‘యానిమల్‌’ లుక్‌ కోసం బాబీ కఠోర సాధన.. నాలుగు నెలలు నో స్వీట్స్‌! | Sakshi
Sakshi News home page

Animal: ‘విలన్‌’ లుక్‌ కోసం బాబీ కఠోర సాధన.. నాలుగు నెలలు నో స్వీట్స్‌!

Published Sun, Nov 26 2023 3:27 PM

Bobby Deol Rigorous Training For Animal Movie - Sakshi

అర్జున్‌ రెడ్డి లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ విలన్‌గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా బాబీ దేవోల్‌ లుక్‌,యాక్టింగ్‌పై ప్రేక్షకులను నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

అయితే ఈ చిత్రంలోని తన పాత్ర కోసం బాబీ చాలా కష్టపడ్డాడట. రణ్‌బీర్‌ కంటే భారీగా కనిపించేందుకు నాలుగు నెలల పాటు కఠోర  సాధన చేశాడట. బాబీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ప్రజ్వల్‌ శెట్టి ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘యానిమల్‌ చిత్రంలో విలన్‌ పాత్ర పోషించేందుకు బాబీ చాలా కష్టపడ్డాడు. లుక్‌ విషయంలో దర్శకుడు సందీప్‌ కొన్ని సూచనలు చేస్తూ.. రణ్‌బీర్‌ కంటే భారీగా కనిపించాలని కండీషన్‌ పెట్టాడు.

దీంతో బాబీ..నాలుగు నెలల పాటు కచ్చితమైన డైట్‌ ఫాలో అయ్యాడట. తనకు బాగా ఇష్టమైన స్వీట్స్‌ కూడా తినకుండా.. సాధన చేశాడు. దీంతో బాబీ డియోల్ శరీరంలోని కొవ్వు శాతం 12కి తగ్గింది. అతని బరువు 85 నుండి 90 మధ్యకు చేరింది.ట్రైనింగ్‌ అనంతరం బాబీ లుక్‌ చూసి చిత్ర యూనిట్‌ అంతా షాకైంది. క్లైమాక్స్‌ షూట్‌ రోజు బాబీ నన్ను సెట్‌కి పిలించుకొని అందరి ముందు అభినందించారు’అని ప్రజ్వల్‌ తెలిపాడు.  ఈ చిత్రం డిసెంబర్‌ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement