిలీని పొగడడం చూస్తుంటే.. ఈ కపూర్ ఫ్యామిలీ మొత్తం అలియాకు ఫిదా అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Have worked with most of the talented Bhatt family(and relatives). Mahesh Bhatt,Mukesh Bhatt,Robin Bhatt,Purnima ji, Soni Bhatt, Pooja Bhatt, Emran Hashmi, Alia Bhatt. Thank you all! — Rishi Kapoor (@chintskap) May 22, 2018 Haha wow 😀🌟🙌 hope we work together again sir.. maybe this time all together 😬😬 https://t.co/hJmlM24qRr — Alia Bhatt (@aliaa08) May 22, 2018 -
ఆ ఎఫైర్‌ను నేను అంగీకరించను: హీరోయిన్
అలియా భట్.. అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించగల నటి. ఆమె నటించిన రాజీ సినిమా ఈరోజు(శుక్రవారం) విడుదలైంది. అయితే ఆ సినిమా గురించి మాట్లాడే వారి కన్నా అలియా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఇంతకీ విషయమేమిటంటే.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించినప్పటి నుంచి అలియా, రణ్‌బీర్ కపూర్ల మధ్య ప్రేమ చిగురించిందని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఎక్కడ చూసినా అలియా- రణ్‌బీర్‌లు జంటగా కనపడుతున్నారు. తాజాగా సోనమ్ కపూర్ పెళ్లికి వచ్చిన వీరివురు ఫొటోలకు పోజులిచ్చి అభిమానులకు కనువిందు చేశారు. అయితే రజత్ శర్మ షో ‘ఆప్ కీ అదాలత్’కి గెస్ట్‌గా వచ్చిన అలియా రూమర్లపై స్పందించారు. ‘ఒకవేళ ఏదైనా జరుగుతుందని మీకనిపిస్తే అలాగే అనుకోండి.. కానీ ఆ విషయాన్ని నేను అంగీకరించాలనుకోవడం లేదంటూ’ అలియా వ్యాఖ్యానించారు. అయితే వెంటనే మళ్లీ.. ‘అతడి(రణ్‌బీర్ కపూర్) గురించి అడిగినపుడు నా ముఖం వికసిస్తోంది. నేను దానిని ఎలా నియంత్రించాలా అని ఆలోచిస్తున్నానంటూ’ అభిమానులను కన్ఫూజన్‌కు గురి చేశారు. నేనేం ఫీలవ్వను.. అలియాకు జనరల్ నాలెడ్జ్ లేదంటూ సోషల్ మీడియాలో జోకులు పేలడంపై ఆమె స్పందించారు. కరణ్ షోలో పాల్గొన్నప్పుడు.. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయానని పేర్కొన్నారు. కాబట్టి తనకేమీ తెలియదంటూ జనాలు నవ్వుకుంటున్నారని.. అయితే అటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోనంటూ అలియా వ్యాఖ్యానించారు. -
ఆమెతో కలిసి నటించను : కత్రినా
ముంబై : బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, దీపికా పదుకొనే అందంతోనే కాకుండా తమ అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. ఇతర నాయికలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి కత్రినాను అడగ్గా.. అలియా భట్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని, తమ కోసం ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయాల్సిందిగా ఆది(ఆదిత్య చోప్రా)కి చెప్పానన్నారు. అయితే ఆ సినిమాలో తామిద్దరికీ శక్తిమంతమైన పాత్రలు ఉండాలని, భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలని కోరానని తెలిపారు. అలియా, నేను కలిసి నటిస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ కత్రినా విశ్వాసం వ్యక్తం చేశారు. మరి దీపికాతో కలిసి మీరు నటిస్తారా అన్న ప్రశ్నకు బదులుగా క్యాట్స్ ‘నో ’ అంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే రణ్‌బీర్ కపూర్‌తో గతంలో కత్రినా, దీపికాలకు ఉన్న రిలేషన్ కారణంగానే కత్రినా ఈవిధంగా స్పందించారని బీ- టౌన్లో టాక్ విన్పిస్తోంది. మరి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించినప్పటి నుంచి అలియా భట్ కూడా రణ్‌బీర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం కత్రినా దృష్టికి రాలేదేమోనని సెటైర్లు వేస్తున్నారు. అయితే గతంలో అలియా కూడా కత్రినా, దీపికాలతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. -
వారి కోసం రణ్‌బీర్, దీపికా కలిసిపోయారు..!
ముంబై : బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె కలిసిపోయారు... అయితే నిజజీవితంలో కాదులెండి.. ‘ద వాక్ ఆఫ్ మిజ్వాన్’ పేరిట ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో కోసం. ఏప్రిల్ 9న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఫ్యాషన్ షోలో మిజ్వాన్ అనే ఎన్జీవోకు చెందిన చికెన్కారీ(ఎంబ్రాయిడరీ) కళాకారులు రూపొందించిన దుస్తులు ధరించి వీరు ర్యాంప్ వాక్ చేయనున్నారు. చికెన్కారీ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనీష్ మల్హోత్రా మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ(ఎన్జీఓ)తో తొమ్మిదేళ్ల నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రతీ ఏడాది బాలీవుడ్ నటులతో ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. గతేడాది బాలీవుడ్ బాద్షా, హీరోయిన్ అనుష్క శర్మలతో పాటు కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఎన్జీఓకు రణ్‌బీర్ కపూర్, షబానా అజ్మీ, నమ్రత గోయల్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ఈ ఎన్జీవోకు బాలీవుడ్ అండదండలు ఉంటాయని నటి షబానా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకెంతో సంతోషంగా ఉందని రణ్‌బీర్ చెప్పాడు. గ్రామీణ భారతంపై దృష్టి సారించాలని, అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు అవకాశాలు కల్పించినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని తమ వంతు సాయం చేశారు. -
మెన్ ఇన్ డిస్కషన్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏదో చెబుతుంటే హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎలా ఆలకిస్తున్నారో చూశారుగా! ఇంతకీ అమితాబ్ ఏం చెబుతున్నారు? ఈ ముగ్గురూ ఎక్కడ కలిశారు? దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అంటే... ‘బ్రహ్మాస్త్ర’ కోసం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ‘‘బ్రహ్మాస్త్ర. ఎగై్జటింగ్ జర్నీ స్టారై్టంది’’ అని ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం సౌరవ్ గుర్జార్‌ను తీసుకున్నారని బాలీవుడ్ సమాచారం. హిందీ బుల్లితెరపై రావణ, భీమ క్యారెక్టర్స్‌లో నటించారు సౌరవ్. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను మూడు పార్ట్స్‌గా తీయాలనుకుంటున్నారు. 150 కోట్లతో రూపొందించనున్న తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. -
‘ఆర్’తో ‘డీ’.. ఈసారి ఏడడుగులు ఖాయం!
‘ఆర్’ అక్షరంతో దీపికా పదుకోన్‌కి ఏదైనా ప్రత్యేకమైన అనుబంధం ఉండి ఉంటుందా? అందుకే ముందు ‘రణబీర్ కపూర్’తో ప్రేమలో పడ్డారు. అతన్నుంచి విడిపోయాక ‘రణవీర్‌సింగ్’తో ప్రేమలో పడ్డారని బాలీవుడ్లో జోకులు వేసుకుంటారు. ఈసారైనా ‘ఆర్’తో ‘డీ’కి కుదురుతుందా? ఏడడుగులు వేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అసలు రణవీర్–దీపికా ఏడడుగులు వేస్తే ఏంటి? వెయ్యకపోతే ఏంటి? ఎందుకీ ఉత్సాహం? అంటే.. సెలబ్రిటీల జీవితాల్లో ఏర్పడే మలుపులు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా. అలాంటి ఔత్సాహికరాయుళ్లకు ఓ జవాబు దొరికింది. దీపిక మెడలో రణవీర్ మూడు ముళ్లు వేయడం ఖాయమని ఆమె ఇచ్చిన సమాధానాలు చెబుతున్నాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణవీర్‌తో బాండింగ్, పెళ్లి తదితర విషయాలు చెప్పారు దీపిక. ఆ విశేషాలు.. ► మేమిద్దరం (రణవీర్–దీపిక) ఉన్నప్పుడు మాకెవరూ అవసరంలేదు. ఏదీ అవసరంలేదు. మా ప్రెజెన్స్ మా ఇద్దరికీ ఎంతో హాయిగా ఉంటుంది. ఒక్కోసారి మేం మేధావుల్లా మాట్లాడుకుంటాం. ఒక్కోసారి సైలెంట్‌గా ఉండిపోతాం. కొన్నిసార్లు చిన్నపిల్లల్లా అమాయకంగా మాట్లాడుకుంటాం. ఏది మాట్లాడినా ఒకర్నొకరు డామినేట్ చేయాలనుకోం. ► నాకు ‘హోమ్ మేకర్’ (పెళ్లి చేసుకోవాలని) అవ్వాలని ఉంది. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక ఒక ఫ్యామిలీ సెట్ చేసుకుని, లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలనే కోరిక ఉంది. అయితే అది ఫలానా సంవత్సరంలో అని టైమ్ చెప్పలేను. అలా టైమ్ చెప్పి నేనేదీ చేయలేను. మా బాండింగ్ గురించి చెప్పాలంటే... ఏ బంధం అయినా ఏదో ఒక పాయింట్లో విస్తరిస్తుంది. మా బంధం కూడా దానంతట అది వేరే దిశలోకి విస్తరిస్తుందనుకుంటున్నా. ► గతంలో ఓ బంధం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డిప్రెషన్లో పడేసింది. అందులోంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టింది. ఆ టైమ్‌లో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ ఒత్తిడిని అధిగమించగలిగాను. అయితే నా సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి నేనే బాధ్యత. వాటిని మాత్రం నా నుంచి ఎవరూ లాగేసుకోలేరు. ఎందుకంటే నా మొత్తం ఎనర్జీని వర్క్ మీద పెడుతున్నా. నా వర్క్ నా ‘బేబీ’. అది పూర్తిగా నా సొంతం. నేనెవరికీ భయపడను సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావతి’ చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. రాణి పద్మావతి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌లు ఆందోళన జరుపుతున్నారు. భన్సాలీ, దీపిక తలలు నరికి, తెచ్చినవారికి భారీ ఎత్తున నగదు బహుమతి ఇస్తామని ఆందోళనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి.. ఈ వివాదాలు దీపికాను భయపెడుతున్నాయా? అంటే.. ‘ఒక ఆర్టిస్టుగా నాకు కోపంగా ఉంది. ఈ వివాదాలు నాకు వినోదంలా అనిపిస్తున్నాయి. నేనస్సలు భయపడను’’ అని పేర్కొన్నారామె. -
రణ్‌బీర్‌తో హాలిడే ట్రిప్‌కు రెడీ!
బాలీవుడ్ క్రేజీ లవర్స్ రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల బంధం ఇప్పుడంత బలంగా లేదని టాక్. దీపికా పదుకొనేతో కలిసి రణ్‌బీర్ ‘తమాషా’ చిత్రంలో నటించడం కత్రినాని ఆగ్రహానికి గురి చేసిందని పరిశీలకులు అంటున్నారు. అందుకని రణ్‌బీర్‌తో కత్రినా ఇంతకు ముందు ఉన్నంత క్లోజ్‌గా ఉండటంలేదట. ఈ ఇద్దరూ దాదాపు విడిపోయినట్లేనని చెప్పుకుంటున్నారు. అలాగే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. తమ మధ్య పెరిగిన ఈ దూరాన్ని మాయం చేయడానికి రణ్‌బీర్ ట్రై చేస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా కత్రినాతో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారట. కొంచెం మారాం చేసిన తర్వాత కత్రినా ఈ ట్రిప్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎక్కడికి చెక్కేస్తారో సన్నిహితులకు కూడా చెప్పలేదట. కచ్చితంగా ఫారిన్ కంట్రీస్‌కే వెళతారని ఊహించవచ్చు. మరి.. ఈ లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళతారో? హాలిడే ట్రిప్‌లో మనసు విప్పి, అన్నీ మాట్లాడుకుని తమ మధ్య పెరిగిన దూరాన్ని ఇక ఎప్పుడూ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తపడతారేమో!